పాపం (చలం రచన)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుడిపాటి వెంకట చలం వ్రాసిన కథల సంపుటి[1] ఇది. దీనిలో 12 కథలు ఉన్నాయి. తెనాలి యువకార్యాలయం వారు దీనిని ప్రకటించారు. వెల నాలుగణాలు. 1937లో ప్రచురింపబడింది. 1942లోను, 1944లోను పునర్ముద్రించబడింది.

కథలు[మార్చు]

  1. మోసం చేసిందా?
  2. వొంటరితనం
  3. నేనూ మా ఆవిడా మిగిలాం
  4. అమ్మగారి అవసరం
  5. అవసరం లేని ఆపరేషన్
  6. అవతారమా?
  7. ఎదగనేలేదు
  8. భాషన్నా తెలీదు
  9. మచ్చలు
  10. ఒరేయ్ వెంకటాచలం
  11. కళారాధన
  12. రస పుత్రులు

పత్రికాభిప్రాయము[మార్చు]

"వెంకటచలంగారు ఈ కథల సంపుటికి గంభీరంగా 'పాపం!!!' అని పేరు పెట్టేరు. కాని వీరి కింత జాలి వీరి కథలలో సంభవించేవాళ్లెవరెవరిమీద ఏఏ కారణాలవల్ల పుట్టిందో బోధపడడం లేదు. 'మోసం చేసిందా?' అన్నకథలోనూ, 'వొంటరితనం' అన్నకథలోనూ,'నేనూ మా ఆవిడా మిగిలాం' అన్నకథలోనూ, 'అమ్మగారిఅవసరం' అన్నకథలోనూ, 'అవసరంలేని ఆపరేషన్' అన్నకథలోనూ, 'అవతారమా?' అన్నకథలోనూ కథకుడి ఉద్దేశ్యంలో జాలిశబ్దం పుట్టించగలిగే ఆడదికాని మొగవాడుకాని ఎంతవెదికినా కనపడడంలేదు. 'ఎదగనేలేదు' అన్నకథలో ఒక పెద్దమనిషి, తన పెళ్లానికి ముసలిరూపు వస్తోందని దుఃఖపడుతూ, ఆ దుఃఖంలో ఏమీ చెయ్యడానికి తోచక తన అత్తగారితో సంబంధం పెట్టుకుంటాడు! ఈ కథలో పెళ్లాన్ని చూసి జాలిపడాలో మొగుడిని చూసి జాలిపడాలో తెలియకుండా ఉంది.'మచ్చలు' అన్నకథలో పాశ్చాత్య శాస్త్రజ్ఞులచేత 'శాడిజమ్' అనబడే కొసవెర్రితో బాధపడుతున్న రత్తయ్య పిచ్చివాడన్న విషయం కథలో ఏ భాగంలోనూ నొక్కి చెప్పకుండా, రత్తయ్య పెళ్లామైన దుర్గమ్మ పడుతున్న బాధలు లోకంలో ప్రతి ఆడదీకూడా పడుతున్నట్టూ, ఒకడి పెళ్లాన్ని మరొకడొచ్చి లేవతీసుకుపోతేకాని ఆడవాళ్లబాధలకి అంతులేనట్టూ కథవ్రాయడం చాలా హాస్యాస్పదంగా ఉంది." - భారతి సాహిత్యమాసపత్రిక ఆగస్టు 1937.

మూలాలు[మార్చు]

  1. [1] భారత డిజిటల్ లైబ్రరీలో మూడవ ముద్రణ ప్రతి