పాత సింగరాయకొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"పాతసింగరాయకొండ" ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామము.[1]

గ్రామ చరిత్ర[మార్చు]

పాతసింగరాయకొండ గ్రామ సమీపాన, మన్నేరు ఒడ్డున జాతీయ రహదారి ప్రక్కన కొత్తవంతెన నిర్మించగా, పాతవంతెన క్రింద మట్టి త్రవ్వుచుండగా, 2017, మార్చి-27న, మూడు అడుగుల ఎత్తు ఉన్న, ఒక పురాతన రాతి శివలింగం బయల్పడినది. [6]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

  1. భవనాశి చెరువు.
  2. మేలం చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ వి, బ్రహ్మానందరెడ్డి, రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికైనారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడ్కలలో భాగంగా, 2017, ఏప్రిల్-24న విజయవాడలో నిర్వహించు ఒక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి శ్రీ నారా లోకేష్ చేతులమీదుగా వీరికి ఈ పురస్కారం అందజేసెదరు. [7]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పట్టాభిసీతారామాలయం[మార్చు]

పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో 2014, జూన్-2, సోమవారం నాడు, సీతా, లక్ష్మణ, ఆంజనేయస్వాముల సమేత శ్రీ కోదండరామస్వామివారి నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠ, కలశ స్థాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేదపండితులు, ఉదయం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, యంత్రస్థాపన, అనంతరం ఉదయం 7-45 గంటలకు శిఖర, కలశ స్థాపన నిర్వహించారు. అనంతరం సరిగా ఉదయం 8 గంటలకు శిలావిగ్రహాలు ప్రతిష్ఠించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామివారి పీఠంలో వెండి, బంగారం వేసి తమ భక్తి చాటుకున్నారు. స్వామివారి శాంతి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. [1]

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం[మార్చు]

దక్షిణ సింహాచలంగా పేరుపొందిన ఈ ఆలయంలో, స్వామివారి బ్రహ్మోత్సవాలు, 2014, జూన్-9, సోమవారం నాడు ప్రారంభమైనవి. ఆరోజున తొలుత, గరుడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. రాత్రికి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం నాడు ప్రత్యేకపూజల అనంతరం, స్వామివారు చొప్పరంపై ఊరేగినారు. సాయంత్రం శేషవాహనంపై అభయమిచ్చారు. ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి నుండి స్వామివారిని గరుడవాహనంపై పాతసింగరాయకొండ, సోమరాజుపల్లె గ్రామాలలో ఊరేగించారు. శనివారం స్వామివారు చొప్పరంపై దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. శనివారం రాత్రికి గజోత్సవం సాగినది. ఆదివారం ఉదయం, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుఝామున స్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలు, 18వ తేదీ, బుధవారం నిర్వహించిన పుష్పయాగంతో ముగిసినవి. [2], [3], [4]&[5]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-3; 7వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-10; 8వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-15; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-16; 15వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-19; 16వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-28; 2వపేజీ. ]7] ఈనాడు ప్రకాశం; 2017, ఏప్రిల్-22; 7వపేజీ.