పామిడి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పమిడి
—  మండలం  —
అనంతపురం జిల్లా పటములో పమిడి మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో పమిడి మండలం యొక్క స్థానము
పమిడి is located in ఆంధ్ర ప్రదేశ్
పమిడి
ఆంధ్రప్రదేశ్ పటములో పమిడి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°57′00″N 77°35′00″E / 14.9500°N 77.5833°E / 14.9500; 77.5833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము పమిడి
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 49,292
 - పురుషులు 25,071
 - స్త్రీలు 24,221
అక్షరాస్యత (2001)
 - మొత్తం 53.94%
 - పురుషులు 65.63%
 - స్త్రీలు 41.91%
పిన్ కోడ్ 515775

పామిడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. పిన్ కోడ్: 515775. ఇది జిల్లా కేంద్రమైన అనంతపురం నుండి 44వ నెంబరు జాతీయ రహదారిలో హైదరాబాదు వెళ్ళే వైపు 30 కి.మి. దూరంలో ఉంది. జిల్లాలో మరో ముఖ్య పట్టణమైన గుత్తి నుండి 20 కి.మి. దూరంలో ఉంది. గుత్తి రైల్వే జంక్షను పామిడి గ్రామానికి సమీప రైల్వే జంక్షను.

గ్రామ చరిత్ర[మార్చు]

స్థల పురాణం: పామిడి గ్రామానికి ఆ పేరు "పాము ముడి" అన్న పద బంధం నుండి వచ్చినట్లు చెబుతారు. భోగేశ్వర స్వామి లింగానికి ఒక పాము ఎప్పుడూ చుట్టుకుని ఉండేదని, అందువల్ల ఆ ప్రదేశానికి "పాము ముడి" అన్న పేరు వచ్చిందని, అదే కాలక్రమేణా పామిడి అయిందని చెబుతారు. భోగేశ్వర స్వామి స్వయంభువని ప్రజల నమ్మకం. స్వామి వారి ఆలయం ఈ ఊరి ముఖ్య ఆకర్షణ.

మండల గణాంకాలు[మార్చు]

మండల కేంద్రము పమిడి
గ్రామాలు 22
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2001) - మొత్తం 49,292 - పురుషులు 25,071 - స్త్రీలు 24,221
అక్షరాస్యత (2001) - మొత్తం 53.94% - పురుషులు 65.63% - స్త్రీలు 41.91%

వ్యవసాయం[మార్చు]

పెన్నా నది తీరాన ఉన్న ఈ గ్రామ జనాభాలో అధిక శాతం మందికి కుట్టుపని జీవనాధారం. ఇక్కడి వస్త్ర వ్యాపారం చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ప్రసిద్ధి. వ్యవసాయం మరో ముఖ్య జీవనాధారం. వరి,వేరుశెనగ, పత్తి ముఖ్య పంటలు. పళ్ళ తోటల సాగు కూడా అధికం. ముఖ్యంగా జామ, బత్తాయి, మామిడి తోటలు బాగా సాగులో ఉన్నాయి.

దేవాలయములు[మార్చు]

  • పామిడిలో సుప్రసిద్దమైన దేవాలయము భోగేశ్వర స్వామి దేవస్థానము మరియు శ్రీ గజేంద్ర మోక్ష లక్ష్మి నారాయణ స్వామి దేవస్థానము తగ్గు దేవాలయము అనే పేరుతో వెలసిల్లుతున్నది.

పెన్నా నది ఒడ్డున గల భోగేశ్వర స్వామి దేవస్థానములో పరమేశ్వరుడు బోగేశ్వరుడిగా పిలువబడుతూ పెద్దదయిన లింగాస్వరుపముతో పెద్ద పాణిమట్టముతో నిత్య అబిషేక పూజలు అందుకుంటున్నాడు. బోగేశ్వర దేవస్థాన ఆలయ ప్రాంగణము ప్రశాంతమయిన వాతావరణము కలిగివుంటుంది. ఈ దేవాలయమునందు కార్తిక మాసములో జరుగు లక్ష దీపరాదన పట్టణ ప్రజలు విశేషంగా పాల్గొంటారు. అంతే కాకుండా శివరాత్రిని మండల ప్రజలందరూ ఆరోజు ఆలయ ప్రాంగణము నందే ఉపవాసము మరియు జాగరణ చేస్తూ నిత్య అభిషేకాలలో పాల్గొంటారు.

Sri Bhogeshwarudu
Pallaki Seva
Sri Lakshmi Narayana Swami
  • శ్రీ లక్ష్మి నారాయణ స్వామి దేవస్థానము రాతికట్టడము. ఈ ఆలయము శ్రీ కృష్ణ దేవరాయలు కాలము నాటిది అని ప్రతీతి. ఈ ఆలయము త్రవ్వకాలలో బయటపడినట్టుగా ఈ గ్రామ ప్రజలు చెప్పుకుంటున్నారు. అందుకే ఈ దేవాలయము తగ్గులో వున్నదని నమ్ముతున్నారు. అందువలన ఈ ఆలయము తగ్గు దేవాలయముగా పిలవబడుతుంది. ఈ ఆలయము మూర్తి పూర్తి క్రింది బాగములో ఒక ముసలి గజేంద్రున్నిపట్టుకున్నట్టు ఆ గజేంద్రుడు తొండము పైనకు వుంచి దేవుడు గురించి ప్రార్థించినట్టుగా ఉంది. దాని పై భాగము గరుడుని పై నారాయణుడు లక్ష్మి సమేతుడై వచ్చినట్టుగా అద్భుతంగా ఉంది. అందువలన ఈ మూర్తి గజేంద్ర మోక్ష లక్ష్మి నారాయణుడిగా నిత్య పూజలు అందుకుంటూ ప్రతి ఏకాదశికి పల్లకి ఉత్సవములు జరుపుకుంటున్నది.

గ్రామంలో సౌకర్యాలు[మార్చు]

పామిడి గ్రామం మండల కేంద్రం కూడా అవటంవల్ల అన్ని సదుపాయాలూ ఉన్నాయి. గ్రంథాలయం, ఆసుపత్రి,ఒక డిగ్రి కళాశాల, ఒక జూనియర్ కళాశాల, హై స్కూళ్ళు ఉన్నాయి. పామిడి గ్రామ పంచాయతి కార్యాలయము ఆవరణములో పట్టణ మంచినీటి సౌకర్యార్థము తక్కువ ధరతో మంచినీటిని అందచేస్తున్నారు.

రవాణా వ్యవస్థ[మార్చు]

జిల్లా కేంద్రం నుండి బస్సులున్నాయి. జిల్లాలో ముఖ్య పట్టణమైన గుత్తి నుండి కూడా బస్సు సౌకర్యం బాగుంది. దగ్గరి రైల్వే స్టేషను ఇక్కడికి 2 కి.మి. దూరంలో గల కల్లూరు రైల్వే స్టేషను.

ఇతర విశేషాలు[మార్చు]

  • పామిడిలో ఆషాఢ మాసములో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారము రోజు గ్రామదేవత అయిన పామిడమ్మ దేవత ఉత్సవాన్ని గ్రామ ప్రజలందరూ పామిడమ్మ తేరుగా విశేషంగా జరుపుకుంటారు. అదే ఆషాఢ మాసములో ఏకాదశి నుండి పౌర్ణమి దాక ఉట్ల తేరు ఉత్సవాలు జరుగుతాయి. పామిడి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానములో దసరా ఉత్సవములు ప్రసిద్దముగా జరుపబడును. అంతేకాక వినాయక చవితి పండుగలో కుల మతాలకు అతీతంగా పాల్గొనటం విశేషము.
  • పామిడి గ్రామంలో తెలుగుతో సమానంగా మరాఠి భాష కూడా చలామణిలో ఉంది. దీనికి కారణం ఇక్కడి ముఖ్య వాణిజ్యమైన వస్త్ర వ్యాపారంలో మరాఠి మాతృభాషగా గల భావసార క్షత్రియ ప్రజలు అధిక సంఖ్యలో ఉండటం. అందువల్ల ఇక్కడ వినాయక చవితి పండుగ, కృష్ణాష్టమి ఘనంగా జరుపబడుతాయి. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున ఉట్లు పడగొట్టటమన్నది ఇక్కడ చాలా వేడుకగా జరుగుతుంది.
  • పామిడి గ్రామానికి జీవనది అయిన పెన్నా నది క్రమంగా తన ఉనికిని కోల్పోవటం వల్ల ఇప్పుడు పామిడి గ్రామం వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నది. క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వస్త్ర వ్యాపారంలో పుంజుకోవటంతో ఇక్కడి వ్యాపార వాణిజ్యాలు మందగించాయి. ప్రస్తుతం కుట్టుపని కొనసాగిస్తూ ప్రపంచ వస్త్ర వాణిజ్యంలో తమ ఉనికిని కాపాడుకోవటానికి ఇక్కడి ప్రజల ప్రయత్నం కొనసాగుతోంది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పామిడి&oldid=1996495" నుండి వెలికితీశారు