పానిక్ అటాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Panic attack
Classification and external resources
Panic attack.jpg
In case of a panic attack, remain calm
ICD-10F41.0
ICD-9300.01
MeSHD016584

పానిక్ అటాక్‌ లు (తీవ్ర భయాందోళన ముట్టడులు) అనేవి తీవ్రమైన భయం లేదా ఆందోళనల కొనసాగింపులు. ఇవి ఆకస్మికంగా ప్రారంభం కావడం[1]తో పాటు తక్కువ సమయం పాటు చోటు చేసుకుంటాయి. తీవ్ర భయాందోళన ముట్టడులనేవి సాధారణంగా అకస్మికంగా చోటు చేసుకోవడంతో పాటు దాదాపు 10 నిమిషాల్లోనే ఉచ్ఛస్ధితికి చేరుకుని మరియు దాదాపు 30 నిమిషాల్లోనే ముగిసిపోతాయి. తీవ్ర భయాందోళన ముట్టడులనేవి 15 సెకండ్ల స్వల్పకాలం మాత్రమే ఉండవచ్చు లేదా చక్రీయంగానూ సంభవించవచ్చు, కొన్నిసార్లు ఎక్కువ సమయం కొనసాగే ఈ రకమైన పరిస్థితి అనేక గంటల సమయం కూడా కొనసాగుతుంది. ఈ రకమైన ముట్టడులులు ముందస్తుగా సంభవించిన అనుభవమున్న పరిస్థితుల్లో సూచనప్రాయమైన ముందస్తు ఆందోళన మరియు ముట్టడు‌ల మధ్య పరిమిత సంకేత ముట్టడి‌ లాంటివి అనుభవంలోకి రావడం ద్వారా ఇవి చోటు చేసుకోవడం జరుగుతుంది.

తీవ్ర భయాందోళన ప్రభావాలు అనేక విధాలుగా ఉంటాయి. కొన్నిసార్లు, ప్రత్యేకించి మొదటిసారి ఈ రకమైన ముట్టడికి గురైన వారి విషయంలో అత్యవసర సేవల కోసం పిలవాల్సి రావచ్చు. చాలావరకు మొదటిసారిగా తీవ్ర భయాందోళన ముట్టడి అనుభవం ఎదుర్కొన్నవారు తాము గుండె పోటుకు లేదా నరాలు చచ్చుబడిపోవడం లాంటి పరిస్థితికి గురయ్యామని భయపడుతుంటారు.[2] తీవ్ర భయాందోళన ముట్టడికి గురైన వారి ప్రకారం, వారు ఎదుర్కొన్న పరిస్థితి అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత తీవ్రమైన భయానక, కృంగుబాటుకు గురిచేసే మరియు అసౌకర్యవంతమైన అనుభవంగా ఉంటుంది.[3]

వర్ణనలు[మార్చు]

తీవ్ర భయాందోళన ముట్టడులతో బాధపడిన వారు చాలాసార్లు భయం లేదా చనిపోతామనే భావన గురించి, "మతి తప్పుతోందనే భావన" లేదా గుండె పోటు అనుభవం గురించి లేదా "మిరుమిట్లు గొలిపే దృష్టి", సొమ్మసిల్లుతున్న లేదా వికారం కలిగిన భావన, దేహమంతా మొద్దుబారుతున్న భావన గురించి, పెద్దగా గాలిపీల్చడం (మరియు దాదాపు ప్రతిసారీ, వేగంగా జరిగే శ్వాసక్రియ) లేదా తమపై తాము నియంత్రణ కోల్పోతున్న భావన లాంటి లక్షణాలను వ్యక్తం చేస్తుంటారు. మరికొంతమంది సొరంగంలోంచి చూస్తున్న భావాన్ని ఎదుర్కొన్నట్టు చెబుతుంటారు, రక్షణలో భాగంగా శరీరంలోని కీలకమైన భాగాల నుంచి తలకు జరిగే రక్త ప్రవాహం నిల్చిపోవడమనేది చాలావరకు ఈ రకమైన పరిస్థితికి కారణంగా నిలుస్తుంది. ఎక్కడైతే ముట్టడి ప్రారంభమైందో (సహానుభూత "పోరాట-లేదా-పలాయన ప్రతిస్పందన" పర్యవసానమిది) అక్కడి నుంచి తప్పించుకోవడం లేదా పారిపోవడం చేయాలని ఈ రకమైన భావాలు గట్టిగా పురిగొల్పవచ్చు, ఈ సందర్భంగా ఈ రకమైన ప్రతిస్పందనకు కారణమైన హార్మోన్లు పెద్ద మొత్తంలో విడుదలవుతాయి. ఈ రకమైన ప్రతిస్పందన శరీరాన్ని హార్మోన్లుతో ప్రత్యేకించి ఎపినెఫ్రైన్ (ఆడ్రినలిన్) తో ముంచెత్తుతుంది, ఈ పరిస్థితి ప్రమాదానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.[3]

తీవ్ర భయాందోళన ముట్టడి అనేది సహానుభూత నాడీ వ్యవస్థ (SNS) కు సంబంధించిన ఒక ప్రతిస్పందన. తక్కువ సమయం పాటు అనియతకాలిక కంపనం, ఆయాసం (వేగంగా ఊపిరితీసుకోవడం), గుండె దడ, ఛాతి నొప్పి (లేదా ఛాతీ పట్టేసిన భావం), ఒళ్లంతా వేడి ఆవిర్లు, శీతల ఆవిర్లు, మండుతున్న భావనలు (ప్రత్యేకించి ముఖం లేదా మెడ భాగంలో), చెమట్లు పట్టడం, వాంతులు, మైకం (లేదా కొంచెం తలతిరగడం), తేలికపాటి-తలనొప్పి, వేగంగా జరిగే శ్వాసక్రియ, పరెస్థేసియాస్ (శరీరం జలదరిస్తున్న భావం), గొంతు పట్టేసిన లేదా ఊపిరాడని భావన, మరియు అవాస్తవికత భావన లాంటివి తీవ్ర భయాందోళన ముట్టడి సందర్భంగా అత్యంత సాధారణంగా చోటు చేసుకునే లక్షణాలు. ఈ రకమైన భౌతిక లక్షణాలు చోటు చేసుకోవడం ద్వారా వ్యక్తులు తీవ్ర భయాందోళన ముట్టడు‌లకు గురికాగలరనే హెచ్చరిక విడుదలవుతుంది. విపరీతమైన ఆత్రుత, మరియు అనుకూల ప్రతిపుష్టి సంబంధం రూపాల్లో ఇది వెలువడుతుంది.[4]

వేగంగా ఊపిరితీసుకోవడం మరియు ఛాతి నొప్పి లాంటివి చోటు చేసుకోవడం తీవ్ర భయాందోళన ముట్టడికి సంబంధించిన సాధారణ చిహ్నాలుగా ఉంటాయి; ఈ రకమైన ఛాతినొప్పిని గుండె పోటుకు సంకేతం లేదా వ్యాధిచిహ్నంగా బాధితులు పొరబాటు పడుతుంటారు. ఈ కారణంగానే తీవ్ర భయాందోళన ముట్టడికు గురైనవారు తమకు అత్యవసర గదిలో చికిత్స కావాలని కోరే అవకాశముంది.

అదేసమయంలో తీవ్రత, కొనసాగింపు లాంటి స్వభావం ద్వారా ఇతర రూపాల్లోని ఆత్రుత నుంచి తీవ్ర భయాందోళన ముట్టడులు స్పష్టమైన భేదాన్ని ప్రదర్శిస్తుంటాయి.[3] తీవ్ర భయాందోళన ముట్టడులనేవి చాలావరకు మానసిక అవ్యవస్థకు సంకేతం కానప్పటికీ, తరచూ ఇవి ఆందోళన అవ్యవస్థలు మరియు ఇతర మానసిక పరిస్థితులతో కలిసి అనుభవంలోకి వస్తుంటాయి.

ప్రకోపకాలు మరియు కారణాలు[మార్చు]

  • దీర్ఘ కాలిక, ముందస్తు కారణాలు — వంశపారంపర్యత. తీవ్ర భయాందోళన అవ్యవస్థ కొన్ని కుటుంబాల్లో తరచూ కనిపిస్తుంటుంది, అంటే దీని అర్థం ఎవరు తీవ్ర భయాందోళన రుగ్మతకు గురయ్యే అవకాశం ఉందని ముందస్తుగా కనిపెట్టే విషయంలో వంశపారంపర్యత అనేది ఒక బలమైన పాత్ర పోషిస్తోంది. అయితే వారి వంశంలో ఎక్కడకూడా ఈ రకమైన అవ్యవస్థ లేనప్పటికీ, చాలామంది ఈ రకమైన అవ్యవస్థకు గురవుతుంటారు. తీవ్ర భయాందోళన దాడి అనేది ఏ వయసులోనైనా సంభవించేదే అయినప్పటికీ, చాలావరకు ఈ పరిస్థితి యుక్తవయసు ప్రారంభంలో ముట్టడిస్తుంటుంది. మహిళల్లో చాలా తరచుగా చోటు చేసుకునే తీవ్ర భయాందోళన ముట్టడి, సాధారణం కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన వారిలో తరచూ కనిపిస్తుంటుంది. విభిన్న కవలల అధ్యయనాల ప్రకారం, కవలల్లోని ఒకరు ఆందోళన అవ్యవస్థ కలిగి ఉంటే, మరొకరు సైతం 31 నుంచి 88 శాతం వరకు ఆందోళన అవ్యవస్థ కలిగి ఉన్నట్టు తేలింది. తల్లితండ్రులు ప్రపంచం పట్ల అతి జాగ్రత్తతో కూడిన దృష్టిని వ్యక్త పరచడం లాంటి పర్యావరణ కారకాలు మరియు దీర్ఘకాలంపాటు పెద్ద మొత్తంలో ఒత్తిడి లాంటివి తీవ్ర భయాందోళన ముట్టడులతో సహసంబంధం కలిగినవిగా గుర్తించబడ్డాయి.[3]
  • జీవసంబంధ కారణాలు — ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, హైపోగ్లైసీమియా, హైపర్‌థైరాయిడిజం, విల్సన్స్ వ్యాధి, మిట్రల్ కవాటం జారిపోవడం, ఫెయోక్రొమోసైటోమా మరియు లోపలి చెవి సంక్షోభం (లేబ్రిన్థిటిస్) మొదలుగునవి తీవ్ర భయాందోళన ముట్టడులకు దారితీయవచ్చు.[3] సంతులితం కాని ఆహారం కారణంగా లేదా బద్దెపురుగు కారణంగా చోటు చేసుకునే ‌పరాన్నజీవ సంక్రమణ వల్ల ఏర్పడే విటమిన్ B లోపం ఆందోళన వల్ల చోటుచేసుకునే రుగ్మతలకు కారణం కావచ్చు.[ఆధారం కోరబడింది]
  • భయాలు — భయం కలిగించే అంశాలు లేదా పరిస్థితికి గురికావడమనేది వ్యక్తులు తరచూ తీవ్ర భయాందోళన ముట్టడు‌లకు గురయ్యేందుకు ప్రత్యక్ష కారణంగా ఉంటోంది.
  • స్వల్ప-కాలంలో ప్రకోపించే కారణాలు — శృంగారపూరిత భాగస్వామితో భావోద్రేగ అనుబంధం, జీవిత పరివర్తనం, గుర్తించదగిన జీవిత మార్పుతో సహా చెప్పుకోదగిన స్థాయిలో వ్యక్తిగత నష్టం మరియు కెఫీన్ లేదా నికోటిన్ లాంటి ఉత్ప్రేరకాలు ప్రకోపకాలుగా పనిచేయవచ్చు.[3]
  • నిర్వహణ కారణాలు — భీతిని ప్రకోపించే పరిస్థితులు లేదా పర్యావరణాలను దూరంగా ఉంచడం, ఆందోళన/ప్రతికూల స్వీయ-వ్యాఖ్యలు ("ఒకవేళ అలా జరిగితే" అనే ఆలోచన), పొరబాటు నమ్మకాలు ("ఈ రకమైన రోగ లక్షణాలు హానికరమైనవి మరియు/లేదా ప్రమాదకరమైనవి"), వాయిదావేసిన భావాలు, నొక్కిచెప్పేతత్వం లోపించడం లాంటివి తీవ్ర భయాందోళన ముట్టడికి దారితీయవచ్చు.[3]
  • నొక్కిచెప్పేతత్వం లోపించడం — సమాచార మార్పిడిలో లేదా ఇతరులతో జరిపే సంభాషణలో చొరవ చూపని తత్వం కలిగిన వ్యక్తుల్లో చోటు చేసుకునే స్వభావం ఈ రకమైన పరిస్థితి చోటు చేసుకుంటుందనేందుకు చక్కని సాక్ష్యం. మర్యాదపూర్వక మరియు గౌరవనీయ రూపంలో ఉండే సమాచార మార్పిడి శైలి సైతం సాధారణంగా నొక్కిచెప్పే తత్వం లోపించడం కిందికే వస్తాయి. ఈ రకమైన నొక్కిచెప్పే తత్వం లోపించిన సమాచార మార్పిడి అనేది తీవ్ర భయాందోళన ముట్టడులకు దారితీయడంతో పాటు తీవ్ర భయాందోళన ముట్టడు‌లకు గురైన వారిలో తరచూ ఈ సమస్య దర్శనమిస్తుంది.[3]
  • ఔషధప్రయోగాలు — రిటాలిన్ (మెథైల్‌ఫెనిడేట్) లేదా ఫ్లూరోక్వీనోలిన్ తరహా యాంటిబయటాక్‌ల వంటి ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలు సైతం కొన్నిసార్లు తీవ్ర భయాందోళన ముట్టడులకు కారణం కావచ్చు.[5] ఇది తాత్కాలిక దుష్ప్రభావం మాత్రమే కావచ్చు, రోగికి మొదటిసారి ఔషధాన్ని ఉపయోగించిన సమయంలో మాత్రమే ఇది చోటు చేసుకోవచ్చు, లేదా రోగి సదరు ఔషధానికి అలవాటు పడిన తర్వాత కూడా ఈ రకమైన పరిస్థితి చోటు చేసుకోవచ్చు, అయితే వేయాల్సిన డోసు లేదా ఔషధ రకం మారినప్పుడు మాత్రమే ఔషధ ఉపయోగ మార్పులో భాగంగా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. దాదాపు మొత్తం SSRI తరగతికి చెందిన మనోవ్యాక్యులత నివారణ ఔషధాలన్నీ తొలిసారి ఉపయోగించిన సమయంలో ఆందోళనకు పెరిగేందుకు కారణం కావచ్చు. ఔషధ ఉపయోగానికి అలవాటు పడడం లేదా అలవాటు మానుకోవడం చేసే సమయంలో, ప్రత్యేకించి ఒకసారి ఆందోళనకు గురై ఉన్నవారు తీవ్ర భయాందోళన ముట్టడు‌లకు గురికావడమనేది అసాధారణమైన విషయమేమీ కాదు.
  • ఆల్కహాల్, ఔషధప్రయోగం లేదా ఔషధ ఉపయోగ ఉపసంహరణ — సూచించబడిన మరియు సూచించబడని వివిధ రకాల పదార్థాలు వాటి ఉపసంహరణ సిండ్రోమ్ లేదా ప్రతిస్పందిత ప్రభావంలో భాగంగా తీవ్ర భయాందోళన ముట్టడు‌లు అభివృద్ధి చెందేందుకు కారణం కాగలవు. ఆల్కహాల్ ఉపసంహరణ మరియు బెంజోడియాజేపైన్ ఉపసంహరణలనేవి వాటి శాంతపరచు లక్షణాలకు సంబంధించిన ప్రతిస్పందిత ఉపసంహరణ లక్షణం రూపంలో ఈ రకమైన ప్రభావాలకు కారణమయ్యేవిగా సుపరిచితంగా ఉంటున్నాయి.[6]
  • వేగవంతమైన శ్వాసక్రియ సిండ్రోమ్ — ఛాతి ద్వారా శ్వాసించడమనేది వేగవంతమైన శ్వాసక్రియకు కారణం కావచ్చు, తద్వారా సదరు వ్యక్తి రక్తప్రవాహంలో ఆక్సిజన్‌తో సంబంధం కలిగి ఉండాల్సిన బొగ్గుపులుసు వాయువు సైతం అధనంగా బయటకి వచ్చేస్తుంది. వేగవంతమైన శ్వాసక్రియ సిండ్రోమ్ అనేది శ్వాసకోశ ఆల్కాలసిస్ మరియు హైపోక్యాప్నియాకు కారణం కావచ్చు. ఈ సిండ్రోమ్ అనేది తరచూ నోటి ద్వారా జరిగే శ్వాసక్రియకు సైతం కారణం కావచ్చు. వేగవంతమైన హృదయ స్పందన, మైకము, మరియు కళ్లు బైర్లు కమ్మడం లాంటి అనేక లక్షణాలకు ఇది దారితీయడంతో పాటు ఈ లక్షణాలన్నీ కలిసి తీవ్ర భయాందోళన ముట్టడు‌లకు దారితీయవచ్చు.[3]
  • సమయానుకూలంగా సంభవించే తీవ్ర భయాందోళన ముట్టడు‌లు — పానిక్ అటాక్‌లతో సంబంధం కలిగిన కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏదైన ఒకటి ఎదురైన సందర్భంలో తీవ్ర భయాందోళన ముట్టడులకు గురికాబోతున్నాం అనే ఆలోచన లేదా ప్రవర్తన చోటు చేసుకోవడం (సమయానుకూలంగా సంభవించే తీవ్ర భయాందోళన ముట్టడులు) ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఇది సంప్రదాయ అనుగుణంగా ఉంటుంది. కళాశాల, పని, లేదా నియోగించడం లాంటి సందర్భాలను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.[3] PTSD చూడండి.
  • ఔషధశాస్త్రపరమైన ప్రేరేపకాలు — ప్రధానంగా ఉత్ప్రేరకాలు మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఉపశమనకారుల వంటి నిర్థిష్ట రసాయన పదార్థాలు ఔషధశాస్త్రపరంగా కోపాన్ని ప్రకోపింపజేసే సమూహాలుగా ప్రవర్తించడంతో పాటు తీవ్ర భయాందోళన ముట్టడి లేదా భయాందోళన రుగ్మత, లేదా ఒకదాన్ని ప్రత్యక్ష్యంగా ప్రేరేపిస్తుంది.[7][8] కెఫేన్, యాంఫేటమైన్, ఆల్కహాల్ మరియు అనేక ఇతర అంశాలను ఇది కలిగి ఉంటుంది. తీవ్ర భయాందోళన ముట్టడి‌తో బాధపడిన కొందరు నిర్థిష్టమైన ఔషధాలు లేదా రసాయనాల పట్ల భయాలను వ్యక్తం చేశారు, ఆ విధంగా సదరు ఔషధాలు కేవలం మానసిక రుగ్మతకి భౌతికమైన లక్షణాలు చూపే ప్రభావాన్ని కలిగి ఉంటాయి, ఆవిధంగా ఆరకమైన ఔషధాలు ఔషధేతర రూపంలో ఔషధ ప్రకోపకాలుగా పనిచేస్తాయి.[9]
  • దీర్ఘకాల మరియు/లేదా తీవ్రమైన అనారోగ్యం — అకస్మిక మరణానికి కారణమయ్యే లాంగ్ QT

సిండ్రోమ్ లాంటి గుండె సంబంధిత రుగ్మతలు; CPVT లేదా వుల్ఫ్-పార్కిన్‌సన్-వైట్ సిండ్రోమ్ లాంటివి సైతం పానిక్ అటాక్‌లకు కారణం కావచ్చు. అయితే గుండె స్తంభించిపోవడం లేదా గుండెలో అమర్చదగిన కార్డియోవెర్టర్-డీఫైబ్రిలేటర్ ఒకవేళ షాక్‌ను విడుదల చేసే అవకాశ ఉండడం లాంటి పరిస్థితులతో సంబంధం కలిగిన ఆందోళనగా దీని గురించి చెప్పడం ప్రత్యేకించి కష్టమైన వ్యవహారం. అలాగే గుండె పనిచేయకపోవడం మరియు ఆందోళన లక్షణాల మధ్య స్పష్టమైన విభేదం చూపగల గుండె పరిస్థితి ఉన్నవారి విషయంలో ఇది కష్టమైన కార్యం. CPVTలో ఆందోళన తనకు తానుగానూ మరియు అరైథిమియాను ప్రకోపింపజేవచ్చు.తీవ్ర భయాందోళన ముట్టడు‌లకు సంబంధించిన ప్రస్తుత నిర్వహణ అనేది బెంజోడియాజెపిన్స్‌పై ఎక్కువగా ఆధారపడి కనిపించే గుండె పరిస్థితులకు ద్వితియంగా ఉంటుంది; ఇది నిర్థిష్ట సెరొటోనిన్ పునర్‌వినియోగం ఆటంకాలు మరియు/లేదా సంజ్ఞాన ప్రవర్తనా చికిత్స రూపంలో ఉంటుంది. అయితే, ఈ విభాగంలోని వ్యక్తులు తరచూ బహువిధ మరియు అనివార్యమైన ఆస్పత్రి చికిత్స అనుభవాన్ని కలిగి ఉంటారు; ఎలక్ట్రోకార్డియోగ్రామ్ లేకుండా తీవ్ర భయాందోళన లక్షణాలను మరియు గుండె సంబంధ లక్షణాలను వేరుపరచి చెప్పడం కష్టతరమైన కార్యం కాగలదు.

మానసికమైన పరిగణనలు[మార్చు]

తీవ్ర భయాందోళన ముట్టడికి సంబంధించిన వివిధ లక్షణాలు చోటుచేసుకున్న సమయంలో బాధితుడు తన శరీరం విఫలమవుతున్న భావనకు గురయ్యే అవకాశం ఉంది, అయితే సదరు భావన అనేది నిజానికి హాని నుంచి తనను తాను రక్షించుకునే ప్రక్రియలో భాగం మాత్రమే. కొన్ని రకాల సంకేతాల ద్వారా తీవ్ర భయాందోళన ముట్టడికి సంబంధించిన విభిన్న లక్షణాలను అర్థం చేసుకోవచ్చు. తరచూ (అయితే ఎల్లప్పూడూ కాదు) తక్కువ ప్రేరేపిత ఉద్దీపనతో కూడిన భయం ఆకస్మికంగా దాడి చేయడం ఇందులో మొదటిది. వ్యక్తి శరీరం ఒక బలమైన శారీరక చర్యకు పూనుకోవడంలో భాగమైన పోరాట లేదా పలాయన ప్రతిస్పందనకు సంబంధించిన ఆడ్రినలిన్ (ఎపినెఫ్రిన్) విడుదలయ్యేందుకు ఈ పరిస్థితి దారితీస్తుంది. అంతేకాకుండా అధిక స్థాయి హృదయ స్పందన (టాచేకార్డియా), వేగవంతమైన శ్వాసక్రియ (హైపర్‌‌వెంటిలేషన్) లకు సైతం దారితీస్తుంది, వేగంగా ఊపిరి తీసుకోవడం (డైస్పేనియా), మరియు చెమటపట్టడం (ఇది వేడి కోల్పోవడాన్ని మరింత ఎక్కువ చేస్తుంది) లాంటి అంశాల ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు. కఠినమైన చర్య అరుదుగా మాత్రమే చోటు చేసుకోవడమే ఇందుకు కారణం, ఇక వేగంగా ఊపిరితీసుకోవడమనేది మొదట ఊపిరితిత్తుల్లోనూ అటుపై రక్తంలోనూ బొగ్గుపులుసు వాయువు తగ్గిపోయేందుకు దారితీస్తుంది. అటుపై రక్తం pH (శ్వాసక్రియ ఆల్కలోసిస్ లేదా హైపోకాప్నియా) లో మార్పులకు దారితీస్తుంది, దీంతోపాటు జలదరింపు లేదా తిమ్మిరి, మైకం, మంట మరిు కళ్లు బైర్లు కమ్మడం లాంటి అనేక ఇతర లక్షణాలకు సైతం ఇది దారితీస్తుంది. అంతేకాకాకుండా, తీవ్ర భయందోళన దాడి సమయంలో విడుదలయ్యే ఆడ్రినలిన్ రక్తనాళాల సంకోచానికి కారణం కావడం వల్ల తలకు జరిగే రక్త ప్రవాహం తగ్గిపోవడం వల్ల మైకం మరియు కళ్లు బైర్లు కమ్మడం లాంటివి చోటుచేసుకుంటాయి. దీంతోపాటు తీవ్ర భయాందోళన ముట్టడి అనేది మెదడు నుండి మరియు ప్రధాన కండరాల నుంచి రక్తంలోని చక్కెర స్థాయి తగ్గిపోయేందుకు కారణమవుతుంది. అంతేకాకుండా ఈ రకమైన ఒక ముట్టడి‌ని అనుభవించిన వ్యక్తి తాను శ్వాసించలేక పోతున్నాననే భావానికి గురికావడంతో పాటు బలంగా శ్వాసక్రియ జరపడం వల్ల రక్తంలో బొగ్గుపులుసు వాయువు స్థాయిలు పడిపోవడం జరుగుతుంది.

లక్షణాలు[మార్చు]

నిర్ధారణ ప్రమాణాలు[మార్చు]

DSM-IV అనేది తీవ్ర భయాందోళన ముట్టడికు సంబంధించిన నిర్ధారణ ప్రమాణం

తీక్షణమైన భయం లేదా అసౌకర్యం యొక్క వివక్త సమయంలో, కింద తెలిపిన నాలుగు (లేదా అనేక) లక్షణాలు ఆకస్మికంగా వృద్ధి చెందడంతోపాటు కేవలం 10 నిమిషాల్లో ఉచ్ఛస్ధితికి చేరుకుంటాయి:

  • స్పష్టమైన తీవ్ర భయాందోళన
  • గుండెదడలు, లేదా హృదయస్పందన రేటు పెరగడం
  • చెమటపట్టడం
  • కంపణం లేదా వణుకు
  • కండరాలు బిగుసుకుపోవడం
  • చూపు మసకబారడం
  • వేగంగా ఊపిరితీసుకోవడం లేదా ఊపిరాడని పరిస్థితి అనుభవంలోకి రావడం
  • గొంతు పట్టేసిన భావం
  • అలలు చుట్టుముట్టేస్తున్న భావన
  • ఛాతి నొప్పి లేదా అసౌకర్యం
  • వికారం లేదా పొత్తికడుపులో ఎక్కువ బాధ
  • తల తిరుగుతున్న, స్థిరత్వంలేని, తలపగిలిపోతున్న, లేదా సొమ్మసిల్లుతున్న భావం
  • అవాస్తవికత (అవాస్తవికతకు సంబంధించిన భావనలు) లేదా వ్యక్తిగతంగా పట్టుకోల్పోవడం (స్వీయభావం నుంచి దూరం కావడం)
  • నియంత్రణ కోల్పోతున్నట్టు లేదా వెర్రెక్కిపోతున్నట్టు భయం
  • చనిపోతామనే భయం
  • పరెస్థియాస్ (తిమ్మరి లేదా జలదరింపు భావనలు)
  • చల్లని లేదా వేడి భావనలు
  • మోకాళ్లలో బలహీనత
  • తికమక
  • సొరంగంలోంచి చూస్తున్న భావం
  • నిశ్చేష్టమైన మది
  • సమయం భారంగా గడుస్తున్న భావన
  • భయటపడాల్సిన అవసరం ఉందనే భావన
  • శరీరం లోపలి నుంచి విస్తరిస్తున్న వేడి భావన
  • తలనొప్పిలా కాకుండా మరోరకంగా తలలో ఒత్తిడి

ఎగ్రోఫోబియా[మార్చు]

ఎగ్రోఫోబియా (బయలు ప్రదేశం అంటే భయం) అనేది ఒక ఆందోళన రుగ్మత, బాధితుడు తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితి నుండి ఏర్పడిన ఒక విభిన్న లేదా ఇబ్బందికర అనుభవానికి సంబంధించిన భయాన్ని ఇది ప్రాథమికంగా కలిగి ఉంటుంది. తీవ్ర భయాందోళన ముట్టడు‌లనేవి సాధారణంగా ఎగ్రోఫోబియా మరియు అధ్వాన పరిస్థితి నుంచి తప్పించుకునే అవకాశం లేదనే భయంతో సంబంధం కలిగి ఉంటాయి. ఫలితంగా, తీవ్రమైన ఎగ్రోఫోబియాతో బాధపడేవారు తమ ఇంటికే పరిమితమై పోవడంతో పాటు సదరు "భద్రమైన ప్రదేశం" నుంచి బయటకు రావడం అత్యంత కష్టమైన కార్యంగా భావిస్తారు.[10] "ఎగ్రోఫోబియా" అనే పదం గ్రీకు పదాలైన అగోరా (αγορά) మరియు ఫోబియా (φόβος) ల నుంచి దత్తత చేసుకోబడిన అంగ్లపదం. "ఎగ్రో" అనే పదం పురాతన గ్రీకులు ఒకచోట చేరి నగరానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకునే ప్రదేశాన్ని సూచిస్తుంది, కాబట్టి ఇది ప్రధానంగా ఏదేని లేదా అన్ని బహిరంగ ప్రదేశాలకు వర్తిస్తుంది; ఎగ్రోఫోబియా అనేది ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాల్లో చోటు చేసుకుంటుంది, బాధితులైన అతను లేదా ఆమె తప్పించుకోవడానికి వీలులేదనే భావానికి గురైనప్పుడు ఈ ఫోబియా చోటు చేసుకుంటుంది. సాంఘిక ఫోబియా లేదా సాంఘిక ఆందోళన ద్వారా ఎగ్రోఫోబియా చోటు చేసుకుంటుంది, మొదటి ప్రదేశంలో బహిరంగంగా తీవ్ర భయాందోళన ముట్టడి‌కు గురికావడం వల్ల బాధితులు అత్యంత ఇబ్బందికి గురికావచ్చు. ఎగ్రోఫోబియా అనేది బహిరంగ ప్రదేశాలకు సంబంధించిన భయం, మరియు వైద్యపరంగా సరైనది కాదు అనే సాధారణ అపోహ ఉండడమే ఈ రకమైన అనువాదానికి కారణం. ఈ విధమైన తీరులో ఎగ్రోఫోబియా వర్ణించబడడం వల్ల తీవ్ర భయాందోళన‌ రుగ్మతకు సంబంధించిన రోగ నిర్ధారణ సమయంలో ఇది వృత్తినిపుణులు పరీక్షించే ఒకానొక లక్షణంగా ఉంటోంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ లేదా పోస్ట్ ట్రూమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ లాంటి ఇతర సిండ్రోమ్స్ సైతం ఎగ్రోఫోబియాకు కారణమవుతాయి, ప్రాథమికంగా ఏదేని చికాకుపెట్టే భయం ఒకరిని భయటకు వెళ్లకుండా అడ్డుకున్నట్టైతే అటువంటి అంశం ఈ సిండ్రోమ్‌కు కారణం కావచ్చు.[11]

నిర్థిష్ట పరిస్థితుల్లో వ్యక్తులు తీవ్ర భయాందోళన ముట్టడి‌కు గురైనట్టైతే అది చికాకుపెట్టే భయాలను, ఆ రకమైన పరిస్థితులకు సంబంధించిన ఫోబియాలుగా పిలిచే భయాలను పెంపొందించడంతో పాటు వాటిని తప్పించడం ప్రారంభమవుతుంది. చివరకు తప్పించడానికి సంబంధించిన పద్ధతి మరియు మరొక దాడికి సంబంధించిన ఆందోళన యొక్క స్థాయి అనేది తీవ్ర భయాందోళన రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు ఇంటి నుంచి బయటకు రాలేని లేదా కనీసం అడుగు కూడా బయటపెట్టలేని స్థాయికి చేరవచ్చు. ఈ రకమైన స్థాయి వద్ద సదరు వ్యక్తి ఎగ్రోఫోబియాతో కూడిన తీవ్ర భయాందోళన రుగ్మతతో బాధపడుతున్నట్టుగా చెబుతారు. ప్రారంభంలోనే చికిత్స తీసుకోనీయకుండా బాధితులకు అడ్డుపడుతుంది కాబట్టి ఇది విపరీతంగా భయపడే రుగ్మత యొక్క అత్యంత బాధాకరమైన దుష్ప్రభావంగా ఉంటుంది. అయితే 90% మించిన ఎగ్రోఫోబియా బాధితులు పూర్తిస్థాయి స్వస్థత పొందడం తప్పకుండా గుర్తించాల్సిన విషయం.[ఆధారం కోరబడింది]

పానిక్ డిసార్డర్ (తీవ్ర భయాందోళన రుగ్మత)[మార్చు]

మళ్లీ మళ్లీ, స్థిరంగా భయానికి సంబంధించిన దాడులకు గురైనవారు లేదా మరో దాడి గురించి విపరీతమైన ఆందోళనకు గురయ్యేవారు తీవ్ర భయాందోళన రుగ్మత కలిగి ఉన్నట్టుగా చెబుతారు. తీవ్ర భయాందోళన రుగ్మత అనేది తరచూ హఠాత్తుగా మరియు ప్రకోపించని తీవ్ర భయాందోళన ముట్టడుల్లో భాగమైన ఇతర రకాల ఆందోళన రుగ్మతల నుంచి పూర్తి స్థాయిలో విభిన్నంగా ఉంటుంది.[12]

చికిత్స[మార్చు]

మానసిక చికిత్సలు, ధ్యానంలతో సహా విభిన్న రకాల జోక్యాల సాయంతో తీవ్ర భయాందోళన రుగ్మతకు ప్రభావవంతగా చికిత్స చేయవచ్చు[3], ఎంపికచేసిన సెరటోనిన్ పునర్వినియోగ నిరోధకాలకు కొనసాగింపుగా సంజ్ఞాన ప్రవర్తనా చికిత్స ప్రభావం దీర్ఘకాలం ఉంటుందనే సాక్ష్యంతో ఇది సాధ్యమవుతోంది.[13]

బెర్రీ మెక్‌డొనాగ్ ప్రకారం, దీర్ఘకాలిక బాధితుడు మరియు తీవ్ర భయాందోళన ముట్టడి రుగ్మతకు చికిత్స జరిపే నిపుణుడి విశ్వాసించేది ఏమిటంటే, తీవ్ర భయాందోళన ముట్టడులు మరియు తీవ్ర భయాందోళన రుగ్మతలు ఒక రోజు కంటే తక్కువ పరిమిత కాలంలో పూర్తిగా నయం కాగలవు, ఇందుకు ఔషధ వినియోగం సమాధానం కాదు- అందుకు బదులుగా వైద్యపరమైన వృత్తినిపుణులు తీవ్ర భయాందోళన ముట్టడుల యొక్క నిజమైన కారణాలను తెలుసుకోవడమే ఇందుకు సరైన చికిత్స. 'పానిక్ అవే' తన పుస్తకంతో ఆయన లెక్కలేనంత మంది వ్యక్తులు తమ తీవ్ర భయాందోళన రుగ్మతలకు మరియు తీవ్ర భయాందోళన ముట్టడులకు ముగింపు పలికేందుకు సాయపడ్డారు, దీంతో వైద్య నిపుణులు సైతం సదరు రుగ్మతకు తాము నిర్వహించే చికిత్స విధానాన్ని మార్చుకున్నారు.

ఏ రకమైన అంశాలు తీవ్ర భయాందోళన ముట్టడికి కారణమవుతున్నాయని తెలుసుకోవడంతో పాటు వాటివల్ల మీ ఆరోగ్యానికి నిజంగా ఎలాంటి భయం లేదని వాస్తవికంగా గ్రహించేలా చేయడమే ఇందుకు సంబంధించి ఆయన తెరమీదకు తెచ్చిన చికిత్సా విధానం. 'అంగీకరించడం' మరియు తీవ్ర భయాందోళన ముట్టడిని స్వాగతించడం ద్వారా ఒకరిలో లక్షణాలు ప్రాథమికంగా పొడచూపిన సమయంలో, వాస్తవికత విధానం ద్వారా వాటిని నిరోధించడం ఇందులో భాగమై ఉంటుంది. తీవ్ర భయాందోళన ముట్టడి అనేది కేవలం ఒక పోరాట లేదా పలాయన ప్రతిస్పందన కావడంతో ఆశ్చర్యం గొలిపే రీతిలో ఆందోళన అనేది మనలను మనం రక్షించుకోవడానికి ఒక యంత్రాంగంలా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి తన శరీరం యొక్క స్వాభావిక ఆందోళన యంత్రాంగాన్ని అణిచి వేసేందుకు ప్రయత్నించిన సమయంలో, తీవ్ర భయాందోళన ముట్టడి అనేది బలపడడం మరియు తీవ్రరూపం దాల్చడం జరగడమే ఇందుకు కారణం.

మానసిక చికిత్సలు[మార్చు]

అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం, " తీవ్ర భయాందోళన రుగ్మతకు సంజ్ఞాన మరియు ప్రవర్తనపరమైన చికిత్సలు ఉత్తమమైనవి. కొన్ని కేసుల్లో ఔషధ ఉపయోగం సైతం సరైన విధానం" అని అనేకమంది వైద్య నిపుణులు అంగీకరిస్తున్నారు.[14] చికిత్సలో మొదటిభాగం ఎక్కువగా సమాచారాన్ని స్వీకరించడంపై ఆధారపడి ఉంటుంది; తీవ్ర భయాందోళన రుగ్మత అంటే ఏమిటి, ఇంకా ఎంతమంది ఇతరులు దీని కారణంగా బాధపడుతున్నారనే విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవడం ద్వారా చాలామంది వ్యక్తులు అత్యద్భుతంగా సహాయపడుతుంటారు. తీవ్ర భయాందోళన రుగ్మతతో బాధపడే చాలామంది తీవ్ర భయాందోళన ముట్టడి కారణంగా తమకు 'మతి తప్పుతోందని' లేదా తీవ్ర భయాందోళన అనేది గుండెపోటు ముప్పును కలిగిస్తుందని బాధపడుతుంటారు. 'సంజ్ఞాన పునర్నిర్మాణం' (ఒకరి ఆలోచన తీరును మార్చడం) అనేది అత్యంత వాస్తవిక ఆలోచనలు, ముట్టడులను అనుకూల ధోరణితో చూడడం ద్వారా వ్యక్తులు ఆరకమైన ఆలోచనల నుంచి బయటపడేందుకు సాయపడుతుంది.[15]

ఔషధ వినియోగం[మార్చు]

పేపర్ బ్యాగ్ రీబ్రీతింగ్[మార్చు]

తీవ్ర భయాందోళన పరిస్థితి అత్యంత ఎక్కువ స్థాయిలో చోటుచేసుకున్న సమయంలో ఒక కాగితపు సంచీలో శ్వాసించడం ప్రభావవంతమైన స్వల్పకాలిక చికిత్స అని తీవ్ర భయాందోళన ముట్టడికి గురైన అనేకమందితో పాటు వైద్యులు సైతం సిఫార్సు చేస్తున్నారు.[16] అయితే, ఈ చికిత్సను ఇతరులు విమర్శిస్తున్నారు, ఇది నిష్ఫలమైనదని మరియు రోగికి ప్రాణాపాయం కలిగించడంతో పాటు తీవ్ర భయాందోళనను మరింత ఎక్కువ చేసే ప్రమాదముందని వారు విశ్వసించడమే అందుకు కారణం.[17] ఈ పద్ధతి వల్ల రక్త ప్రవాహంలో ప్రాణవాయువు స్థాయిలు తీవ్రంగా పడిపోతాయి, [18] మరియు బొగ్గుపులుసు వాయువు స్థాయిలు వృద్ధి చెందుతాయి, తీవ్ర భయాందోళన ముట్టడుల విషయంలో ఇదొక ప్రధాన కారణంగా మారడం కనుగొనబడింది అని విమర్శకులు చెబుతున్నారు.[19]

కాబట్టి ప్రతికేసులో శ్వాసక్రియ జోరుగు జరగడాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇది రక్తంలో ప్రాణవాయువు/CO2 స్థాయిలను తిరిగి సర్ధుబాటు చేసిన తర్వాత, మరియు/లేదా లెక్కించిన శ్వాసక్రియ విధానం పునఃస్థాపనం అనేది ఒక సరైన చికిత్స, లెక్కించడం లేదా కూనిరాగం సాయంతో బహిర్‌శ్వాసను విస్తరించడం ద్వారా కూడా దీన్ని సాధించవచ్చు.[20]

రుతుక్రమం ఆగిన మహిళల్లో గుండెపోటు మరియు స్ట్రోక్ పెరిగే ముప్పు[మార్చు]

ఇటీవలి ఒక అధ్యయనం సూచించిన ప్రకారం, తీవ్ర భయాందోళనతో బాధపడే రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో మరియు తీవ్ర భయాందోళన ముట్టడులు ఎక్కువ సంభవించిన వారిలో అటుపై వచ్చే ఐదేళ్లలో గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం మూడింతలు ఎక్కువగా ఉంటుంది. తీవ్ర భయాందోళన ముట్టడులు లేదా వాటికి సంబంధించిన కచ్చితమైన లక్షణాలు (ఛాతి నొప్పి, వేగంగా ఊపిరితీసుకోవడం) లాంటివి గుండె సంబంధ వ్యాధులను గుర్తించబడకపోవడమనే అంశాన్ని పట్టి చూపుతాయి, లేదా తీవ్ర భయాందోళన కారణంగా రోగిలో ఏర్పడే గుండె సంబంధ ఒత్తిడి మరియు ఏళ్ల తరబడి తీవ్ర భయాందోళన ముట్టడులు చోటు చేసుకోవడం వల్ల గుండె దెబ్బతింటుంది.[21] అయితే, తీవ్ర భయాందోళన రుగ్మత లేదా ఎగ్రోఫోబియా లేకుండానే తీవ్ర భయాందోళన ముట్టడులకు గురైన ఇతర కేసుల్లో సైతం రోగి గుండె వెనువెంటనే దెబ్బతింటుందని లేదా తీవ్ర భయాందోళన రుగ్మత మరియు స్ట్రోక్‌ల మధ్య సంబంధం సాధారణమేనని లేదా చాలామంది రోగులు అనుభవించినట్టు SSRIలు మరియు బెంజోడియాజెపిన్స్ లాంటి ఔషధ చికిత్స వల్ల చోటుచేసుకునే గుండె సంబంధ ప్రభావాలు వాస్తవమేననే అంశాలను సదరు అధ్యయనం నిరూపించలేదు. తీవ్ర భయాందోళన ముట్టడి లక్షణాలు గుండెపోటుకు సంబంధించిన హెచ్చరికలు మరియు ముందస్తు సూచనలు కూడా అయ్యే అవకాశముంది. అందుకే తీవ్ర భయాందోళన లక్షణాల నుంచి గుండె వ్యాధుల లక్షణాలను స్పష్టంగా వేరుపరచి చూడడం కోసం ఛాతి నొప్పి, వేగంగా ఊపిరి తీసుకోవడం, అసాధారణ అలసట మరియు ఇతర రకాలైన గుండెపోటు లక్షణాల గురించి వైద్యుని ద్వారా పరీక్షించుకోవాలి.

పరిమిత లక్షణం కలిగిన ముట్టడి[మార్చు]

తీవ్ర భయాందోళన ముట్టడుల విషయమై చికిత్స అందుకుంటున్న అనేకమంది వ్యక్తులు పరిమిత లక్షణం కలిగిన ముట్టడి అనుభవం ఎదుర్కోవడం ప్రారంభమవుతుంది. ఈ రకమైన తీవ్ర భయాందోళన ముట్టడులనేవి ఇదివరకే అనుభవించిన 4 శారీరక లక్షణాలకంటే తక్కువ స్థాయిలో ఉండడంతో పాటు తక్కువ సమగ్రమైనవిగా ఉంటాయి.[3]

తమ కాళ్లలో ప్రకంపణలు, లేదా వేగంగా ఊపిరితీసుకోవడం, లేదా ఈస్ట్రోజన్ కొరత కారణంగా వేడి సెగలను పోలినవి లాంటివి కాకుండా శరీర వ్యాప్తంగా తీవ్రమైన వేడి ప్రసరించడం లాంటి ఒకే ఒక లేదా రెండు రకాల లక్షణాలని ఒకే సమయంలో అనుభవించడం తీవ్ర భయాందోళనతో బాధపడే వారి విషయంలో అసాధారణ విషయమేమీ కాదు. కాళ్లలో సంభవించే ప్రకంపణల వంటి కొన్ని లక్షణాలు తీవ్ర భయాందోళన రుగ్మతను స్పష్టంగా పట్టిచూపే సాధారణ ఉద్వేగం నుంచి చాలినంత వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. జాబితాలోని ఇతర లక్షణాలు మాత్రం తీవ్ర భయాందోళన రుగ్మత ఉన్నవారు లేదా లేనివారు ఇద్దరిలోనూ చోటు చేసుకుంటాయి. నిజానికి తీవ్ర భయాందోళన రుగ్మత అనేది నాలుగు లేదా అనేక లక్షణాలను కలిగి ఉండాలని అవన్నీ ఏకకాలంలో సంభవించాలనే కచ్చితమైన నిబంధనేదీ లేదు. పూర్తి కారణ రహిత తీవ్ర భయాందోళన మరియు హెచ్చు స్థాయికి చేరే హృదయ స్పందన లాంటి తీవ్ర భయాందోళన కారణాలనేవి తీవ్ర భయాందోళన దాడిని సూచించేందుకు పూర్తిగా సరిపోతాయి.[3]

సూచనలు[మార్చు]

  1. http://m-w.com/dictionary/panic%20attack
  2. Reid, Wilson (1996). "Don't Panic: Taking Control of Your Anxiety Attacks. Revised Edition, HC".
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 బోర్న్, E. (2005). ది యాంగ్జైటీ అండ్ ఫోబియా వర్క్‌బుక్ , 4వ సంచిక: న్యూ హర్‌బింగర్ ప్రెస్.
  4. Klerman, Gerald L.; Hirschfeld, Robert M. A.; Weissman, Myrna M. (1993). Panic Anxiety and Its Treatments: Report of the World Psychiatric Association Presidential Educational Program Task Force. American Psychiatric Association. p. 44. ISBN 978-0-88048-684-2.
  5. Sternbach H, State R (1997). "Antibiotics: neuropsychiatric effects and psychotropic interactions". Harv Rev Psychiatry. 5 (4): 214–226. doi:10.3109/10673229709000304. PMID 9427014.
  6. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  7. మెడ్‌లైన్‌ప్లస్ మెడికల్ ఎన్‌సైక్లోపీడియా: పానిక్ డిజార్డర్
  8. కెఫేన్ మరియు పానిక్ డిజార్డర్
  9. సైకోమ్యాటిక్ మరియు ఔషధ-ప్రేరేపిత తీవ్ర భయాందోళన ముట్టడులు
  10. http://www.mayoclinic.com/health/agoraphobia/DS00894
  11. సైక్ సెంట్రల్: ఎగ్రోఫోబియా లక్షణాలు
  12. Panic Disorder: Panic Attacks and Agoraphobia – familydoctor.org
  13. ఆందోళన: పెద్దవారిలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల్లో ఆందోళన (తీవ్ర భయాందోళన రుగ్మత, ఎగ్రోఫోబియా సహితంగా లేదా లేకుండా, మరియు సాధారణీకరించిన ఆందోళన రుగ్మత) నిర్వహణ మరియు సమాజ సంరక్షణ. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ క్లినికల్ ఎక్సెలెన్స్. క్లినికల్ గైడ్‌లైన్ 22. సంచిక తేజీ: ఏప్రిల్ 2007 [1] ISBN 1-84629-400-2
  14. http://www.apa.org/topics/anxietyqanda.html
  15. Cramer, K., Post, T., & Behr, M. (January 1989). "Cognitive Restructuring Ability, Teacher Guidance and Perceptual Distracter Tasks: An Aptitude Treatment Interaction Study". Retrieved 2010-11-19.CS1 maint: Multiple names: authors list (link)
  16. కాగితపు సంచీ లోపల మరియు బయట శ్వాసక్రియ
  17. హైపర్‌వెంటిలేషన్ సిండ్రోమ్ – కాగితపు సంచీలో శ్వాసక్రియ జరపడం ద్వారా నేను హైపర్‌వెంటిలేషన్ సిండ్రోమ్‌ని నయం చేయగలనా?
  18. కాగితపు సంచీలో శ్వాసక్రియ అనేది మీరు పొందడానికి సాధ్యమైన తాజా గాలిని అడ్డుకుంటుంది. తాజా గాలి లేకుంటే, తక్కువ ఆక్సిజన్ మాత్రమే పీల్చడానికి వీలవుతుంది. కాబట్టి, కాగితపు సంచీలో శ్వాసక్రియ అనేది మీ రక్తప్రవాహంలో ప్రాణవాయువు నిల్వను ప్రమాదకర స్థాయిలో తగ్గిపోయేలా చేస్తుందనే వాదన ఉంది. గుండెపోటుకు సంబంధించి నమోదైన అనేక కేసుల్లో రోగులు తాము హైపర్‌వెంటిలేషన్ సిండ్రోమ్‌తో ఉన్నట్టు తప్పుగా ఆలోచించడంతో పాటు కాగితపు సంచీలో శ్వాసక్రియ కారణంగా వారి గుండెపోటు సమస్య మరింత ప్రమాదకర పరిస్థితికి చేరుతోంది. http://firstaid.about.com/od/shortnessofbreat1/f/07_paper_bags.htm
  19. CO2 మరియు తీవ్ర భయాందోళన ముట్టడుల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్తతం అనేక అధ్యయనాలు నిరూపించాయి, వీటి ప్రకారం పీల్చే గాలిలో CO2ను కృత్రిమంగా ఎక్కువ చేయడం వల్ల ఆందోళనతో బాధపడే రోగుల్లో తీవ్ర భయాందోళన భావనలు మరింత ఎక్కువవుతాయని తేలడం పరిస్థితిని మరింత అధ్వానంగా మార్చింది. http://firstaid.about.com/od/shortnessofbreat1/f/07_paper_bags.htm
  20. http://www.anxietyawareness.com/overcoming-anxiety.php
  21. మూస:Smoller, Jordan W., MD CsD, et al, Archives of General Psychiatry, 2007; 64(10):1153-1160.

16. # ^ కార్పోనెల్, డేవిడ్. (2004) పానిక్ అటాక్స్ వర్క్‌బుక్: తీవ్ర భయాందోళన సమస్యను ఎదుర్కొనేందుకు ఒక మార్గదర్శక కార్యక్రమం. . బర్కిలీ, CA: యులైసెస్ ప్రెస్.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Mental and behavioral disorders