పాతపాటి సర్రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాతపాటి సర్రాజు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2019 - 2023
ముందు కలిదిండి రామచంద్రరాజు
తరువాత వేటూకూరి వెంకట శివరామరాజు
నియోజకవర్గం ఉండి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1954
జక్కరం, కాళ్ళ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2023 ఫిబ్రవరి 17
భీమవరం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు శ్రీ రామరాజు
జీవిత భాగస్వామి అన్నపూర్ణ
వృత్తి రాజకీయ నాయకుడు

పాతపాటి సర్రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. పాతపాటి సర్రాజు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా విధులు నిర్వహించాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

పాతపాటి సర్రాజు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఎమ్మెల్యే కాకముందు కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. పాతపాటి సర్రాజు 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. పాతపాటి సర్రాజు తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు.

పాతపాటి సర్రాజు 2014లో ఓడిపోయినా అనంతరం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఆయన 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితుడై,[2] 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా భాద్యతలు చేపట్టాడు.[3]

మరణం

[మార్చు]

గుండెపోటుకు గురైన 72 ఏళ్ల పాతపాటి సర్రాజు భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (17 July 2021). "ఏపీ నామినేటెడ్‌ పదవులు దక్కించుకుంది వీరే." Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  2. Eenadu (18 July 2021). "జిల్లావాసులకు పదవుల పంట". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  3. Andhrajyothy (14 August 2021). "క్షత్రియుల అభ్యున్నతికే కార్పొరేషన్‌". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  4. "Andhra News: ఏపీ క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత". web.archive.org. 2023-02-18. Archived from the original on 2023-02-18. Retrieved 2023-02-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)