పసిడి మనసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పసిడి మనసులు
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.సుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ ఉషశ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పసిడి మనసులు 1970 మే 16న విడుదలైన తెలుగు సినిమా. ఉషశ్రీ ప్రొడక్షన్స్ పతాకం కింద పి.చిన్నప్ప రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పి.సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, శారద లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు అశ్వథామ గుడిమెట్ల సంగీతాన్నందించాడు.

తారాగణం[1][మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: పి. సుబ్రహ్మణ్యం (తెలుగు దర్శకుడు)
  • నిర్మాత: పి.చిన్నప్ప రెడ్డి;
  • సినిమాటోగ్రాఫర్: ఎం. కన్నప్ప;
  • ఎడిటర్: అంకి రెడ్డి వేలూరి;
  • స్వరకర్త: అశ్వథామ గుడిమెట్ల;
  • సాహిత్యం: ఆరుద్ర, ఉషశ్రీ
  • అసిస్టెంట్ డైరెక్టర్: A. మోహన్ గాంధీ, S.S. రవి చంద్ర;
  • కథ: పి.చిన్నప్ప రెడ్డి;
  • స్క్రీన్ ప్లే: పి.చిన్నప్ప రెడ్డి;
  • సంభాషణ: ఆరుద్ర, ఉషశ్రీ
  • గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, S.P. బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల, L.R. ఈశ్వరి
  • ఆర్ట్ డైరెక్టర్: వి.సూరన్న;
  • నృత్య దర్శకుడు: కె.ఎస్. రెడ్డి, రాజు (డ్యాన్స్), భాస్కర్

పాటలు[మార్చు]

  1. చిన్నారి నీ చిరునవ్వు, విరిసిన మల్లెపువ్వు, పొన్నారి నీ అందం, పూచిన పూగందం, రచన: ఉషశ్రీ, గానం. ఘంటసాల
  2. అందుకో కలకల కిల కిల, రచన:ఆరుద్ర, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి
  3. ఇదేలా ఓయీ నెలరాజా, రచన: ఉషశ్రీ, గానం.పులపాక సుశీల
  4. జీవితమే ఓ పూబాట , రచన: ఉషశ్రీ, గానం.ఘంటసాల బృందం
  5. నిన్నే వలచితినోయీ , రచన: ఉషశ్రీ, గానం.పి.సుశీల
  6. వద్దంటే వెళ్ళాను మంగళగిరికి , రచన: ఉషశ్రీ, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి.

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • ఘంటసాల గళామ్రుతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బాహ్య లంకెలు[మార్చు]

  1. "Pasidi Manasulu (1970)". Indiancine.ma. Retrieved 2023-07-05.