Jump to content

పాస్ ఓవర్

వికీపీడియా నుండి
(పాస్‌ ఓవర్‌ నుండి దారిమార్పు చెందింది)

పాస్‌ ఓవర్‌/ పాసోవర్‌. Pesakh (పెసాఖ్‌) అని కూడా అంటారు. ఇది యూదుల పండుగ. ఈజిప్టు నుంచి మోసెస్‌ (మోషె) సలహా ప్రకారం యూదులు తరలి వెళ్లిన (ఎక్జొడస్‌) సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొనే పెద్ద పండుగ. (ఎగ్జొడస్‌ అంటే నిర్గమనం అనే పదం వాడుకలో ఉంది. ఎగ్జొడస్‌ పుస్తకానికి నిర్గమన కాండ అంటున్నారు). ఈజిప్టులో అతి భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలిన సందర్భమది. మృత్యువు ప్రతి ఈజిప్టు గృహంలో మొదటి మగ శిశువును కబళిస్తుండే వాడు. యూదులను కాపాడే ఒక ఉపాయాన్ని దైవం మోసెస్‌ (మోషె) ద్వారా తెలియజేశాడు. ఈజిప్టు వదలి వెళ్లే ముందు సాయంత్రం ఒక గొఱ్ఱె పిల్లను ఆహారంగా త్వరితగతిని తీసుకోవలసిందనీ, చంపిన గొఱ్ఱెపిల్ల రక్తాన్ని తమ ఇంటిపై ఒక గుర్తుగా వ్రాసి ఉంచితే మృత్యుదేవత దానిని చూసి ఆ ఇంటిని వదలి వేరే ఇంటికి వెడతాడని మోసెస్‌ (మోషె) చెప్పిన ఉపాయం. ఇంటిని తప్పించి మరొక ఇంటికి వెళ్లడం ‘‘పాస్‌ ఓవర్‌’’. పెసాఖ్‌ అనేది ఇదే అర్థం కలిగిన హీబ్రూ పదం. ఈజిప్టు వదలి వెళ్లిన సందర్భాన్ని యేటా పండుగ చేసుకొనమని కూడా దైవ సందేశంలో ఉంది. యూదులు అలాగే చేశారు. ఈజిప్టు వదలి వెళ్లిపోయారు. ఇది జరిగింది యూదు సంవత్సరం ఏడవ నెల అయిన నిసాన్‌ మాసం 14వ రోజున. (ఏప్రిల్‌ మాసం 12వ తేదీకి కాస్త అటూ ఇటూగా వచ్చే రోజు). అది వసంత కాలం. అప్పటి నుంచి యూదులు ఈ దినాన్ని పండుగగా జరుపు కొంటున్నారు. యూదులలో సనాతనవాదులు ఈ పండుగను ఇజ్రాయిల్‌ బయట ఎనిమిది రోజులు చేస్తారు. సంస్కరణ వాదులైన యూదులు ఇజ్రాయిల్‌లోనే ఏడు రోజులు జరుపుతారు.

  • [పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 ]
"https://te.wikipedia.org/w/index.php?title=పాస్_ఓవర్&oldid=3685938" నుండి వెలికితీశారు