పాట్రిక్ ప్యాటర్సన్
![]() |
||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | Balfour Patrick Patterson | |||
జననం | Williamsfield, Jamaica |
15 సెప్టెంబరు 1961 |||
బ్యాటింగ్ శైలి | Right-handed | |||
బౌలింగ్ శైలి | Right-arm fast | |||
అంతర్జాతీయ సమాచారం | ||||
జాతీయ జట్టు | West Indies | |||
టెస్టు అరంగ్రేటం | 21 February 1986 v England | |||
చివరి టెస్టు | 27 November 1993 v Australia | |||
వన్డే ప్రవేశం | 18 February 1986 v England | |||
చివరి వన్డే | 25 February 1993 v Pakistan | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
1982–1998 | Jamaica | |||
1984–1990 | Lancashire | |||
1984–1985 | Tasmania | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | Tests | ODIs | FC | LA |
మ్యాచ్‌లు | 28 | 59 | 161 | 100 |
సాధించిన పరుగులు | 145 | 44 | 618 | 106 |
బ్యాటింగ్ సగటు | 6.59 | 8.80 | 5.83 | 10.60 |
100s/50s | 0/0 | 0/0 | 0/0 | 0/0 |
ఉత్తమ స్కోరు | 21* | 13* | 29 | 16 |
బాల్స్ వేసినవి | 4,829 | 3,050 | 24,346 | 5,115 |
వికెట్లు | 93 | 90 | 493 | 144 |
బౌలింగ్ సగటు | 30.90 | 24.51 | 27.51 | 24.27 |
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 5 | 1 | 25 | 1 |
మ్యాచ్ లో 10 వికెట్లు | 0 | 0 | 2 | 0 |
ఉత్తమ బౌలింగ్ | 5/24 | 6/29 | 7/24 | 6/29 |
క్యాచులు/స్టంపింగులు | 5/– | 9/– | 32/– | 15/– |
Source: Cricket Archive, 19 October 2010 |
1961, సెప్టెంబర్ 15న జన్మించిన పాట్రిక్ ప్యాటర్సన్ (Balfour Patrick Patterson) 1980 మరియు 1990 దశాబ్దాలలో వెస్ట్‌ఇండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ ఆటగాడు. 1986లో ఇంగ్లాండుతో జరిగిన సబీనా పార్క్ టెస్ట్‌లో మైకెల్ హోల్డింగ్ అందుబాటులో లేకపోవడంతో టెస్ట్ క్రికెట్‌లో రంగప్రవేశం చేసిన ప్యాటర్సన్ 1987లో ఫాస్ట్ బౌలర్‌గా ప్రముఖంగా వెలుగులోకి వచ్చాడు. తొలి టెస్టులోనే 7 వికెట్లు సాధించి హోల్డింగ్ లేని లోటును తీర్చాడు. అప్పటినుంచి 1992-93లో ఆస్ట్రేలియా పర్యటనలో క్రమశిక్షణ చర్య వలన అతడిని తొలిగించేవరకు క్రమం తప్పకుండా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతడి నిష్క్రమణ అనంతరం ఆ స్థానాన్ని వెస్ట్‌ఇండీస్ భర్తీ చేయలేకపోయింది. క్రమక్రమంగా వెస్ట్‌ఇండీస్ క్రికెట్‌లో పతనావస్థ ప్రారంభమైంది.
టెస్ట్ క్రికెట్[మార్చు]
ప్యాటర్సన్ తన క్రీడాజీవితంలో మొత్తం 28 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30.90 సగటుతో 93 వికెట్లను సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 5 సార్లు పడగొట్టినాడు. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 24 పరుగులకు 5 వికెట్లు. ఇది 1987-88లో భారత పర్యటనలో సాధించిన రికార్డు. కేవలం 30.3 ఓవర్లలో ఆట తొలిరోజు ఒకే సెషన్‌లో ఆ గణాంకాలను నమోదుచేయడం విశేషం.[1]
వన్డే క్రికెట్[మార్చు]
ప్యాటర్సన్ 59 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 24.51 సగటుతో 90 వికెట్లను సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 29 పరుగులకు 6 వికెట్లు.
ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]
1987 వివియన్ రిచర్డ్స్ నాయకత్వంలో మరియు 1992 రిచీ రిచర్డ్‌సన్ నాయకత్వంలో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లలో ప్యాటర్సన్ వెస్ట్్‌ఇండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.