పార్వతి జయరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్వతి జయరామ్

పార్వతి, ప్రముఖ దక్షిణ భారత నటి. ఆమె అసలు పేరు అశ్వతి కురుప్. పార్వతి ప్రఖ్యాత శాస్త్రీయ నాట్య కళాకారిణి కూడా. ఆమె ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటించింది.

1986 నుండి 1993 వరకు పార్వతి మలయాళ సినీ పరిశ్రమలో నటిగా పనిచేసింది. ఆమె నటించిన మొదటి సినిమాకు లెనిన్ రాజేంద్రన్  దర్శకత్వం వహించాడు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. 1986లో  నటుడు, దర్శకుడు బాలచంద్ర మేనన్ దర్శకత్వంలో  వివహితరే ఇతిలే సినిమాతో మలయాళ సినీ రంగానికి పరిచయం అయ్యింది ఆమె. ఆమె నటించిన చిత్రాల్లో అమృతం గామయే, ఒరు  మిన్నమినుంగింటే నురుంగువెట్టం, తూవనతూంబికల్ (1987),  పొనముట్టయిదున్న తరవు (1989), వడక్కునొక్కియంత్రం, పెరువన్నపురతే విశేషంగళ్, కిరేదం (1989) వంటివి విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి.

1992లో మలయళ నటుడు జయరాంను వివాహం చేసుకుంది పార్వతి. జయరాంతో కలసి ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది. పెళ్ళైన తరువాత  ఆమె సినిమాల్లో నటించడం క్రమంగా మానేసింది.[1] ప్రస్తుతం ఆమె  కుటుంబంతో కలసి చెన్నైలో నివసిస్తోంది. ఆమెకు ఒక కొడుకు  కాళిదాస్ జయరాం, కుమార్తె మాళవికా జయరాం.

వ్యక్తిగత జీవితం[మార్చు]

తిరువల్లాలోని కవియూర్ లో జన్మించింది ఆమె. రామచంద్ర కురుప్, పద్మ భాయ్ ల ముగ్గురు సంతానంలో రెండో కుమార్తె పార్వతి. ఆమె తండ్రి అలప్పుళలోని చంపకులానికి చెందినవారు కాగా, తల్లి సొంత ఊరు తిరువెల్లాలోని కవియూర్. ఆమె అక్క జ్యోతి, చెల్లెలు  దీప్తి (చనిపోయారు). తిరువెల్లాలోని దేవస్వం బోర్డు హైయర్ సెకెండరీ స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించిందామె. అదే స్కూలులో ఆమె  తల్లి లెక్కల ఉపాధ్యాయినిగా పని చేసేది. చంగనచెర్రీలో ఎన్.ఎస్.ఎస్. హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకూ చదివింది పార్వతి. అక్కడ చదువుకునే సమయంలోనే లెనిన్ రాజేంద్రన్ తన సినిమాలో హీరోయిన్ గా ఆమెను ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆ సినిమా ఆగిపోయింది.  తరువాత ఆమె బాలచంద్రన్ మేనన్ దర్శకత్వంలో వివహితరే ఇతిలే (1986) సినిమాలో కథానాయికగా నటించింది. అప్పటికి ఆమె వయసు 16 సంవత్సరాలే కావడం విశేషం.

మూలాలు[మార్చు]