Jump to content

పారిజాతాపహరణం (ప్రబంధం)

వికీపీడియా నుండి
నంది తిమ్మన

నంది తిమ్మన

అంకితము

[మార్చు]

శ్రీ కృష్ణదేవరాయలు

విశేషాలు

[మార్చు]

ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు. పారిజాతాపహరణానికి సంస్కృత భారతంలో మూడు శ్లోకాలే అని అంటారు. కాని నిజానికి దీనికిని, సంస్కృత హరివంశమున వజ్రనాభుని వధ యనెడి కథకును సాన్నిహిత్యం ఉంది. ఏమైనా చాలా చిన్నదైన ఈ కథకు నంది తిమ్మన సంతరించిన అలంకార సౌకర్యములు, ప్రబంధోచిత పాత్రచిత్రణము, ఆయా పాత్ర జీవన వర్ణనము దీనిని సుందరమైన ప్రబంధకావ్యంగా తీర్చిదిద్దాయి.[1]

ఇతివృత్తము

[మార్చు]

నారదుడు పారిజాతం కృష్ణులవారికి ఇవ్వడం, ఆ సమయములో వారు రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం, పారిజాత వృక్షం సత్య తీసుకొని రావడం, తులాభారంతో కథ సుఖాంతం.

తెర వెనక కథ

[మార్చు]

ఈ గ్రంథము వ్రాయడానికి నంది తిమ్మన గారికి ఒక కారణము ఉన్నది అంటారు. ఒక రోజు అనుకోకుండా తిరుమలదేవి రాయల వారిని పాదాలతో తాకుతుందట. దానితో రాయల వారు కోపగించుకొని, తిరుమలదేవిని చూడటం మానేస్తాడు, తిరుమలదేవికి అరణంగా వచ్చిన నంది తిమ్మన ఆ గొడవని రూపు మాపడానికి స్వయంగా కృష్ణులవారే తన్నించుకున్నారు మీదేముంది అని చెప్పడానికి ఈ కథ వ్రాసినాడు అని ఒక జనశ్రుతి.

ఉదాహరణ పద్యాలు

[మార్చు]
శ్రీ కృష్ణుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చాడని చెలికత్తె చెప్పగానే సత్యభామ


అనవినివేటువ్రడ్డయురగాంగనయంవలెనేయివోయభ
గ్గన దరికొన్న హుతాశన కీల యనంగ లేచి హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కిలి కుంకుమపత్రభంగ సం
జనితనవీన కాంతి వెదజల్లగ గద్గద ఖిన్న కంఠయై
(తా. అలా చెప్పిన దానిని వినగా దెబ్బతిన్న పాము లాగ, నేయి పోయగానే భగ్గనే మంటవలె లేచి, కనులు ఎఱ్రబడడంతో ఆ కుంకుమ కాంతి చెక్కిలి మీద పడి కొత్త కాంతి వెదజల్లగా వణుకుతున్న కంఠంతో)చెలికత్తెను ఇలా ప్రశ్నించింది -
ఏమేమీ కలహాసనుండచటికై యేతెంచి యిట్లాడెనా?
ఆ మాటల్చెవియొగ్గి తా వినియెనా ఆ గోపికా వల్లభుం
డేమేమాడెను రుక్మిణీ సతియు, నీ వింకేటికిన్ దాచెదే?
నీ మోమాటలు మాని నీరజముఖీ, నిక్కంబెరింగింపవే
చేరవచ్చిన శ్రీకృష్ణుని సత్యభామ
జలజాతాసనవాసవాది సురపూజాభాంజనంబైతన
ర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్
తొలగంజేసె లతాంగి,యట్లయగు నాథుల్ నేరముల్ సేయపే
రలకంజెందినయట్టి కాంతలుచితవ్యాపారముల్ నేర్తురే?
సత్యభామ దండనకు శ్రీకృష్ణుని స్పందన
ననుభవదీయదాసునిమనంబుననెయ్యపుకిన్కబూనితా
చినయదినాకుమన్ననయ,చెల్వగునీపదపల్లవంబుమ
త్తనుపులకాంతకటంకవితానముతాచిననొచ్చునంచునే
ననియదయల్కమానవుకదాయికనైననరాళకుంతలా

సత్యభామ రోదించిన విధము

ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే
గాసిలి యేడ్చె ప్రాణవిభు కట్టెదుటన్ లతాంగి పంకజ
శ్రీసఖమైన మోముపయి చేలచెఱంగిడి బాలపల్లవ
గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్

ప్రచురణలు

[మార్చు]

మూలాలు

[మార్చు]