Jump to content

పాప్ మ్యూజిక్

వికీపీడియా నుండి

పాప్ మ్యూజిక్ లేదా పాప్ సంగీతం అనేది ఒక ప్రసిద్ధ సంగీత శైలి. ఇది 1950ల మధ్యలో అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్లలో దాని ఆధునిక రూపాన్ని సంతరించుకుంది.[1] 1950-1960 దశకాల్లో, పాప్ సంగీతం రాక్ అండ్ రోల్, ఇంకా దాని ప్రభావంతో వచ్చిన యువత ఆధారిత రీతలను కలిగి ఉంది. 1960ల చివరి వరకు రాక్, పాప్ సంగీతం దాదాపు పర్యాయపదాలుగా వాడేవారు. ఆ తర్వాత పాప్ మరింత వాణిజ్యపరమైన, తాత్కాలిక, సులభంగా చేరుకోగలిగే సంగీతాన్ని సూచిస్తోంది.

పునరావృతమయ్యే బృందగానం, హుక్స్, ఒక పల్లవి లేదా చరణం, తర్వాత కోరస్ పాడగలిగే ఆకృతి పాప్ సంగీతం గుర్తించే కారకాలు. ఇవి చిన్న నుండి మధ్యస్థ-నిడివి గల పాటలు, సులభంగా నృత్యం చేయగల లయ లేదా టెంపోలను కలిగి ఉంటాయి. పాప్ సంగీతంలో ఎక్కువ భాగం రాక్, హిప్ హాప్, అర్బన్, డ్యాన్స్, లాటిన్, జానపదం వంటి ఇతర శైలుల నుండి కూడా అంశాలను తీసుకుంటుంది. పాపులర్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ అనే పదాలు తరచుగా ఒకే భావనను సూచించడానికి వాడతారు. కానీ పాపులర్ మ్యూజిక్ సామూహిక ఆదరణ పొందే అన్ని రకాల సంగీతాన్ని, విభిన్న శైలులను కలిగి ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. S. Frith, W. Straw, and J. Street, eds, The Cambridge Companion to Pop and Rock (Cambridge: Cambridge University Press), ISBN 0-521-55660-0, pp. 95–105.