Jump to content

పాకిస్తాన్ ప్రకటన

వికీపీడియా నుండి
1922 బ్రిటిష్ ఇండియా మ్యాపు

"పాకిస్తాన్ ప్రకటన" (నౌ ఆర్ నెవర్; ఆర్ వీ టు లివ్ ఆర్ పెరిష్ ఫరెవర్?) అనేది చౌదరి రహమత్ అలీ, [1] [2] [3] [4] [5] [6] [7] [8] [9] 1933 జనవరిలో, పాక్‌స్తాన్ (PAKSTAN - "I" అనే అక్షరం అందులో లేదు) అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించాడు. 1932లో జరిగిన మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ప్రతినిధులకు ఈ కరపత్రాన్ని పంచారు.

కవరింగ్ లెటర్

[మార్చు]

ఈ కరపత్రం 1933లో లండన్‌లో జరిగిన మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన బ్రిటీష్ భారతీయ ప్రతినిధుల కోసం రూపొందించారు. [10]

దీన్ని 1933 జనవరి 28 తేదీతో ఉన్న ఒక కవరింగ్ లెటర్‌తో సహా పంచారు. దానిపై అలీ ఒక్కడే సంతకం చేసాడు. 3 హంబర్‌స్టోన్ రోడ్ అనే చిరునామా నుండి దాన్ని పంపించారు. ఇది ఇలా పేర్కొంది: [9]

భారతదేశంలోని ఐదు ఉత్తర ప్రాంతాలైన పంజాబ్, నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ (ఆఫ్ఘన్) ప్రావిన్స్, కాశ్మీర్, సింధ్, బలూచిస్తాన్‌లో నివసిస్తున్న ముప్పై మిలియన్ల మంది పాక్‌స్థాన్ ముస్లింల తరపున నేను ఒక విజ్ఞప్తిని ఇక్కడ జత చేస్తున్నాను. మతపరమైన, సామాజిక, చారిత్రక ప్రాతిపదికన ప్రత్యేక సమాఖ్య రాజ్యాంగాన్ని పాక్‌స్థాన్‌కు మంజూరు చేయడం ద్వారా భారతదేశంలోని ఇతర నివాసుల నుండి భిన్నమైన వారి జాతీయ హోదాను గుర్తించాలనే వారి డిమాండ్‌ను ఇది ప్రతిబింబిస్తుంది.

నౌ ఆర్ నెవర్; మనం జీవించాలా లేక శాశ్వతంగా నశించాలా?

[మార్చు]

కరపత్రం ఈ ప్రసిద్ధ వాక్యంతో ప్రారంభమైంది: [11]

భారతదేశ చరిత్రలో, ఈ గంభీరమైన సమయంలో, బ్రిటిషు, భారతీయ రాజనీతిజ్ఞులు ఆ భూమి కోసం ఒక సమాఖ్య రాజ్యాంగం తయారు చేసేందుకు పునాదులు వేస్తున్నప్పుడు, మా ముప్పై మిలియన్ల ముస్లిం సోదరుల తరపున, మా ఉమ్మడి వారసత్వం పేరిట, పాక్‌స్థాన్‌లో —ఐదు ఉత్తరాది యూనిట్లు, అవి: పంజాబ్ (P), నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ (ఆఫ్ఘన్ ప్రావిన్స్ A), కాశ్మీరు (K), సింధ్ (S), బలూచిస్తాన్ (tan) - నివసించే వారి తరఫున మేం ఈ విజ్ఞప్తి చేస్తున్నాం.

కరపత్రం,"భారతదేశంలోని ఐదు ఉత్తరాది ప్రాంతాలైన-పంజాబ్ (P), నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ (ఆఫ్ఘన్ ప్రావిన్స్ A), కాశ్మీరు (K), సింధ్ (S) (అప్పటి బొంబాయి, సింద్‌లో భాగం) , బలూచిస్తాన్ (tan) [12] లు (అన్నీ కలిపి PAKSTAN) భారత సమాఖ్య నుండి విడివడి స్వతంత్ర దేశంగా అవతరిస్తాయి.

ముస్లిం సంస్కర్త సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క రెండు-దేశాల సిద్ధాంతం నుండి ఉద్భవించిన ఈ కరపత్రంలో ఆలీ చెప్పిన 'పాక్స్తాన్' 'దేశం'లో ముస్లింల గురించి స్పష్టమైన, సంక్షిప్త వివరణ ఉంది.

మొదటి, రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ల ప్రతినిధులు అఖిల భారత సమాఖ్య సూత్రాన్ని అంగీకరించడం ద్వారా 'క్షమించలేని తప్పు, నమ్మశక్యం కాని ద్రోహానికి' పాల్పడ్డారని అలీ విశ్వసించాడు. వాయవ్య ప్రాంతంలోని 3 కోట్ల మంది ముస్లింల జాతీయ హోదాను గుర్తించి, వారికి ప్రత్యేక ఫెడరల్ రాజ్యాంగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశాడు. [14]

ప్రొఫెసర్ KK అజీజ్ [9] రాస్తూ, "రహమత్ అలీ మాత్రమే ఈ ప్రకటనను రూపొందించాడు. [15] ఈ కరపత్రంలో మొదటిసారిగా పాక్‌స్థాన్ అనే పదాన్ని ఉపయోగించాడు. దానిని "ప్రాతినిధ్యం" వహిస్తూ సంతకం చేయడానికి అతను, వ్యక్తుల కోసం వెతికాడు. ఆంగ్ల విశ్వవిద్యాలయాలలోని యువ మేధావులపై గట్టి పట్టున్న 'భారతీయవాదం' నేపథ్యంలో చేసిన ఈ అన్వేషణలో దానికి మద్దతునిచ్చి సంతకం చేసేందుకు ముందుకొచ్చిన ముగ్గురు యువకులను లండన్‌లో పట్టుకోవడానికి అతనికి ఒక నెల పైనే పట్టింది. [16]

కరపత్రాన్ని ప్రచురించిన తరువాత, దాన్ని అందులోని "పాక్స్తాన్" అనే పదాన్ని హిందూ పత్రికలు దానిని తీవ్రంగా విమర్శించాయి. [9] అందువలన ఈ పదం చర్చనీయాంశంగా మారింది. ఉచ్చారణను మెరుగుపరచడానికి అందులో "i"ని జోడించడంతో, పాకిస్తాన్ అనే పేరు ప్రజాదరణ పొందింది. ముహమ్మద్ ఇక్బాల్ తత్వశాస్త్రంతో కలిపి, సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క రెండు దేశాల సిద్ధాంతం, జిన్నా యొక్క అభిప్రాయాలు పాకిస్తాన్ ఉద్యమం ప్రారంభానికి దారితీశాయి. తత్ఫలితంగా 1947 లో [17] పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది.

అనంతర పరిణామాలు

[మార్చు]

తరువాతి కరపత్రాలలో అలీ, పాకిస్తాన్ నే కాకుండా, ఉపఖండంలో బంగిస్తాన్, ఉస్మానిస్థాన్ వంటి అనేక ఇతర ముస్లిం రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కూడా సూచించాడు. తూర్పు భారతదేశంలోని తూర్పు బెంగాల్, అస్సాం ల లోని పూర్వ ముస్లిం ప్రావిన్సులు బంగిస్థాన్‌గా మారాలని, బెంగాలీ, అస్సామీ, బీహారీ మాట్లాడే ముస్లింలకు స్వతంత్ర ముస్లిం దేశం ఉండాలని అతను సూచించాడు. హైదరాబాద్ రాజ్యాన్ని ఉస్మానిస్తాన్ అనే ఇస్లామిక్ దేశం కావాలని కూడా అతను సూచించాడు. [18] [19]

1947 జూన్ 3 న బ్రిటిషు వారి విభజన ప్రణాళికను ముస్లిం లీగ్ ఆమోదించిన ఆరు రోజుల తర్వాత అతను, "ది గ్రేట్ బిట్రేయల్" పేరుతో బ్రిటిష్ ప్రణాళికను తిరస్కరించాలని, తన పాకిస్తాన్ ప్రణాళికను ఆమోదించాలనీ కోరుతూ ఒక ప్రకటనను విడుదల చేశాడు. అతను తన 1933 కరపత్రం నౌ ఆర్ నెవర్‌లో ఊహించిన దానికంటే చిన్నదిగా ఉన్న పాకిస్తాన్‌ దేశంపై అసంతృప్తి వెలిబుచ్చాడు. [9] చిన్న పాకిస్తాన్‌ను అంగీకరించినందుకు జిన్నాను విమర్శించాడు. [9] అతనిని "క్విస్లింగ్-ఎ-ఆజం" అని పిలిచినట్లు చెబుతారు. [14] [a] చివరికి బ్రిటిషు ప్రణాళిక ఆమోదం పొందింది, అలీ ప్రణాళిక తిరస్కరించబడింది. [21] అప్పటి నుంచి పాకిస్థాన్‌ ఏర్పాటుపై అలీ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. [9]

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అలీకి సమకాలీనుడైన మియా అబ్దుల్ హక్, 1935 తర్వాత, "ప్రధాన నాజీ రచనల అధ్యయనం ఫలితంగా అలీ మానసిక ఆకృతి మారిందని, వాటిలోని చాలా భాగాలను అతను బట్టీ పట్టాడు" అని పేర్కొన్నాడు. [22]

కరపత్ర రచయిత గతి

[మార్చు]

ఈ ప్రసిద్ధ కరపత్రం యొక్క రచయిత చౌధురి రహమత్ అలీ (1897 నవంబర్ 16 - 1951 ఫిబ్రవరి 3), పంజాబ్‌కు చెందిన ముస్లిం జాతీయవాది. బ్రిటిష్ ఇండియాలోని ప్రెసిడెన్సీలు, ప్రావిన్సుల నుండి ప్రత్యేక ముస్లిం మాతృభూమికి "పాక్‌స్తాన్" అనే పేరును సృష్టించిన ఘనత ఆయనది. అతను 1933లో పాకిస్తాన్ పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి మిషనరీ ఉత్సాహంతో దాన్ని ప్రచారం చేసాడు. [17] తరువాత అతను తన ఆలోచనలను ప్రచారం చేయడానికి పాకిస్తాన్ నేషనల్ మూవ్‌మెంట్ [9] ని కూడా స్థాపించాడు. ఒక రాజకీయ ఆలోచనాపరుడు, ఆదర్శవాది అయినందున, 1947లో ఒక చిన్న పాకిస్తాన్‌ను అంగీకరించడాన్ని మించి, [23] "హిందూ ఆధిపత్యం" నుండి ప్రతి భారతీయ ముస్లింను రక్షించాలని ఎక్కువ కోరుకున్నాడు. [9]

1947లో పాకిస్తాన్ ఆవిర్భావం తరువాత అలీ, లాహోర్‌కు తిరిగి వెళ్ళాడు. అక్కడే ఉండాలని అతను అనుకున్నాడు గానీ, అప్పటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అతన్ని పాకిస్తాన్ నుండి బహిష్కరించాడు. అతని వస్తువులను జప్తు చేసారు. 1948 అక్టోబరులో అతను రిక్తహస్తాలతో ఇంగ్లండ్‌కు వెళ్ళిపోయాడు. [9]

అలీ 1951 ఫిబ్రవరి 3 న కేంబ్రిడ్జ్‌లో మరణించాడు. థెల్మా ఫ్రాస్ట్ ప్రకారం, మరణించే సమయంలో అతను "నిరాశ్రయుడు, ఒంటరివాడు". [10] చనిపోయేటప్పటికి అతను దివాళా తీయడంతో, కేంబ్రిడ్జి లోని ఇమ్మాన్యుయేల్ కాలేజ్ కు మాస్టరైన ఎడ్వర్డ్ వెల్బోర్న్, అంత్యక్రియల ఖర్చులను కళాశాల భరించాలని ఆదేశించాడు. ఫిబ్రవరి 20 న కేంబ్రిడ్జ్ సిటీ స్మశానవాటికలో అలీని ఖననం చేసారు. [9] లండన్ కార్యాలయం, పాకిస్తాన్‌లోని సంబంధిత అధికారుల మధ్య "సుదీర్ఘమైన ఉత్తరప్రత్యుత్తరాల" తర్వాత, అంత్యక్రియల ఖర్చులు, ఇతర వైద్య ఖర్చులను 1953 నవంబరులో పాకిస్తాన్ హైకమీషనర్ తిరిగి చెల్లించారు. [24]

ఇవి కూడా చూడండి

[మార్చు]

నోట్స్

[మార్చు]
  1. 1947 నాటి కరపత్రం "ది గ్రేటెస్ట్ బిట్రేయల్, ది మిల్లత్‌స్ మార్టిర్‌డమ్‌ & ది ముస్లిమ్‌స్ డ్యూటీ" లో జిన్నాను ఇలా అభివర్ణించాడు. కిస్లింగ్ అనేది, నాజీల కింద నార్వే ప్రభుత్వాన్ని నడీపిన విడ్‌కున్ కిస్లింగ్ అనే నాయకుడిని సూచిస్తూ చెప్పిన మాట.[20]

మూలాలు

[మార్చు]
  1. Pakistan, the enigma of political development, by Lawrence Ziring, p. 67
  2. Iqbal, an illustrated biography by Khurram Ali Shafique, p.131
  3. India-Pakistan in war & peace, Jyotindra Nath Dixit p. 10
  4. The Great Divide: Muslim Separatism and Partition By S.C. Bhatt, p. 70
  5. Historiography of India's Partition: An Analysis of Imperialist Writings By Viśva Mohana Pāndeya p.15
  6. Governments and politics of South Asia J. C. Johari, p. 208
  7. Creating New States: Theory and Practice of Secession By Aleksandar Pavković, Peter Radan p.103
  8. A history of Pakistan: past and present Muḥammad ʻAbdulʻaziz, p. 162
  9. 9.00 9.01 9.02 9.03 9.04 9.05 9.06 9.07 9.08 9.09 9.10 Aziz (1987).
  10. 10.0 10.1 Kamran (2017).
  11. "Now or Never; Are We to Live or Perish Forever?" Archived 19 ఏప్రిల్ 2011 at the Wayback Machine
  12. THE HISTORY MAN: Cambridge Remembers Rahmat Ali – Ihsan Aslam – Daily Times
  13. Kamran (2015), pp. 99–100.
  14. 14.0 14.1 Kamran (2015).
  15. "Now or Never; Are We to Live or Perish Forever?" Archived 19 ఏప్రిల్ 2011 at the Wayback Machine
  16. Sajid, Syed Afsar (12 December 2007). "An adroit translation". Pakistan Today. Archived from the original on 9 September 2019. Retrieved 8 September 2019.
  17. 17.0 17.1 Aziz (1987)
  18. Jalal, Self and Sovereignty (2002).
  19. Ali, Choudhary Rahmat. "India: The Continent of DINIA or The Country of DOOM?". Archived from the original on 6 March 2012.
  20. Kamran (2015), p. 82.
  21. Cohen, Stephen P. (21 September 2004). The Idea of Pakistan (in ఇంగ్లీష్). Brookings Institution Press. p. 52. ISBN 0815797613. osmanistan hyderabad.
  22. Ikram, S.M. (1995), Indian Muslims and Partition of India, Atlantic Publishers & Dist, pp. 177–178, ISBN 978-81-7156-374-6
  23. Aziz 1987, pp. 319–338
  24. Emmanuel College Cambridge Archives

వనరులు

[మార్చు]