పాండువా (హుగ్లీ జిల్లా)
పాండువా | |
---|---|
Census Town | |
Coordinates: 23°05′N 88°17′E / 23.08°N 88.28°E | |
Country | India |
రాష్ట్రం | West Bengal |
జిల్లా | Hooghly |
Elevation | 19 మీ (62 అ.) |
జనాభా (2011) | |
• Total | 30,700 |
Languages | |
• Official | Bengali, English |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 712149 |
Vehicle registration | WB |
Lok Sabha constituency | Hooghly |
Vidhan Sabha constituency | Pandua |
పాండువా అనేది భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, హుగ్లీ జిల్లా, చిన్సురా ఉపవిభాగం లోని పాండువా కమ్యూనిటి డెవలప్మెంట్ బ్లాక్‌లోని జనాభా లెక్కల పట్టణం.[1]
భౌగోళికం
[మార్చు]పాండువా 23°05′N 88°17′E / 23.08°N 88.28°E అక్షాంశ రేఖాంశాల వద్ద ఉంది [2] ఇదిసముద్ర మట్టానికి 19 మీటర్లు (62అడుగులు) సగటు ఎత్తులో ఉంది. పాండువా, పురుషోత్తంపూర్, నమాజ్‌గ్రామ్ జనాభా లెక్కల పట్టణ సమూహంగా ఏర్పడ్డాయి.[2] పాండువా సిడి బ్లాక్ అనేది ఒకచదరంగా ఉన్న ఒండ్రు మైదానం, దీనిని హుగ్లీ-దామోదర్ ప్లెయిన్ అని పిలుస్తారు.ఇది గంగా డెల్టాలో భాగం.[3] ఈ ప్రదేశం దాని మినార్ [4], అన్ని ముఖ్యమైన రాష్ట్ర వేడుకలు జరిగే పాండువా రాజు ప్యాలెస్ శిధిలాలకు ప్రసిద్ధి చెందింది.[5] 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ మినార్ 125 అడుగులు ఎత్తులో ఉంది.[6]
చరిత్ర
[మార్చు]బినోయ్ ఘోష్ ప్రకారం, ఎత్తైన పాండువా మినార్ ను రైళ్లలో ప్రయాణించేటప్పుడు లేదా గ్రాండ్ ట్రంక్ రోడ్డులో ప్రయాణించే వారు చూడవచ్చు. పాండువా మహానాడు ప్రాంతంలోని హిందూరాజును షా సూఫియుద్దీన్ ఓడించి ఈ విజయ స్తంభాన్ని నిర్మించాడని స్థానికులు చెబుతారు. శాంతిపూర్‌కు చెందిన మహియుద్దీన్ ఒస్తాగర్ పాండువార్ కెచ్చఅనే పద్యం కంపోజ్ చేసాడు.దీనిలో అతను ఈ ప్రాంతంలో ముస్లిం ఆధిపత్యాన్నిఎలా సాధించాడో వివరిస్తాడు. పాండువాలో పాండు అనే రాజు ఉండేవాడు. అతని రాజభవనం లోపల దేవతలు ఆశీర్వదించిన బావి ఉంది.పాండు రాజుపాలనలో, పాండువాలో ఎక్కువమంది హిందూ నివాసులు ఉన్నారు. కొంతమంది ముస్లిం నివాసులు ఉన్నారు.ఒకరోజు ఒక ముస్లిం రైతు తన కొడుకు పుట్టిన రోజున ఆవును చంపాడు. ఇది హిందువులకు కోపం తెప్పించింది. వారు అతని కొడుకును చంపారు. ముస్లిం రైతు పాండురాజుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతు తన కొడుకు మృతదేహాన్ని ఢిల్లీలోని ఫిరోజ్ షా వద్దకు తీసుకువెళతాడు. ఫిర్యాదు విన్న తర్వాత, అతను తన మేనల్లుడు షా సూఫీని సైన్యానికి అధిపతిగా పాండువా వద్దకుపంపుతాడు.అతను యుద్ధం చేస్తాడు, కానీ దైవిక బావి జీవనాధార లక్షణాల కారణంగా అతను మొదట్లో విజయవంతం కాలేదు. విసుగు చెందిన షా సూఫీ దాదాపు ఢిల్లీకి తిరిగి వచ్చే దశలో ఉన్నాడు. ఒక ఆవుల కాపరి షా సూఫీకి దైవ బావి రహస్యాన్ని వెల్లడించాడు. బాలుడు యోగి వేషంలో, రాజభవనంలోకి ప్రవేశించి బావిలో కొంత గొడ్డు మాంసం విసిరాడు. తద్వారా దాని దైవిక లక్షణాలను నాశనం చేశాడు.ముస్లిం దళాలు పాండువాను స్వాధీనం చేసుకున్నాయి.షా సూఫీ తిరిగి పాండువా లోనే ఉండిపోయాడు. అక్కడ పెద్దమసీదు కట్టించాడు.[7]
చారిత్రాత్మకంగా పాండువా రాజు ఉనికికి ఎటువంటి ఆధారాలు లేవు.కానీ సప్తగ్రామ్ - పాండువా ప్రాంతంలో చాలా మంది చిన్నహిందూ రాజులు ఉన్నారు. భక్తియార్ ఖిల్జీ ఆక్రమణకు గురైన ఒక శతాబ్దంలో, ముస్లింలు రార్ ప్రాంతంలోని దక్షిణ ప్రాంతాలలోకి ప్రవేశించారు. ఇందులో ప్రస్తుత హూగ్లీ జిల్లా కూడా ఉంది. ఇది 13వ శతాబ్దం చివరినుండి 14వ శతాబ్దం వరకు ప్రారంభమైంది. ఢిల్లీలోని బాల్బన్ సుల్తానుల పాలనలో (1286-1328) సింహాసనాలను, రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా మాత్రమే కాకుండా, ఇస్లాంను సామాజికంగా స్థాపించడానికే కాకుండా,ఇస్లాంను స్థాపించడానికి ప్రయత్నాలు జరిగాయి. వారి కార్యనిర్వహణ విధానం ఏమిటంటే హిందూ రాజుల భూభాగంలోకి ఏదో ఒక సాకుతో లేదా మరేదైనా ఆక్రమణదారులుగా ప్రవేశించడం. అప్పుడు వారు ఈ అవిశ్వాస రాజులపై ముస్సల్మాన్‌ల హక్కులను ఉల్లంఘించినందుకు వారిని శిక్షించడానికి ముస్లింరాజ్యానికి చెందిన సాధారణ సైన్యాన్ని దించుతారు.[7][8]
అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం, జాఫర్ ఖాన్ 13వ శతాబ్దం చివరిలో త్రిబేని ప్రాంతానికి, షా సుఫియుద్దీన్ 14వ శతాబ్దం ప్రారంభంలో పాండువా ప్రాంతానికి వచ్చారు. ఆ తరువాత కాలంలోముస్లిం ఘాజీలు హిందూ దేవాలయాల శిథిలాలపై అనేక మసీదులు, సమాధులను నిర్మించారు. పాండువా-మహానాడు-త్రిబేని ప్రాంతంలో ముస్లిం ఘాజీ-పీర్ల చారిత్రక పాత్రకు సంబంధించిన కథా ఆధారాలు ఉన్నాయి.[7]
శృంఖలా దేవి పుణ్యక్షేత్ర శక్తి పీఠం
[మార్చు]ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని రూపొందించడంలో దక్ష యజ్ఞం, సతీదేవి స్వీయ దహనం పురాణాలు అపారమైన ప్రాముఖ్యతను కలిగిఉన్నాయి. భారతదేశ సంస్కృతిపై కూడా ప్రభావం చూపాయి.ఇది శక్తి పీఠాల భావన అభివృద్ధికి దారితీసింది. అక్కడ శక్తివాదాన్ని బలోపేతం చేసింది. పురాణాలలోని అపారమైన పౌరాణిక కథలు దక్ష యాగాన్ని దాని మూలానికి కారణంగా తీసుకున్నాయి.ప్రద్యుమ్ననగరం లోని శక్తిపీఠం ఆదిశంకరాచార్యులు రచించిన అష్టాదశ శక్తి పిఠా స్తోత్రంలో ప్రస్తుతం ధ్వంసమైన శృంఖలాదేవిశక్తి పీఠంగా పేర్కొనబడింది.[9][10]
జనాభా శాస్త్రం
[మార్చు]- 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పాండువా మొత్తం జనాభా 30,700, అందులో 15,597 (51%) మంది పురుషులు కాగా, 15,103 (49%) మంది స్త్రీలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు లోపు గల జనాభా 2,986 మంది ఉన్నారు. పాండువాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 22,604 .ఇది మొత్తం జనాభాలో 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభా మొత్తం లో 81.56% గా ఉంది.[11]
- 2001 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం పాండువా జనాభా 27,126. అందులో పురుషులు 51% మంది ఉన్నారు.అలాగే స్త్రీలు 49% మంది ఉన్నారు. పాండువా సగటు అక్షరాస్యత రేటు 67%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత రేటు 72% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 62% ఉంది. పాండువాలో, జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[12]
పౌర పరిపాలన
[మార్చు]రక్షకభట నిలయం
[మార్చు]పాండువా సిడి బ్లాక్‌పై పాండువా రక్షకభట నిలయం అధికార పరిధిని కలిగి ఉంది.[13][14]
సిడి బ్లాక్ ప్రధాన కార్యాలయం
[మార్చు]పాండువా సిడి బ్లాకు ప్రధాన కార్యాలయం పాండువాలో ఉంది.[15]
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]ఇది అనేక శీతల గిడ్డంగులతో కూడిన గొప్ప వ్యవసాయ ప్రాంతం.[16] ఎస్ఆర్ఐ ఇండస్ట్రీ, నిర్మాణ, వ్యవసాయ యంత్రాల తయారీదారు 1996లో [17] స్థాపించబడింది.
రవాణా
[మార్చు]రాష్ట్ర రహదారి 13 / గ్రాండ్ ట్రంక్ రోడ్డు పాండువా గుండా వెళుతుంది.[18][19] పాండువా రైల్వే స్టేషన్ హౌరా-బర్ధమాన్ ప్రధాన మార్గంలో ఉంది.
ఆరోగ్య సంరక్షణ
[మార్చు]పాండువాలో గ్రామీణ ఆసుపత్రి (30 పడకలతో) ఉంది.[20]
సందర్శకుల ఆకర్షణలు
[మార్చు]- బారి మసీదు: బారి అర్థం "ఇటుకలతో చేసిన అద్భుతమైన నిర్మాణాన్ని చూపే పెద్ద మసీదు". దీనిని సా.శ. 14వ శతాబ్దంలో షా సూఫియుద్దీన్ నిర్మించాడు.
- పాండువా మినార్: దీనిని సా.శ. 1477లో షంసుద్దీన్ యూసుఫ్ షా నిర్మించాడు. ఇది అతని విజయానికి చిహ్నంగా నిర్మించాడు.[21] బారీ మసీదుతో పాటు, షంషుద్దీన్ యూసుఫ్ షా ధ్వంసం చేసిన శృంఖలా దేవి ఆలయం స్థానంలో దీనిని నిర్మించాడు.[10]
పాండువా చిత్ర గ్యాలరీ
[మార్చు]-
పాండువాలో ఎఎస్ఐ వారసత్వ భవనం పలకం
-
పాండువా మినార్
-
ఆలయం పాండువా
-
ఆలయం, పాండువా
-
పాండువా మినార్
మూలాలు
[మార్చు]- ↑ District-wise list of statutory towns Archived 2007-09-30 at the Wayback Machine
- ↑ 2.0 2.1 "Census of India 2011, West Bengal: District Census Handbook, Hooghly" (PDF). Map of Pandua CD Block, page 385. Directorate of Census Operations, West Bengal. Retrieved 25 September 2018.
- ↑ "District Census Handbook: Hugli, Series-20, Part XIIA" (PDF). Physiography, Page 17. Directorate of Census Operations, West Bengal, 2011. Retrieved 28 September 2018.
- ↑ Husain, ABM (2012). "Chhota Pandua Minar". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
- ↑ Das, Dipakranjan (2012). "Bari Mosque". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
- ↑ "Minars and Minarettes of India". Archived from the original on 2021-11-29. Retrieved 2023-05-07.
- ↑ 7.0 7.1 7.2 Ghosh, Binoy, Paschim Banger Sanskriti, (in Bengali), part II, 1976 edition, pages 312-316, Prakash Bhaban, Kolkata.
- ↑ The author has quoted from History of Bengal, Dacca University, Vol II, p. 69
- ↑ "Shrinkhala Devi Temple". Archived from the original on 2021-05-18. Retrieved 2023-05-07.
- ↑ 10.0 10.1 Sharma, Partha (2018). The Forgotten Shivalinga of the Sati Shaktipeeths. p. 75. ISBN 978-9387456129.
- ↑ "C.D. Block Wise Primary Census Abstract Data(PCA)". 2011 census: West Bengal – District-wise CD Blocks. Registrar General and Census Commissioner, India. Retrieved 10 June 2016.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 10 June 2016.
- ↑ "District Statistical Handbook 2014 Hooghly". Tables 2.1, 2.2. Department of Statistics and Programme Implementation, Government of West Bengal. Archived from the original on 21 January 2019. Retrieved 3 October 2018.
- ↑ "Hooghly District Police". West Bengal Police. Archived from the original on 5 July 2017. Retrieved 20 June 2017.
- ↑ "District Census Handbook: Hugli, Series-20, Part XIIA" (PDF). Map of Hooghly district with CD Block HQs and Police Stations (on the fifth page). Directorate of Census Operations, West Bengal, 2011. Retrieved 20 June 2017.
- ↑ "List of functioning Cold Storage of West Bengal District wise as on 18.01.07". West Bengal State Marketing Board. Archived from the original on 22 January 2009. Retrieved 2009-01-28.
- ↑ "S.R.Industry". indiamart.com. Retrieved 14 July 2017.
- ↑ "Road - Highway". Public Works Department, Government of West Bengal. Archived from the original on 12 మార్చి 2017. Retrieved 24 February 2017.
- ↑ Google maps
- ↑ "Health & Family Welfare Department". Health Statistics. Government of West Bengal. Archived from the original on 28 అక్టోబరు 2021. Retrieved 15 July 2017.
- ↑ Begama, Āẏaśā (2013). Forts and Fortifications in Medieval Bengal. University Grants Commission of Bangladesh. p. 196. ISBN 9789848910139.
The Chhota Pandua Minar pre - dates the Firuz Minar by about 10 years built by Sultan Yusuf Shah in 1477 A D.