పాయిజన్ ఐవీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాయిజన్ ఐవీ
Toxicodendron radicans, leaves.jpg
Ground-level poison ivy, Ottawa, Ontario
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: సపిండేలిస్
కుటుంబం: అనకార్డియేసి
జాతి: టాక్సికోడెండ్రాన్
ప్రజాతి: టి. రాడికాన్స్
(L.) Kuntze
ద్వినామీకరణం
టాక్సికోడెండ్రాన్ రాడికాన్స్
పర్యాయపదాలు
 • Rhus toxicodendron
 • Rhus radicans

టాక్సికోడెండ్రన్ రాడికన్స్ (పాయిజన్ ఐవీ (విషపు మొక్క) ; పురాతన పర్యాయపదాలు రస్ టాక్సికోడెండ్రన్ , రస్ రాడికన్స్ [1]) అనేది అనకార్డియేసి కుటుంబానికి చెందిన ఒక మొక్క. ఇది ఒక కలుపు మొక్క మాదిరిగా పెరిగే తీగ. దీనికి విషపూరిత రసాయన చమురును ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. ఇది ఎక్కువ మందిలో చర్మరోగాన్ని కలిగించే విధంగా పుండు ఏర్పడటానికి కారణమవుతుంది. సాంకేతికంగా, [[విషపూరిత రసాయన చమురు ప్రేరేపిత స్పర్శ చర్మ శోధం గా దీనిని పేర్కొనవచ్చు. అయితే ఇది ఒక నిజమైన మొక్క (ప్రాచీనకాలపు కలప తీగలు ) కాదు.

పెరిగే ప్రదేశాలు మరియు పరిధి[మార్చు]

పాయిజన్ ఐవీ ఎక్కువగా కెనడా మేరిటైమ్ ప్రావిన్సులు, క్యూబెక్ మరియు ఒంటారియో, ఉత్తర డకోటా మినహా పశ్చిమ నార్త్ అమెరికా యొక్క తూర్పు భాగాన ఉన్న అన్ని U.S. రాష్ట్రాలు, అదే విధంగా మెక్సికో చుట్టుపక్కల పర్వత ప్రాంతాలు (మధ్య మెక్సికో భారతీయులు అనే పదం చూడండి) సహా ఉత్తర అమెరికాలో ఎక్కువగా పెరుగుతుంది. ఇది సాధారణంగా కలప ఎక్కువగా పెరిగే ప్రాంతాలు మరియు ప్రత్యేకించి, గట్టు అంచు ప్రాంతాల్లో పెరుగుతుంది. కొండ ప్రాంతాలు, బయట పొలాలు మరియు బురద ప్రాంతాల్లోనూ పెరుగుతుంది. ఇది కొంత వరకు రంగును నిలుపుకునే గుణం కలిగి ఉన్నప్పటికీ, ఇది ఒక అటవీ ప్రాంత మొక్కగా ఎదుగుతుంది.[1] ఈ మొక్క సాధారణంగా న్యూ ఇంగ్లాండ్‌‌లోని ఉపపట్టణ మరియు పట్టణ, మిడ్‌-అట్లాంటిక్ మరియు ఆగ్నేయ అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో విస్తారంగా కనిపిస్తుంది. పాయిజన్ ఐవీ మాదిరిగా కనిపించే పాయిజన్‌-ఓక్‌ మరియు టాక్సికోడెంట్రన్ రిడ్బర్గీ మొక్కలు ఎక్కువగా పశ్చిమ నార్త్ అమెరికా ప్రాంతంలో ఎదుగుతాయి. వివిధ ప్రాంతాల్లో ఎత్తుల స్థాయి మారినప్పటికీ, పాయిజన్ ఐవీ ఎత్తైన ప్రాంతాల్లో1,500 m (4,900 ft)నే చాలా అరుదుగా పెరుగుతుంది.[1] ఈ మొక్కలు ఒక పొద మాదిరిగా భూఉపరితలం10–25 cm (3.9–9.8 in) ఎత్తుకు లేదా పలు ఆధారాల సాయంతో తీగ మాదిరిగా అల్లుకుపోతూ, సుమారు కొంత ఎత్తు1.2 metres (3.9 feet) వరకు పెరుగుతాయి. స్థిరమైన ఆధారాలతో పెరిగే పురాతన తీగలు సమీపంలోని కొమ్మలపై అల్లుకుంటాయి. ప్రాథమికంగా అది చెట్టు శాఖలపై గజిబిజిగా అల్లుకుంటుంది.

ఎడారి లేదా నిస్సార ప్రాంతాల్లో ఇది పెరగకపోయినా, దీనికి ప్రత్యేకించి తడినేల అంత అనువు కాదు. ఇది పలు రకాల నేలల్లోనూ పెరుగుతుంది. అలాగే నేల pH 6.0 (ఆమ్ల సంబంధమైనది) నుంచి 7.9 (పరిమిత క్షారం) వరకు ఉండాలి. ఇది నియమిత కాల వరదలకు గురయ్యే లేదా ఉప్పు నీటి ప్రాంతాల్లోనూ పెరుగుతుంది.[1]

ఇది ఐరోపావాసులు నార్త్ అమెరికాలో తొలుత ప్రవేశించినప్పటి కంటే ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. అటవీ, నిరుపయోగ భూమికి ఆనుకుని జరిగే రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనేది "తీరప్రాంత ప్రభావాల,"కు దారితీస్తుంది. ఫలితంగా అటువంటి ప్రదేశాల్లో పాయిజన్ ఐవీ విస్తారమైన, కోమలమైన సమూహంగా ఎదుగుతుంది. దీనిని హానికర కలుపుమొక్కగా మిన్నెసోటా మరియు మిచిగాన్ వంటి U.S. రాష్ట్రాలు మరియు కెనడాకి చెందిన ఒంటారియోలో పేర్కొనడం జరిగింది.

పాయిజన్ ఐవీ మరియు దానికి సంబంధించిన ఇతర మొక్కలు నిజానికి ఐరోపాలో అస్సలు తెలియదు. US మరియు కెనడాలకు వెళ్లే పలువురు ఐరోపావాసులు ఆయా ప్రాంతాల్లో అలాంటి హానికర మొక్క పెరుగుతుండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వర్ణన[మార్చు]

ఎరుపు రంగు "గుబురు వేర్లు" కలిగిన పాయిజన్ ఐవీ (దీని యొక్క ఆకులు, తీగలు మానవులపై విపరీతమైన విష ప్రభావం చూపుతాయి)

పాయిజన్ ఐవీ యొక్క పతయాళు ఆకులు బాదాము ఆకృతిలో మూడు కరపత్రాలను కలిగిన త్రిపత్రం.[1] పాయిజన్ ఐవీ ఆకు యొక్క వర్ణం లేత ఆకుపచ్చ (సాధారణంగా లేత ఆకులు) నుంచి ముదురు ఆకుపచ్చ (ముదిరిన ఆకులు) వరకు ఉంటుంది. రాలిపోయేటప్పుడు నిగనిగలాడే ఎరుపు రంగులోకి మారుతుంది. కానీ తొలుత పింగళ వర్ణంలోనూ, ముదిరినప్పుడు ఆకుపచ్చ రంగులోనూ, రాలిపోయేటప్పుడు ఎరుపు, నారింజ లేదా పసుపు రంగులోకి మారుతుందని మరికొందరు చెబుతున్నారు. అయితే ముదురు ఆకుల కరపత్రాలు (చిన్న ఆకులు) కొంత వరకు మెరుస్తూ ఉంటాయి. కరపత్రాలు సుమారు 3 నుంచి 12 cm, అరుదుగా 30 cm పొడవు కలిగి ఉంటాయి. ప్రతి కరపత్రం అంచు వెంట కొన్ని లేదా అసలు రంపపు పళ్లు ఉండదు. అయితే దాని ఉపరితలం మాత్రం నునుపుగా ఉంటుంది. కరపత్ర సమూహాలు తీగపై ప్రత్యామ్నాయంగా ఉంటాయి. దీనికి ఎలాంటి ముళ్లూ ఉండవు. ఒక చెట్టు కొమ్మపై అల్లుకునే తీగలు పైకి ఎగబాకే అసంఖ్యాక వేర్ల ద్వారా దృఢంగా ఉంటాయి.[2] తీగల నుంచి అబ్బురపు వేళ్ళు పుడుతాయి. లేదంటే ఈ మొక్క వేరుల లేదా వేరు శిఖరభాగాల నుంచి విస్తరించగలదు. పాయిజన్ ఐవీ యొక్క తెల్లటి పాలు గాలి తగలడంతో నల్లబడుతుంది.

పాయిజన్ ఐవీ నిశ్చలంగా మరియు పునరుత్పత్తి రెండింటి పరంగా విస్తరిస్తుంది. ఏకలింగక మొక్కయైన ఇది మే, జులై మధ్య చిగురిస్తుంది. పసుపు లేదా ఆకుపచ్చ-తెలుపు వర్ణ పుష్పాలు సాధ్యమైనంత వరకు కనిపించవు. ఇవి ఆకుల పైభాగాన గుచ్ఛాలలో సుమారు 8 cm వరకు ఉంటాయి. రేగిపండు మాదిరి పండు, టెంకె పండు బూడిద-తెలుపు వర్ణంతో ఆగస్టు-నవంబరు మధ్య పక్వం చెందుతుంది.[1] ఈ పండ్లు చలికాలంలో కొన్ని పక్షులు మరియు ఇతర జంతువులకు ఆహారంగా ఉపయోగపడుతాయి. విత్తనాలు ప్రధానంగా జంతువుల చేత వెదజల్లబడతాయి. జంతువుల జీర్ణ ప్రక్రియ అనంతరం బయటకు విసర్జించబడినప్పటికీ, అవి మొలిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

గుర్తించడమెలా?[మార్చు]

ఈ కింది మూడు లక్షణాలు వివిధ పరిస్థితుల్లో పాయిజన్ ఐవీని గుర్తించడానికి తగినవిగా చెప్పవచ్చు. (a) మూడు కరపత్రాల సమూహం (b) ప్రత్యామ్నాయ పత్ర అమరిక మరియు (c) ముళ్లులు లేకపోవడం. ఇదే విధమైన వివరణ పలు ఇతర మొక్కలకు కూడా వర్తించే అవకాశమున్నప్పటికీ, పాయిజన్ ఐవీని గుర్తించలేని వారు ఈ రకమైన లక్షణాలు ఉన్న మొక్కను తెలివిగా దూరం చేయడం మంచిది. ఆకులు చిరిగిపోవడం, ఆకులు లేని చలికాలంలో దీనిని గుర్తించడం అనుభవజ్ఞులకు కూడా కష్టమవుతుంది. పర్యావరణ సంబంధిత మరియు /జన్యుపరమైన అంశాల కారణంగా ఇవి అసాధారణ రీతిలో పెరుగుతాయి.

పాయిజన్ ఐవీ లాక్షణిక ఆకృతికి సంబంధించి జ్ఞాపకం పెట్టుకోదగిన పలు ప్రాసలు:[3]

 1. "లీవ్స్ ఆఫ్ త్రీ, లెట్ ఇట్ బి."
 2. "హెయిరీ వైన్, నో ఫ్రెండ్స్ ఆఫ్ మైన్."[4] పాయిజన్ ఐవీ తీగలు చాలా విషపూరితమైనవి.
 3. "ర్యాగీ రోప్, డోంట్ బి ఎ డోప్

!" చెట్లపై కనిపించే పాయిజన్ ఐవీ తీగలకు బొచ్చుగల "రాగుల" ఆకారం ఉంటుంది. చెట్లు ఎక్కేవారిని ఈ ప్రాసలు పాయిజన్ ఐవీని గుర్తించి, జాగ్రత్తగా వ్యవహరించమని సూచిస్తుంది.

 1. "వన్, టు, త్రీ? డోంట్ టచ్ మి."
 2. "బెర్రీస్ వైట్, రన్ ఇన్ ఫ్రెయిట్" మరియు "బెర్రీస్ వైట్, డేంజర్ ఇన్ సైట్."[5]
 3. "లాంగర్ మిడిల్ స్టెమ్, స్టే అవే ఫ్రమ్ థెమ్." మధ్య కరపత్రానికి మిగిలిన రెండింటి కంటే ఒక పొడవాటి కాండం ఉంటుంది. చూడటానికి పాయిజన్ ఐవీ మాదిరిగా కనిపించే రస్ అరోమేటికా - ఫ్రాంగ్రంట్ సుమాక్‌ను గుర్తించడానికి ఈ తేడా బాగా ఉపయోగపడుతుంది.
 4. "రెడ్ లీఫ్‌లెట్స్ ఇన్ ది స్ప్రింగ్, ఇట్స్ ఎ డేంజరస్ థింగ్." అంటే వసంతంలో చిగురించే కొత్త కరపత్రాలు కొన్ని సందర్భాల్లో ఎరుపు వర్ణంలో కన్పిస్తాయని దానర్థం. (ఆ తర్వాత వేసవిలో అవే కరపత్రాలు ఆకుపచ్చగా మారుతాయి. దాంతో ఇతర మొక్కలకు, దానికి మధ్య తేడా గుర్తించడం కష్టతరమవుతుంది. ఇక శిశిరంలో అవి ఎరుపు-నారింజ వర్ణంలోకి మారుతాయి.)
 5. "సైడ్ లీఫ్‌లెట్స్ లైక్ మిటెన్స్, విల్ ఇట్చ్ లైక్ ది డికెన్స్." ఇది అన్ని కాకుండా, కొన్ని కరపత్రాలు మాత్రమే ఏ విధంగా కన్పిస్తాయో తెలుపుతుంది. పాయిజన్ ఐవీ పత్రాలు, ఇరు పక్కల ఉండే రెండు కరపత్రాల్లో ప్రతి ఒక్కదానికి ఒక చిన్న గీత ఉంటుంది. ఇది కరపత్రం చూడటానికి "బొటనవ్రేలు"తో కూడిన ఒక చేతితొడుగు మాదిరిగా కనిపించే విధంగా చేస్తుంది. (అంటే, పక్కన ఉండే కరపత్రాలు మాత్రమే దురద పుట్టిస్తాయని ఈ ప్రాసను తప్పుగా అర్థం చేసుకోకూడదు. నిజానికి ఈ మొక్క భాగాలన్నీ దురద పుట్టించగలవని గుర్తించాలి.)
 6. "ఇఫ్ బటర్‌ఫ్లైస్ ల్యాండ్ థేర్, డోంట్ పుట్ యువర్ హ్యాండ్ థేర్." అంటే, కొన్ని సీతాకోకచిలుకలు పాయిజన్ ఐవీపై వాలుతాయి. కానీ అవి ఎలాంటి ప్రభావానికి గురికావు. తమను చంపితినే జంతువులు ఆ మొక్కను తినవు కాబట్టి అవి వాటి నుంచి రక్షణ పొందుతాయి.[6]

శరీరంపై చూపే ప్రభావాలు[మార్చు]

పాయిజన్ ఐవీ వల్ల ఏర్పడే దుష్పరిణామం విషపూరిత రసాయన చమురు ప్రేరేపిత స్పర్శ చర్మ శోధం అనేది ఎలర్జీగా చెప్పబడుతుంది. సుమారు 15%[7] నుంచి 30%[8] మంది ఎలర్జీబారిన పడలేదు. అయితే విషపూరిత రసాయన చమురుకు మళ్లీ మళ్లీ లేదా మరింత నిర్జలీకరణ వల్ల ఎక్కువ మంది ఎలర్జీకి గురయ్యే ప్రమాదముంటుంది. దీని ప్రతిచర్య కారణంగా ఎనాఫిలాక్సిస్‌ (అమితమైన ఎలర్జీ)కు గురవుతారు.

రోడ్డు పక్కన ఉన్న పాయిజన్ ఐవీ

విషపూరిత రసాయన చమురు ఒంటిపై అంటుకున్న ప్రదేశంలో విపరీతమైన దురద పుడుతుంది. తద్వారా గాయం ఎరుపు రంగులోకి మారి మంట పుట్టడం లేదా వర్ణరహిత దద్దుర్లు ఏర్పడతాయి. చివరకు పుండ్లు ఏర్పడుతాయి. ఇలా ఏర్పడిన పుండ్లకు కెలామైన్ లోషన్ ద్వారా చికిత్స చేయవచ్చు. సాంప్రదాయ మందులు సమర్థవంతంగా పనిచేయడం లేదని ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొన్నప్పటికీ, బరో సొల్యుషన్‌ గుడ్డలు లేదా చికాకు నుంచి విముక్తి పొందే విధంగా స్నానాల[9] ద్వారా కూడా దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.[10][11] దురదలు తగ్గడానికి వైద్యుడు సిఫారసు చేయని మందులు లేదా సాధారణంగా ఓట్ ధాన్యపు స్నానాలు మరియు బేకింగ్ సోడా వంటి పద్ధతులను పాయిజన్ ఐవీ చికిత్సకు డెర్మటాలజిస్టులు (చర్మవ్యాధి నిపుణులు) ప్రస్తుతం సిఫారసు చేస్తున్నారు.[12] పలు సందర్భాల్లో పుండ్ల నుంచి చీము కారుతుంటుంది. దానికి కోర్టికోస్టెరాయిడ్లు తగిన చికిత్స.

పాయిజన్ ఐవీ తగలడం వల్ల ఏర్పడిన పుండ్లు

దద్దుర్ల వల్ల ఏర్పడిన గాయాల (పొక్కుల) నుంచి కారే చీము విషంగా వ్యాపించదు.[13][14][15] దద్దుర్లు వ్యాపిస్తున్నట్లు కనిపించడం కొన్ని భాగాల్లో విష పదార్థం ఎక్కువగా అంటుకుందన్న విషయాన్ని తెలియజేస్తుంది. అక్కడ ఇతర భాగాల్లో కంటే వెంటనే ఎక్కువ దురద పుడుతుంది. లేదంటే, విషం విస్తరించిన వస్తువులను తగలడం వల్ల దురద ప్రభావం కలుగుతూనే ఉంటుంది.[13] రక్తనాళాల వల్ల ఏర్పడిన పొక్కులు మరియు చీము ఖాళీలను ఏర్పరచడం మరియు చర్మం ద్వారా ద్రవాన్ని బయటకు పంపుతుంది. ఒకవేళ చర్మం చల్లగా ఉంటే, నాళాలు బిగుతుగా మారి, కారడం తగ్గుతుంది.[ఆధారం చూపాలి] పాయిజన్ ఐవీని మండించడం ద్వారా వచ్చిన పొగను పీల్చినట్లయితే, దద్దుర్లు ఊపిరితిత్తుల అమరికపై ఏర్పడుతాయి. ఫలితంగా విపరీతమైన నొప్పి మరియు ప్రమాదకర శ్వాససంబంధ సమస్య కూడా తలెత్తవచ్చు.[16] పాయిజన్ ఐవీని తింటే, ఆహార నాళం, శ్వాసనాళం, మూత్రపిండాలు లేదా ఇతర అవయవాలు చెడిపోయే ప్రమాదముంది.[ఆధారం చూపాలి] పాయిజన్ ఐవీ వల్ల ఏర్పడిన దద్దుర్లు ఒకటి నుంచి రెండు వారాల్లో తగ్గిపోతాయి. అయితే అది కఠిన పథ్యం మరియు చికిత్సపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో, పాయిజన్ ఐవీ ప్రభావం కారణంగా ఆసుపత్రిపాలయ్యే అవకాశముంటుంది.[13][17]

విషపూరిత రసాయన చమురు ప్రభావం పలు ఏళ్ల వరకు పనిచేస్తూనే ఉండొచ్చు. కాబట్టి, రాలిన ఆకులను లేదా తీగలను పట్టుకోవడం ఒక విధంగా దాని ప్రభావానికి గురయ్యే ప్రమాదముంటుంది. అదనంగా, మొక్క నుంచి చమురు ఇతర వస్తువుల (పెంపుడు జంతువలు వంటివి)పై పడటం ద్వారా అది చర్మానికి గనుక అంటుకుంటే దద్దుర్లు వచ్చే అవకాశముంది.[18][19] చమురు అంటుకున్న దుస్తులు, పరికరాలు మరియు ఇతర వస్తువులను శుభ్రం చేయాలి. లేదంటూ అది వ్యాపించే ప్రమాదముంది. పాయిజన్ ఐవీ బారిన సులువుగా పడే వారు మామిడికాయల నుంచి కూడా అదే విధమైన దద్దుర్లను పొందే అవకాశముంది. ఎందుకంటే, మామిడికాయలు కూడా పాయిజన్ ఐవీ మాదిరిగానే ఒకే కుటుంబానికి (అనాకార్డియాసియా)చెందినవే. మామిడి చెట్టు మరియు మామిడికాయల నుంచి కారే స్రావానికి (రసు)విషపూరిత రసాయన చమురు వలే రసాయన ప్రభావం ఉంటుంది.[20]

అదే విధమైన ప్రభావాలు ఫ్రాగ్రంట్ సుమాక్ రస్ అరోమాటికా లేదా జపనీస్ లాకెర్ ట్రీ సంబంధిత మొక్కలతో స్పర్శ కారణంగా కలిగినట్లు సందర్భోచితంగా పేర్కొనబడ్డాయి.

సారూప్య మొక్కలు[మార్చు]

 • వర్జిన్స్ బోవర్ (క్లెమాటిస్ వర్జీనియానా ) (డెవిల్స్ డార్నింగ్ నీడిల్స్, డెవిల్స్ హెయిర్, లవ్ వైన్, ట్రావెలర్స్ జాయ్, వర్జిన్స్ బోవర్, వర్జీనియా వర్జిన్స్ బోవర్, వైల్డ్ హాప్స్ మరియు వుడ్‌బైన్ అని కూడా పిలవబడుతుంది. క్లెమాటిస్ వర్జీనియానా L. వర్. మిస్సోరియన్సిస్ (Rydb.) పామర్ & స్టేయర్‌మార్క్ [1]) అనేది అమెరికా సంయుక్తరాష్ట్రాల్లోని రనున్‌కులాసియా కుటుంబానికి చెందిన ఒక తీగ. ఈ మొక్క తీగ సుమారు 10–20 ft పొడవు వరకు అల్లుకుంటుంది. చెట్ల కొమ్మల అంచుల వెంట, తేమ ప్రదేశాలు, ముళ్ల కంచెలు, ముళ్ల పొదలు, మరియు నదీ తీరాల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఇంచు వ్యాసంతో సువాసన కలిగిన తెలుపు రంగు పుష్పాలను జులై, సెప్టెంబరు మాసాల మధ్య ఉత్పత్తి చేస్తుంది.
 • బాక్స్‌-ఎల్డర్ (అసెర్ నెగుండో ) అనే చిన్న మొక్కల యొక్క ఆకులు చూడటానికి అచ్చం పాయిజన్ ఐవీ మాదిరిగానే కన్పిస్తాయి. అయితే దాని సౌష్ఠత చాలా భిన్నమైనది. బాక్స్‌-ఎల్డర్స్‌కు తరచుగా ఏడు కరపత్రాలుంటాయి. ప్రత్యేకించి, చిన్న మొక్కలకు సంబంధించి మూడు కరపత్రాలు సాధారణంగా ఉంటాయి. ఈ రెండింటికి మధ్య తేడాను ఆకు తొడిమ, ప్రధాన శాఖ (ఇక్కడ మూడు కరపత్రాలు ఒకటిగా కలిపివేయబడి ఉంటాయి) కలిసే ఆకుల స్థానాన్ని బట్టి గుర్తించవచ్చు. పాయిజన్ ఐవీలో ప్రత్యామ్నాయ ఆకులుంటాయి. అంటే మూడు కరపత్ర ఆకులు ప్రధాన శాఖ వెంట ప్రత్యామ్నాయంగా ఉంటాయి. మేపిల్‌ (సేపిన్ డేసియా కుటుంబానికి చెందిన బాక్స్-ఎల్డర్ తరహా మొక్క) మొక్కకు అభిముఖంగా ఆకులుంటాయి. మరో ఆకు కాండం నేరుగా అభిముఖ భాగాన ఉండటాన్ని బాక్స్‌-ఎల్డర్ లక్షణంగా చెప్పవచ్చు.
 • వర్జీనియా క్రీపర్‌ (పార్తియోనోసిసస్ క్విన్‌క్యూఫోలియా ) మొక్క తీగలు చూడటానికి పాయిజన్ ఐవీ మాదిరిగా ఉంటాయి. దీని లేత ఆకులు మూడు కరపత్రాలను కలిగి ఉంటాయి. ఆకు అంచు వెంట పలు రంపపు పళ్లు ఉంటాయి. ఆకు ఉపరితల భాగం కొంతమేర ముడతలు పడినట్లు కన్పిస్తుంది. ఏదేమైనప్పటికీ, పలు వర్జీనియా క్రీపర్ మొక్క ఆకులు ఐదు కరపత్రాలను కలిగి ఉంటాయి. వర్జీనియా క్రీపర్ మరియు పాయిజన్ ఐవీ ఒకటిగా, అదీ ఒకే చెట్టుపై కలిసి పెరగడం చాలా తరచుగా జరుగుతుంటుంది. పాయిజన్ ఐవీ వల్ల అలర్జీకి గురికాని వారు వర్జీనియా క్రీపర్ స్రావంలో ఉండే ఉప్పు స్ఫటికాల వల్ల దానికి గురయ్యే ప్రమాదముంది.
 • వెస్టర్న్ పాయిజన్‌-ఓక్ (టాక్సికోడెంట్రన్ డైవర్సిలోబమ్ ) కరపత్రాలు కాండం చివరి భాగంలో మూడుగా కనిపిస్తాయి. అయితే ప్రతి కరపత్రం కూడా ఓక్ ఆకు మాదిరిగానే ఉంటుంది. పాయిజన్ ఐవీని పాయిజన్‌-ఓక్‌గా పలువురు పేర్కొన్నప్పటికీ, వెస్టర్న్ పాయిజన్‌-ఓక్‌ పశ్చిమ అమెరికా సంయుక్తరాష్ట్రాలు మరియు కెనడాల్లో మాత్రమే పెరుగుతుంది. ఎందుకంటే, ఐవీ-తరహా ఆకృతి లేదా కుంచె మాదిరి ఓక్‌-తరహా ఆకృతిల్లో వాతావరణంలోని తేమ మరియు కాంతి పరిస్థితులపై ఆధారపడి, పాయిజన్ ఐవీ పెరుగుతుంది. ఐవీ ఆకృతి మొక్కకు సాధారణంగా కొద్దిగా సూర్యరశ్మి తగిలే చీకటి ప్రాంతాలు అనువుగా ఉంటాయి. ఇది చెట్ల కొమ్మలపై అల్లుకుంటూ, భూమి పైభాగంపై కూడా శరవేగంగా విస్తరించగలదు.
 • పాయిజన్ సుమాక్‌ (టాక్సికోడెండ్రన్ వెర్నిక్స్‌‌ )కు 7–15 కరపత్రాలుండే సమ్మిళిత ఆకులుంటాయి. పాయిజన్ సుమాక్‌కు ఎప్పుడూ మూడు కరపత్రాలుండవు.
 • కుడ్జు (ప్యూరారియా లోబటా ) అనేది ఒక విషయేతర ఆహార పదార్థపు తీగ. ఇది చిన్నచిన్న చెట్లపై విపరీతంగా అల్లుకోవడం లేదా కొంత ఎత్తువరకు చెట్లుగా ఎదుగుతుంది. కుడ్జు అనేది దక్షిణ అమెరికా సంయుక్తరాష్ట్రాల్లోని ఒక ఆక్రమిత జాతి. పాయిజన్ ఐవీ మాదిరిగానే దీనికి కూడా మూడు కరపత్రాలుంటాయి. అయితే ఇవి పాయిజన్ ఐవీ కంటే పెద్దవిగా ఉంటాయి. ఇక కింది భాగంలో యవ్వనంలోకి వచ్చిన రంపపు పళ్ల మాదిరి అంచులు ఉంటాయి.
 • బ్లాక్‌బెర్రీస్ మరియు రాస్ప్‌బెర్రీస్ (రుబస్‌ spp.) అనేది చూడటానికి పాయిజన్ ఐవీ మాదిరిగా ఉంటుంది. ఇవి రెండూ ఒకే విధమైన ప్రాంతంలో పెరగగలవు. బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ మరియు పాయిజన్ ఐవీ మధ్య ప్రధాన తేడా ఏంటంటే...బ్లాక్‌బెర్రీస్ మరియు రాస్ప్‌బెర్రీస్ కాండాలపై చిన్న ముళ్లులు ఉంటాయి. అదే పాయిజన్ ఐవీ మాత్రం నునుపుగా ఉంటుంది. కొన్ని బ్లాక్‌బెర్రీస్ మరియు రాస్ప్‌బెర్రీస్‌ల మూడు కరపత్రాల నమూనా అవి పెరిగేకొద్దీ ఆకుల రూపం మారిపోతుంటుంది. తర్వాత కాలంలో వచ్చిన ఆకులకు మూడు కాకుండా ఐదు కరపత్రాలుంటాయి. బ్లాక్‌బెర్రీస్ మరియు రాస్ప్‌బెర్రీస్‌ ఆకు వెంట పదునైన రంపపు పళ్లు ఉంటుంది. నాళాలు ఉండే వాటి ఆకుల పై ఉపరితలం ఎక్కువగా చాలా ముడతలు పడినట్లుంటుంది. ఇక ఆకుల కింది భాగం లేత పుదీనా మాదిరి ఆకుపచ్చ-తెలుపు వర్ణంలో ఉంటుంది. పాయిజన్ ఐవీ విషయానికొస్తే...మొత్తం పచ్చగా ఉంటుంది. పాయిజన్ ఐవీ కాండం కపిలవర్ణంలో ఉంటూ స్థూపాకారంగా ఉంటుంది. ఇక బ్లాక్‌బెర్రీ మరియు రాస్ప్‌బెర్రీ కాండాలు పచ్చ రంగులో ఉంటాయి. ఇది అడ్డుకోత ద్వారా విశ్లేషించబడుతుంది. అలాగే వాటికి ముళ్లులు కూడా ఉంటాయి. రాస్ప్‌బెర్రీస్ మరియు బ్లాక్‌బెర్రీస్ అనేవి అసలు తీగలు కావు. అంటే, అవి తమ కాండాలకు ఆధారంగా ఉండటానికి ఎప్పుడూ చెట్లపై అల్లుకోవు.
 • వేర్లు కనిపించని రివర్‌బ్యాంక్ గ్రేప్‌ (విటిస్ రిపారియా ) యొక్క మందపాటి తీగలు పాయిజన్ ఐవీ తీగలకు భిన్నంగా ఉంటాయి. చెట్టుపై అల్లుకునే పాయిజన్ ఐవీకి బొచ్చు మాదిరిగా కనిపించే గుబురు వేర్లుంటాయి. రివర్‌బ్యాంక్ ద్రాక్షా తీగలు లేత ఎరుపు రంగులో ఉంటాయి. తమ ఆధార చెట్లకు దూరంగా వేళాడుతూ పెరగగలవు. అలాగే వాటికి ముక్కులుముక్కలుగా ఉండే బెరడు ఉంటుంది. ఇక పాయిజన్ ఐవీ తీగలైతే పింగళ (కపిల) వర్ణంలో ఉంటాయి. అవి తమ ఆధార చెట్లకు అల్లుకునే పెరుగుతాయి. వాటికి ముక్కులుముక్కలుగా కనిపించే బెరడు ఉండదు.
 • ఫ్రాగ్రంట్ సుమాక్‌ (రస్ అరోమేటికా ) చూడటానికి పాయిజన్ ఐవీ మాదిరిగా కనిపిస్తుంది. ఈ రెండు జాతులకు మూడు కరపత్రాలుంటాయి. పాయిజన్ ఐవీ యొక్క మధ్య కరపత్రం ఒక పొడవాటి కాండపు రెమ్మను కలిగి ఉంటుంది. అయితే ఫ్రాగ్రంట్ సుమాక్ యొక్క మధ్య కరపత్రం స్పష్టమైన కొమ్మను కలిగి ఉండదు. ఫ్రాగ్రంట్ సుమాక్ వసంతంలో ఆకులు రావడానికి ముందుగా పుష్పాలను ఉత్పత్తి చేస్తుంది. అదే పాయిజన్ ఐవీలోనైతే ఆకులు వచ్చిన తర్వాత పుష్పాలు పుష్పిస్తాయి. ఫ్రాగ్రంట్ సుమాక్ యొక్క పుష్పాలు మరియు పండ్లు దాని యొక్క కాండం చివర్లో ఉత్పత్తి కాగా, పాయిజన్ ఐవీలో కాండం మధ్య భాగం వెంబడి వస్తాయి.

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 USDA ఫైర్ ఎఫెక్ట్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్: టాక్సిడెండ్రన్ రాడికన్స్
 2. పీట్రిడెస్, జార్జ్ A. ఎ ఫీల్డ్ గైడ్ టు ట్రీస్ అండ్ ష్రబ్స్ (పీటర్సన్ ఫీల్డ్ గైడ్స్), బోస్టన్: Houghton Mifflin Co., 1986, పేజీ 130.
 3. "Poison Ivy Treatment Guide , Getting Rid of the Plants: Identifying Poison Ivy". line feed character in |title= at position 27 (help)
 4. http://www.parks.ca.gov/pages/735/files/transcriptmtlivermoreangelisland.pdf Page 3.
 5. క్యాంప్ క్రస్టీ
 6. మిచెల్, రాబర్ట్. T., "బటర్‌ఫ్లైస్ అండ్ మాత్స్," న్యూయార్క్: St. మార్టిన్స్ ప్రెస్, 2001, పేజీ 133.
 7. హౌస్టఫ్‌వర్క్స్ "హౌ పాయిజన్ ఐవీ వర్క్స్"
 8. కాంటాక్ట్‌-పాయిజనస్ ప్లాంట్స్ ఆఫ్ ది వరల్డ్
 9. విల్సన్, W. H. & లోడర్‌మిల్క్, P. (2006). మేటర్నల్ చైల్డ్ నర్సింగ్ కేర్ (3వ ఎడిషన్). St. లూయిస్ : మోస్బీ ఎల్సీవియర్.
 10. "American Topics. An Outdated Notion, That Calamine Lotion". Archived from the original on 2007-05-19. Retrieved 2007-07-19.
 11. అప్పెల్, L.M. ఓమర్ట్ మరియు R.F. స్టెర్నర్, జింక్ ఆక్సైడ్: ఎ న్యూ, పింక్, రిఫ్రాక్టివ్ మైక్రోఫామ్ క్రిస్టల్ . AMA ఆర్చ్ డెర్మాటల్ 73 (1956), 316–324 పేజీలు. PMID 13301048
 12. "American Academy of Dermatology - Poison Ivy, Oak & Sumac".
 13. 13.0 13.1 13.2 "Treating Poison Ivy Rash With Home Remedies: Jewelweed;Is Poison Ivy Rash Contagious?".
 14. "Facts about Poison Ivy: Is it contagious?".
 15. "Poison Ivy Treatment Guide, Outsmarting Poison Ivy: Treating Poison Ivy Exposures". Retrieved June 01, 2008. Check date values in: |accessdate= (help)
 16. "Facts about Poison Ivy: How do you get poison ivy?".
 17. "Facts about Poison Ivy: How long does the rash last?, What can you do once the itching starts?, How do you get poison ivy?".
 18. పాయిజన్ ఐవీ, ఓక్ & సుమాక్
 19. "Facts about Poison Ivy: How do you get poison ivy?, Pets and Poison Ivy, How long does the oil last?".
 20. మ్యాంగోస్ అండ్ పాయిజన్ ఐవీ (న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వెబ్ కథనం)

బాహ్య వలయాలు[మార్చు]