Jump to content

పాలస్తీనా అథారిటీ

వికీపీడియా నుండి
السلطة الوطنية الفلسطينية
అస్-సల్త అల్-వతనియ్య అల్-ఫలస్తీనియ్య
పాలస్తీనా జాతీయ అధికారం
Flag of పాలస్తీనా పాలస్తీనా యొక్క కోట్ ఆఫ్ ఆర్మ్స్
జాతీయగీతం
బలాది
పాలస్తీనా యొక్క స్థానం
పాలస్తీనా యొక్క స్థానం
రాజధాని
అతిపెద్ద నగరం
జెరూసలెం
అధికార భాషలు అరబ్బీ, ఇంగ్లీషు
ప్రభుత్వం
 -  అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్
 -  ప్రధానమంత్రి సలాం ఫయాజ్
స్థాపన
 -  స్థాపితము 1994 
జనాభా
 -  2008 అంచనా 4.017.000 (128th)
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $5.550 బిలియన్లు (-)
 -  తలసరి వెస్ట్ బ్యాంక్ $1,500[1] (-)
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Decrease 0.731 (medium) (106వది)
కరెన్సీ ఇస్రాయెలీ కొత్త షెకెల్
జోర్డానియన్ దీనార్a (JOD, ILS)
కాలాంశం   (UTC+2)
 -  వేసవి (DST)   (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ps
కాలింగ్ కోడ్ +970
a en:West Bank మాత్రమే.
b Not officially assigned.

పాలస్తీనా లేదా పాలస్తీనా జాతీయ ప్రభుత్వము (PNA or PA; అరబ్బీ: అస్-సుల్తా అల్-వతనియ్య అల్-ఫలస్తీనియ్యా) గాజా పట్టీ, పశ్చిమ తీరపు ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ 'పాలస్తీనా' ప్రజల ప్రభుత్వం.

పాలస్తీనా గురించి

[మార్చు]

మధ్యధరా సముద్రం తీరాన 360 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 15 లక్షల మంది జనాభాతో కిక్కిరిసి పోయి ఉండే పాలస్తీనియన్ భూభాగం గాజా. పాలస్తీనాలో ఇజ్రాయిల్ పాలకులు గాజాను నిరంతరం దిగ్బంధానికి గురిచేస్తూ వచ్చారు. విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేశారు. ఆహారం మందులు అందకుండా చేశారు. ఆ ప్రాంతంలోకి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను అనుమతించాలన్న తమ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం వారు పాటించ లేదు. మహిళలు, బాలలతో సహా అమాయక పాలస్తీనియన్లు ఎందరో హతమారిపోతున్నారు. వారి గృహాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, నేలమట్టమై పోయాయి. హమాస్‌కు ఉగ్రవాద నేపథ్యం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే గాజాలో అధికారంలోకి వచ్చింది. నాలుగు దశాబ్దాలకు పైగా ఆక్రమణలో గాజా ఉంది.'మున్ముందు మరింత బీభత్సం చోటుచేసుకోనుంది'. హిజ్బొల్లా లాగానే హమాస్ పూర్తిగా అదృశ్యమైపోతుందని ఇజ్రాయెల్ పాలకులు చెబుతున్నారు. హమాస్, ఫతాల మధ్య స్నేహం లేదు. మరో పాలస్తీనా భూభాగం వెస్ట్ బ్యాంక్ ఫతా పాలనలో ఉంది. 1993 ఓస్లో ఒప్పందాలలో రెండు పాలస్తీనా రాజ్యాల ఏర్పాటు ప్రతిపాదన ఉంది. అధ్యక్ష పదవినుంచి తాను వైదొలిగే లోగానే పాలస్తీనాలో రెండు రాజ్యాలు ఉనికిలోకి వస్తాయని' జార్జిబుష్ ప్రకటించారు. పాలస్తీనీయులకు మద్దతుగా భారత ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించింది.

సాహిత్యం - సంస్కృతి

[మార్చు]
  1. సమీ అల్-ఖసీమ్: కవి, జర్నలిస్ట్, సంపాదకులు, రాజకీయవేత్త.[2]
  2. రిమ్ బన్నా: పాలస్తీనా గాయకురాలు, సంగీత దర్శకురాలు.
  3. కమ్లియా జుబ్రాన్: పాలస్తీనా గాయకురాలు, పాటల రచయిత్రి, సంగీత దర్శకురాలు.
  4. మై మస్రీ: పాలస్తీనా చిత్ర దర్శకురాలు.
  5. నిస్రీన్ ఫౌర్:పాలస్తీనా రంగస్థల, సినిమా నటి,

మూలాలు

[మార్చు]
  1. "CIA - The World Factbook -- West Bank." Archived 2008-07-09 at the Wayback Machine Central Intelligence Agency. 23 January 2007. 28 January 2007.
  2. నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (4 November 2018). "జీవిక-జీవితం!". మామిడి హరికృష్ణ. the original నుండి 6 July 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2019.
పాలస్తీనా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు

https://web.archive.org/web/20141111035239/http://www.palestinecabinet.gov.ps/

ఇవీ చూడండి

[మార్చు]