పాల్ స్టిర్లింగ్
2013 లో స్టిర్లింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | పాల్ రాబర్ట్ స్టిర్లింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1990 సెప్టెంబరు 3 బెల్‌ఫాస్ట్, ఉత్తర ఐర్లాండ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 175 cm (5 ft 9 in) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | పై వరుస బ్యాటరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 9) | 2018 మే 11 - పాకిస్తాన్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2025 నవంబరు 19 - బంగ్లాదేశ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 28) | 2008 జూలై 1 - న్యూజీలాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2025 మే 25 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 1 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 16) | 2009 జూన్ 15 - పాకిస్తాన్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2025 డిసెంబరు 2 - బంగ్లాదేశ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| T20Iల్లో చొక్కా సంఖ్య. | 1 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2010–2019 | మిడిల్‌సెక్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2013 | సిల్హెట్ రాయల్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2018 | కాందహార్ నైట్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2019 | ఖుల్నా టైటన్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2020–present | నార్దర్న్ నైట్స్ క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2020 | నార్తాంప్టన్‌షైర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2020 | దంబుల్లా వైకింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2021–2023 | ఇస్లామాబాద్ యునైటెడ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2021 | మిడిల్‌సెక్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2021–2022 | సదరన్ బ్రేవ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2022–2023 | వార్విక్‌షైర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2022 | గయానా అమెజాన్ వారియర్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2023 | పార్ల్ రాయల్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2023 | ఓవల్ ఇన్విన్సిబుల్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2024 | లీసెస్టర్‌షైర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2025 డిసెంబరు 7 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాల్ రాబర్ట్ స్టిర్లింగ్ (జననం 1990 సెప్టెంబరు 3) ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఐరిష్ క్రికెటర్ . స్టిర్లింగ్ ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. అప్పుడప్పుడు కుడిచేతి ఆఫ్-బ్రేక్ బౌలింగు చేస్తాడు.. T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో టాప్ 10 పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడు.[1] 2018 మేలో పాకిస్థాన్‌తో జరిగిన ఐర్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆడిన పదకొండు మంది క్రికెటర్లలో అతను ఒకడు. 2020 జూన్లో ఐర్లాండ్ జట్టుకు వైస్-కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.[2] ఆండ్రూ బాల్‌బిర్నీ రాజీనామా చేసిన తర్వాత అతను T20I, వన్‌డే ఫార్మాట్‌లో ఐర్లాండ్ తాత్కాలిక కెప్టెన్‌గా పనిచేశాడు. 2023 అక్టోబరులో శాశ్వత పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.[3]
స్టిర్లింగ్ 2008 మార్చిలో ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో ఐర్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అదే సంవత్సరం, స్టిర్లింగ్ వన్డే ఇంటర్నేషనల్స్లో రంగప్రవేశం చేశాడు. మిడిల్‌సెక్స్ యూత్ జట్లకు, సెకండ్ XI కూ, స్టిర్లింగ్ 2009 డిసెంబరులో క్లబ్‌తో ఒప్పందంపై సంతకం చేశాడు. ఒక నెల తర్వాత అతనికి క్రికెట్ ఐర్లాండ్‌తో ఒప్పందం లభించింది. దీనితో అతను బోర్డుతో పూర్తి సమయం ఒప్పందం ఉన్న ఆరుగురు ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు. స్టిర్లింగ్ ట్వంటీ20 లో 2010 లో, లిస్ట్ ఎ ల్లో 2011లో మిడిల్‌సెక్స్ తరపున రంగప్రవేశం చేశాడు.
2018 డిసెంబరులో, క్రికెట్ ఐర్లాండ్ 2019 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన పంతొమ్మిది మంది ఆటగాళ్లలో స్టిర్లింగ్ ఒకడు.[4][5] 2019 జూలైలో, జింబాబ్వేతో జరిగిన రెండవ వన్‌డేలో అతను, వన్‌డేలలో 4,000 పరుగులు చేసిన మొదటి ఐర్లాండ్ బ్యాట్స్‌మన్ అయ్యాడు.[6] 2020 జనవరిలో, క్రికెట్ ఐర్లాండ్ నుండి సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన పంతొమ్మిది మంది ఆటగాళ్లలో అతను ఒకడు.[7] అన్ని కాంట్రాక్టులు పూర్తి-సమయ ప్రాతిపదికన ఇవ్వబడిన మొదటి సంవత్సరం అది.[8] 2021 ఆగస్టులో, జింబాబ్వేతో జరిగిన ఐర్లాండ్ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో స్టిర్లింగ్, ఐర్లాండ్ తరపున తన 300 వ మ్యాచ్ ఆడాడు.[9] 2022 జనవరిలో, COVID-19 కారణంగా ఆండ్రూ బాల్‌బిర్నీ మ్యాచ్‌కు దూరమైన తర్వాత, వెస్టిండీస్‌తో జరిగిన రెండవ మ్యాచ్‌లో స్టిర్లింగ్ తొలిసారిగా వన్‌డేలలో ఐర్లాండ్‌కు నాయకత్వం వహించాడు.[10] అదే మ్యాచ్‌లో, స్టిర్లింగ్ ఐర్లాండ్ తరపున వన్డేల్లో 5,000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా కూడా నిలిచాడు.[11]
తొలినాళ్లలో కెరీర్
[మార్చు]2009 జూలైలో, స్టిర్లింగ్ తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు. 2009–10 ICC ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో ఐర్లాండ్ తొలి మ్యాచ్‌లో, అతను జెరెమీ బ్రేతో కలిసి బ్యాటింగ్ ప్రారంభించి మొదటి ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేశాడు. [12] జనవరిలో న్యూజిలాండ్ ఆతిథ్యం ఇచ్చిన 2010 అండర్-19 ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఐర్లాండ్ జట్టులో స్టిర్లింగ్ సభ్యుడు. ఆ జట్టు ప్లేట్ ఛాంపియన్‌షిప్‌లో బంగ్లాదేశ్‌కు రన్నరప్‌గా నిలిచింది, మొత్తం 16 స్థానాల్లో పదవ స్థానంలో నిలిచింది. [13] ఐదు మ్యాచ్‌లలో 209 పరుగులతో స్టిర్లింగ్, ఆ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. [14]
2010 ఆగస్టులో స్టిర్లింగ్, "ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్", "అసోసియేట్ అండ్ అఫిలియేట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్" విభాగాలలో ICC అవార్డులకు నామినేట్ అయ్యాడు. "ఎమర్జింగ్ ప్లేయర్" విభాగంలో నామినేట్ అయిన ఏకైక అసోసియేట్ సభ్యుడు అతను. మిగిలిన 15 మందీ టెస్ట్ ఆడే దేశాల నుండి వచ్చిన ఆటగాళ్ళే. "అసోసియేట్, అఫిలియేట్" విభాగంలో ఐర్లాండ్‌కు అత్యధిక నామినీలు ఉన్నారు. స్టిర్లింగ్‌తో పాటు ట్రెంట్ జాన్‌స్టన్, కెవిన్ ఓ'బ్రియన్‌లు కూడా ఉన్నారు. ICC ప్రతినిధి రిచర్డ్ హోల్డ్స్‌వర్త్ మాట్లాడుతూ, "పాల్ స్టిర్లింగ్ రెండు వేర్వేరు విభాగాలలో నామినేట్ కావడం, పూర్తి సభ్యులలో కొంతమంది ప్రముఖ వర్ధమాన ఆటగాళ్లతో పాటు గుర్తింపు పొందడం చాలా అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను. ఇది అసోసియేట్ క్రికెట్ అభివృద్ధి ఎంతవరకు పురోగతి సాధించిందో రుజువు చేస్తుంది" అని అన్నారు.[15] అయితే, అతను రెండు విభాగాలలోనూ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేదు.[16]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2010 సెప్టెంబరు 7 న, కెనడాతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ లో స్టిర్లింగ్, 177 పరుగులు చేసి, తన తొలి లిస్ట్-ఎ సెంచరీని సాధించాడుడు. ఆ విధంగా అతను, ఐర్లాండ్ తరపున వన్డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించాడు.
2011 ప్రపంచ కప్ కోసం ఐర్లాండ్ 15 మంది సభ్యుల జట్టులో స్టిర్లింగ్ ఎంపికయ్యాడు. [17] ఐర్లాండ్ ఆరు మ్యాచ్‌లలో రెండింటిలో గెలిచింది, ఇది గ్రూప్ దశ దాటి ముందుకు సాగడానికి సరిపోలేదు. కానీ నెదర్లాండ్స్‌ను ఓడించడం ద్వారా అత్యున్నత స్థాయిలో ముగించింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై గెలవడానికి 307 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆ న్యాచ్‌లో స్టిర్లింగ్, జట్టు కెప్టెన్ విలియం పోర్టర్‌ఫీల్డ్‌తో కలిసి బ్యాటింగ్‌ను ప్రారంభించాడు. ఈ జంట 177 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకుంది. వన్డేల్లో ఐర్లాండ్ తొలి వికెట్ కు కొత్త రికార్డు సృష్టించింది. స్టిర్లింగ్ 101 పరుగుల వద్ద ఔటయ్యాడు, అతని సెంచరీ 70 బంతుల్లో వచ్చింది. ఇది ప్రపంచ కప్ చరిత్రలో నాల్గవ వేగవంతమైన సెంచరీగా నిలిచింది.[18]
ఐర్లాండ్ క్రికెటర్లు ఇంగ్లీష్ కౌంటీలలో రెగ్యులర్‌గా ఆడుతున్నప్పుడు, దేశం, క్లబ్ నుండి డిమాండ్లు కొన్నిసార్లు ఘర్షణకు దారితీశాయి. అయినప్పటికీ, మేలో పాకిస్తాన్‌తో జరిగిన ఐర్లాండ్ రెండు మ్యాచ్‌ల వన్‌డే సిరీస్‌లో స్టిర్లింగ్ ఆడాడు. ఐర్లాండ్ సిరీస్‌ను 2 – 0 తేడాతో ఓడిపోయింది, కానీ రెండవ మ్యాచ్‌లో స్టిర్లింగ్ ఒక టెస్ట్ దేశంపై తన మొదటి సెంచరీ సాధించాడు.[19] జట్టుపై స్టిర్లింగ్ ప్రభావం ఎంతగా ఉందంటే, ఆల్ రౌండ్ కెవిన్ ఓ'బ్రియన్‌తో పాటు, ఆగస్టులో 2011 ICC అవార్డులలో అసోసియేట్, అఫిలియేట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన ఇద్దరు ఐర్లాండ్ ఆటగాళ్లలో అతను ఒకడు.[20]
2012 జనవరిలో దుబాయ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడటానికి అసోసియేట్, అనుబంధ జట్ల నుండి కొంతమంది ఉత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టును ఏర్పాటు చేశారు. ఆ నెల చివర్లో పాకిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు ఇంగ్లాండ్ సన్నాహాల్లో భాగంగా ఈ మూడు రోజుల మ్యాచ్ జరిగింది. 12 మంది సభ్యుల జట్టులో చేర్చబడిన నలుగురు ఐర్లాండ్ ఆటగాళ్లలో స్టిర్లింగ్ ఒకడు.[21]
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో, రషీద్ ఖాన్‌తో కలిసి ఒకే వన్డే మ్యాచ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన మొదటి బౌలర్ల జతలో ఒకడిగా నిలిచాడు.[22]
2018 ఫిబ్రవరిలో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటుకు ముందు చూడవలసిన పది మంది ఆటగాళ్లలో స్టిర్లింగ్‌ను ఒకరిగా పేర్కొంది. [23]
2018 మేలో, అదే నెలలో పాకిస్తాన్‌తో జరిగిన ఐర్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ కోసం పద్నాలుగు మంది సభ్యుల జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు.[24][25] అతను 2018 మే 11న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ తరపున టెస్ట్ రంగప్రవేశం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతను 17 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో బౌండరీ సాధించిన మొదటి ఐరిష్ బ్యాట్స్‌మన్ అయ్యాడు.[26][27] 2019 జనవరిలో, భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ కోసం ఐర్లాండ్ జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు.[28][29]
2019 సెప్టెంబరులో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన 2019 ICC T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటు కోసం ఐర్లాండ్ జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు.[30] అతను ఎనిమిది మ్యాచ్‌లలో 291 పరుగులతో టోర్నమెంటులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[31][32]
2020 జూన్లో, అతను ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [33] 2020 జూలై 10న, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో జరిగే వన్‌డే సిరీస్ శిక్షణ కోసం ఇంగ్లాండ్ వెళ్ళే ఐర్లాండ్ 21 మంది సభ్యుల జట్టులో స్టిర్లింగ్ పేరు పెట్టారు. [34] [35] 2021 జనవరిలో, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఐర్లాండ్ సిరీస్‌లో, స్టిర్లింగ్ తన 12వ సెంచరీని సాధించాడు, ఇది వన్‌డేలలో ఐర్లాండ్ తరపున సాధించిన అత్యధిక సెంచరీల రికార్డు ఇది. [36] 2021 సెప్టెంబరులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఐర్లాండ్ తాత్కాలిక జట్టులో స్టిర్లింగ్ పేరు పెట్టారు.[37]
2023 ఏప్రిల్లో, శ్రీలంకతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ కోసం ఐర్లాండ్ జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు.[38] 2023 ఏప్రిల్ 25 న అతను, టెస్ట్ క్రికెట్‌లో తన తొలి సెంచరీ సాధించాడు.[39] మూడు అంతర్జాతీయ ఫార్మాట్‌లలోనూ సెంచరీ చేసిన రెండవ ఐరిష్ వ్యక్తి అయ్యాడు. [40] అతను మొదటి ఇన్నింగ్స్‌లో ఆండీ బాల్‌బిర్నీతో కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నమోదు చేశాడు. పరుగుల పరంగా ఐర్లాండ్ తరపున టెస్ట్‌లలో అత్యధిక భాగస్వామ్యం అది.[41]
2024 మేలో, అతను 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంటు కోసం ఐర్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [42]
2025 మే 21న క్లాంటార్ఫ్‌లోని కాజిల్ అవెన్యూలో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో వెస్టిండీస్‌పై 54 పరుగులు చేసి స్టిర్లింగ్, అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 10,000 అంతర్జాతీయ పరుగులు చేసిన మొదటి ఐరిష్ ఆటగాడిగా నిలిచాడు. అన్ని దేశాల ఆటగాళ్ళను కలుపుకుంటే అతడు ఈ ఘనత సాధించిన 95వ ఆటగాడు.[43]
ఫ్రాంచైజ్ కెరీర్
[మార్చు]2018 సెప్టెంబరులో, అతను ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో కాందహార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. [44] తరువాతి నెలలో, అతను మజాన్సి సూపర్ లీగ్ T20 టోర్నమెంటు యొక్క మొదటి ఎడిషన్ కోసం పార్ల్ రాక్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[45][46]
2019 జూలైలో, అతను యూరో T20 స్లామ్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభ ఎడిషన్‌లో బెల్‌ఫాస్ట్ టైటాన్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు. [47] [48] అయితే, మరుసటి నెలలో ఆ టోర్నమెంటు రద్దైంది.[49]
2020 జనవరి 31న స్టిర్లింగ్, 2020 వైటాలిటీ t20 బ్లాస్ట్ కోసం నార్తాంప్టన్‌షైర్‌తో ఒప్పందంపై సంతకం చేశాడు. 2020 అక్టోబరులో, లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం దంబుల్లా వైకింగ్ అతన్ని తీసుకుంది.[50] 2021 ఫిబ్రవరిలో స్టిర్లింగ్ ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ప్రత్యామ్నాయ ఆటగాడిగా సంతకం చేశాడు. [51] 2021 డిసెంబరులో, 2022 పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం ఆటగాళ్ల డ్రాఫ్ట్ తర్వాత అతను ఇస్లామాబాద్ యునైటెడ్‌తో సంతకం చేశాడు.[52] ఐర్లాండ్‌తో అంతర్జాతీయ జట్టులో చేరేముందు ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున PSL మొదటి ఐదు ఆటలు ఆడాడు.[53] లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ ఆటకు ముందు అతను ఇస్లామాబాద్ యునైటెడ్‌కు తిరిగి వచ్చాడు.[54]
ది హండ్రెడ్ ప్రారంభ సీజన్‌లో, అతను సదరన్ బ్రేవ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. [55]
2023లో, అతను ది హండ్రెడ్ 2023 ఫైనల్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడాడు. ది ఇన్విన్సిబుల్స్ 14 పరుగుల తేడాతో గెలిచింది.
మూలాలు
[మార్చు]- ↑ "Chris Gayle, Andre Russell and Shahid Afridi among big names taken at LPL draft". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 October 2020.
- ↑ "Islamabad United has Signed Paul Stirling as Replacement of Colin Munro". baaythak.com. 16 February 2021. the original నుండి 20 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 February 2021.
- ↑ "Franchises finalise squad for HBL PSL 2022". Pakistan Cricket Board. 10 January 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 December 2021.
- ↑ "Chris Gayle, Andre Russell and Shahid Afridi among big names taken at LPL draft". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 October 2020.

- ↑ "10 stars to look out for at CWCQ". International Cricket Council. 27 February 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 February 2018.
- ↑ "Ireland announce 14-man squad for historic first Test against Pakistan". Belfast Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0307-1235. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 May 2018.
- ↑ "Ireland omit George Dockrell for historic first men's Test against Pakistan". BBC Sport. 4 May 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 May 2018.
- ↑ "Chris Gayle, Andre Russell and Shahid Afridi among big names taken at LPL draft". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 October 2020.
- ↑ "Islamabad United has Signed Paul Stirling as Replacement of Colin Munro". baaythak.com. 16 February 2021. the original నుండి 20 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 February 2021.
- ↑ "Franchises finalise squad for HBL PSL 2022". Pakistan Cricket Board. 10 January 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 December 2021.
- ↑ "PSL 7: Islamabad United to replace Paul Stirling with Liam Dawson". www.geo.tv (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-26.

- ↑ "Paul Stirling returns to Islamabad United, could play Friday's eliminator". ESPNcricinfo (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-26.