పాలి ఎథిలీన్

వికీపీడియా నుండి
(పాలిథిలిన్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పాలీథిలిన్ నుండి తయారైన ఒక సంచి
స్పేస్ ఫిల్లింగ్ మోడల్ అఫ్ పాలీథిలిన్ ఛైన్
పాలీథిలిన్ యొక్క స్టీరియో కెమిస్ట్రిని చూపుతున్న ఒక రిపీటింగ్ యూనిట్
రిపీటింగ్ యూనిట్ ను చూపించే సులభ పద్ధతిసూచన :ఈ బొమ్మలో చూపబడుతున్న C-H బంధపు కోణం 90 డిగ్రీలు కాదు. కాని సుమారుగా 110 డిగ్రీలు. ఎందుకంటే ప్రతి కార్బన్ అనువు ఒక టెట్రహేద్రల్ (sp3)

పాలిథిలిన్ లేదా పాలిథిన్ (UPAC పేరు పాలిథిన్ లేదా పాలిథిలిన్ ) అనేది విరివిగా ఉపయోగింపబడుతున్న ప్లాస్టిక్, సరాసరి సంవత్సరానికి 80 మెట్రిక్ టన్నుల[1] దాకా ఉత్పత్తి చేయబడుతుంది. దీని ప్రాథమిక ఉపయోగం ప్యాకేజింగ్ వరకు పరిమితం (ముఖ్యంగా ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్)

వివరణ[మార్చు]

పాలిథిలిన్ అనేది అతి పెద్ద గోలుసు కలయికలు గల మొనోమార్ ఇథాలిన్ (IUPAC నామం ఇతేన్) థెర్మోప్లాస్టిక్ పాలిమర్. పాలిథిలిన్ అనే ప్రతిపాదిత శాస్త్రీయ నామము ఒక క్రమ పద్ధతిలో మోనోమర్[2][3] సాంకేతిక నామము నుండి పొందినది. కొన్ని పరిస్థితుల్లో ఇది ఒక నిర్మాణ ఆధారిత పేర్ల జాబితాలో ఉపయోగపడుతుంది. అలాంటి సందర్భాలలో IUPAC పాలి(మేతైలిన్) [3]ను ప్రతిపాదిస్తుంది. (పాలి (మితానిడిల్) అనేది నిరుపయోగమైన ప్రత్యామ్నాయము) [4][5] పేర్లలో వ్యత్యాసానికి కారణం మొనోమార్ పాలిమరైజేషన్ మీద ద్విబంధాన్ని ప్రారంభించడమే .

దీని పేరు క్లుప్తంగా PE అని కుదించబడింది. తద్వారా ఈ పేరుకు దగ్గరగా ఉండే పాలిప్రిపలేన్ మరియు పాలిస్టిరేన్ లాంటి పేర్లు PP మరియు PSగా కుదించబడింది. యునైటెడ్ కింగ్డం లో పాలిమర్ అనేది సాధారణంగా పాలిథిన్ గా పిలువబడుతుంది. కానీ ఈ పేరు శాస్త్రీయంగా గుర్తింపు పొందలేదు.

ఇథీన్ పరమాణువు (విశ్వ వ్యాప్తంగా పిలువబడే సాధారణ నామం ఇథిలీన్) C2H4 అనేది CH2=CH2. రెండు CH2 గ్రూపులు ఒక ద్విబంధంతో ఇలా కలుపబడినవి.

Ethylene.svg         Ethylene-3D-vdW.png

పాలిథిలిన్ లో రసాయన మూలకాలైన కర్బనము మరియు హైడ్రోజెన్ ఉంటాయి.

ఇతేన్ ను పాలిమరైజేషణ్ చేయడం ద్వారా పాలీ-ఇథిలీన్ తయారవుతుంది. రాడికల్ పాలిమరైజేషణ్, అనియానిక్ అడిషినల్ పాలిమరైజేషన్ అయాన్ కోఆర్డినేషన్ పాలిమరైజేషన్ లేదా క్యాటియానిక్ ఆడిషన్ పాలిమరైజేషన్ ద్వారా కూడా దీనిని తయారు చేయవచ్చు. ఎందుకంటే పాలిమర్ ఆధిక్య స్థిరత్వాన్ని ప్రభావితం చేసే ఎథెన్ కు ఏవిధమైన ప్రత్యామ్నాయ గ్రూపులు లేవు. ఈ పద్ధతుల్లో ప్రతి ఒక్కటి విభిన్నమైన పాలిథిలిన్ రూపొందుటకు దారి తీస్తుంది.

వర్గీకరణ[మార్చు]

పాలిథిలిన్ అనేది, దాని సాంద్రత మరియు విభాగాలను అనుసరించి పలు రకాలైన, విభిన్నమైన వర్గాలుగా విజించబడింది. PE యొక్క యాంత్రిక లక్షణాలు వివిధ కారకాల పై ఆధారపడి ఉంటాయి .విభాగపు విష్తరణ మరియు రకము, పారదర్శక నిర్మాణము, మరియు పరమాణు బరువు అనేవి ఈ కార్కాలలో కొన్ని. అమ్మకాల పరిమాణ పరంగా చూస్తే, HDPE, LLDPE, మరియు LDPE అనేవి ప్రముఖ పాలిథిలిన్ రకాలు.

 • అల్ట్రా హై మాలిక్యులార్ వెయిట్ పాలిథిలిన్ (UHMWPE)
 • అల్ట్రాలో మాలిక్యూలర్ వెయిట్ పాలిథ్లీన్ (ULMWPE లేదా PE - WAX)
 • హై మాలిక్యులార్ వెయిట్ పాలిథిలిన్ (HMWPE)
 • హై డెన్సిటీ పాలిథిలిన్ (HDPE)
 • హై డెన్సిటీ క్రాస్ లింక్డ్ పాలిథిలిన్ (HDXLPE)
 • క్రాస్ లింక్డ్ పాలిథిలిన్ (PEX లేదా XLPE)
 • మీడియం డెన్సిటీ పాలిథిలిన్ (MDPE)
 • లినియర్ లో డెన్సిటీ పాలిథిలిన్ (LLDPE)
 • లో డెన్సిటీ పాలిథిలిన్ (LDPE )
 • వెరీలో డెన్సిటీ పాలిథిలిన్ (VLDPE)

UHMWPE అనేది మిలియన్ల సంఖ్యలో గల పరమాణు బరువు కలిగిన పాలిథిలిన్. ఈ పరమాణువుల సంఖ్య సాధారణంగా 3.1 మిలియన్ల నుండి 5.67 మిలియన్ల వరకు ఉంటుంది. అత్యధిక పరమాణు బరువు ఉండుట వలన దృఢమైన సామగ్రి తయారవుతుంది. కానీ పారదర్శక నిర్మాణంలో తక్కువ సామర్ధ్యం కలిగిన గొలుసుల అమరికకు దారి తీస్తుంది. ఈ పరిస్థితి ఎక్కువ సాంద్రత గల పాలిథిలిన్ లో కన్నా తక్కువ సాంద్రతల్లో కనిపిస్తుంటుంది. (ఉదాహరణకు 0.930 -0.935 g/cm3) జైగ్లార్ ఉత్ప్రేరకాలు సర్వ సాధారణమైనవి అయినా కూడా UHMWPE అనేది, ఏ విధమైన ఉత్ప్రేరక సాంకేతికత ద్వారా తయారు చేయవచ్చు. దీనికి గల సాటి లేని శక్తీ, అమరిక, అరుగుదల మరియు అత్యధిక రసాయనాలకు నిలదొక్కుకొనే శక్తీ గల కారణాల దృష్ట్యా, UHMWPE వివిధ రకాల, వివిధ శ్రేణుల్లో ఉపయోగించబడుతుంది. క్యాన్లు మరియు బాటిళ్ళు తయారి మిషన్ల విడి భాగాలు, నెట్ యంత్రాల పై గల కదిలే విడి భాగాలు, బీరింగులు, గీర్లు, కృత్రిమ కీళ్ళు, ఇసు రింకులలో అంచుల రక్షణకు, వద్య శాలలలో ఉపయోగించే బోర్డులు మొదలగునవి ఈ కోవకు చెందుతాయి. బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు అయిన 'అరామిడ్' తో ఇవి పోటీ పడడమే గాక పేరొందిన బ్రాండులైన స్పెక్ట్ర మరియు దైనీమాలతో సమానంగా పోటీ పడుతాయి. అంతే గాక కీళ్ళ బదులు అమర్చే విడి భాగాలు, తుంటి మరియు కీళ్ళకు బదులుగా వాడీ విడి భాగాలలో ఉపయోగించబడును.

HDPE 0.941 g/cm3కి సమానం లేదా ఎక్కువ సాంద్రత గలదిగా నిర్వచించబడింది. HDPE తక్కువ మోతాదు విభాజీకరణ ఉండుట వలన బలమైన అంతర పరమాణు శక్తులు మరియు దృఢమైన శక్తి కలిగి ఉంటుంది. క్రోమియం/సిలికాల ఉత్ప్రేరకములు, జైగ్లేర్-నాట్టా ఉత్ప్రేరకములు లేదా మేటలోసిన్ ఉత్ప్రేరకాలను ఉపయోగించి HDPEని ఉత్పత్తి చేయవచ్చు. విభజీకరణ లేకపోవడం అనేది అనువైన ఉత్రేరకపు ఎంపిక అనుసరించి మరియు ప్రతిచర్యా పరిస్థితుల అనుసరించి ఉంటుంది. (ఉదాహరణకు క్రోమియం ఉత్ప్రేరకాలు లేదా జైగ్లార్ నట్టా ఉత్ప్రేకాలు) పాల జగ్గులు, సబ్బులు, సీసాలు, వారపత్రికల తోట్టెలు, చెత్త బుట్టలు, మరియు నీటి గొట్తములు, మొదలగు వాటి తయారీ మరియు ప్యాకేజింగులకు HDPE ఉపయోగించబడును. ఆట బొమ్మల తయారీలో మూడింట ఒక భాగం HDPE ఉపయోగించబడుతుంది. 2007 సంవత్సరంలో HDPE ఉపయోగం 30 మిలియన్ల టన్నుల[6] పరిమాణానికి చేరుకున్నది.

PEX అనేది మధ్యస్థ నుండి అత్యధిక సాంద్రత గల పాలిథిలిన్. ఇందులో మెలిక గొలుసు బంధాలు కలిగి ఉంటాయి. దీనిని పాలిమర్ నిర్మాణాలు, తెర్మోప్లాస్ట్ను ఎలాస్తో మీటర్ గా మార్పు చేసే ప్రక్రియలో ఉపయోగిస్తారు. అత్యధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే లక్షణాలు గల పాలిమర్ నాణ్యవంతం చేయబడుటే గాక, దాని ప్రవాహాన్ని తగ్గించి, రసాయనాల ధాటి తట్టుకునే శక్తీ పెంపొందించబడింది. PEXను సులభంగా కదిలించుకోగల నీటి ప్లంబింగ్ విధానాలలో ఉపయోగిస్తున్నారు.ఎందుకంటే PEXతో తయారైన గొట్టాలను లోహపు నిప్పల్ పై అనువైన రీతిలో మలుచుకొని అమర్చుకోవచ్చు. తద్వారా అది సాధారణ ఆకృతికి చేరుకొని శాశ్వతంగా, బిగుతైన నీటి కనెక్షనుకు దోహదం చేస్తుంది.

MDPE అనేది 0.926 నుండి 0.940 g/cm3 సాంద్రత కలదిగా నిర్వచించుకోవచ్చు. MDPEని క్రోమియం/సిలికాల ఉత్ప్రేరకాలతోను, జైగ్లార్-నట్టా ఉత్ప్రేరకాలు లేదా మేటలోసిన్ ఉత్ప్రేరాకాలతో తయారు చేయవచ్చు. MDPE విద్యుత్ ఘాతాల ఆటు పోట్లను తట్టుకోగల లక్షణాలు కలది. HDPE కన్నా MDPE తక్కువ పీల్చుకునే స్వభావం కలది. పగుళ్ళ తాకిడికి HDPE కన్నా తట్టుకోగల శక్తీ ఎక్కువగా కలది. MDPE ప్రత్యీకంగా గ్యాస్ గొట్టాలు మరియు ఫిట్టింగులు, గోతాలు, కుదింపు ఫిల్ములలోను, ప్యాకేజింగ్ ఫిల్ములలోను, కెమేరా సంచులు మరియు స్క్రూ మూతలలో ఉపయోగించబడును.

LLDPE అనేది 0 .915 - 0 .925 g/cm3 సాంద్రతా శ్రేణిలో కలదిగా నిర్వచించబడింది. LLDPE అనేది గణనీయమైన సంఖ్యలో, చిన్న విభాగాలు గల విస్తృతమైన పలుచని పాలిమర్. చిన్న గోలుసు కలయికల ఆల్ఫా- ఒలేఫిన్స్ తో కూడిన ఇథాలిన్ ను, కో-పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా సాధారణంగా ఇది తయారు చేయబడుతుంది. (ఉదాహరణకు 1 - బ్యూటేన్,1 - హేక్సేన్, మరియు 1 -అక్తెన్.) LDPE కన్నా LLDPEకి మనకు అనుగుణంగా మలుచుకోగల శక్తి కలది. ఈ శక్తిని అధికంగా వెలిబుచ్చుటే గాక గుచ్చుకునే పరిస్థితిని తట్టుకునే శక్తి LDPE కన్నా ఎక్కువగా కలది. తక్కువ మందం గల (గేజి ) ఫిల్ములు పగిలి పోవచ్చు. LDPEతో పోలిస్తే మెరుగైన పరిస్థితినే మరియు నిర్వహణలో సులభంగాను ఉంటుంది. LLDPE ముఖ్యంగా ఫిలిం సంచులు మరియు షీటుల తయారీలో ఉపయోగించబడుతుంది. LDPEతో పోలిస్తే తక్కువ మందంలో LLDPE ఉపయోగించి, కేబుల్ కవరింగులు, బొమ్మలు, మూతలు, బక్కెట్లు, కంటైనర్లు మరియు గొట్టాలు తయారు చేయబడుతాయి. ప్రత్యామ్నాయాలు లభిస్తున్నా కూడా, LLDPE ఫిల్ముల తయారీలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నది. గట్టిదనము, మృదు స్వభావము మరియు పారదర్శకత కలిగి ఉండుటయే ఇందుకు ప్రధాన కారణము. వ్యవసాయ ఫిల్ములు, సరన్ ర్యాప్, బబుల్ ర్యాప్, మల్టీ లేయర్లు మరియు కాంపోజిట్ ఫిల్ముల ఉత్పత్తులను ఉదాహరణాల శ్రీణిగా చెప్పుకోవచ్చు. 2009 సంవత్సరపు ప్రపంచ మార్కెట్ లో LLDPE వినియోగపు పరిమాణం దాదాపు 24 బిలియన్ల US డాలర్లకు (17 బిలియన్ల యూరో) [7] చేరుకున్నది.

LDPE అనేది 0.910 నుండి 0.940 g/cm3 సాంద్రతా శ్రేణి కలదిగా నిర్వచించబడింది. LDPE అత్యధిక డిగ్రీలలో తక్కువ మరియు ఎక్కువ గొలుసు విభాగాలు గలది.అంటీ ఈ గొలుసు కలయికలు పారదర్శక నిర్మాణాలలో కూడా చేరి ఉండదు. కాబట్టి దీనికి తక్కువ శక్తి గల అంతర్గత పరమాణు బంధాలు ఉండుట మూలాన, రెండు పశ్ర్మాను బంధాల శక్తి, ప్రేరేపిత శక్తి తక్కువగా ఉంటుంది. తద్వారా తట్టుకునే సామర్ధ్యము మరియు అతి పలుచగా తయారయ్యే సామర్ధ్యం పెరుగుదలకు దారి తీస్తుంది. LDPE ఫ్రీ ర్యాడికల్ పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించబడింది. అత్యధిక విభాగాల మయమై, పెద్ద గొలుసు కలయికల మూలాన, కరిగిన LDPE సరైన మరియు కావలసిన రీతిలో మలుచుకోగల లక్షణాలు కలిగి ఉంటుంది. దృఢమైన కంటైనరలు మరియు ప్లాస్టిక్ ఫిల్ముల తయారిలోనే గాక ప్లాస్టిక్ బ్యాగులు మరియు ఫిలిం ర్యాప్ తయారీలో LDPE విరివిగా ఉపయోగించబడును. 2009లో విశ్వ వ్యాప్తంగా LDPE 22.2 బిలియన్ US డాలర్ల (15.9 బిలియన్ యూరో) [8] పరిమాణానికి చేరుకుంది.

VLDPE అంటే 0.880 నుండి 0.915 g /cm3 సాంద్రతా శ్రేణి కలదిగా నిర్వచించబడింది. VLDPE అనేది విస్తృతమైన అత్యధిక మోతాదులలో తక్కువ మెలికల విభాగాలుగల పలుచని పాలిమర్. సాధారణంగా తక్కువ మెలికల ఆల్ఫా ఒలేఫిన్లతో కూడిన ఇథిలీన్ కోపాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా తయారు చేయబడుతుంది. (ఉదాహరణకు 1-బ్యూటేన్, 1 -హేక్సేన్ మరియు 1-అక్తెన్) VLDPEని సాధారణంగా మేటల్లోసిన్ ఉత్ప్రేరకాలను ఉపయోగించి తయారు చేయబడుతుంది. ఇందుకు కారణం ఉత్ప్రేరకాలు కో-మొనోమార్ ఇన్కార్పొరేషన్ ను వెలుపలికి పంపడమే. VLDPE లు నాడాలు మరియు గొట్టాల తయారి, ఇస్ మరియు ఘనీకృత ఆహారపు సంచులు, ఫుడ్ ప్యాకేజింగ్ మరియు పరిచే ఫిలిం పేపరు మరియు ఇతర పాలిమర్లతో కలిపినప్పుడు చర్యను ద్విగుణీకృతం చేసేందుకు ఉపయోగించబడుతుంది.

పాలిథిలిన్ లో గల పొడవైన గొలుసు కలయికల విభాగాల స్వభావము మరియు పంపిణీల పరంగా, ఇటీవల ఎంతో పరిశోధనా ప్రక్రియ పట్ల దృష్టి సారించడం జరిగింది. HDPEలో ఒక మోస్తరుగా తక్కువ సంఖ్యలో గల ఈ విభాగాలు, అంటే ఒక బ్యాక్ బొన్ కార్బన్ లో సుమారుగా 100 ఒకటి లేదా 1000లో ఒకటి, పాలిమర్ యొక్క పారంపర్య లక్షణాల పై గణనీయంగా ప్రభావం చూపుతుంది.

ఇథిలీన్ కో పాలిమర్స్[మార్చు]

ఆల్ఫా ఒలేఫిన్ల కో-పాలిమరైజేషన్ తో పాటు, విస్తృతమైన శ్రేణిలో ఇతర పరమాణువులు మరియు అయాన్ల సమ్మేళనంతో కలిపి కో పాలిమరైజేషన్ చేయవచ్చు. ఇందుకు సాధారణ ఉదాహరణ వినైల్ అసిటేట్ (తయారయ్యే ఉత్పాత్తి ఏమిటంటే ఇథిలీన్ వినైల్ అసిటేట్ లేదా EVA. ఇది క్రీడాకారులు ధరించే బూట్ల తోళ్ళు తయారీలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నది) మరియు ఒక విధమైన అక్రిలేట్లను (ప్యాకేజింగ్ మరియు క్రీడా వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు) చెప్పుకోవచ్చు.

చరిత్ర[మార్చు]

పాలిమిథిలిన్ మొట్టమొదటిసారిగా జర్మనీకి చెందిన రసాయనికవేత్త హ్యన్స్ వాన్ పెచ్మన్ చే తయారుచేయబడింది. దయజోమితేన్ ను 1898లో వేడి చేస్తుండగా ప్రమాదవశాత్తు పాలిథిలిన్ ను కనుగొనడమైనది. అతని సహోద్యోగులైన యుజన్ బామ్బెర్జార్ మరియు ఫ్రెద్రిచ్ టిస్చిమేర్ లు ఒక విధమైన తెల్లని మైనం లాంటి పదార్థం ఈ ప్రక్రియలో రూపొందడం గుర్తించారు. అంతే గాక ఈ పదార్థంలో పొడవైన CH2 గొలుసు కలయికలు కలిగి యుండుట గుర్తించడమే గాక దీనిని పాలిమిథిలిన్ అని పేర్కొన్నారు.

పారిశ్రామికంగా మొట్టమొదట అసలైన పాలిథిలిన్ తయారీ ప్రక్రియ 1933లో (మళ్లీ ప్రమాదవశాత్తు) ఎరిక్ ఫేసేట్ మరియు రేజినాల్ద్ గిబ్సన్ అనే వారిచే నార్త్-విచ్, ఇంగ్లాండు[9]లో ICI పనులు జరుగుతున్నపుడు కనుగొనబడింది. ఇథిలీన్ మరియు బెంజాల్డిహైడ్ మిశ్రమాల పై అత్యధిక ఒత్తిడిని ఎన్నో వందల రెట్లు) కలిగించుట ద్వారా ఒక తెల్లని మైనం లాంటి పదార్ధాన్ని ఉత్పత్తి చేశారు. ఈ ప్రతిచర్య తమ పరికరాల్లో చేరి ఉన్న ప్రాణ వాయువు, కలుషితం కావడం వలన, ఈ ప్రయోగం మొట్టమొదటి సారిగా, తిరిగి చేయడం కష్టతరం అయినది. 1935లో మరొక ICI రసాయనవేత్త మైఖేల్ పేరిన్ అనే అతను ఈ ప్రమాదాన్ని పెంపొందించి, తద్వారా పాలిథిలిన్ కోసం అత్యధిక ఒత్తిడిని పునరుత్పత్తి చేయగలిగాడు. ఇదే పారిశ్రామిక LDPE ఆవిర్భావానికి 1839 నాంది అయినది.

ఆ తర్వాత పాలిథిలిన్ ప్రక్రియ ఎన్నో మలుపులు తిరిగి, మరెంతో అభివృద్ధి చెంది, ఎన్నో రకాల ఉత్ప్రేరకాలను రూపొందింపబడి తద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతలు మరియు ఒత్తిడులలో పాలిమరైజేషన్ ను వేగవంతం చేయడం జరిగింది. వీటిలో క్రోమియం త్రయాక్సైడ్ ఆధారిత ఉత్ప్రేరకం మొట్టమొదటిసారిగా 1951లో, ఫిలిప్స్ పెట్రోలియం నందు, రాబర్ట్ బ్యాంక్స్ మరియు పాల్ హొగన్ లచే కనుగొనబడింది. 1953లో జర్మనీకి చెందిన రసాయనవేత్త కార్ల్ జైగ్లార్ టైటానియం హాలిడేస్ మరియు ఆర్గానో-అల్యుమినియమ్ సమ్మేళనం ఆధారంగా, ఒక కొత్త ఉత్ప్రేరక విధానాన్ని కనుగొన్నాడు. ఇది ఫిలిప్స్ ఉత్ప్రేరకం కన్నా సరళమైన పరిస్థితుల్లో కూడా రూపొందింప వీలవుతుంది. ఫిలిప్స్ ఉత్ప్రేరకం తక్కువ ఖర్చుతో కూడినది మరియు పనిచేయడం ఎంతో తేలిక, కానీ పారిశ్రామిక ఉత్పత్తిపరంగా రెండు పద్ధతులు ఆచరింపబడుతున్నవి.

1950 సంవత్సరాంతానికి ఫిలిప్స్ మరియు జైగ్లార్ విధానాలు రెండూ HDPE ఉత్పత్తిలో ఉపయోగించబడుతున్నవి. ఒకే విధమైన నాణ్యత గల HDPE ఉత్పాదనల ఉత్పత్తి చేయడంలో, ప్రాథమికంగా ఫిలిప్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుచే నిర్ణయాత్మకం కాని ప్లాస్తిక్కులతో గిడ్డంగులను నింపివేసాడు. కానీ 1957లో తనకు ఎదురైన ఆర్థిక పోటును అనుకోకుండా నివారించగలిగాడు. అప్పట్లో చుట్టూతా పొలిథిలిన్ గొట్టంతో కూడిన హుల-హోప్ అనే బొమ్మ పట్ల యునైటెడ్ స్టేట్స్ లోని యువత వెర్రి వ్యామోహం చూపడం ఇందుకు కారణం.

మూడో రకమైన ఉత్ప్రేరక విధానాన్ని, మెటాలోసిన్స్ ఆధారంగా 1976లో జర్మనీకి చెందిన వాల్టర్ కమిన్స్కి మరియు హన్సజారగ్ సీన్ అనే వారు కనుగొన్నారు. జాగ్లార్ మరియు మేటలోసిన్ ఉత్ప్రేరక కుటుంబాలు రెండూ, ఇతర ఒలేఫిన్స్ తో చేర్చి ఎతిలిన్ ను కో-పాలిమారైజేషన్ చేయడానికి ఎంతో అనువైనవి. అంతే గాక అతి తక్కువ సాంద్రత గల పాలిఇతిలిన్ మరియు పలుచని తక్కువ సాంద్రత గల పాలిఇతిలిన్లతో సహా, నేడు విరివిగా, అధిక శ్రేణిలో లభ్యమవుతున్న పాలిథిలిన్ రేసిన్లకు ఇది మూలము. ఈ విధమైన రేసిన్లు, దైనీమ లాంటి ఫైబరు రూపంలో అత్యధిక శక్తివంతమైన ప్రక్రియల ఉపయోగాల్లో చోటు చేసుకుని, 2005 నుండి అరమిడ్స్ స్థానాన్ని ఆక్రమించడం ప్రారంభమైనది.

ఇటీవలి వరకు మేటలోసిన్లు ఇథిలీన్ పాలిమారైజేషన్ ప్రక్రియలో సింగల్ సైట్ ప్రధాన ఉత్ప్రేరకాలుగా ప్రధాన పాత్ర వహిస్తూ, సరికొత్త ఉత్ప్రేరకాలైన జిర్కొనోసిన్ ద్రైక్లోరైడ్ తో ప్రత్యేక రీతిలో సరిపోల్చబడుతున్నది. మెట్లోసిన్స్ తో సమకూడే పాలిమర్ నిర్మాణాన్ని మలుచుకునే దానికన్నా, ఎక్కువ అనుకూలంగా ఉండే సింగల్ సైట్ (పోస్ట్ మేటలోసిన్ అని కూడా అంటారు) ఉత్ప్రేరకాలను రూపొందిచుటకు ప్రస్తుతం గట్టి ప్రయత్నం జరుగుతున్నది. ఇటీవల మిత్సుయి (ఇతరులలో) కు చెందిన ఫూజిత ప్రదర్శించిన గ్రూప్ 4 లోహాల యొక్క సలిసిలల్డిమిన్ సమ్మేళనాలు కొన్ని ప్రయోగాపరంగా చూస్తే మెటాలోసిన్స్ కన్నా గణనీయంగా మెరుగైన ప్రక్రియ చూపుతున్నట్లు తెలుస్తుంది.

భౌతిక లక్షణాలు[మార్చు]

స్పటిక సామర్ధ్యము మరియు పరమాణు బరువు, కరిగే స్థితి మరియు గాజు సామర్ధ్యములను గుర్తించవచ్చు లేదా గుర్తించ లేకపోవచ్చు. ఈ పరిస్థితిలో ఉండే ఉష్ణోగ్రతలు పాలిథిలిన్ రకాన్ని అనుసరించి బలంగా మారుతూ ఉండవచ్చు. సాధారణ వాణిజ్య పరమైన మధ్యస్థ మరియు అత్యధిక సాంద్రతల పాలిథిలిన్ ల కరిగే స్థితి సంక్లిష్టంగా ఉండే శ్రీణి (17) 120 to 130 °C (248 to 266 °F). సరాసరి, వాణిజ్య, మరియు తక్కువ సాంద్రత గల పాలిథిలిన్ యొక్క కరిగేడు స్థితి శ్రేణి సంక్లిష్టంగా (18) 105 to 115 °C (221 to 239 °F).

LDPE, MDPE, మరియు HDPE గ్రేడుల పాలిథిన్లన్నీ దాదాపు అత్యుత్తమంగా తట్టుకునే సామర్ధ్యం కలిగి ఉండుటయే గాక వీటికి గల స్పటిక సామర్ధ్యం వలన గది ఉష్ణోగ్రతలలో ఇవి కరిగి పోవు. పాలిథిలిన్లు అన్నీ (క్రాస్ లింక్డ్ పాలిథిలిన్ తప్ప) హెచ్చించబడిన ఉష్ణోగ్రతల్లో, టౌలేనే లేదా జైలేన్ లాంటి ఆరోమ్యటిక్ హైడ్రో కార్బన్లు, లేదా క్లోరినేటెడ్ సాల్వెంట్లైన ట్రైక్లోరోఇతేన్ లేదా ట్రైక్లోరోబెంజైన్ లలో కరిగిపోగలవు.

వ్యర్ధాల నిర్మూలన ప్రక్రియలో పాలిథిలిన్ నీలి రంగు జ్వాలల్లో పసుపు పచ్చని శిస్నంతో నెమ్మదిగా కాలుతూ ఒక విధమైన మైనపు వాసన వెదజల్లుతుంది. ఇది కాలుతున్నపుడు జ్వాలను తొలగిస్తే చుక్కలుగా రాలడాన్ని సూచిస్తుంది.[10]

పర్యావరణ సమస్యలు[మార్చు]

పాలిథిలిన్ రేసైక్లింగ్ చేయదగినది అయినా కూడా, దాదాపు వాణిజ్య పాలితిన్ల వ్యర్దాలన్నింటినీ వ్యర్ధంగా పారవేయడం మరియు గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ పేరున మహాసముద్రాలలో వదిలి వేయడం జరుగుతుంది. పాలిథిలిన్ ను జీవ వ్యర్ధంగా అంగీకరించబడదు. ఎందుకంటే సూర్యరశ్మి నుండి UVకి తోడు చేస్తే తప్ప, అది సమర్ధవంతంగా వ్యర్ధమై పోవడానికి[ఆధారం కోరబడింది] ఎన్నో శతాబ్దాలు పడుతుంది. 2008 సంవత్సరం మే నెలలో డేనియల్ బర్డ్ అనే 16 సంవత్సరాల వయస్సు గల కెనడా వాసి, ఒట్టావాలో జరిగిన కేనేడా వైడ్ సైన్సు ఫెయిర్ ను గెలుచుకున్నాడు. ప్లాస్టిక్ వ్యర్ధాలు కేవలం మూడు నెలల్లో దాదాపు 40% బరువును కోల్పోయేలా చేసే స్పింగోమోనాస్ అనే బ్యాక్తీరియాను కనుగొనడమే ఇతనికి గెలుపుకు కారణం. కానీ ఈ ప్రక్రియను ఆచరణయోగ్యం చేయడమెలా అనేది పరిశోధకులు ఇంకా కనుగోనవలసియున్నది.[11]

బయోపోలిథిలిన్[మార్చు]

చెరకు నుండి ఆకుపచ్చ రంగు గల పాలిథిలిన్ ను ఉత్పత్తి చేసి, సంయుక్తంగా అమ్మకపు కార్యకలాపాలు చేయుటకు బ్రాస్కేం మరియు టయోట ట్సుషో సంస్థలు శ్రీకారం చుట్టాయి. బ్రాస్కిం సంస్థ త్రియిన్ఫో, RS, బ్రెజిల్ లో గల తమ పారిశ్రామిక యూనిట్ లో ఒక సరికొత్త సౌకర్యం కల్పించి తద్వారా (23) 200,000 short tons (180,000,000 kg) సాలుసరి ఉత్పత్తి సామర్ధ్యం, చెరకు[12] నుండి తీసిన బయో ఇథనాల్ ను ఉపయోగించి అధిక సాంద్రత పాలిథిలిన్ (HDPE) మరియు అల్ప సాంద్రత పాలిథిలిన్ ఉత్పత్తి చేయ సంకల్పించింది.

ఆహారంగా ఉపయోగించే గోధుమ ధాన్యం మరియు బీట్ దుంప[13] ఉపయోగించి కూడా బయో లేదా రెన్యూవబుల్ పాలిథిలిన్ ను తయారు చేయవచ్చు.

జోడించుట[మార్చు]

జోడించడంలో సాధారణ పద్ధతులలో కూడినవి:[14]

 • హాట్ గ్యాస్ వెల్డింగ్
 • అల్త్రాసోనిక్ వెల్డింగ్
 • లేజర్ వెల్డింగ్
 • ఇంఫ్రార్డ్ వెల్డింగ్
 • ఫాస్టేనింగ్

జిగుర్లు మరియు సాల్వెంట్లు అరుదుగా ఉపయోగించబడతాయి. ఎందుకంటే పాలిథిలిన్లు నాన్ పోలార్ మరియు కరిగించుకునే వాటిలో కరగని శక్తి గలవి. ప్రెజర్ సెన్సిటివ్ అడేసివ్స్ (PSA) సాధ్యమే కాని వాటి ఉపరితలం ఫ్లేం ట్రీటెడ్ లేదా కరోనా ట్రీటెడ్ గా ఉండాలి. కానీ వీటి సంబంధిత బంధము బలహీనంగా ఉంటుంది. పాలిథిలిన్ల పై లేబుళ్ల నిమిత్తం ఉపయోగించేది సాధారణ జిగురు మాత్రమే. సాధారణంగా ఉపయోగించే జిగుర్లు ఇవే[14]:

 • టూ పార్ట్ పాలియురేతేన్ లేదా ఎపాక్సి అడహేసీవ్స్
 • వినైల్ అసితేట్ కోపాలిమార్ హాట్ మెల్ట్ అడహేసీవ్స్
 • డిస్పర్షన్ ఆఫ్ సాల్వెంట్ PSAs
 • పాలియురేతేన్ కాంటాక్ట్ అడహిసివ్స్

సూచనలు[మార్చు]

 1. Piringer & Baner 2008, p. 32.
 2. ఏ గైడ్ టు IUPAC నోమేన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, బ్లాక్వేల్ సైంటిఫిక్ పబ్లికేషన్స్,ఆక్స్ఫర్డ్(1993)
 3. 3.0 3.1 Kahovec, J.; Fox, R.B.; Hatada, K. (2002). "Nomenclature of regular single-strand organic polymers (IUPAC Recommendations 2002)". Pure and Applied Chemistry. 74: 1921. doi:10.1351/pac200274101921. 
 4. IUPAC ప్రోవిజినల్ రికమందేషన్స్ ఆన్ నోమేనక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కేమిస్త్రి బై H A ఫేవర్ అండ్ W H పొవెల్, సిర్కా 2005
 5. ఎ గైడ్ టు IUPAC నామేన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (రికమందేషన్స్ 1993) IUPAC కమిషన్ ఆన్ నోమేన్క్లేచార్ ఆఫ్ ఆర్గానిక్ కేమిస్త్రి, 1993 బ్లాక్ వెల్ సైంటిఫిక్
 6. "Market Study: Polyethylene HDPE". Ceresana Research.  External link in |publisher= (help)
 7. "Market Study: Polyethylene LLDPE". Ceresana Research.  External link in |publisher= (help)
 8. "Market Study: Polyethylene LDPE". Ceresana Research.  External link in |publisher= (help)
 9. "Winnington history in the making". This is Cheshire. Retrieved 2006-12-05. 
 10. http://www.boedeker.com/burntest.htm
 11. TheRecord.com - CanadaWorld - WCI student isolates microbe that lunches on plastic bags
 12. బ్రాస్కేం & టయోట త్సుస్హో అనే వారు చెరకు నుండి తయారైన ఆకు పచ్చ పాలితిలిన్ ను సంయుక్తం గా మార్కెటింగ్ కార్య కలాపాలు ప్రారంభిచారు.
 13. లైఫ్ సైకల్ అసేస్స్మెంట్ వర్క్ బుక్స్ ఫర్ సెలెక్షన్ అఫ్ మేజర్ రెన్యూవబుల్ కేమికెల్స్
 14. 14.0 14.1 Plastics Design Library, p. 326.

గ్రంథ పట్టిక[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

మూస:Plastics మూస:Fibers