ముడివేముల

వికీపీడియా నుండి
(పాత ముడివేముల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గ్రామం
నిర్దేశాంకాలు: 16°00′07″N 79°27′22″E / 16.002°N 79.456°E / 16.002; 79.456Coordinates: 16°00′07″N 79°27′22″E / 16.002°N 79.456°E / 16.002; 79.456
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంత్రిపురాంతకం మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08403 Edit this on Wikidata )
పిన్‌కోడ్523326 Edit this on Wikidata


ముడివేముల, ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

ముడివేముల చరిత్ర-శ్రీనివాసప్రసాద్ తురిమెళ్ళ ఇక్ష్వాకులు సా.శ.225-625 మధ్య ఆంధ్రదేశమును పాలించిరి.వారితర్వాతవచ్చినవాలో ముఖ్యులు పల్లవరాజులు.త్రిలోచన పల్లవుడు సా.శ.458-80 మధ్య కాలమున శ్రీశైలము అనబడు అరణ్య ప్రదేశములను కొట్టించి బ్రాహ్మణులకు నివాసయోగ్యములుగా చేసి కొన్నిగ్రామములను అగ్రహారములుగా యిచ్చెను.ఇచ్చట ఒక చారిత్రికాంశముకలదు.చాళుక్యులమూల పురుషుడైన విజయాదిత్యుడు త్రిలోచనపల్లవునితో యుద్దైముచేసి మరణించెను.అతనుమరణించునాటికి అతని భార్య గర్భవతి.ఆమె తప్పించుకొనిపోయి హిరణ్యరాష్ట్రమున నేటి త్రిపురాంతకం సమీపమున గల "ముడివేము" గ్రామముచేరి విష్ణుభట్ట సోమయాజి అనుబ్రాహ్మణునిచే రక్షింపబడి, మగశిశువునుకనెను.ఆబాలుడు పెద్దవాడై పల్లవులను ఓడించి చాళుక్య రాజ్యస్థాపన చేసెను.ఆబాలుడు రాజైనపిదప విష్ణుభట్ట సోమయాజులకు ఆగ్రామమును అగ్రహారముగ యిచ్చెను.తదనంతరం ముడివేము ముడివేముల గ్రామము అయినది.దీనికిసమీపములోగల ఒడ్డుపాలెం అనుగ్రామముకలదు.ఈ ఊరిలో కొంతభాగమును చిన్నముడివేముల అనిపిలువబడును.చిన్నముడివేములకు ఉత్తరభాగమున ఒక చెరువుకలదు దీనికి వుత్తరభాగమున కొంత దూరమున నేటికి కొన్ని శాసనములు శిథిలమై కన్పించును.అలాగే ముడివేముల చిన్నముడివేముల మధ్య భాగమున కూడా దద్దనాలు అని పురాతన శిథిల శివాలయం కలదు

మూలాలు[మార్చు]