పసుమర్తి శ్రీనివాస శర్మ
పసుమర్తి శ్రీనివాస శర్మ | |
|---|---|
| 1964 డిసెంబరు 2 కూచిపూడి, మొవ్వ, కృష్ణా జిల్లా | |
| వృత్తి | కూచిపూడి నాట్య గురువు, రచయిత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1992 - ప్రస్తుతం |
| Spouse | లక్ష్మీ |
| పిల్లలు | 1, పసుమర్తి కుమార దత్త (కుమారుడు) |
| Parents |
|
పసుమర్తి శ్రీనివాస శర్మ (జననం 1964 డిసెంబరు 2), భారతీయ కూచిపూడి నాట్యాచార్యుడు, రచయిత. జులై 2025లో రాజమండ్రిలోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలో ఆయన ప్రిన్సిపల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. ఆయన 1992 నుండి ఇక్కడ నాట్య గురువుగా సేవలందిస్తున్నాడు.[1] 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్న ఆయన గౌరవ డాక్టరేట్ 2016లో పొందాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]ఆయన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన వేంకట చలపతి శర్మ కుమారుడు. ఆయన డా. వెంపటి చినసత్యం, డా. వేదాంతం సత్యనారాయణ శర్మ, పసుమర్తి వెంకటేశ్వర శర్మ తదితరుల వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందాడు.
కెరీర్
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలో అసిస్టెంట్ లెక్చరర్ గా కెరీర్ ప్రారఃభించాడు. నాట్యం లో సుమారు పది పుస్తకాలు రాసాడు. భారతదేశంతో పాటు విదేశాలలో పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 1985లో ఫ్రాన్స్, 1992లో జర్మనీలలో భారత ప్రభుత్వ ఉత్సవాలలో పాల్గొన్నాడు. అక్కడ, ఆయన జర్మనీ ప్రభుత్వం నుండి పురస్కారం అందుకున్నాడు.
రచనలు
[మార్చు]- అభినయ చంద్రిక (1996)
- కూచిపూడి నర్తన కళా పరిచయం (2004)
- కూచిపూడి నాట్య కౌముది (2006)
- కూచిపూడి నృత్య చంద్రిక (2008)
- సిద్ధేంద్ర యోగి చరిత్ర (2010)
- కూచిపూడి నాట్య కౌముది (ఆంగ్లం)
- కూచిపూడి నృత్య చంద్రిక (ఆంగ్లం)
- యక్ష గాన పారిజాతం (2024)
- కూచిపూడి నాట్య సంహిత (2024)
పురస్కారాలు
[మార్చు]- కూచిపూడి నర్తన శిరోమణి
- సుకవిత నాట్యాచార్య
- యక్ష గంధర్వ కళా బంధు
- కూచిపూడి నాట్య పరిశోధన ఆచార్య
- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు
మూలాలు
[మార్చు]- ↑ "భరతముని జయంత్యుత్సవం". Sakshi. Retrieved 2025-07-11.