పారిస్ ఒప్పందం
![]() State parties Signatories
Parties also covered by European Union ratification Agreement does not apply | |
రాసిన తేదీ | 2015 నవంబరు 30 – డిసెంబరు 12 , ఫ్రాన్స్ లోని లే బోర్జేలో |
---|---|
సంతకించిన తేదీ | 22 April 2016 |
స్థలం | పారిస్ |
అమలు తేదీ | 4 November 2016[1][2] |
స్థితి | Ratification and accession by 55 UNFCCC parties, accounting for 55% of global greenhouse gas emissions |
సంతకీయులు | 195[1] |
కక్షిదారులు | 195[1] (list) |
Depositary | Secretary-General of the United Nations |
భాషలు |
|
![]() |
పారిస్ ఒప్పందం, వాతావరణ మార్పుపై 2016 లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం.[3] ఈ ఒప్పందంలో వాతావరణ మార్పుల తగ్గింపు, అనుసరణ. ఆర్థిక సహాయాల అనే అంశాలున్నాయి. ఫ్రాన్స్‌లోని పారిస్ సమీపంలో జరిగిన 2015 ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశంలో 196 పార్టీలు ఈ అంశాలపై చర్చించాయి. 2023 ఫిబ్రవరి నాటికి, ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుపై ముసాయిదా సమావేశం (UNFCCC)లోని 195 సభ్యదేశాలు ఈ ఒప్పందంలో పార్టీలుగా ఉన్నారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించని మూడు UNFCCC సభ్య దేశాలలో, ఇరాన్ మాత్రమే ప్రధాన ఉద్గారిణి. రెండవ అతిపెద్ద ఉద్గారిణి అయిన యునైటెడ్ స్టేట్స్ 2020 లో ఒప్పందం నుండి వైదొలిగింది.[4] 2021 లో తిరిగి చేరి,[5] మళ్ళీ 2025 లో ఉపసంహరించుకుంది.[6]
పారిస్ ఒప్పందంలో దీర్ఘకాలిక ఉష్ణోగ్రత లక్ష్యం ఉంది. ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక విప్లవానికి ముందరి స్థాయిల కంటే 2 °C (3.6 °F) కంటే మించకుండా చూడడం ఈ లక్ష్యం. వీలైనంతవరకు ఈ పెరుగుదలను 1.5 °C (2.7 °F) కే పరిమితం చెయ్యాలని ఒప్పందం చెబుతుంది. ఈ పరిమితులు, అనేక సంవత్సరాల పాటు కొలిచిన ప్రపంచ ఉష్ణోగ్రతల సగటులుగా నిర్వచించబడ్డాయి. [7]
ఉష్ణోగ్రత పెరుగుదల ఎంత తక్కువగా ఉంటే, వాతావరణ మార్పుల ప్రభావాలు అంత తక్కువగా ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత లక్ష్యాన్ని సాధించడానికి, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను వీలైనంత మేరకు, వీలైనంత త్వరగా తగ్గించాలి. అవి 21వ శతాబ్దం మధ్య నాటికి నికర సున్నాకి కూడా చేరుకోవాలి. [8] గ్లోబల్ వార్మింగు 1.5 °C కంటే తక్కువగా ఉండాలంటే, 2030 నాటికి ఉద్గారాలను దాదాపు 50% తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ సంఖ్య ప్రతి దేశం చేసిన ప్రతిజ్ఞలను పరిగణనలోకి తీసుకుంటుంది. [9] పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, ప్రపంచ ఉద్గారాలు తగ్గకపోగా, పెరుగుతూ ఉన్నాయి. [7] 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డైంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 °C కంటే ఎక్కువగా ఉంది. [7]
వాతావరణ మార్పుల ప్రభావాలకు దేశాలు అనుగుణంగా మారడం, అందుకు తగినంత ఆర్థిక సహాయం అందించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఒప్పందం ప్రకారం, ప్రతి దేశం అది చేయదగ్గ తోడ్పాటును నిర్ణయించాలి, ప్రణాళిక చేసుకోవాలి, అమలుపై క్రమం తప్పకుండా నివేదించాలి. నిర్దిష్ట ఉద్గార లక్ష్యాలను నిర్దేశించమని ఏ యంత్రాంగం కూడా ఒక దేశాన్ని బలవంతం చేయదు. కానీ ప్రతి లక్ష్యం మునుపటి లక్ష్యాలను మించి ఉండాలి. 1997 నాటి క్యోటో ప్రోటోకాల్‌కి విరుద్ధంగా, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వ్యత్యాసం తగ్గింది. దాంతో అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా తమ ఉద్గార తగ్గింపు ప్రణాళికలను సమర్పించాల్సి ఉంటుంది.
పారిస్ ఒప్పందం 2016 ఏప్రిల్ 22 న (భూమి దినోత్సవం) న్యూయార్క్‌లోని UN ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంతకాల కోసం సిద్ధం చేసారు. యూరోపియన్ యూనియన్ ఈ ఒప్పందాన్ని ఆమోదించిన తర్వాత, ప్రపంచంలో గ్రీన్‌హౌస్ వాయువులకు తగినంత బాధ్యత వహించే దేశాలు కూడా ఆమోదించాక, 2016 నవంబరు 4 న, ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
ప్రపంచ నాయకులు ఈ ఒప్పందాన్ని ప్రశంసించారు. అయితే, కొంతమంది పర్యావరణవేత్తలు, విశ్లేషకులూ దీనిని విమర్శించారు. ఇది తగినంత కఠినంగా లేదని అన్నారు. ఒప్పందం ప్రభావం గురించి చర్చ జరుగుతోంది. పారిస్ ఒప్పందం కింద ఇచ్చిన హామీలు అందులో నిర్దేశించుకున్న ఉష్ణోగ్రత లక్ష్యాలను చేరుకోవడానికి సరిపోవు. అయితే ఆశయాన్ని పెంచే యంత్రాంగం ఉంది. 2010ల చివరలో వాతావరణ వ్యాజ్యాలలో పారిస్ ఒప్పందాన్ని విజయవంతంగా ఉపయోగించారు. దీనివల్ల దేశాలు, చమురు కంపెనీలూ తమ వాతావరణ చర్యలను బలోపేతం చేయాల్సి వచ్చింది. [10] [11]
లక్ష్యాలు
[మార్చు]ఆర్టికల్ 2 లో వివరించిన విధంగా, ఒప్పందం లక్ష్యం వాతావరణ మార్పు వలన కలగబోయే ప్రమాదానికి బలమైన ప్రతిస్పందనను సిద్ధం చెయ్యడం; ఇది వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సమావేశం అమలును మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది: [3]
(ఎ) ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే పెరుగుదల 2°C కు లోపు ఉండేలా చూడడం, ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5°C కి పరిమితం చేసే ప్రయత్నం చెయ్యడం. ఇది వాతావరణ మార్పు వలన కలిగే ప్రమాదాలు, ప్రభావాలను గణనీయంగా తగ్గిస్తుందని గుర్తించడం;
(బి) ఆహార ఉత్పత్తికి ముప్పు కలిగించని విధంగా, వాతావరణ మార్పు యొక్క ప్రతికూల ప్రభావాలకు అలవాటు పడే సామర్థ్యాన్ని, వాతావరణ స్థితిస్థాపకత ను పెంచడం, తక్కువ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల అభివృద్ధిని పెంపొందించడం;
(సి) తక్కువ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు, వాతావరణ-స్థితిస్థాపకత అభివృద్ధి మొదలైనవాటికి అనుగుణంగా ఆర్థిక ప్రవాహాలను సుస్థిర పరచడం
"ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల గరిష్ట స్థాయికి వీలైనంత త్వరగా" చేరుకోవాలని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. [3]
అభివృద్ధి
[మార్చు]
లీడ్-అప్
[మార్చు]1992 ఎర్త్ సమ్మిట్‌లో ఆమోదించబడిన UN ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) ఈ అంశంపై జరిగిన మొదటి అంతర్జాతీయ ఒప్పందాలలో ఒకటి. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి సంబంధిత పార్టీలు క్రమం తప్పకుండా సమావేశం కావాలని ఇది నిర్దేశిస్తుంది. ఇది భవిష్యత్ వాతావరణ ఒప్పందాలకు పునాది వేస్తుంది.[12]
1997 లో ఆమోదించబడిన క్యోటో ప్రోటోకాల్‌లో, 2008 నుండి 2012 వరకు పరిమిత దేశాలకు గ్రీన్హౌస్ వాయువు తగ్గింపులను నియంత్రించింది. 2012 లో దోహా సవరణతో ఈ ప్రోటోకాల్‌ను 2020 వరకు పొడిగించారు.[13] ఇందులో ఉన్న చట్టపరమైన కట్టుబాటు కారణంగా, యునైటెడ్ స్టేట్స్ ఈ ఒప్పందాన్ని ఆమోదించకూడదని నిర్ణయించుకుంది. ఇదీ, పంపిణీ సంఘర్షణ కలిసి తరువాతి అంతర్జాతీయ వాతావరణ చర్చల వైఫల్యాలకు దారితీసాయి. 2009 లో జరిగిన చర్చలను క్యోటో వారస ఒప్పందాన్ని రూపొందించడానికి ఉద్దేశించారు గానీ, ఆ చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా వచ్చిన కోపెన్‌హాగన్ ఒప్పందం చట్టపరమైన కట్టుబాట్లు లేవు; అది సార్వత్రికంగా అమలు కాలేదు.[14]
ఈ ఒప్పందం పారిస్ ఒప్పందం యొక్క బాటమ్-అప్ విధానానికి చట్రాన్ని నిర్దేశించింది. UNFCCC కార్యనిర్వాహక కార్యదర్శి క్రిస్టియానా ఫిగ్యురెస్ నాయకత్వంలో, కోపెన్హాగన్ వైఫల్యం తరువాత చర్చలు తిరిగి ఊపందుకున్నాయి.[15] 2011 ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు సందర్భంగా, 2020 నుండి వాతావరణ మార్పుల ఉపశమన చర్యలను నియంత్రించే చట్టపరమైన సాధనాన్ని చర్చించడానికి డర్బన్ వేదిక స్థాపించబడింది. ఐపిసిసి యొక్క ఐదవ అసెస్మెంట్ రిపోర్టూ, యుఎన్ఎఫ్సిసిసి యొక్క అనుబంధ సంస్థల పని ద్వారా తెలియజేయవలసిన ఆదేశం ఈ వేదికకు ఉంది. ఫలితంగా ఏర్పడిన ఒప్పందాన్ని 2015లో ఆమోదించాల్సి ఉంది.[16]
చర్చలు, తీర్మానం
[మార్చు]ఈ చర్చలు పారిస్‌లో రెండు వారాల పాటు జరిగాయి. చివరి మూడు రోజుల్లో రాత్రుళ్ళు కూడా కొనసాగాయి. [17] [18] దానికి ముందు సంవత్సరం పాటు వివిధ ముసాయిదాలు ప్రతిపాదనలను చర్చింది, క్రమబద్ధీకరించారు.[19] ఒక వ్యాఖ్యాత ప్రకారం, ఈ సమావేశాల విజయావకాశాలను పెంచేందుకు ఫ్రెంచివారు అవలంబించిన రెండు మార్గాలు: మొదటగా, చర్చలు ప్రారంభమయ్యే ముందే ఒక్కోదేశం చెయ్యవలసిన తోడ్పాటులను (INDCలు) నిశ్చయించుకోవడం, రెండవది, నాయకులను సమావేశం ప్రారంభానికి మాత్రమే ఆహ్వానించడం. [20]
ఒప్పందపు ఇంగ్లీషు పాఠ్యంలో ఉన్న ("షుడ్" అనే పదానికి బదులు "షల్" అని ఉండడం) చిన్నపాటి అంశం కారణంగా, అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాలను తగ్గించడానికి చట్టపరమైన కట్టుబాటు, బాధ్యత ఉంటాయని అర్థం వస్తున్నట్లు అమెరికా న్యాయబృందం గమనించి, దాఅనిపట్ల అభ్యంతరం తెలిపింది. ఈ కారణంగా చర్చలు దాదాపుగా విఫలమయ్యే స్థితికి వచ్చినపుడు, అది టైపింగులో చేసిన పొరపాటు (టైపాటు) అని ప్రకటించి ఫ్రెంచివారు ఆ సమస్యను పరిష్కరించారు. [21] 2015 డిసెంబరు 12 న జరిగిన COP21 (పార్టీల 21వ సమావేశం) ముగింపులో, పారిస్ ఒప్పందం యొక్క తుది పదాలను 195 UNFCCC సభ్య దేశాలు, యూరోపియన్ యూనియన్ ఏకాభిప్రాయంతో ఆమోదించాయి. [22] ఒప్పందం బలహీనంగా ఉందని ఖండించినందున ఒప్పందంపై అభ్యంతరం చెప్పాలనుకుంటున్నామని నికరాగ్వా సూచించింది గానీ, వారికి ఆ అవకాశం దొరకలేదు. [23] [24] ఒప్పందంలో సభ్యులు తమ కార్బన్ ఉత్పత్తిని "సాధ్యమైనంత త్వరగా" తగ్గిస్తామని, గ్లోబల్ వార్మింగ్‌ను " 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా " ఉంచడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సంతకం చేయడం, అమలులోకి రావడం
[మార్చు]పారిస్ ఒప్పందం UNFCCC లో భాగస్వాములైన దేశాలు, ప్రాంతీయ ఆర్థిక సమైక్యత సంస్థల సంతకాలు 2016 ఏప్రిల్ 22 నుండి 2017 ఏప్రిల్ 21 వరకు న్యూయార్క్‌లోని UN ప్రధాన కార్యాలయంలో జరిగాయి.[25] ఒప్పందంపై సంతకం చేయడం, ఆమోదానికి మొదటి అడుగు. అయితే, సంతకం చేయకుండానే ఒప్పందానికి అంగీకరించడం కూడా సాధ్యమే.[26] ఒప్పందం లక్ష్యానికి విరుద్ధంగా వ్యవహరించకూడదని ఇది పార్టీలను నిర్బంధిస్తుంది.[27] ప్రపంచ ఉద్గారాలలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ స్టేట్స్, చైనాలు పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకం చేస్తామని 2016 ఏప్రిల్ 1న ధృవీకరించాయి. [28] [29] ఈ ఒప్పందంపై సంతకం కోసం తెరిచిన మొదటి రోజున 175 పార్టీలు (174 దేశాలు, ఐరోపా సమాఖ్య) సంతకం చేశాయి.[30] [31] 2021 మార్చి నాటికి, 194 దేశాలు, యూరోపియన్ యూనియన్‌లు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి.[1]

ప్రపంచంలోని గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో కనీసం 55% ఉత్పత్తి చేసే 55 దేశాలు (2015లో ఉత్పత్తి చేయబడిన జాబితా ప్రకారం) [32] ఒప్పందాన్ని ఆమోదించినా లేదా వేరేవిధంగా చేరినా ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. [26] ఒప్పందంలో చేరడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అంగీకారం, ఆమోదం లేదా ప్రవేశం. మొదటి రెండూ సాధారణంగా ఒక దేశాన్ని ఒక ఒప్పందంతో బంధించడానికి దేశాధినేత అవసరం లేనప్పుడు ఉపయోగించబడతాయి. అయితే రెండోది సాధారణంగా ఒక దేశం ఇప్పటికే అమలులో ఉన్న ఒప్పందంలో చేరినప్పుడు జరుగుతుంది. [33] యూరోపియన్ యూనియన్ ఆమోదించిన తర్వాత, ఒప్పందం 2016 నవంబరు 4 న అమలులోకి వచ్చింది. [34]
పారిస్ ఒప్పందాన్ని ఆమోదించడానికి EU, దాని సభ్య దేశాలు రెండూ వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తాయి. EU, దాని 28 సభ్య దేశాలు ఒకే సమయంలో ఆమోదించడం ద్వారా మరొకరికి ఖచ్చితంగా సంబంధించిన బాధ్యతలను నెరవేర్చకుండా చూసుకోవాలనే బలమైన ప్రాధాన్యత నివేదించబడింది, [35] EU-వ్యాప్త తగ్గింపు లక్ష్యంలో ప్రతి సభ్య దేశం వాటాపై భిన్నాభిప్రాయాలు, అలాగే EU నుండి నిష్క్రమించడానికి బ్రిటన్ ఓటు వేయడం వల్ల పారిస్ ఒప్పందం ఆలస్యం కావచ్చు అనే భయాలు పరిశీలకులలో ఉండేవి. [36] అయితే EU, ఏడు సభ్య దేశాలతో పాటు, 2016 అక్టోబరు 5 న ధృవీకరణ పత్రాలను సమర్పించింది.[36]
పార్టీలు
[మార్చు]ఆమోదించిన దేశాలు
[మార్చు]గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో మొత్తం 98% కంటే ఎక్కువ ఉన్న 194 దేశాలు, ఐరోపా సమాఖ్యలు ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి. [1] [37] దీనికి ఆమోదం తెలపని వాటిలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు వెలువరించే మధ్యప్రాచ్యంలోని దేశాలున్నాయి. ప్రపంచపు మొత్తం ఉద్గారాల్లో 2% వాటా కలిగిన ఇరాన్ సంతకం పెట్టని దేశాల్లో అతిపెద్దది. [38] లిబియా, యెమెన్‌లు కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదు . [1] తాజాగా 2023 ఫిబ్రవరి 7 న, ఎరిట్రియా ఈ ఒప్పందాన్ని ఆమోదించింది.
ఒప్పందం నుండి దేశాలు వైదొలగాలంటే, ఆర్టికల్ 28 డిపాజిటరీకి ఉపసంహరణ నోటిఫికేషన్ పంపాలి. దేశంలో ఒప్పందం అమల్లోకి వచ్చిన మూడు సంవత్సరాల లోపు ఈ నోటీసు ఇవ్వకూడదు. డిపాజిటరీకి తెలియజేసిన ఒక సంవత్సరం తర్వాత ఈ ఉపసంహరణ అమలులోకి వస్తుంది.[39]
ఒప్పందం నుండి అమెరికా ఉపసంహరణ, తిరిగి రావడం, మళ్ళీ పోవడం
[మార్చు]చైనా తర్వాత రెండవ అతిపెద్ద గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారిణి అయిన అమెరికా, [40] పారిస్ ఒప్పందం నుండి వైదొలగే అర్హత రాగానే వైదొలగాలని భావిస్తోందని 2017 ఆగస్టు 4 న ట్రంప్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి అధికారిక నోటీసును అందజేసింది.[4] 2019 నవంబరు 4న అమెరికాకు ఈ ఒప్పందం మూడు సంవత్సరాలు అమలులో ఉండే వరకు ఉపసంహరణ నోటీసును సమర్పించడం సాధ్యం కాదు. [41] [42] అమెరికా ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కు సమర్పించి, ఒక సంవత్సరం తర్వాత 2020 నవంబరు 4 న అధికారికంగా ఒప్పందం నుండి తప్పుకుంది.[43]
అధ్యక్షుడు జో బైడెన్ పదవి చేపట్టిన మొదటి రోజున అంటే 2021 జనవరి 20 న పారిస్ ఒప్పందంలో అమెరికాను తిరిగి చేరాలని కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశాడు. [44] [45] ఆర్టికల్ 21.3 ద్వారా నిర్దేశించబడిన 30 రోజుల వ్యవధి తర్వాత అమెరికా, తిరిగి ఒప్పందంలో చేరింది.[46] [5] అమెరికా వాతావరణ రాయబారి జాన్ కెర్రీ వర్చువల్ ఈవెంట్లలో పాల్గొని, పారిస్ ప్రక్రియలో అమెరికా "తిరిగి చట్టబద్ధతను పొందుతుంది" అని అన్నారు. [47] అమెరికా తిరిగి రావడాన్ని స్వాగతిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్, "అంతటినీ బలహీనపరిచిన ఈ లింకు" తిరిగి ఏర్పడిందని అన్నాడు.[47]
2025 జనవరి 20 న కొత్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఒప్పందం నుండి ఉపసంహరించుకుంటూ మరొక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.[48]
స్పందనలు
[మార్చు]ఈ ఒప్పందాన్ని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, UN సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్, UNFCCC కార్యనిర్వాహక కార్యదర్శి క్రిస్టియానా ఫిగ్యురెస్ లు ప్రశంసించారు. బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ఈ ఒప్పందాన్ని "సమతుల్యమైనది, దీర్ఘకాలికమైనదీ" అని అభివర్ణించింది.[49] భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఒప్పందం లోని వాతావరణ న్యాయాన్ని ప్రశంసించాడు. [50] [51] 2016 అక్టోబరులో ఈ ఒప్పందానికి అవసరమైనన్ని సంతకాలు సాధించినప్పుడు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, "మనం ప్రతి లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ, మనం వెళ్లాల్సిన చోటులో కొంత భాగాన్ని మాత్రమే చేరుకుంటాము." అని అన్నాడు.[52] "ఈ ఒప్పందం వాతావరణ మార్పు యొక్క కొన్ని చెత్త పరిణామాలను ఆలస్యం చేయడానికి లేదా నివారించడానికి సహాయపడుతుంది. ఇతర దేశాలు కాలక్రమేణా వాటి ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి" అని కూడా ఆయన పేర్కొన్నారు. [52]
కొంతమంది పర్యావరణవేత్తలు, విశ్లేషకులు జాగ్రత్తగా స్పందించారు. దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో "పారిస్ స్ఫూర్తి"ని గుర్తించారు, కానీ వాతావరణ మార్పు తగ్గింపు వేగం పట్ల, పేద దేశాలకు ఈ ఒప్పందం ఎంతవరకు ఉపయోగపడుతుందనే దాని పట్లా తక్కువ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. [53] నాసా మాజీ శాస్త్రవేత్త, ప్రముఖ వాతావరణ మార్పు నిపుణుడు జేమ్స్ హాన్సెన్, ఒప్పందంలో ఎక్కువ భాగం "వాగ్దానాలు" లక్ష్యాలే ఉన్నాయని, దృఢమైన నిబద్ధతలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పారిస్ చర్చలను "చర్యలు లేవు, కేవలం వాగ్దానాల"తో మోసంగా అభివర్ణించారు. [54] వాతావరణ చర్యలకు వ్యతిరేకంగా వాదించే వారి నుండి ఒప్పందంపై విమర్శలు విస్తృతంగా వచ్చాయి. ఇది ఒప్పందపు బలహీనత వల్ల కావచ్చు. ఈ రకమైన విమర్శలు సాధారణంగా జాతీయ సార్వభౌమాధికారం పైన, అంతర్జాతీయ చర్యల్లోని అసమర్థతపైనా దృష్టి పెడతాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Paris Agreement". United Nations Treaty Collection. Archived from the original on 5 July 2021. Retrieved 15 July 2021. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "depo2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Paris Climate Agreement Becomes International Law". ABC News. Archived from the original on 4 November 2016. Retrieved 4 November 2016.
- ↑ 3.0 3.1 3.2 "Paris Agreement, FCCC/CP/2015/L.9/Rev.1" (PDF). UNFCCC secretariat. Archived (PDF) from the original on 12 December 2015. Retrieved 12 December 2015.
- ↑ 4.0 4.1 "Reference: C.N.464.2017.TREATIES-XXVII.7.d (Depositary Notification)" (PDF). United Nations. 8 August 2017. Archived (PDF) from the original on 15 August 2017. Retrieved 14 August 2017. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "UScom" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 5.0 5.1 "US makes official return to Paris climate pact". Associated Press. 19 February 2021. Archived from the original on 19 February 2021. Retrieved 19 February 2021 – via The Guardian. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":20" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Calma, Justine (2025-01-20). "Donald Trump pulls US out of Paris climate agreement". The Verge (in ఇంగ్లీష్). Retrieved 2025-01-20.
- ↑ 7.0 7.1 7.2 Zhong, Raymond; Plumer, Brad; Rojanasakul, Mira (2025-01-10). "2024's Record-Breaking Heat Brought the World to a Dangerous Threshold. Now What?". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2025-01-10.
- ↑ UNFCCC. "The Paris Agreement". unfccc.int. Archived from the original on 19 March 2021. Retrieved 18 September 2021.
- ↑ Schleussner, Carl-Friedrich. "The Paris Agreement – the 1.5 °C Temperature Goal". Climate Analytics (in ఇంగ్లీష్). Retrieved 2022-01-29.
- ↑ Corder, Mike (20 December 2019). "Activists cheer victory in landmark Dutch climate case". AP news (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
- ↑ Boffey, Daniel (26 May 2021). "Court orders Royal Dutch Shell to cut carbon emissions by 45% by 2030". The Guardian. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
- ↑ "UN Climate Talks". Council of Foreign Affairs. 2021. Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
- ↑ Harrabin, Roger (8 December 2012). "UN climate talks extend Kyoto Protocol, promise compensation". BBC News. Archived from the original on 16 July 2018. Retrieved 22 June 2018.
- ↑ Klein, Richard J. T. (7 December 2020). "The Paris Agreement and the future of climate negotiations". Stockholm Environment Institute (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
- ↑ McGrath, Matt (19 February 2016). "UN climate chief Christiana Figueres to step down". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 29 December 2020. Retrieved 7 March 2021.
- ↑ "UNFCCC:Ad Hoc Working Group on the Durban Platform for Enhanced Action (ADP)". Archived from the original on 2 August 2015. Retrieved 2 August 2015.
- ↑ Jepsen, Henrik; et al. (2021). Negotiating the Paris Agreement: The Insider Stories. Cambridge University Press. ISBN 978-1-108-88624-6.
- ↑ Goldenberg, Suzanne (12 December 2015). "Paris climate deal: nearly 200 nations sign in end of fossil fuel era". The Guardian (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2021. Retrieved 18 July 2021.
- ↑ Evans, Simon (7 September 2015). "Bonn climate talks ask for draft Paris text". Carbon Brief (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
- ↑ "The Paris Agreement is done! Let the negotiations begin?". GHG and Carbon Accounting, Auditing, Management & Training | Greenhouse Gas Management Institute (in అమెరికన్ ఇంగ్లీష్). 24 February 2016. Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ "How a 'typo' nearly derailed the Paris climate deal". the Guardian (in ఇంగ్లీష్). 16 December 2015. Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ Sutter, John D.; Berlinger, Joshua (12 December 2015). "Final draft of climate deal formally accepted in Paris". CNN. Turner Broadcasting System, Inc. Archived from the original on 12 December 2015. Retrieved 12 December 2015.
- ↑ Watts, Joshua. "Latin America in the climate change negotiations: Exploring the AILAC and ALBA coalitions".
- ↑ Harvey, Fiona (8 December 2020). "The Paris agreement five years on: Is it strong enough to avert climate catastrophe?". The Guardian. Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ "Article 20(1)" (PDF). UNFCCC.int. Archived (PDF) from the original on 17 November 2017. Retrieved 17 November 2017.
- ↑ 26.0 26.1 Yeo, Sophie (19 April 2016). "Explainer: The adoption, signing and ratification of the UN climate deal". Carbon Brief (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
- ↑ Voigt, Christina (2017). "Institutional Arrangements and Final Clauses". In Klein, Daniel (ed.). The Paris Agreement on Climate Change. p. 363.
- ↑ McGrath, Matt (31 March 2016). "Paris Climate Treaty: 'Significant step' as US and China agree to sign". BBC. Archived from the original on 23 April 2016. Retrieved 23 April 2016.
- ↑ Davenport, Coral (31 March 2016). "Obama and President Xi of China Vow to Sign Paris Climate Agreement Promptly". The New York Times. Archived from the original on 21 February 2017.
- ↑ "'Today is an historic day,' says Ban, as 175 countries sign Paris climate accord". United Nations. 22 April 2016. Archived from the original on 29 June 2017. Retrieved 29 June 2017.
- ↑ "Paris Agreement Signature Ceremony" (PDF). UNFCCC. 22 April 2016. Archived from the original (PDF) on 16 May 2017. Retrieved 22 April 2016.
- ↑ "Information provided in accordance with paragraph 104 of decision 1 CP21 related to entry into force of the Paris Agreement (Article 21)" (PDF). UNFCCC. Archived (PDF) from the original on 21 February 2016. Retrieved 23 April 2016.
- ↑ "Glossary of terms relating to Treaty actions". United Nations Treaty Collection (in ఇంగ్లీష్). Archived from the original on 22 May 2019. Retrieved 18 July 2021.
- ↑ Yeo, Sophie (6 October 2016). "Explainer: Paris Agreement on climate change to 'enter into force'". Carbon Brief (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
- ↑ Yeo, Sophie (23 June 2016). "Explainer: When will the European Union ratify the Paris Agreement?". Carbon Brief. Archived from the original on 5 September 2016. Retrieved 3 September 2016.
- ↑ 36.0 36.1 Schiermeier, Quirin (4 October 2016). "Paris climate deal to take effect as EU ratifies accord".
- ↑ "India Ratifies Landmark Paris Climate Deal, Says, 'Kept Our Promise'". Archived from the original on 3 October 2016. Retrieved 2 October 2016.
- ↑ "Each Country's Share of CO2 Emissions". Union of Concerned Scientists. Archived from the original on 24 November 2018. Retrieved 27 June 2021.
{{cite web}}
: templatestyles stripmarker in|title=
at position 46 (help) - ↑ "On the Possibility to Withdraw from the Paris Agreement: A Short Overview". UNFCCC. 14 June 2017. Archived from the original on 2 December 2018. Retrieved 4 April 2021.
- ↑ World Resources Institute, 10 December 2010 "This Interactive Chart Shows Changes in the World's Top 10 Emitters" Archived 14 మార్చి 2021 at the Wayback Machine
- ↑ Restuccia, Andrew (4 August 2017). "Trump administration delivers notice U.S. intends to withdraw from Paris climate deal". Politico. Archived from the original on 4 August 2017. Retrieved 4 August 2017.
- ↑ Liptak, Kevin. "WH: US staying out of climate accord". CNN. Archived from the original on 17 September 2017. Retrieved 17 September 2017.
- ↑ Dennis, Brady. "Trump makes it official: U.S. will withdraw from the Paris climate accord". The Washington Post. Archived from the original on 9 November 2019. Retrieved 4 December 2019.
- ↑ Medina, Daniella. "Biden plans 17 executive orders on student loans, wearing masks and more. See the list". The Tennessean (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 21 January 2021. Retrieved 20 January 2021.
- ↑ "Paris Climate Agreement". WH.gov. The White House. 20 January 2021. Archived from the original on 21 January 2021. Retrieved 21 January 2021.
- ↑ "United States officially rejoined the Paris Agreement". Renewable Energy 2050. 20 February 2021. Archived from the original on 20 February 2021. Retrieved 20 February 2021.
- ↑ 47.0 47.1 Volcovici, Valerie (19 February 2021). "It's official: U.S. back in the Paris climate club". Reuters (in ఇంగ్లీష్). Archived from the original on 20 February 2021. Retrieved 20 February 2021.
- ↑ Volcovici, Valerie; Ward, Jasper (20 January 2025). "Trump to withdraw from Paris climate agreement, White House says". Reuters. Retrieved 20 January 2025.
- ↑ Hulac, Benjamin (14 December 2015). "Pollution from Planes and Ships Left Out of Paris Agreement". Scientific American (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
- ↑ Goswami, Urmi (14 December 2015). "Paris COP21: Recognition of "common but differentiated responsibilities" key achievement of India". The Economic Times. Archived from the original on 15 July 2021. Retrieved 21 July 2021.
- ↑ Taylor, Matthew (13 December 2015). "Paris climate deal provides 'best chance we have' of saving the planet". The Guardian. Archived from the original on 13 July 2021. Retrieved 21 July 2021.
- ↑ 52.0 52.1 "A sweeping global climate change agreement was ratified on Wednesday". NBC News. 5 October 2016. Archived from the original on 5 October 2016. Retrieved 5 October 2016.
- ↑ Harvey, Fiona (14 December 2015). "Paris climate change deal too weak to help poor, critics warn". The Guardian (in ఇంగ్లీష్). Archived from the original on 30 June 2021. Retrieved 26 June 2021.
- ↑ Milman, Oliver (12 December 2015). "James Hansen, father of climate change awareness, calls Paris talks 'a fraud'". The Guardian. London, England. Archived from the original on 14 December 2015. Retrieved 14 December 2015.