పాలాసియో డి సాల్
Coordinates: 20°19′50.48″S 67°2′48.81″W / 20.3306889°S 67.0468917°W
పాలాసియో డి సాల్ (స్పానిష్ భాషలో "పాలెస్ ఆఫ్ సాల్ట్) అనే హోటల్ ఉప్పు దిమ్మలతో కట్టబడినది. ఇది ప్రపంచం లో అతి పెద్ద ఉప్పు క్షేత్రం అయిన సలార్ డి ఉయుని వద్ద కలదు. ఇది 10582 చ.కి.మీ. వైశాల్యం గలది[1]. ఇది బొలీవియా దేశ ముఖ్య పట్టణం "లా పాజ్"కు దక్షిణంగా 350 కి.మీ. దూరంలో ఉంది. ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ప్రాంతం సలార్ డి ఉయుమి[2]. ఇది బొలీవియా వాయువ్య ప్రాంతంలో పొటోసి మరియు ఓరుడి సంస్థ వద్ద ఉంది. ఇది "ఆండీస్" పర్వత శిఖరం నుండి 3656 మీ. ఎత్తులో గలదు. ఈ హోటల్ ఒక పర్యాటక ప్రదేశం. ఇది ఎందరోపర్యాటకులను ఆకర్షించే హోటల్. అనేక ప్రాంతములనుండి ఈ హోటల్ లో విశ్రాంతి కోసం అనేక మంది వస్తుంటారు.
హోటల్ నిర్మాణం[మార్చు]
బొలివియా దేశంలోని ఉయుని పట్టణం దగ్గర ఈ 'లవణ మందిరం' ఉంది. విశాలమైన 12 గదులు, మంచాలు, కుర్చీలు, ఇతర వస్తుసామగ్రి మొత్తాన్ని ఉప్పుతోనే చేశారు. దీని పేరు 'పాలాసియో డి సాల్'. అంటే స్పానిష్ భాషలో ఉప్పు ప్యాలెస్ అని అర్థం. దీని నిర్మాణానికి 15 అంగుళాల ఉప్పు ఘనాలను ఏకంగా 10 లక్షలు తయారు చేసి వాటితో కట్టారు. ఇందులో అలంకరణ కోసం పెట్టిన శిల్పాలు, కళాఖండాలు కూడా ఉప్పుతో మలిచినవే. ఇందులోని ఈతకొలనులో ఉప్పు నీరే ఉంటుంది. హోటల్ బయట గోల్ఫ్ కోర్స్ కూడా ఉప్పు మయమే.
అసలు దీన్నెందుకు కట్టారంటే ఆ ప్రాంతం గురించి చెప్పుకోవాలి. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉండే అక్కడి ప్రదేశమంతా ఎటుచూసినా ఉప్పే. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉప్పు క్షేత్రం. దీని మొత్తం విస్తీర్ణం 10,582 చదరపు కిలోమీటర్లు. అంటే హైదరాబాద్ నగరానికి 20 రెట్లు పెద్దదన్నమాట! కనుచూపుమేర ఎటుచూసినా అంతులేని ఉప్పు మేటలతో, ఉప్పు ఎడారిలా ఉంటుంది. దీన్ని చూడ్డానికి నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. వాళ్ల వసతి కోసమే ఈ ఉప్పు హోటల్‌ను కట్టారు.
దీన్ని నిజానికి 1993-1995 ల మధ్య కట్టినా రెండేళ్లలోనే మూసివేశారు[3][4]. తిరిగి 2007లో సకల సౌకర్యాలతో నిర్మించారు. ఉప్పు దిమ్మలతో కూడిన ఈ హోటల్ పర్యాటక కేంద్రంగా మారినది[5][6]. ఇక్కడకు వచ్చే పర్యాటకులు గోడల్ని నాకకుండా సిబ్బంది పరిశీలిస్తూ ఉంటారు[3][4][5][7]. ఈ హోటల్ లో 12 కామన్ బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఒక కామన్ బాత్ రూమ్ ఉంది. కానీ అందులో షవర్ లేదు[5]. ఈ ప్రాంతం ఎడారికి మధ్యలో గల ప్రాంతం కనుక ఇచట అనేక శానిటారీ సమస్యలు తలెత్తి అధిక వ్యర్థ పదార్థాలు మనుష్యులే బాగుచేయవలసి యున్నది. అనేక పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నందున ఈ హోటల్ ను 2002 లో నిర్మూలించారు[8][9]. కానీ 2007 లో ఈ హోటల్ ను "పాలాసియో డి సాల్" పేరుతో క్రొత్త ప్రదేశంలో అనగా "సాలర్ డి ఉయుమి"కి తూర్పుగా 25 కి.మీ. దూరంలో పునర్నిర్మించారు[7][6]. ఈ క్రొత్త ప్రదేశం బొలీవియా రాజధాని నగరమైన లా పాజ్కు దక్షిణంగా 350 కి.మీ. దూరంలో గలదు.
ఈ భవన నిర్మాణానికి 35 సెం.మీ. (14 అంగుళాలు) గల ఉప్పు దిమ్మలు ఒక పది లక్షలు వాడబడినవి. వీటిని గదులలో నేలకు, గోడలకు, సీలింగ్ కు, ఫర్నిచర్ (బెడ్స్, టేబుల్స్, కుర్చీలు) మరియు శిల్పాల నిర్మాణానికి ఉపయోగించారు[9]. ఈ హోటల్ లో శానిటరీ వ్యవస్థను ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నిర్మించటం జరిగినది[3] . ఈ హోటల్ లో డ్రై సౌనా మరియు ఆవిరి గది, ఉప్పు నీటి కొలను మరియు విర్ల్‌పూల్ బాత్ లు కలవు[10].
చిత్ర మాలిక[మార్చు]
Wall details | Dining area |
ఇవి కూడా చూడండి[మార్చు]
సూచికలు[మార్చు]
- ↑ "Uyuni Salt Flat". Encyclopædia Britannica. Retrieved 2007-12-01. Cite web requires
|website=
(help) - ↑ "Salar de Uyuni, Bolivia". NASA Earth Observatory. Retrieved 2007-12-01. Cite web requires
|website=
(help) - ↑ 3.0 3.1 3.2 Bolivian "Hotel Truly Is the Salt of the Earth" Check
|url=
value (help). January 27, 2009. Cite web requires|website=
(help) - ↑ 4.0 4.1 "Don't Lick the Walls of the Salt Hotel". 19 May 2009. Cite web requires
|website=
(help) - ↑ 5.0 5.1 5.2 Peter McFarrren, The Associated Press (March 4, 1999). "Salt hotel has a rule: No licking". Cite web requires
|website=
(help) - ↑ 6.0 6.1 Ben Box, Robert Kunstaetter, Daisy Kunstaetter, Geoffrey Groesbeck (2007). Peru, Bolivia & Ecuador. Footprint Travel Guides. p. 378. ISBN 1-906098-06-9.CS1 maint: multiple names: authors list (link)
- ↑ 7.0 7.1 "Photo in the News: New Salt Hotel Built in Bolivia". National Geographic. July 25, 2007. Retrieved 2009-09-01. Cite web requires
|website=
(help) - ↑ Harry Adès (2004). The Rough Guide to South America. Rough Guides. p. 259. ISBN 1-85828-907-6.
- ↑ 9.0 9.1 "Palacio del Sal" (German లో). Cite web requires
|website=
(help)CS1 maint: unrecognized language (link) - ↑ "Homepage of Palacio de Sal" (Spanish లో). Cite web requires
|website=
(help)CS1 maint: unrecognized language (link)