పాటూరు రామయ్య
పాటూరు రామయ్య కమ్యూనిస్టు నాయకుడు.[1] ప్రజాశక్తి సంపాదకులు. అతను కృష్ణా జిల్లా నిడుమోలు( పామర్రు) నియోజకవర్గానికి నాలుగు సార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. అతమి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు[2]. అతను ఆల్‌ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[3]
జీవిత విశేషాలు
[మార్చు]పాటూరు రామయ్య నెల్లూరు జిల్లా లోని జలదంకి మండలం లో జమ్మలపాలెంలో అత్యంత నిరుపేద దళిత కుటుంబంలో పాటూరి వెంకయ్య, సుబ్బమ్మ దంపతులకు 1941 అక్టోబరు 9న జన్మించాడు. బతుకు తెరువు కోసం కూలిపనులకు వెళ్ళేవాడు. దాతల సహకారంతో చదువుకున్నాడు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూ క్రమంగా కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడయ్యాడు. అతను పుచ్చలపల్లి సుందరయ్య శిష్యుడు.1965లో మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. తన ప్రజా సేవకు అడ్డొస్తారని భార్య అనుమతితో బిడ్డలనే వద్దని కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు సిపిఎం తరుఫున శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. తన నియోజకవర్గంలో కొన్ని వేల మందికి ఇంటి స్థలాలు కల్పించి నీడనిచ్చాడు. కానీ, తనకంటూ ఒక్క సెంటు స్థలాన్నీ, నివసించేందుకు కనీసం ఒక పూరిల్లునూ సంపాదించుకోలేదు. ఉయ్యూరు లోని రోటరీ వృద్ధాశ్రమం లో ఉంటున్నాడు.1967లో జనశక్తి పత్రికలో ప్రూఫ్‌రీడర్ ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఎడిటోరియల్ బోర్డులోకి వచ్చాడు.
శాసనసభలో అతను చేసిన ప్రసంగాలు ఎంతో ఆకట్టుకునేవి. అతని కాలంలోనే అంతకుముందటి పోరాటాలకు సాక్షీభూతంగా లక్ష్మీపురం షుగర్ ఫ్యాక్టరీ మిగులు భూమిని 7,500 మంది పేదలకు 20 సెంట్ల నుంచి 25 సెంట్లు చొప్పున ఆయా గ్రామాల్లో పంపిణీ జరిగింది.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అతని భార్య మహలక్ష్మమ్మ. ఆమె పార్టీ ఉద్యమాలలోనూ, పోరాటాలలోనూ అతనికి తోడుగా నిలిచింది.
శాసనసభ్యునిగా
[మార్చు]ప్రజాశక్తి పత్రికకు ఎడిటర్ గా పనిచేసిన అతను 1985లో రాజకీయ రంగప్రవేశం చేసాడు. 1985. 1989, 1994, 2004 శాసనసభ ఎన్నికలలో విజయం సాధించాడు.
సంవత్సరం | అసెంబ్లీ నియోజకవర్గం పేరు | రకం | విజేత | పార్టీ | పొందిన ఓట్లు | ప్రత్యర్థి | పార్టీ | ఓట్లు | మూలాలు |
---|---|---|---|---|---|---|---|---|---|
1985 | నిడుమోలు శాసనసభ నియోజకవర్గం | ఎస్.సి | పాటూరు రామయ్య | సీపీఐ (ఎం) | 36934 | మునిపల్లి విజనయబాబు | భారత జాతీయ కాంగ్రెస్ | 30008 | [5] |
1989 | నిడుమోలు శాసనసభ నియోజకవర్గం | ఎస్.సి | పాటూరు రామయ్య | సీపీఐ (ఎం) | 36149 | మునిపల్లి విజనయబాబు | స్వంతంత్ర | 34020 | [6] |
1994 | నిడుమోలు శాసనసభ నియోజకవర్గం | ఎస్.సి | పాటూరు రామయ్య | సీపీఐ (ఎం) | 45052 | మునిపల్లి విజనయబాబు | స్వంతంత్ర | 31989 | [7] |
2004 | నిడుమోలు శాసనసభ నియోజకవర్గం | ఎస్.సి | పాటూరు రామయ్య | సీపీఐ (ఎం) | 45114 | ఉప్పులేటి కల్పన | తెలుగుదేశం పార్టీ | 41925 | [8] |
పురస్కారాలు
[మార్చు]- గుత్తికొండ రామరత్నం స్మారక పురస్కారాన్ని శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు చేతుల మీదుగా అందుకున్నాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ pavan (2015-07-13). "సోషలిజంతోనే సమస్యలు పరిష్కారం:పాటూరు రామయ్య". CPI(M) AP (in ఇంగ్లీష్). Retrieved 2020-06-09.
- ↑ Reddy, Pragnadhar. "సీపీఎం ఆధ్వర్యంలో గుత్తి రామకృష్ణ శతజయంతి | teluguglobal.in". www.teluguglobal.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-09.
- ↑ ప్రజా ఉద్యమంలో నేను(Praja Udyamamlo Nenu) By K.Krishna Murthy - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-06-09. Retrieved 2020-06-09.
- ↑ "ప్రజాప్రతినిధుల్లో ఆణిముత్యం పాటూరు రామయ్య | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Archived from the original on 2020-06-09. Retrieved 2020-06-09.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1985". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-06-09.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-06-09.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1994". Elections in India. Archived from the original on 2021-11-07. Retrieved 2020-06-09.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2004". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-06-09.
- ↑ "NewsDog - India News - NewsDog". www.newsdogapp.com. Archived from the original on 2020-06-09. Retrieved 2020-06-09.
బాహ్య లంకెలు
[మార్చు]- పాటూరు రామయ్య నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం || Paturu Ramaiah Biography || CPIMAP
- "PATURU RAMAYYA GARU DOCUMENTARY". www.youtube.com. Retrieved 2020-06-09.
- Achievements of Paturu Ramaiah documentary
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- Pages using age template with invalid date
- Date of birth not in Wikidata
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు నాయకులు
- కృష్ణా జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2004)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1994)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1989)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1985)
- 1941 జననాలు