పశ్చిమ బెంగాల్

వికీపీడియా నుండి
(పశ్చిమ బెంగాల్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పశ్చిమ బెంగాల్
Map of India with the location of పశ్చిమ బెంగాల్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
కోల్‌కతా
 - 22.82° ఉ 88.2° తూ
పెద్ద నగరము కోల్‌కతా (Calcutta)
జనాభా (2001)
 - జనసాంద్రత
80,221,171 (4వ స్థానం)
 - 904/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
88,752 చ.కి.మీ (13వ స్థానం)
 - 19
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1960-05-01
 - ఎం.కె.నారాయణన్
 - మమతా బెనర్జీ
 - ఒకే సభ (295)
అధికార బాష (లు) బెంగాలీ
పొడిపదం (ISO) IN-WB
వెబ్‌సైటు: www.wbgov.com

పశ్చిమ బెంగాల్ (West Bengal, পশ্চিমবঙ্গ, Pôščim Bôngô) భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం సముద్రమూ, వాయువ్యాన ఒడిషా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.

చరిత్ర[మార్చు]

క్రీ.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దమునుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది.

1947 లో స్వాతంత్ర్యం లభించినపుడు బెంగాల్ విభజింపబడింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో ఒక భాగమై తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడింది. తరువాత ఇదే భాగం 1971లో పాకిస్తాన్‌నుండి విడివడి స్వతంత్ర బంగ్లాదేశ్‌గా అవతరించింది.

ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న చందానగర్ 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది.

రాష్ట్రం[మార్చు]

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కొలకత్తా నగరం రాజధాని. ఇక్కడ బంగ్లా భాష ప్రధానమైన భాష.. 1977 నుండి ఈ రాష్ట్రంలో వామపక్షపార్టీలు ఎన్నికలలో నిరంతరాయంగా గెలుస్తూ అధికారాన్ని నిలుపుకొంటూ వస్తున్నాయి.

విభాగాలు[మార్చు]

పశ్చిమ బెంగాల్ లో 18 జిల్లాలు ఉన్నాయి.


రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
WB BI బిర్బం సురి 3012546 4545 663
WB BN బంకురా బంకురా 3191822 6882 464
WB BR బర్ధామన్ బరధమన్ 6919698 7024 985
WB DA డార్జిలింగ్ డార్జిలింగ్ 1605900 3149 510
WB DD దక్షిణ దినాజ్‌పూర్ బలుర్‌ఘాట్ 1502647 2183 688
WB HG హుగ్లీ చిన్‌సురాహ్ 5040047 3149 1601
WB HR హౌరా హౌరా 4274010 1467 2913
WB JA జల్పైగురి జల్పైగురి 3403204 6227 547
WB KB కూచ్ బెహర్ కూచ్ బెహర్ 2478280 3387 732
WB KO కోల్‌కత కోల్‌కత 4580544 185 24760
WB MA మల్దా ఇంగ్లీష్ బజార్ 3290160 3733 881
WB ME మిడ్నాపూర్ మిడ్నాపూర్ 9638473 14081 685
WB MU ముర్షిదాబాద్ బెర్హంపూర్ 5863717 5324 1101
WB NA నాడియా కృష్ణానగర్ 4603756 3927 1172
WB PN ఉత్తర 24 పరగణాలు బరసత్ 8930295 4095 2181
WB PS దక్షిణ 24 పరగణాలు అలిపూర్ 6909015 9955 694
WB PU పురూలియా పురూలియా 2535233 6259 405
WB UD ఉత్తర దినాజ్‌పూర్ రాయ్‌గంజ్ 2441824 3180 768

వాతావరణం[మార్చు]

డార్జిలింగ్ హిమాలయ పర్వత ప్రాంతములో తీస్తా నది తీరము వెంటా, కాలింపోంగ్ వద్ద మెలికలు తిరుగుతూ సాగుతున్న భారత జాతీయ రహదారి 31A

పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని డార్జిలింగ్ ప్రాంతం మంచి నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ డెల్టా ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉంది. ప్రసిద్ధమైన బెంగాల్ టైగర్కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.

సంస్కృతి[మార్చు]

పశ్చిమ మిడ్నాపూర్‌లో ఒక గ్రామీణ దృశ్యం. రాష్ట్రములోని 72% జనాభా గ్రామాలలో నివసిస్తారు.
కలకత్తాలో ఒక వామపక్ష రాజకీయ ప్రదర్శన
అప్పుడే మొలకెత్తుతున్న వరి నారు. వెనుక దృశ్యములో జనపనార కట్టలు

భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉంది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉంది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.

ప్రసిద్ధులైన వారు[మార్చు]

సాహితీ వేత్తలు[మార్చు]

సంగీతకారులు[మార్చు]

విజ్ఙాన వేత్తలు[మార్చు]

జాతీయోద్యమ నాయకులు[మార్చు]

రాజకీయ నాయకులు[మార్చు]

విప్లవనాయకులు[మార్చు]

సంఘసంస్కర్తలు[మార్చు]

తాత్వికులు[మార్చు]

ఆధ్యాత్మిక గురువులు[మార్చు]

కళాకారులు[మార్చు]

క్రీడాకారులు[మార్చు]

జనవిస్తరణ[మార్చు]

దస్త్రం:IIT KGP Main Building.JPG
ఐ.ఐ.టి ఖరగ్‌పూర్

పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష. బీహారీలు కూడా రాష్ట్రమంతా నివసిస్తున్నారు. సిక్కిం సరిహద్దు ప్రాంతంలో షెర్పాలు, టిబెటన్ జాతివారు ముఖ్యమైన తెగ. డార్జిలింగ్ ప్రాతంలోని నేపాలీ భాష మాట్లాడేవారు ప్రత్యేకరాష్ట్రం కోసం చాలాకాలం ఉద్యమం సాగించారు. వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే స్వతంత్రప్రతిపత్తి ఇవ్వబడింది.

బయటి లంకెలు[మార్చు]