పామర్తి శంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పామర్తి శంకర్
Pamarthi Shankar.jpg
జననంమార్చి 3
నాగిరెడ్డిపల్లి గ్రామం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుకార్టూనిస్ట్ శంకర్
వృత్తిసాక్షి దినపత్రికలో ఎడిటోరియల్ కార్టూనిస్టు
ప్రసిద్ధివ్యంగ్య చిత్రకారుడు
మతంహిందూ

పామర్తి శంకర్ తెలంగాణ రాష్ట్రం లోని యాదాద్రి - భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు (కార్టూనిస్టు). ఆయన వ్యంగ్యచిత్రాలు, కారికేచర్ల చిత్రణలో ప్రపంచ ప్రఖ్యాతి గడించారు. కార్టూన్ల రంగంలో నోబెల్ బహుమతిగా పేరుపొందిన గ్రాండ్ పురస్కారానికి ఎంపికైన తొలి ఆసియావాసిగా ఆయన చరిత్ర సృష్టించారు.[1][2][3]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

శంకర్ మార్చి 3న యాదాద్రి - భువనగిరి జిల్లా జిల్లాలోని నాగిరెడ్డిపల్లిలో జన్మించారు. నల్గొండలోని నాగార్జునా డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు.

వృత్తి జీవితం[మార్చు]

తొలుత తను డ్రాయింగ్ టీచర్ గా చేసేవారు. 1999 లో వార్త దినపత్రికలో హైదరాబాద్ నగరంలో ఉద్యోగిగా తన వృత్తి జీవితం ప్రారంభించారు. ప్రస్తుతం సాక్షి దినపత్రికలో ఎడిటోరియల్ డెస్క్ ప్రధాన కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు

కార్టూన్లు[మార్చు]

శంకర్ తన ప్రతి కార్టూన్ లోనూ ఒక ప్రత్యేకత చూపించేందుకు ప్రయత్నిస్తారు. శంకర్ గీసిన అనేక కార్టూన్లు సాక్షి వంటి దినపత్రికలలో ప్రచురితమై ప్రజాదరణ పొందాయి.

కారికేచర్లు[మార్చు]

శంకర్ గీసే క్యారికేచర్లు వారి వారి స్వభావాలు, మ్యానరిజాలు, ఇజాలు... ఇలా వ్యక్తిగత లక్షణాలను ప్రతిబింబిచటంతో పాటు తమాషాగా ఆకర్షణీయంగా వుంటాయి. బాల్‌థాకరేను పులి లక్షణాల్తో గీసి... ఓ తోక కూడా పెడతారు. బాపూ గారు పైప్‌ పీల్చడం మానేశారనే విషయాన్ని ఆదరంగా తీసుకుని అతని క్యారికేచర్ లో వారు వాడే పైపులో పకక్షులు గూడు కట్టుకొని ఉన్నట్లు చిత్రించారు. రామభక్త హనుమానుడిగా వర్ణించుకునే వారికి అదనంగా ఓ తోకకూడా తగిలిస్తారు. అసలే బాగా పొడుగు... ఆ పొడుకు తగ్గట్లు సంపాదించుకున్న అమితాబచ్చన్ చాలా పొడగరి కాబట్టి వీరి క్యారీకేచర్ గీసేప్పుడు కొంగలాగా చిత్రిస్తారు. ఒంటికాలితో బాలివుడ్‌ను మేనేజ్‌ చేయగల కొంగ కాలికి సెల్యులాయిడ్‌ ఫిల్మ్‌ చేపలాగా చిక్కి ఉంటుంది. అదేవిధంగా మైక్‌ టైసన్లూ, ఇటు చార్లీచాప్లిన్లు, చిరంజీవి లాంటి వారెందరో ఇతని క్యారీ కేచర్లలో ఒడుపుగా ఒదిగిపోయారు.[4]

గుర్తింపులు[మార్చు]

 • మొదటి సారి హిందుస్థాన్‌ టైమ్స్‌ నిర్వహించిన కార్టూన్ల పోటీలో మూడో బహుమతి పొందారు.
 • బ్రెజిల్‌లో అంతర్జాతీయ క్వార్డినాజ్‌ ఫోర్త్‌ ఫెస్టివల్‌లో క్యారీకేచర్ కు అవార్డు గెలుచుకున్నారు.
 • రుమేనియాలో 2002లో జరిగిన ట్వెంటియత్‌ సెంచరీ గేట్ర్‌ పర్సనాలిటీస్‌ పోటీలో పాల్గొన్నారు.
 • బ్రెజిల్‌లో 2003లో నిర్వహించిన సలావో ఇంటర్నేషనల్‌ కార్టూన్ల పోటీకి వీరి కార్టూన్లు ఎంపికయ్యాయి. డీ హూమర్‌ తెరాస్కాబా పేరిట నిర్వహించిన ఆ సమావేశంలో శంకర్‌ కార్టూన్లకు ప్రముఖుల నుండి అనేక ప్రశంసలు అందాయి.
 • 2003లో చైనాలో సెకండ్‌ ఫ్రీ కార్టూన్‌ వెబ్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లో శంకర్‌ను ప్రత్యేకంగా అక్కడి కార్టూన్‌ పండితులు అభినందించారు.
 • పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు 2014 సంవత్సారానికి గానూ శంకర్ అందుకున్నారు. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు, దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది.[1][2][3]
 • 2015 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పామర్తి శంకర్‌కు ఉత్తమ కళాకారుడి అవార్డు ప్రదానం జరిగింది.[5]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 నమస్తే తెలంగాణ. "తెలంగాణ బిడ్డకు కార్టూన్ నోబెల్!". Retrieved 3 March 2017.
 2. 2.0 2.1 సాక్షి. "'సాక్షి' కార్టూనిస్టుకు అంతర్జాతీయ అవార్డు". Retrieved 3 March 2017.
 3. 3.0 3.1 తెలుగు వన్ ఇండియా. "కార్టూనిస్ట్ శంకర్‌కు అంతర్జాతీయ అవార్డు". telugu.oneindia.com. Retrieved 3 March 2017.
 4. తెలుగు వన్ ఇండియా. "చిరంజీవికి అలాంటివి అలవాటు లేదు: ఆర్టిస్ట్ శంకర్‌కే చెల్లింది". telugu.oneindia.com. Retrieved 3 March 2017.
 5. సాక్షి. "ఉత్తమ కళాకారుడి అవార్డు అందుకున్న సాక్షి కార్టూనిస్టు శంకర్‌". Retrieved 3 March 2017.

ఇతర లింకులు[మార్చు]