పార్వతీ నాయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్వతీ నాయర్

పార్వతీ నాయర్,  భారతీయ విజువల్ కళాకారిణి, సృజనాత్మక రచయిత. ఢిల్లీలో జన్మించిన ఆమె సృజనాత్మక వీడియోలుశిల్పాలు, చిత్రలేఖనాలు, పుస్తకాలు, ఫోటోగ్రఫీ వంటి ప్రక్రియల్లో ఆమె చేసిన కృషి ద్వారా ప్రసిద్ధి చెందింది. అమితాబ్ బచ్చన్ 70వ జన్మదినోత్సవ వేడుకల్లో బి70 పేరిట ప్రచురించిన 70 మంది కళాకారుల్లో ఒకరు కావడం విశేషం.[1] 2014లో కొత్త ముంబై ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎయిర్ పోర్ట్ లో ఆమె తయారు చేసిన 20 అడుగుల శిల్పాన్ని స్థాపించబడటం ఆమె కెరీర్ లోనే మైలురాయిగా నిలిచింది. సింగపూర్ ఆర్ట్ మ్యూజియం, సొతెబీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్. ది ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్, డ్యెట్స్కే బ్యాంక్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రదర్శనశాలల్లో ఆమె శిల్పాలు ఉన్నాయి. ఎబిఎన్ ఎమ్రోస్ దిల్ సే ప్లాటినం కార్డ్ లో ఆమె చిత్రాలు ప్రచురించబడ్డాయి.[2][3][4][5]

విద్యాభ్యాసం[మార్చు]

చెన్నైలోని గుడ్ షెపర్డ్ కాన్వెంట్ లో మెట్రిక్యులేషన్, ఇంటర్ పూర్తి చేసింది పార్వతీ.[3] మద్రాసు విశ్వవిద్యాలయానికి చెందిన స్టెల్లా మేరిస్ కళాశాలలో బిఏ చదువుకుంది పార్వతీ. ఆ తరువాత 1985లో బ్రిటీష్ ప్రభుత్వ స్కాలర్ షిప్ పై లండన్లో సెంట్రల్ సెయింట్ మార్టిన్స్ కళాశాలలో ఎం.ఎ ఫైన్ ఆర్ట్స్ చదువుకుంది ఆమె. చదువుకునే సమయంలో విశ్వవిద్యాలయంలో ప్రథమురాలిగా నిలిచింది.

మూలాలు[మార్చు]

  1. "Parvathy's Master strokes". Chennai live news. Archived from the original on 2016-12-02. Retrieved 2016-10-07.
  2. "Infinite canvas". The Hindu. Retrieved 2016-10-07.
  3. 3.0 3.1 "A life offered to art". New Indian Express. Retrieved 2016-10-07.
  4. "Celebrating Amitabh Bachchan on canvas". DNA India. Retrieved 2016-10-07.
  5. "India's largest public art project lands at Mumbai airport". Artradarjournal. Archived from the original on 2016-05-28. Retrieved 2016-10-07.