పార్వతి(నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్వతి(నటి)

పార్వతి, ప్రముఖ భారతీయ నటి. ఎక్కువగా మళయాళ, తమిళ భాషా సినిమాల్లో నటించారు. కేరళలోని కోళిక్కోడ్ కు చెందిన పార్వతి 2006లో మళయాళ చిత్రం ఔట్ ఆఫ్ సిలబస్ సినిమాతో తెరంగేట్రం  చేశారు. నోట్ బుక్(2006), పూ(2008), పృధ్వీ(2010), సిటీ ఆఫ్ గాడ్(2011), మర్యన్(2013), బెంగుళూర్ డేస్(2014), ఉత్తమ విలన్(2015), ఎన్ను నింతె మొయిడీన్(2015), చార్లే(2015) వంటి సినిమాల్లో ఆమె నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంశలు పొందారు.

2015లో ఎన్ను నింతె మొయిడీన్, చార్లే సినిమాల్లోని నటనకు పార్వతి కేరళ రాష్ట్ర ఫిలిం పురస్కారం అందుకున్నారు. పూ అనే తమిళ సినిమాకుగానూ 2008లో ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకున్నారు ఆమె. అలాగే 2014లో బెంగుళూరు డేస్ సినిమాలో  అమె నటించిన ఆర్.జె సెరా పాత్రకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం అందుకున్నారు. తరువాత 2015లో మళయాళ చిత్రం ఎన్ను నింతె మొయిడీన్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్నారు పార్వతి.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]