పాము యొక్క అంతర్ చెవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పడగ విప్పిన నాగుపాము

చెవి అంటే ఇది ఒక శరీరభాగము. ఇది ఒక జ్ఞానేంద్రియము. శరీరములోని వినికిడి సాధనము. పంచేంద్రియాలలో ఒకటి. The Technical University of Munich, Germany, The Bernstein Center for Computational Neuroscience కు చెందిన J. Leo van Hemmen, Paul Friedel అనే శాస్త్రవేత్తలు పాములు వినగలవు అని తాజా అద్యయనల ద్వారా కనుగొన్నారు. పాములకు కర్ణభేరి Eardrums, ఉండవు కాని అంతర్ చెవులు Inner ear, కాక్లియా Cochlea నిర్మాణాలు సహాయంతో గాలిలో గల ప్రకంపనలు గ్రహించటం ద్వారా వినగలవు. [1]

కర్ణబేరి ఉండదు[మార్చు]

పాము యెుక్క అంతర్ చెవి నిర్మాణం (ఈ నిర్మాణం సహాయంతో పాము అతి సూక్ష్మ శబ్దాలను కుడా వినగలదు)

కర్ణభేరి త్వచం, మధ్య చెవి కుహరం, శ్రోత్రనాళాలు లోపిస్తాయి. సర్పాల్లో కర్ణస్తంభిక (Columella (auditory system) ) ప్రలంబంతో అతికి ఉంటాయి.పాముకు కర్ణబేరి ఉండదు, బాహ్య చెవులు ఉండవు పరిణామక్రమంలో పాముల బాహ్య చెవులు వ్యర్థావయవాలు (vestigial organs) అయ్యాయి. కేవళం లోపలి చెవులు మాత్రమే ఉంటాయి. కాని అంతర్ చెవులు (Inner ear), కాక్లియా (Cochlea) నిర్మాణాలు సహాయంతో గాలిలో గల ప్రకంపనలు దవడలు సహాయంతో గ్రహించటం ద్వారా అతి సూక్ష్మ శబ్దాలను కూడా వినగలవు. పాము కూడి, ఏడమ దవడలను స్వతంత్రంగా కదపడం ద్వారా వివిధ దిక్కుల నుండి వచ్చే శబ్దాలను గుర్తించగలదు.[1]

జ్ఞానేంద్రియగ్రహితలు[మార్చు]

జ్ఞానేంద్రియగ్రహితలు (Mechanoreceptors) అనేవి అతి సున్నితమైన నరాలు ఇవి శరీరమంతా ఉండి వెన్నుపాము (Spinal cord) తో అనుసందానముగా డండి నేల మీద నుండి లేదా ఇసుక రేణువుల నుండి వచ్చే తరంగాలను స్పర్శించడానికి సహాయపడుతాయి.అలా వచ్చిన తరంగాలు శరీరంలోని జ్ఞానేంద్రియగ్రహితలు, వెన్నుపాము ద్వారా మెదడుకు (Brain) చేరుకుని శబ్దాలను గ్రహిస్తుంది. ఈ జ్ఞానేంద్రియగ్రహితలు అతి సూక్ష్మ శబ్ద తరంగాలను సైతం గ్రహించి పాముకు ద్వని ఏర్పడిన ప్రదేశాన్ని గుర్తించేందుకు సహాయపడుతాయి.[1]

గాలిలో తరంగాలను పుర్రె గ్రహించుట[మార్చు]

గాలిలో పయనించే సూక్ష్మ శబ్ద తరంగాలు మెుదట పుర్రె గ్రహించిన పిమ్మట లోపలి చెవులకు పంపుతుంది. ఆ తరువాత ఆ తరంగాలు మెదడుకు చేరుతాయి అప్పుడు కూడా పాము శబ్దాలను గ్రహిస్తుంది.[1]

ములాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 Snakes indeed hear Hemmen and Fridel researches shows snakes indeed listen Archived 2016-07-20 at the Wayback MachineRetrived:www.animals.mom.me