పాపనాశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాపనాశం (తమిళం:பாபநாசம்) ఇది తమిళనాడులోని తంజావూరుజిలాలో ఉన్న ఒక పంచాతితీ పట్టణం. ఇది తంజావూరు నుండి 25 కిలోమీటర్ల దూరం అలాగే కుంబకోణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కావేరి, తిరుమలై రాజన్, కుడమురుట్టి అనే మూడు నదులు ఉన్నాయి.

జనాభా

[మార్చు]
  • 2001 జనాభాగణాంకాను అనుసరించి పాపనాశం జనసంఖ్య 16,397.
  • వీరిలో స్త్రీ:పుషుల సంఖ్య 50%:50% ఉంది.
  • అక్షరాస్యత సంఖ్య 76%. ఇది జాతీయ సరాసరి అక్షరాస్యత అయిన 59.5% కంటే అధికం.
  • పురుషుల అక్షరాస్యత 82%.
  • స్త్రీల అక్షరాస్యత 70%.
  • జనాభాలో 6 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న వారు 11%.

పొదియిన్ మలై పాపనాశం

[మార్చు]

పాపనాశం అనేది ఇక్కడ ఉన్న పరమశివుడి ఆలయంలోని మూలవిరాట్టు పేరు. ఆయన పేరు మీదనే ఈ ఊరికి ఈ పేరు వచ్చింది. పాపాలను వినాశనం చేస్తాడు కనుక ఇక్కడి శ్డివుడికి పాపనాశం అనే పేరు వచ్చింది. ఇక్కడి ఆలయం లోని అమ్మవారి పేరు ఉలగమ్మై, లోకనాయకి. స్థల వృక్షం పేరు : కళా మరం. తీర్థం పేరు తామ్రపర్ణి, కల్యాణ తీర్థం, భైరవ తీర్థం. ఇక్కడ ఆరాధించిన భక్తులు అగస్త్యుడు.

స్థల చరిత్ర

[మార్చు]

పాపనాశం, పొదియిన్ మలై పాపనాశం రెండూ ఒకటే. అయినా ప్రజలు పాపనాశం అని అంటారు. పొదియిన్ మలై దిగువ ప్రాంతమే పాపనాశం. శివకల్యాణానికి తరలి వచ్చిన దేవతలు, మునులు తదితరుల బరువు భరించలేని ఉత్తరభారతం దిగబడి దక్షిణ భారతం పైకి లేచి భూమిలో అసంతుల్యత కలిగింది. దానిని నివారించడానికి పరమశివుడు అగస్త్యుడిని పిలిచి దక్షిణదిశకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అందుకు అగస్త్యుడు కలత చెందాడు. అది చూసి శివుడు తన కల్యాణ శోభను అగస్త్యుడికి చూపిస్తానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన విధంగానే శివుడు తన కల్యాణం జరగగానే అగస్త్యునికి కల్యాణ మూర్తిగా పార్వతీదేవితో అగస్త్యుడికి దర్శనం ఇచ్చిన ప్రదేశం పాపనాశం. పాపనాశంకు పడమట ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న జలపాతానికి ఇందువలన కల్యాణతీర్థం అని పేరు వచ్చింది. అగస్త్యుడి ఆలయం ఉన్న ప్రదేశానికి పత పాపనాశం అని పేరు ఉంది. పొదిగై మలై మీద నుండి తామ్రపర్ణి నది సమతల భూమిలోకి ప్రవేశించిన పవిత్ర ప్రదేశం పాపనాశం. విక్రమపురంలో శివజ్ఞాన స్వామి పినతండ్రి నివసించాడు. అమ్మవారి మీద హద్దులు లేని భక్తి కలిగిన ఆయన ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్ళే వాడు. అమ్మవారి మీద భక్తిపారవశ్యం వలన అమ్మవారిని గురించిన పాటలు పాడుకుంటూ ఆలయానికి వచ్చి వెళ్ళేవాడు. ఒక సారి వారు ఆలయానికి వచ్చి తిరిగి వెళ్ళే సమయంలో అమ్మవారు ఆయన పాటలు వింటూ ఆయనకు తెలవకుండా ఆయనను అనుసరించి వెళ్ళసాగింది. ఆయన పాడే సమయంలో ఆయన వేసుకున్న తాంబూలం ఎంగిలి చింది అమ్మవారి మీద పడింది. అమ్మవారు అలాగే ఆలయానికి తిరిగి వచ్చింది. మరునాడు ఉదయం ఆలయ పూజారులు అమ్మవారి మీద ఉన్న ఎంగిలిని చూసి బాధతో మహారాజుకు మొరపెట్టుకున్నారు. మహారాజు ప్రాయశితం చేసే నిమిత్తం ఇలాంటి పాతకచర్య చేసిన వాడిని శిక్షిస్తానని అన్నాడు. ఆరోజు రాత్రి అమ్మవారు మహారాజు కలలో కనపడి జరిగిన వృత్తాంతం వివరించింది. మరునాటి ఉదయం నిద్ర లేచిన మహారాజు సేవకులను పంపి కవిని పిలిపించి ఆయనను పరీక్షించే నిమిత్తం అమ్మవారి చేతిలో పూలచెండును ఉంచి దానిని బంగారు కమ్మితో బంధించి దానిని వెలుపలికి తెచ్చేలా పాట పాడమని ఆజ్ఞాపించాడు. ఆయన కవినయంతో అందాది ఒకటి రచించి పాడాడు. అమ్మవారి చేతిలో ఉన్న పూలచెండుకు కట్టబడిన బంగారు తీగలు ఒక్కోశ్లోకానికి ఒక్కో చుట్టుగా వదులై కవి యొక్క మహిమను లోకానికి వెల్లడైంది. ఇక్కడ ఉన్న అగస్త్యుని జలపాతంలో సంవత్సరం అంతా నీరు కిందికి పడుతూనే ఉంటుంది.

ప్రత్యేకతలు

[మార్చు]
  • ఈ ప్రదేశం జ్ఞానసంబదర్ వాక్కులలో చోటు చేసుకున్న ప్రదేశం.
  • అగస్త్యునికి పరమశివుడు పార్వతీదేవితో కలిసి కల్యాణ మూర్తిగా దర్శనం ఇచ్చిన ప్రదేశం.
  • ఇక్కడ అగస్త్యుడికి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం పరమశివుడి కల్యాణం జరగడానికి ముందుగా అగస్త్యుడిని తీసుకు వచ్చి ఉపస్థితుడిని చేసిన తరువాతనే శివపార్వతుల కల్యాణోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తుంది.
  • ఈ ఆలయం తిరునల్వేలి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • ఈ ఆలయం ప్రశస్థి మాణిక్యవాశర్ రచించిన తిరువాచకమ్ అనే తమిళ గ్రంథంలో ఉంది.
  • చందనవృక్ష సమూహాలు మూలికావృక్ష సమూహాలు ఉన్న పొదిగై మలై శిఖరంలో తామ్రపర్ణి నది ఉత్పత్తి ఔతుంది.
  • పెద్ద ఆలయం (పెరియ కోయిల్) ముందు పరుతున్న తామ్రపర్ణి నదిలో స్నానం చేయడానికి తగిన వసతులు ఉన్నాయి.
  • సంవత్సరం అంతా ఉప్పొంగి పడే జలపాతం నీరు మూలికా శక్తి కలిగి ఉంటుంది కనుక ఇక్కడి నీటిలో స్నానం చేసే వారికి అనారోగ్యం నుండి స్వస్థత చేకూరుతుందని విశ్వసిస్తున్నారు.
  • విష్ణుమూర్తి కల్యాణ సుందర మూర్తిగా అగస్త్యుడు ఆయన భార్య లోపాముద్రకు దర్శనం ఇచ్చిన ప్రదేశమిదే.
  • ఇక్కడ తామ్రపర్ణి, దేవతీర్థం, కల్యాణ తీర్థం, భైరవ తీర్థం మొదలైన తీర్ధాలు ఉన్నాయి. వీటిలో భైరవ తీర్థం, కల్యాణ తీర్థం కొండశిఖరం మీద ఉన్నాయి.
  • ఈ ఆలయంలోని స్వామికి పాపనాశర్, వైరాసర్, పళమరైనాయకర్, ముక్కళామూర్తి, పరంజ్యోతి అనే అనేక పేర్లు ఉన్నాయి.
  • స్వామి గర్భగృహానికి చుట్టూ అద్భుతమైన శ్ల్పకళానైపుణ్యమున్న శిల్పాలు ఉన్నాయి.
  • ఈ ఆలయంలో నూనె అన్నం (ఎణ్ణ సాదమ్ ) దానికి తగిన పచ్చడి (తువైయల్) కలిపి భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా ఇస్తారు.
  • ఫాల్గుణ మాసంలో తెప్ప ఉత్సవం, తీర్ధ తిరనాళ (తిరువిళా), తమిళ చైత్రమాస మొదటి రోజు అగస్త్యుడికి దర్శనం ఇచ్చిన శివకల్యాణోత్సవం చక్కగా జరుపుతారు.

విద్యారంగం

[మార్చు]

కళాశాలలు

[మార్చు]

పాపనాశంలో పవిత్ర ప్రదేశాలు

[మార్చు]

పాలైవనంతర్ ఆలయం

[మార్చు]

సబస్టిన్ చర్చి

[మార్చు]

ప్రముఖులు

[మార్చు]

పాపనాశం సమీపంలో ఉన్న పవిత్ర ప్రదేశాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పాపనాశం&oldid=2909055" నుండి వెలికితీశారు