పసువులేటి వేణు
Appearance
పసువులేటి వేణు | |
---|---|
జననం | 1938 |
మరణం | 2002 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, నాటక రచయిత |
పసువులేటి వేణు (1938 - 2002) ప్రముఖ రంగస్థల నటుడు, నాటక రచయిత.[1]
జననం - ఉద్యోగం
[మార్చు]వేణు 1938లో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జన్మించాడు. ఆర్.వి.ఎమ్. హైస్కూలులో విద్యాభ్యాసం చేశాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]వృత్తిరీత్యా వైద్యుడైన వేణు వెంకటగిరిలో అమెచ్యూర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్థాపించాడు.
రచించినవి
[మార్చు]1955లో నిరాశ ప్రొడక్షన్ నెం. 1 అనే హాస్య నాటికలో తన నాటక రచనను ప్రారంభించి, 5 నాటికలు 2 నాటకాలు రాశాడు.
నాటికలు:
- నిరాశ ప్రొడక్షన్ నెం. 1 (1955)
- దిష్టి బొమ్మలు (1958)
- చీకటిదొంగలు (1958)
- రాజీవం (1960)
- అన్నపూర్ణ (1961)
- పద్మవ్యూహం (1961)
- వంశవృక్షం (1973)
నాటకాలు:
- నటరాజ్
- ఎట్ లాస్ట్
బహుమతులు
[మార్చు]ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు - దిష్టి బొమ్మలు - ఆంధ్ర నాటక కళా పరిషత్తు
మరణం
[మార్చు]వేణు 2002లో చిత్తూరు జిల్లా, కార్వేటినగరంలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.575.