పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్ | |
|---|---|
|
పశ్చిమ బెంగాల్ ప్రదేశాలు (పై నుండి): కోల్‌కాతా స్కైలైన్, కోల్‌కాతా సమిపంలో దక్షిణేశ్వర కాళికాలయము, కోల్‌కాతా గెట్, డువర్స్ ఛాయ్ తోటలు, హజార్దురి రాజభవనం, దీఘా సముద్రతీరం, సుందర్‌బన్స్ జాతీయ ఉద్యానవనంలో బెంగాల్ పులి, డార్జిలింగ్ | |
భారతదేశంలో పశ్చిమ బెంగాల్ ఉనికి | |
| దేశం | |
| అవతరణ | 26 జనవరి 1950 |
| రాజధాని | కోల్‌కాతా |
| కోల్‌కాతా |
| జిల్లాలు | List
|
| Government | |
| • గవర్నర్ | జగ్దిప్ ఢంకర్ (భారతీయ జనతా పార్టీ)[1] |
| • ముఖ్యమంత్రి | మమతా బెనర్జీ (అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్) |
| • పశ్చిమ బెంగాల్ శాసనసభ | పశ్చిమ బెంగాల్ శాసనసభ (295) |
| • ఉన్నత న్యాయస్థానం | కోల్‌కాతా ఉన్నత న్యాయస్థానం |
| • ప్రధాన న్యాయమూర్తులు | తొట్టతిలి బి. రాధకృష్ణన్ |
| Area | |
• Total | 88,752 కి.మీ2 (34,267 చ. మై) |
| • Rank | 13వ స్థానం |
| Population (2011)[2] | |
• Total | 9,13,47,736 |
| • Rank | 4 వ ర్యాంకు |
| • Density | 1,029/కి.మీ2 (2,670/చ. మై.) |
| Demonym | బెంగాలీ జనాభా |
| జి.డి.పి (2018–19) | |
| • మొత్తం | ₹11.77 లక్ష కోట్లు (US$150 billion) |
| • తలసరి ఆదాయం | ₹1,09,491 (US$1,400) |
| భాష | |
| • అధికారిక | |
| Time zone | UTC+05:30 (ప్రామాణిక కాలమానం) |
| ISO 3166 code | IN-WB |
| Vehicle registration | WB |
| HDI (2017) | |
| అక్షరాస్యత (2011) | 77.08%[6] |
| లింగ నిష్పత్తి (2011) | (పురుషులు) 1000:950 (స్తీలు) [7] |
| ^* 294 ఎన్నికైనవారు, 1 నియమించినవారు | |
| Symbols of పశ్చిమ బెంగాల్ | |
| చిహ్నం | అశోక స్తంభం, బెంగాలి అక్షరం ব |
| భాష | |
| పక్షి | |
| పువ్వు | |
| వృక్షం | |
| River | |
| క్రీడ | |
పశ్చిమ బెంగాల్, భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం, వాయవ్యాన ఒడిషా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.
చరిత్ర
[మార్చు]సా.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దంనుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది.

1947 లో స్వాతంత్ర్యం లభించినపుడు బెంగాల్ విభజింపబడింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో ఒక భాగమై తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడింది. తరువాత ఇదే భాగం 1971లో పాకిస్తాన్‌నుండి విడివడి స్వతంత్ర బంగ్లాదేశ్‌గా అవతరించింది.
ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న చందానగర్ 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది.
దేవాలయాలు
[మార్చు]- బోరో మా కాళి ఆలయం, నైహతి : ఉత్తర 24 పరగణాల జిల్లాలోని నైహటి పట్టణంలో ఉన్న ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం హిందూ దేవత అయిన కాళీకి అంకితం చేయబడింది.
రాష్ట్రం
[మార్చు]
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కొలకత్తా నగరం రాజధాని. ఇక్కడ బంగ్లా భాష ప్రధానమైన భాష.. 1977 నుండి ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ఎన్నికలలో నిరంతరాయంగా గెలుస్తూ అధికారాన్ని నిలుపుకొంటూ వస్తున్నాయి.
వాతావరణం
[మార్చు]
పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని డార్జిలింగ్ ప్రాంతం మంచి నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ డెల్టా ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉంది. ప్రసిద్ధమైన బెంగాల్ టైగర్కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.
సంస్కృతి
[మార్చు]భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉంది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉంది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.
ప్రసిద్ధులైన వారు
[మార్చు]సాహితీ వేత్తలు
[మార్చు]- రొబీంద్రనాధ టాగూరు: భారత దేశానికీ, బంగ్లాదేశ్ కూ జాతీయగీత రచయిత. కవి, చిత్రకారుడు, సంగీతజ్ఙుడు, తత్వవేత్త. 1913 లో నోబెల్ బహుమతి గ్రహీత.
- కాజీ నజ్రుల్ ఇస్లామ్
- మైకేల్ మధుసూదన దత్తు
- శరత్చంద్ర ఛటర్జీ
- బంకించంద్ర ఛటర్జీ
- బిభూతి భూషణ బందోపాధ్యాయ్
- రాజనారాయణ బసు
సంగీతకారులు
[మార్చు]విజ్ఙాన వేత్తలు
[మార్చు]- జగదీశ్చంద్ర బోస్
- సత్యేంద్రనాధ బోస్: బోస్-అయిన్ స్టయిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భాగస్వామి, బోసాన్ సూక్ష్మకణాలు ఈయన పేరుమీద నామకరణం చేయబడినాయి.
- మహేంద్రలాల్ సర్కార్
- బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు
- అమర్త్యసేన్ : 1988 లో నోబెల్ పురస్కారాన్ని అందుకొన్ని ఆర్థిక శాస్త్రజ్ఙుడు
జాతీయోద్యమ నాయకులు
[మార్చు]రాజకీయ నాయకులు
[మార్చు]విప్లవనాయకులు
[మార్చు]సంఘసంస్కర్తలు
[మార్చు]తాత్వికులు
[మార్చు]ఆధ్యాత్మిక గురువులు
[మార్చు]- చైతన్య మహాప్రభు: 15 వ శతాబ్దిలో కృష్ణభక్తిని ప్రబోధించిన అవతారమూర్తి.
- రామకృష్ణ పరమహంస
- వివేకానంద
- భక్తివేదాంత ప్రభుపాద (అంతర్జాతీయ కృష్ణచైతన్యోద్యమ వ్యవస్థాపకులు)
కళాకారులు
[మార్చు]సినిమా కళాకారులు
[మార్చు]క్రీడాకారులు
[మార్చు]- సౌరవ్ గంగూలీ: క్రికెట్
- అర్పణరాయ్: టెన్నిస్
- లియాండర్ పేస్
- రిచా ఘోష్ - భారత మహిళా క్రికెటర్
- ఝులన్ గోస్వామి - భారత మహిళా క్రికెటర్
జనవిస్తరణ
[మార్చు]పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష. బీహారీలు కూడా రాష్ట్రమంతా నివసిస్తున్నారు. సిక్కిం సరిహద్దు ప్రాంతంలో షెర్పాలు, టిబెటన్ జాతివారు ముఖ్యమైన తెగ. డార్జిలింగ్ ప్రాతంలోని నేపాలీ భాష మాట్లాడేవారు ప్రత్యేకరాష్ట్రం కోసం చాలాకాలం ఉద్యమం సాగించారు. వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే స్వతంత్రప్రతిపత్తి ఇవ్వబడింది.
విభాగాలు
[మార్చు]పశ్చిమ బెంగాల్ లో 2019 నాటికి 23 జిల్లాలు ఉన్నాయి.
ఇవి కూడ చూడండి
[మార్చు]- రామ్ చంద్ర విద్యాబాగీష్
- పశ్చిమ బెంగాల్ చరిత్ర
- పశ్చిమ బెంగాల్లో మతం
- 2024లో పశ్చిమ బెంగాల్ వరదలు
- పశ్చిమ భారతదేశం
- జనాభా ప్రకారం పశ్చిమ బెంగాల్ నగరాల జాబితా
- పశ్చిమ బెంగాల్‌లోని పారిశ్రామిక ప్రాంతాల జాబితా
- భారతదేశ రాష్ట్రాలలో బెంగాలీ మాట్లాడేవారి జాబితా
- పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తుల జాబితా
- పశ్చిమ బెంగాల్లో కోవిడ్-19 మహమ్మారి
మూలాలు
[మార్చు]- ↑ PTI (20 July 2019). "Centre appoints four new Governors, Jagdeep Dhankar now in-charge of West Bengal". The Hindu (in Indian English). ఒరిజినల్ నుండి 20 July 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 July 2019.
- ↑ "Area, population, decennial growth rate and density for 2001 and 2011 at a glance for West Bengal and the districts: provisional population totals paper 1 of 2011: West Bengal". Registrar General & Census Commissioner, India. ఒరిజినల్ నుండి 7 జనవరి 2012 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 జనవరి 2012.
- ↑ "MOSPI Gross State Domestic Product". Ministry of Statistics and Programme Implementation, Government of India. 1 August 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 September 2019.
- ↑ "Fact and Figures". www.wb.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 March 2018.
- ↑ "Sub-national HDI – Area Database". Global Data Lab (in ఇంగ్లీష్). Institute for Management Research, Radboud University. the original నుండి 23 September 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 September 2018.
- ↑ "Sex ratio, 0–6 age population, literates and literacy rate by sex for 2001 and 2011 at a glance for West Bengal and the districts: provisional population totals paper 1 of 2011: West Bengal". Government of India:Ministry of Home Affairs. ఒరిజినల్ నుండి 7 జనవరి 2012 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 జనవరి 2012.
- ↑ "Sex Ratio in West Bengal". Census of India 2011. the original నుండి 27 ఫిబ్రవరి 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 January 2020.





