పారుపల్లి సుబ్బారావు
పారుపల్లి సుబ్బారావు | |
---|---|
జననం | పారుపల్లి సుబ్బారావు 1897 శ్రీకాకుళం, ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
ప్రసిద్ధి | నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. |
పారుపల్లి సుబ్బారావు నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. స్త్రీ పాత్రలకు పేరొందిన వాడు.[1]
జీవిత విషయాలు
[మార్చు]సుబ్బారావు 1897లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో జన్మించాడు.
నట ప్రస్థానం
[మార్చు]1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించాడు. తమ అన్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులు (డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గురువు) దగ్గర సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో అప్పటి సంగీత దర్శకుడు పాపట్ల కాంతయ్య (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన) వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించాడు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోనూ, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో పేరు సంపాదించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యంతో సాత్వికాభినయంలో మేటిగా, స్త్రీ పాత్రధారణకు పేరొందిన సుబ్బారావు పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషాన్ని చక్కగా ధరంచేవాడు
నటించిన పాత్రలు
[మార్చు]- విమల (రసపుత్ర విజయం)
- రాముడు (లవకుశ)
- సావిత్రి
- లీలావతి
- రాధ
- సుకన్య
- కైక
- చంద్రమతి
- రుక్మిణి
- రత్నాంగి
- కమలాంబ
- దుర్యోధనుడు
- రామదాసు
సినిమాలు
[మార్చు]1934లో ఈస్టిండియా కంపెనీ సి.పుల్లయ్య దర్శకత్వంలో తీసిన ‘లవకుశ’ చిత్రంలో శ్రీరాముని పాత్రలో నటించాడు.
- 1936: సతీ సులోచన (1936 సినిమా)
- ద్రౌపది మాన సంరక్షణము (ధర్మరాజు)[2]
- 1944: సీతారామ జననం (జనకుడు)[3]
మూలాలు
[మార్చు]- ↑ పారుపల్లి సుబ్బారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 660.
- ↑ సితార, సినీ మార్గదర్శకులు. "తొలి టాకీ కృష్ణుడు... సియ్యస్సార్". www.sitara.net. ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 9 November 2019. Retrieved 29 September 2020.
- ↑ The Hindu, Cinema (25 February 2012). "Blast From The Past: Sri Sita Rama Jananam (1944)" (in Indian English). M.L. Narasimham. Archived from the original on 2018-06-20. Retrieved 29 September 2020.
ఇతర లంకెలు
[మార్చు]- పారుపల్లి సుబ్బారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 660.