పింక్ పాంథర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ది పింక్ పాంథర్ (The Pink Panther) అనేది అబందర ఫ్రెంచ్ పోలీసు పరిశోధకుడు జాక్వెస్ క్లౌసెయుతో రూపొందించబడిన ఒక హాస్య చలనచిత్ర శ్రేణి (సిరీస్), 1963లో ఇదే పేరుతో విడుదలైన చలనచిత్రంతో ఈ సిరీస్ ప్రారంభమైంది. పీటర్ సెల్లెర్స్‌తో ఈ పాత్ర ప్రారంభమైంది, దీనితో ఆయన బాగా దగ్గరి అనుబంధం కలిగి ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో చలనచిత్రాలకు బ్లేక్ ఎడ్వర్డ్స్ దర్శకుడిగా మరియు సహ రచయితగా ఉన్నారు, ముఖ్యమైన ఇతివృత్త సంగీతాన్ని హెన్రీ మాన్సినీ స్వరపరిచారు.

ఈ సిరీస్‌లో ఎక్కువ చలనచిత్రాల పేర్లలో "పింక్ పాంథర్"ను ఉపయోగించినప్పటికీ, ఇది క్లౌసెయు పాత్ర కాదు, ఒక పెద్ద మరియు విలువైన కాల్పనిక గులాబీ రంగులో ఉండే వజ్రాన్ని ఈ పేరు సూచిస్తుంది, ఇది సిరీస్‌లోని మొదటి చలనచిత్రం యొక్క "మాక్‌గుఫిన్"గా (ముఖ్యమైన కథాంశంగా) ఉంది.[1] నాలుగో చలనచిత్రమైన ది రిటర్న్ ఆఫ్ ది పింక్ పాంథర్ పేరులో ఈ పదబంధం తిరిగి కనిపించింది, ఈ చలనచిత్రంలో వజ్రం చోరీ తిరిగి ఇతివృత్తం యొక్క ప్రధానాంశంగా ఉంది; పదేళ్ల విరామం తరువాత ఈ చలనచిత్రంలో సెల్లెర్స్ తిరిగి ఈ పాత్రలో నటించారు, ఇది పాత్ర మరియు వజ్రం మధ్య కొంత గందరగోళానికి కారణమైంది. చలనచిత్ర సిరీస్‌లో తరువాతి ప్రతి చిత్రానికి ఈ పదబంధాన్ని ఉపయోగించారు, వజ్రం ఇతివృత్తంలో లేనప్పటికీ ఈ పేరును ఉపయోగించడం జరిగింది (ఈ చలనచిత్ర సిరీస్‌లో మొత్తం రూపొందించిన పదకొండు చిత్రాల్లో ఆరింటిలో మాత్రమే వజ్రం కనిపిస్తుంది).

మొదటి చలనచిత్రంలో ఉండే ఒక యానిమేట్ చేసిన ప్రారంభ క్రమాన్ని డిప్యాటీ-ఫ్రెలెంగ్ ఎంటర్‌ప్రైజెస్ సృష్టించింది, పింక్ పాంథర్ పాత్రను చూపించే ఈ క్రమానికి హెన్రీ మాన్సినీ ఇతివృత్త సంగీతాన్ని అందించారు. హావ్లే ప్రాట్ రూపొందించిన ఈ పాత్ర తరువాత దాని యొక్క సొంత యానిమేటెడ్ కార్టూన్స్ సిరీస్‌కు కథాంశంగా ఉంది, ది పింక్ పాంథర్ షో పేరుతో శనివారం ఉదయం ప్రసారాలు ద్వారా దీనికి ఎంతో ఆదరణ లభించింది. ఎ షాట్ ఇన్ ది డార్క్ మరియు ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు రెండింటిలో మినహా, సిరీస్‌లోని ప్రతి చలనచిత్రం ప్రారంభంలో ఈ పాత్ర కనిపిస్తుంది.

చలనచిత్రాలు మరియు ఇతివృత్తాలు[మార్చు]

ఇటీవలి రెండు పింక్ పాంథర్ చలనచిత్రాల్లో స్టీవ్ మార్టిన్ నటించినప్పటికీ, ఈ సిరీస్‌లోని ఎక్కువ చలనచిత్రాల్లో ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు పాత్రను పీటర్ సెల్లెర్స్ పోషించారు, వీటికి బ్లేక్ ఎడ్వర్డ్స్ దర్శకుడు మరియు సహ-రచయితగా ఉన్నారు. ప్రసిద్ధ జాజ్-ఆధారిత ఇతివృత్త సంగీతాన్ని హెన్రీ మాన్సినీ స్వరపరిచారు. చలనచిత్రంలో పేర్లుపడే దృశ్యాలతోపాటు, పాత్రను ఉపయోగించిన మొదటి చలనచిత్రం మరియు తరువాతి చలనచిత్రాల్లో ఏదైనా అనుమానాస్పద సందర్భాల్లో కూడా ఈ ఇతివృత్త సంగీతం వినిపిస్తుంది.

మొదటి చలనచిత్రం కోసం మాన్సినీ అందించిన ఇతర ఇతివృత్త సంగీతాల్లో ప్రధానంగా యువ నటి ఫ్రాన్ జెఫ్రీస్‌ను పరిచయం చేసేందుకు ఉపయోగించిన "మాంగ్లియో స్టాసెరా"గా పిలిచే ఇటాలియన్-భాషా సెట్-భాగం కూడా ఒకటి. ఒక వాద్యసంగీత రూపం యొక్క భాగాలు చలనచిత్ర సంగీతంలో అనేకసార్లు వినిపిస్తాయి. ఒక "హాంకీ టోంక్" పియానో సంగీతమైన "షేడ్స్ ఆఫ్ సెన్నెట్"ను రోమ్ వీధుల్లో చిత్రీకరించిన చలనచిత్రం యొక్క పతాక సన్నివేశంలో ఉపయోగించారు. సౌండ్‌ట్రాక్ ఆల్బమ్‌లోని మిగిలిన సంగీత భాగాలు 1960వ దశకం ప్రారంభ కాలానికి చెందిన ఆర్కెస్ట్రాల్ జాజ్ భాగాలుగా, ఈ శకం శైలికి అనుగుణంగా ఉన్నాయి. ప్రధాన ఇతివృత్తం యొక్క వైవిధ్యాలు అనేక పింక్ పాంథర్ సిరీస్ చలనచిత్రాలతోపాటు, కార్టూన్ సిరీస్‌లో పునరావృతమైనప్పటికీ, ఎ షాట్ ఇన్ ది డార్క్ కోసం మాన్సినీ స్వరపరిచిన ఒక భిన్నమైన ఇతివృత్తాన్ని యానిమేటెట్ సిరీస్ ది ఇన్‌స్పెక్టర్ స్వీకరించింది.

పింక్ పాంథర్ అనేది ఒక "దుముకుతున్న చిరుతపులి" రూపంలో కనపించేలా ఒక పగులు ఉన్న వజ్రం, ఈ ఆకారం ఒక నిర్దిష్ట మార్గంలో కాంతిని ప్రసరింపజేసినప్పుడు కనిపిస్తుంది. మొదటి చలనచిత్రం యొక్క ప్రారంభంలో దీనిని వివరించారు, అస్పష్టమైన పగులును చూపించేందుకు వజ్రంపై కెమెరా జూమ్‌లు ఉపయోగించారు, పేర్లుపడటం ప్రారంభమైనప్పుడు చిరుతపులిపై (అయితే దుముకుతున్న చిరుతపులి కాదు) దృష్టిపెట్టడం ద్వారా దీనిని చిత్రీకరించడం జరిగింది (దీనినే రిటర్న్‌లో కూడా చేశారు). మొదటి చలనచిత్రంలో ఈ వజ్రం యొక్క చోరీ ప్రధాన కథాంశంగా ఉంటుంది. వజ్రం తిరిగి ఈ సిరీస్‌లో ఐదు చలనచిత్రాల్లో కనిపిస్తుంది (ది రిటర్న్ ఆఫ్ ది పింక్ పాంథర్, ట్రయిల్ ఆఫ్ ది పింక్ పాంథర్, కర్స్ ఆఫ్ ది పింక్ పాంథర్, మరియు ది పింక్ పాంథర్ యొక్క 2006 రీమేక్ మరియు రీమేక్ యొక్క సీక్వెల్ ది పింక్ పాంథర్ 2) . నేర పరిశోధకుడి చలనచిత్రాలకు సంబంధించిన ఒక సిరీస్‌లో డాక్టర్ ఫ్రాంకెన్‌స్టెయిన్ యొక్క సృష్టి లేదా ది థిన్ మ్యాన్‌ను సూచించేందుకు చలనచిత్రాల పేర్లలో ఫ్రాంకెన్‌స్టెయిన్ ‌ను ఉపయోగించినట్లుగానే పింక్ పాంథర్ పేరు ఇన్‌స్పెక్టర్ క్లౌసెయుకు ఉపయోగించబడింది.

సిరీస్‌లో రెండు చలనచిత్రాల్లో మొదటిదానిలో ఇన్‌స్పెక్టర్ క్లౌసెయును చూపించేందుకు ఉద్దేశించబడిన ఎ షాట్ ఇన్ ది డార్క్ అనే చలనచిత్రంలో (రెండోది ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు ) వజ్రాన్ని లేదా విలక్షణమైన యానిమేటెడ్ పింక్ పాంథర్‌ను చిత్ర ప్రారంభంలో లేదా ముగింపులో చూపించలేదు. అనేక మంది విమర్శకులు, లియోనార్డ్ మాల్టిన్ సహా, ఈ సిరీస్‌లో దీనిని ఉత్తమమైన చలనచిత్రంగా పరిగణించారు.

అసలు పింక్ పాంథర్ చలనచిత్రంలో డేవిడ్ నివెన్ యొక్క సర్ ఛార్లస్ లైటన్ పాత్రపై ప్రధానంగా దృష్టి పెట్టారు, దీనిలో "ది పాంటోమ్" అనే మారుపేరుతో పిలిచే దుష్ట ఆభరణ దొంగ మరియు అతను వజ్రాన్ని దాని యజమాని వద్ద నుంచి దొంగిలించేందుకు పన్నే పన్నాగం ప్రధానాంశాలుగా ఉంటాయి. ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు కేవలం లైటన్ యొక్క ప్రత్యర్థిగా ఒక మద్దతు పాత్రలో కనిపించాడు, ఒక కపటమైన, ఉల్లాసభరితమైన నేర నాటకంగా ఉండాల్సిన ఈ చలనచిత్రంలో నవ్వులు నింపేందుకు ఈ పాత్రను హాస్యాస్పదం‌గా తీర్చిదిద్దారు, ఇది ఎడ్వర్డ్స్ యొక్క చలనచిత్రాలకు ఇది కాస్త భిన్నంగా కనిపిస్తుంది. క్లౌసెయు పాత్రకు ఆదరణ లభించడంతో, అతని పాత్రను తరువాతి పింక్ పాంథర్ చిత్రాల్లో ప్రధాన పాత్రగా తీర్చిదిద్దడం జరిగింది, వీటిని పూర్తిగా హాస్యరస ప్రధాన చిత్రాలుగా రూపొందించారు.

మాన్సినీ యొక్క ఇతివృత్తం సంగీతాన్ని, కూర్పులో కొన్ని వైవిధ్యాలతో, తరువాత వచ్చిన మొదటి రెండు చలనచిత్రాల్లో మినహా మిగిలిన చిత్రాలన్నింటిలో ప్రారంభంలో ఉపయోగించారు.

2009నాటికి, పదకొండు పింక్ పాంథర్ చలనచిత్రాలు నిర్మించబడ్డాయి:

పింక్ పాంథర్ చలనచిత్రాలు
చలనచిత్రం సంవత్సరం గమనికలు
ది పింక్ పాంథర్ 1963 డేవిడ్ నివెన్, పీటర్ సెల్లెర్స్ చుట్టూ తిరిగే ఈ చలనచిత్రం మంచి ఆదరణ పొందినప్పటికీ, తరువాత వచ్చిన చలనచిత్రాల్లో కథాకథనాలు ఫాంటోమ్/సర్ ఛార్లస్ లైటన్‌కు బదులుగా క్లౌసెయు చుట్టూ తిరుగుతాయి.
ఎ షాట్ ఇన్ ది డార్క్ 1964 ది పింక్ పాంథర్ విడుదలై ఏడాది తిరగకముందే దీనిని విడుదల చేశారు, క్లౌసెయు ఒక హత్యా దర్యాప్తు ద్వారా తిరిగి గందరగోళంలోకి అడుగుపెడతాడు. హెర్బెర్ట్ లోమ్ యొక్క డ్రైఫుస్ మరియు బర్ట్ వౌక్ యొక్క కాటో ఇద్దరు దీనిలో మొదటిసారి కనిపిస్తారు.
ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు 1968 ఈ చలనచిత్రంలో క్లౌసెయు పాత్రలో అలెన్ ఆర్కిన్ నటించారు, మిగిలిన చలనచిత్రాల్లో పునరావృతమయ్యే ఇతర పాత్రలు (డ్రైఫుస్, కాటో, ఫాంటోమ్, ఇతరాలు) దీనిలో కనిపించవు. ఈ చిత్రాన్ని మిరిష్ కార్పొరేషన్ నిర్మించినప్పటికీ, పీటర్ సెల్లెర్స్, బ్లేక్ ఎడ్వర్డ్స్ మరియు హెన్రీ మాన్సినీ నిర్మాణంలో పాలుపంచుకోలేదు.
ది రిటర్న్ ఆఫ్ ది పింక్ పాంథర్ 1975 ప్రసిద్ధ "పింక్ పాంథర్" వజ్రం పునరాగమనంతోపాటు, దీనిలో పీటర్ సెల్లెర్స్ కూడా క్లౌసెయు పాత్రలో (ఎడ్వర్డ్స్, మాన్సినీ, డ్రైఫుస్ మరియు కాటోలతో సహా) తిరిగి దర్శనమిచ్చారు. సర్ ఛార్లస్ లైటన్ పాత్రను క్రిస్టోఫర్ ప్లుమ్మెర్ పోషించారు.
ది పింక్ పాంథర్ స్ట్రైక్స్ ఎగైన్ 1976 డ్రైఫుస్ పిచ్చితనం తారాస్థాయికి చేరుతుంది, క్లౌసెయును హత్య చేస్తానని అతను మిగిలిన ప్రపంచాన్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తాడు.
రివేంజ్ ఆఫ్ ది పింక్ పాంథర్ 1978 ఈ చలనచిత్రం క్లౌసెయుకు ఫ్రెంచ్ సంబంధం గురించి వివరిస్తుంది. క్లౌసెయు పాత్రలో సెల్లెర్స్ నటించిన చివరి చలనచిత్రం ఇదే కావడం గమనార్హం; ఈ చలనచిత్రం విడుదలైన రెండేళ్ల తరువాత ఆయన మరణించారు.
ట్రయిల్ ఆఫ్ ది పింక్ పాంథర్ 1982 ఈ చిత్రంలో క్లౌసెయు పత్రలో పీటర్ సెల్లెర్స్ నటించారు, స్ట్రైక్స్ ఎగైన్ చలనచిత్రంలో ఉపయోగించిన భాగాలను దీనిలో ఉపయోగించారు, తద్వారా సెల్లెర్స్‌కు నివాళి అర్పించారు, అయితే ఇది విడుదలైన తరువాత, సెల్లెర్స్ భార్య లైన్ ఫ్రెడెరిక్ ఈ చిత్రంపై కేసుపెట్టి ఎడ్వర్డ్స్‌పై విజయం సాధించారు, తన భర్త జ్ఞాపకాలను స్టూడియో నాశనం చేసిందని ఆమె ఈ కేసు పెట్టడం జరిగింది. డేవిడ్ నివెన్ మరియు కాపుసిన్ వారి అసలు పాత్రలను తిరిగి పోషించారు.
కర్స్ ఆఫ్ ది పింక్ పాంథర్ 1983 ట్రయిల్‌లో కనిపించకుండా పోయిన ఇన్‌స్పెక్టర్ క్లౌసెయును మరియు ది పింక్ పాంథర్ వజ్రాన్ని అమెరికన్ డిటెక్టివ్ క్లిఫ్టన్ స్లీగ్ (టెడ్ వాస్) కనిపెడతాడు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తన రూపాన్ని మార్చుకున్న ప్రసిద్ధ నటుడు రోజర్ మూర్ ఈ చిత్రంలో క్లౌసెయు పాత్రలో ఉత్సాహభరితమైన హాస్యాన్ని పంచారు. సెర్జెంట్ స్లీగ్ కోసం దురదృష్టకరమైన సాహసాలతో ఒక కొత్త సిరీస్‌ను సృష్టించేందుకు ఉద్దేశించబడినప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది, విమర్శకులు తీవ్రస్థాయిలో విరుచుకపడటంతో తరువాత ఒక దశాబ్దంపాటు పాంథర్ చిత్రాలు నిలిపివేయబడ్డాయి.
సన్ ఆఫ్ ది పింక్ పాంథర్ 1993 రాబెర్టో బెనిగ్నీ ఈ సిరీస్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు, మేరియా గాంబ్రెలీ (ఎ షాట్ ఇన్ ది డార్క్ చలనచిత్రంలో హత్యా అనుమానితురాలు) ద్వారా ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు యొక్క అక్రమ కొడుకు జెండార్మే జాక్వస్ గాంబ్రెలీతో ఈ సిరీస్‌ను పునరుద్ధరించారు. అనేక మంది మాజీ పాంథర్ సహ-నటులు తిరిగి దీనిలో నటించారు. ఒక కొత్త అబందర కథానాయకుడితో సిరీస్‌ను తిరిగి ప్రారంభించాలని భావించినప్పటికీ, "సన్" పాత్ర అసలు పాంథర్ సిరీస్‍‌లో చివరి స్థాపనగా మారింది.
ది పింక్ పాంథర్ 2006 ఈ చలనచిత్రంతో స్టీవ్ మార్టిన్‌ను ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు పాత్రలో మరియు కెవిన్ క్లిన్‌ను చీఫ్ ఇన్‌స్పెక్టర్ డ్రైఫుస్ పాత్రలో చూపిస్తూ ఒక కొత్త పింక్ పాంథర్ సిరీస్ తిరిగి ప్రారంభించబడింది. అసలు చలనచిత్రం యొక్క రీమేక్ కాకుండా, ఈ చలనచిత్రంలో ఒక సమకాలీన సిరీస్ కోసం ఒక కొత్త ప్రారంభ అంశాన్ని చూపించారు, ఒక కొత్త తరం ప్రసిద్ధ వజ్రంతో క్లౌసెయు మరియు డ్రైఫుస్ పాత్రలను దీనిలో పరిచయం చేశారు.
ది పింక్ పాంథర్ 2 2009 స్టీవ్ మార్టిన్ యొక్క పింక్ పాంథర్ చలనచిత్రం యొక్క తరువాతి భాగం ఇది. మార్టిన్ తిరిగి తన పాత్రను పోషించగా, కెవిన్ క్లైన్ స్థానంలో చీఫ్ ఇన్‌స్పెక్టర్ డ్రైఫుస్‌గా జాన్ క్లీస్ నటించారు.

మొదటి ఐదు పీటర్ సెల్లెర్స్-బ్లేక్ ఎడ్వర్డ్స్ చలనచిత్రాలు యునైటెడ్ ఆర్టిస్ట్స్ ద్వారా విడుదలయ్యాయి. ట్రయిల్, కర్స్ మరియు సన్ చిత్రాలను MGM/యునైటెడ్ ఆర్టిస్ట్స్ విడుదల చేశాయి. ది రిటర్న్ ఆఫ్ ది పింక్ పాంథర్ యొక్క DVD హక్కులు యూనివర్శల్ పిక్చర్స్ యొక్క ఫోకస్ ఫీచర్స్ విభాగం నియంత్రణలో ఉన్నాయి, బ్రిటీష్ నిర్మాణ సంస్థ ITC ఎంటర్‌టైన్మెంట్ మరియు దాని రూపాంతరం ITV గ్లోబల్ ఎంటర్‌టైన్మెంట్ లిమిటెడ్ కూడా హక్కులను పంచుకుంటుంది--ఫోకస్ ఈ చలనచిత్రాన్ని రీజియన్ 1 కోసం DVDలో విడుదల చేసింది.

ITC మొదట ఒక ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు టెలివిజన్ సిరీస్ నిర్మించడానికి ప్రయత్నించింది, అయితే బ్లేక్ ఎడ్వర్డ్స్ ఒక చలనచిత్రాన్ని నిర్మించాలా నిర్మాణ కంపెనీని ఒప్పించారు, ఈ చిత్రం విజయవంతమైతే తరువాత టెలివిజన్ సిరీస్ నిర్మాణాన్ని చేపట్టాలని సలహా ఇచ్చారు. 1975లో అత్యంత లాభదాయకమైన చలనచిత్రంగా మారి ఈ చలనచిత్రం అందరి అంచనాలను తలక్రిందులు చేసింది. యునైటెడ్ ఆర్టిస్ట్స్ తరువాత ITC యొక్క పెట్టుబడిని కొనుగోలు చేసి, తరువాతి చలనచిత్రంపై వెంటనే పనిని ప్రారంభించింది.

అధికారికమైనప్పటికీ, 1968 చలనచిత్రం ఇన్‌స్పెక్టర్ క్లౌసెయును సాధారణంగా అభిమానులు పింక్ పాంథర్ "కానోన్"లో భాగంగా పరిగణించరు, సెల్లెర్స్ లేదా ఎడ్వర్డ్స్ లేకపోవడంతో దీనిని పింక్ పాంథర్ సిరీస్‌లో భాగంగా పరిగణించడం లేదు. అయితే సెల్లెర్స్ 1975లో రిటర్న్ చిత్రంలో తిరిగి అడుగుపెట్టినప్పుడు, ఆర్కిన్స్ యొక్క నటన మరియు వేషధారణ వంటి కొన్ని అంశాలు తిరిగి స్వీకరించడం జరిగింది. ప్రచారం జరిగినప్పటికీ, ట్రయిల్ ఆఫ్ ది పింక్ పాంథర్ చలనచిత్రంలో అలెన్ ఆర్కిన్ నటించలేదు.

రెండో పింక్ పాంథర్ సిరీస్‌లో మొదటి చిత్రం ది పింక్ పాంథర్, దీనిలో స్టీవ్ మార్టిన్ ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు పాత్ర పోషించారు, దీనికి ష్వాన్ లెవీ దర్శకత్వం వహించగా, రాబర్ట్ సిమెండ్స్ నిర్మించారు, ఫిబ్రవరి 2006లో ఇది విడుదలైంది. కొలంబియా పిక్చర్స్ విడుదల చేసిన మొదటి పాంథర్ చలనచిత్రం ఇది, దీనికి మెట్రో-గోల్డ్‌విన్-మేయర్ సహ-నిర్మాతగా ఉంది. ప్రస్తుత కాలానికి తగినట్లుగా దీనిలో వివిధ ప్రధాన పాత్రలను పరిచయం చేశారు, తద్వారా ఇది ఒక భిన్నమైన కొనసాగింపుతో ఉంది. మార్టిన్ తరువాత వచ్చిన చలనచిత్రం ది పింక్ పాంథర్ 2లో కూడా నటించారు, ఇది 2009లో విడుదలైంది, ప్రస్తుతం ది పింక్ పాంథర్ 3 చలనచిత్రాన్ని రాబర్ట్ సిమెండ్స్ నిర్మిస్తున్నారు.

పాత్రలు[మార్చు]

ఇన్‌స్పెక్టర్ జాక్వస్ క్లౌసెయు[మార్చు]

 • మొదట కనిపించిన చిత్రం: ది పింక్ పాంథర్ (1963)
 • కనిపించిన చిత్రాలు: సన్ ఆఫ్ ది పింక్ పాంథర్ మినహా అన్ని చలనచిత్రాల్లో ఈ పాత్ర కనిపిస్తుంది

జాక్వస్ క్లౌసెయు పాత్రధారి గందరగోళపరిచే అమాయకుడైన పోలీసు మరియు నేర పరిశోధకుడిగా కనిపిస్తాడు. ఇతను ఫ్రెంచ్ ఉచ్ఛారణరీతితో వివరించలేని ఆంగ్లంలో మాట్లాడతాడు, ఇతర పాత్రలు ఆంగ్లం మాట్లాడతాయి, తరచుగా ఈ పాత్రలు వారి సొంత ఉచ్ఛారణరీతులను ఉపయోగిస్తాయి. క్లౌసెయు యొక్క ఉచ్ఛారణరీతిని మొదటి చిత్రంలో చాలా తక్కువగా ఉపయోగించారు; ఎ షాట్ ఇన్ ది డార్క్ చిత్రం నుంచి అతని ఉచ్ఛారణ హాస్యాస్పదంగా సాగుతుంది. ఈ అమాయకుడైన పోలీసును ఫ్రెంచ్ వ్యక్తిగా చూపించడం, ఫ్రెంచ్ పోలీసు యొక్క ఒక బ్రిటీష్ సాధారణీకరణగా పరిగణించబడుతుంది, లేదా మొత్తం ఫ్రెంచ్ జనాభాను ఇది సూచిస్తుంది.

క్లౌసెయు పాత్ర పోషించిన పీటర్ సెల్లెర్స్ సొంత అభిప్రాయం ప్రకారం, క్లౌసెయుకు తాను ఒక బఫూన్ అనే విషయం తెలుసు; అయితే క్లౌసెయుకు జీవించేందుకు ఒక అద్భుతమైన నేర్పు ఉంది. పూర్తిగా అదృష్టం లేదా నిపుణత లేకపోవడం సాధారణంగా అతడిని కాపాడుతుంటుంది. మొదటి చలనచిత్రంలో, రోమ్ నగరంలోని ఫౌంటైన్‌ల చుట్టూ దొంగలను పట్టుకునేందుకు జరిగే ఒక నవ్వుపుట్టించే కారు ఛేజ్ అన్ని వాహనాలు ఢీకొనడానికి దారితీస్తుంది (దొంగలు ఇద్దరూ గొరిల్లా వేషధారణలో ఉంటారు). క్లౌసెయు మెట్లపై పడిపోవడంతో ఈ పద్ధతి జోరందుకుంది; కొలనుల్లో మరియు ఫౌంటైన్‌లలో పడటం; అగ్నిప్రమాదాలు మరియు విపత్తులకు కారణమవడం; మరియు బాంబులతో దాడి ఎదుర్కోవడం వంటి అనేక సన్నివేశాలకు తరువాత వచ్చిన చిత్రాల్లో ఇది స్ఫూర్తిగా నిలిచింది. ది పింక్ పాంథర్ స్ట్రైక్స్ ఎగైన్ చలనచిత్రంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హంతకులను క్లౌసెయును చంపేందుకు పంపుతారు; షూలేస్‌లను కట్టుకునేందుకు అతను వంగడం, కిందపడిపోవడం, తదితర సన్నివేశాలు, అతడిని చంపేందుకు వచ్చిన హంతుకులు ఒకరినొకరు చంపుకునేందుకు దారితీస్తాయి. ట్రయిల్ ఆఫ్ ది పింక్ పాంథర్ చలనచిత్రంలో, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో జరిగే ఒక మునపటి కథనంలో, క్లౌసెయు జర్మనీ ఆక్రమణకు వ్యతిరేకంగా ఫ్రెంచ్ పునరుజ్జీవనోద్యమం పాల్గొన్నట్లు చూడవచ్చు, అయితే అసమర్థత కారణంగా క్లౌసెయు ఎటువంటి సందర్భాన్నైనా అధిగమించగలడని ఈ మునపటి కథలు కూడా చూపిస్తాయి.

ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు ఒక దేశాభిమానం ఉన్న ఫ్రెంచ్ వ్యక్తి: ఆయనకు దేశం అత్యధిక ప్రాధాన్యకర అంశంగా స్పష్టమవుతుంది. సర్ ఛార్లస్ లైటన్ వేశ్యాధోరణితో మోసగించిన తరువాత నుంచి అతనిలో వ్యామోహం పెరుగుతుంది (ఇది తరచుగా కనిపిస్తుంది). అతను పదేపదే లైంగిక ప్రవర్తన చేత విభ్రాంతమవుతుంటాడు, ఈ వ్యామోహంలో వారిని అతను "సర్ లేదా మేడమ్" అని పిలుస్తాడు.

పీటర్ సెల్లెర్స్‌తో ఈ పాత్ర ప్రారంభమైనప్పటికీ, అలెన్ ఆర్కిన్ (ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు లో) మరియు డేనియల్ పీకాక్ మరియు లూకా మెజోఫోంటీలు ట్రయిల్ ఆఫ్ ది పింక్ పాంథర్ చలనచిత్రంలో యువ క్లౌసెయు పాత్రల్లో, రోజర్ మూర్ (కర్స్ ఆఫ్ ది పింక్ పాంథర్ చిత్రం చివరిలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని క్లౌసెయు పాత్రలో నటించారు) మరియు స్టీవ్ మార్టిన్ (2006 పింక్ పాంథర్ మరియు దీని తరువాత వచ్చిన 2009 సీక్వెల్) ఈ పాత్రలో నటించారు.

చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఛార్లస్ లారౌసీ డ్రైఫుస్[మార్చు]

 • మొదట కనిపించిన చిత్రం: ఎ షాట్ ఇన్ ది డార్క్ (1964)
 • కనిపించిన చిత్రాలు: 1963నాటి చలనచిత్రం మరియు ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు లలో మినహా, అన్ని పాంథర్ చలనచిత్రాల్లో ఈ పాత్ర ఉంది.

క్లౌసెయు పైఅధికారి, ఛార్లస్ డ్రైఫుస్ పాత్రను ఎ షాట్ ఇన్ ది డార్క్ చిత్రంలో పరిచయం చేశారు, ఈ చిత్రంలో ఇతను కమిషనర్ హోదాలో కనిపిస్తాడు. క్లౌసెయు యొక్క గందరగోళంతో ఎప్పటికప్పుడు పరధ్యానంలోకి వెళ్లే పాత్ర ఇది, ఒక లెటర్-ఓపెనర్ (సూది) ని ఛాతీలో గుచ్చుకునేంత స్థాయిలో, చివరకు హత్యకు ప్రయత్నించే పిచ్చి అతనికి కలుగుతుంది. ది రిటర్న్ ఆఫ్ ది పింక్ పాంథర్ చిత్రంలో, డ్రైఫుస్ కమిషనర్‌కు బదులుగా చీఫ్ ఇన్‌స్పెక్టర్ హోదాలో కనిపిస్తాడు. ముందుమాదిరిగా, చిత్రం చివరిలో అతనికి పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది, తన కాలివేళ్లమధ్య రంగుబలపాన్ని తీసుకొని "కిల్ క్లౌసెయు" అని ఒక గదిలో రాయడంతో ఈ చిత్రం ముగుస్తుంది. ఎ షాట్ ఇన్ ది డార్క్ మాదిరిగా, డ్రైఫుస్ మొదట వివిధ రకాల వ్యక్తిగత గాయాలతో బాధపడతాడు (తన తుపాకీ మరియు ఇదే ఆకారంలో ఉండే సిగరెట్ లైటర్ మరియు ప్రమాదవశాత్తూ ఒక చిన్న శిరశ్ఛేదక యంత్రం రూపంలో ఉండే సిగార్ కత్తెరతో తన బొటనువేలు కత్తిరించుకోవడం), క్లౌసెయు మరణ వార్త విని సంతోషించే సన్నివేశంలో మరియు క్లౌసెయును ఒక తుపాకీతో హత్య చేసే సందర్భంలో అతనికి ఈ గాయాలు అవతాయి, అంతేకాకుండా ప్రమాదవశాత్తూ ఇతను తన వైద్యుడిని పీకపిసికి చంపబోతాడు. ది పింక్ పాంథర్ స్ట్రైక్ ఎగైన్ చిత్రంలో, డ్రైఫుస్ పూర్తిగా కోలుకున్న తరువాత ఆశ్రమం నుంచి విడుదలవడానికి రంగం సిద్ధమవుతుంది, అయితే క్లౌసెయు వచ్చిన 5 నిమిషాల్లోనే (డ్రైఫుస్ తరపున మాట్లాడేందుకు), అతనికి వివిధ రకాల గాయాలవతాయి, దీని ఫలితంగా అతడిని తిరిగి హత్య చేయాలనే పిచ్చి ఆవహిస్తుంది. డ్రైఫుస్ ఈ చికిత్సా కేంద్రం నుంచి తప్పించుకొని బయటకు వచ్చి, ఒక శాస్త్రవేత్తను కిడ్నాప్ చేస్తాడు, అతడిని డిజింటిగ్రేటర్ రేను నిర్మించాలని బలవంతం చేస్తాడు; ఈ పరికరాన్ని ఉపయోగించి మిగిలిన ప్రపంచాన్ని క్లౌసెయును హత్య చేయాలని బెదిరిస్తాడు. స్ట్రైక్ ఎగైన్ చివరిలో డ్రైఫుస్ అస్థిరపడతాడు; అయితే తరువాత, ఎటువంటి వివరణలు లేకుండానే, అతను తిరిగి రివేంజ్ ఆఫ్ ది పింక్ పాంథర్ చిత్రంలో చికిత్సా కేంద్రంలో కనిపిస్తాడు, క్లౌసెయు మరణించినట్లు తప్పుడు ప్రకటనతో అతను తిరిగి చీఫ్ ఇన్‌స్పెక్టర్ విధుల్లోకి వస్తాడు. హెర్బెర్ట్ లోమ్ తన పాత్రకు ఒక శైలిని పరిచయం చేశారు, అతను బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మరియు క్లౌసెయు హత్యకు ప్రయత్నిస్తున్నప్పుడు పిల్లాడి మాదిరిగా నవ్వడం ఈ శైలిలో భాగంగా ఉంటుంది.

సన్ ఆఫ్ ది పింక్ పాంథర్ చిత్రంలో, డ్రైఫుస్ (తిరిగి ఒక కమిషనర్) క్లౌసెయు పాత్ర మాదిరిగా బఫూన్‌గా ప్రవర్తించే కుమారుడు జాక్వస్ గాంబ్రెలీతో కలిసి పనిచేస్తాడు. క్లౌసెయు విషయంలో వ్యవహార శైలితో పోలిస్తే, గాంబ్రెలీ విషయంలో డ్రైఫుస్ మరింత సహనంతో వ్యవహరిస్తాడు. చలనచిత్రం చివరిలో, క్లౌసెయు యొక్క మాజీ ప్రేయసి మేరియా గాంబ్రెలీ (జాక్వస్ గాంబ్రెలీ యొక్క తల్లి) ని డ్రైఫుస్ వివాహం చేసుకుంటాడు. వివాహ విందు వేడుకలో, క్లౌసెయు మరియు మేరియా వాస్తవానికి కవలలని డ్రైఫుస్ తెలుసుకొని విభ్రాంతికి గురవతాడు: జాక్వస్ మరియు జాక్వెలీన్ గాంబ్రెలీ.

2006 ది పింక్ పాంథర్ కొత్త చిత్రంలో డ్రైపుస్ (తిరిగి చీఫ్ ఇన్‌స్పెక్టర్) స్వయంగా తానే నేరాలను పరిష్కరించేందుకు క్లౌసెయును తప్పుదారిపట్టించే వ్యక్తిగా ఉపయోగించుకుంటాడు. డ్రైఫుస్ దాదాపుగా క్లౌసెయును ఒక శుంఠగా పరిగణిస్తాడు, అతడిని హత్య చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించడు; అయితే క్లౌసెయు ఒక సందర్భంలో తన నియోగిని గుర్తించలేక దాడి చేస్తాడు. చిత్రంలో తరువాతి భాగంలో, క్లౌసెయు యొక్క స్మార్ట్ కారు వెనుక డ్రైఫుస్ ప్రమాదవశాత్తూ లాగివేయబడతాడు. దీంతో డ్రైఫుస్ ఆస్పత్రి పాలవతాడు, ఈ ఆస్పత్రిలో క్లౌసెయు సృష్టించే గందరగోళంతో అతను కిటికీలో నుంచి కిందకుపడిపోతాడు. అయితే 2009 సీక్వెల్‌లో, డ్రైఫుస్ ముందు చిత్రంతో పోిస్తే చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తాడు.

బ్లేక్ ఎడ్వర్డ్స్ చలనచిత్రాల్లో డ్రైఫుస్ పాత్రను హెర్బెర్ట్ లోమ్ పోషించగా, 2006 చిత్రంలో కెవిన్ క్లైన్ ఈ పాత్ర పోషించారు. 2009 చిత్రంలో క్లైన్ స్థానంలో జాన్ క్లీస్ ఈ పాత్రలో నటించారు.

కాటో ఫోంగ్[మార్చు]

 • మొదట కనిపించిన చిత్రం: ఎ షాట్ ఇన్ ది డార్క్ (1964)
 • కనిపించిన చిత్రాలు: 1963 చిత్రం, ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు మరియు 2006-2009 చిత్రాల్లో మినహా మిగిలిన అన్ని చిత్రాల్లో ఈ పాత్ర ఉంటుంది.

కాటో (Cato) (ఎ షాట్ ఇన్ ది డార్క్‌లో Katoగా రాస్తారు) అనే పాత్ర క్లౌసెయు ఇంటిలో పనిచేసే బాలుడు, ఇతను మార్షల్ ఆర్ట్స్ (యుద్ధ కళల్లో) నిపుణుడు. ఇతను క్లౌసెయును ఒక గొప్ప నేర పరిశోధకుడిగా భావిస్తుంది లేదా తనకు నవ్వు తెప్పించే వ్యక్తిగా భావిస్తుంది అస్పష్టంగా ఉంటుంది. క్లౌసెయు యొక్క పోరాట నైపుణ్యాలు మరియు అప్రమత్తతలను చురుగ్గా ఉంచేందుకు క్లౌసెయుపై అనూహ్యంగా దాడి చేయాలని అతనికి ఆదేశాలు ఉండటం, ఒక రన్నింగ్ జోక్‌గా ఉంటుంది. దురదృష్టవశాత్తూ, కాటో ఈ ఆదేశాలను చాలా తీవ్రంగా పరిగణిస్తాడు, తరచుగా ఇతను క్లౌసెయు ఇంటిలో దాగివుండి, ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తుంటాడు. ఈ దాడి మధ్యలో వారికి అడ్డుతగిలినట్లయితే, (టెలిఫోన్ కాల్ వంటివి), కాటో దుండగుడి పాత్ర నుంచి బయటకు రావడం మరియు మంచి క్రమశిక్షణ గల నౌకరుగా మారతాడు.

తరువాతి చలనచిత్రాల్లో, కాటో కొన్ని కేసులను పరిష్కరించడంలో క్లౌసెయుకు సాయపడతాడు, హాంకాంగ్ కేసులో కూడా ఇతని సాయం కనిపిస్తుంది. ఇక్కడ, కాటో స్పష్టంగా కనబడకుండా ఉండేందుకు అద్దాలు ధరిస్తాడు, అయితే సరిగా కనిపించని చూపు కారణంగా వివిధ వస్తువులను ఢీకొంటాడు.

మొదట, కాటో "అస్పష్టమైన ఆంగ్లం" మరియు నవ్వుతో చైనా జాతి సాధారణీకరణను ప్రతిబింబించేలా కనిపిస్తాడు; అయితే రివేంజ్ ఆఫ్ ది పింక్ పాంథర్ చిత్రంలో, అతను ప్రామాణికంకాని ఆంగ్లంతోపాటు, ఆంగ్ల భాషను స్పష్టంగా మాట్లడగలడని వెల్లడవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ప్రేమ-ద్వేషం సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు కాటోకు ద్వేషం ఎక్కువగా ఉన్నట్లు కనబడుతుంది.

రివేంజ్ చిత్రంలో, కాటో తన మాస్టర్ మరణించినట్లు భావిస్తాడు, క్లౌసెయు నివాసంలో అతను ఒక రహస్యమైన వేశ్యావ్యాపారాన్ని నడుపుతాడు. వ్యభిచారంలోకి అడుగుపెట్టేందుకు ఉపయోగించే పాస్‌వర్డ్ "ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు"గా ఉంటుంది, అసలైన ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు కనిపించినప్పుడు ఇది హాస్యం పండిస్తుంది. కర్స్ ఆఫ్ ది పింక్ పాంథర్ చిత్రంలో కాటో మరో వ్యభిచారాన్ని ప్రారంభిస్తాడు, క్లౌసెయు యొక్క నివాసాన్ని ఒక మ్యూజియంగా మారుస్తాడు, సంవత్సరాలుగా క్లౌసెయు ధరించిన మారువేషాలను దీనిలో ప్రదర్శిస్తాడు.

ది గ్రీన్ హోర్నెట్‌లో బ్రూస్ లీ ఉపయోగించిన సైడ్‌స్టిక్ Kato ఆధారంగా Catoను సృష్టించారు.[ఉల్లేఖన అవసరం] ఎ షాట్ ఇన్ ది డార్క్‌లో పేర్లు అతని పేరు "K"తో ప్రారంభమవుతుంది, తరువాత వచ్చిన చలనచిత్రాల్లో ఈ పేరు "C"తో ప్రారంభమవుతుంది.

బర్ట్ నోవాక్ ఈ కాటో పాత్రను పోషించారు. తిరిగి కొత్త సిరీస్‌ను ప్రారంభిస్తున్నప్పుడు ఈ పాత్రను పోషించాలని జాకీ ఛాన్‌ను కోరారు. అయితే చివరకు, ఈ పాత్రను పూర్తిగా తొలగించారు, ఆధునిక ప్రేక్షకులకు చైనీస్ సాధారణీకరణ రాజకీయంగా సమంజసంగా ఉండదని భావించారు. కాటో పాత్ర ఒక కొత్త పాత్ర జెండార్మే గిల్బెర్ట్ పోంటాన్‌తో మార్చబడింది, దీనిని జీన్ రెనో పోషించారు, క్లౌసెయును పరిశీలించేందుకు చీఫ్ ఇన్‌స్పెక్టర్ డ్రైఫుస్ ఇతడిని నియమిస్తారు. కాటో పాత్రను పోలినట్లుగా, క్లౌసెయుపై పాంటోనా పాత్ర అనూహ్యంగా దాడి చేస్తుంటుంది; కాటో పాత్రకు భిన్నంగా పోంటాన్ పాత్ర ఎప్పుడు ఈ పోరాటాల్లో విజయం సాధిస్తుంటుంది. కాటో పాత్ర కనిపించే పోరాటాలు ఎల్లప్పుడూ బాగా విధ్వంసకరంగా ఉంటాయి, పోంటాన్ పాత్ర ఉండే పోరాటాల కంటే ఇవి ఎక్కువ నిడివితో ఉంటాయి.

ఫ్రాంకోయిస్[మార్చు]

డ్రైఫుస్ యొక్క సహాయకుడు ఫ్రాంకోయిస్ ప్రశాంతమైన గందరగోళంతో సాధారణంగా క్లౌసెయుతో తన బాస్ మాటలను (మరియు తరువాత ఉద్వేగభరితమైన వైఫల్యాలు) పరిశీలిస్తుంటాడు. ఫ్రెంచ్ నటుడు ఆండ్రీ మారాన్నే ఆరు పాంథర్ చిత్రాల్లో ఫ్రాంకోయిస్ పాత్ర పోషించారు, సన్ ఆఫ్ ది పింక్ పాంథర్ చిత్రంలో అతని స్థానంలో డెర్మోట్ క్రౌలే నటించారు (మారాన్నే 1992లో మరణించిన కారణంగా). ఇతను తరువాత క్లౌసెయు సహాయకుడిగా మారతాడు. ఎ షాట్ ఇన్ ది డార్క్ , ట్రయిల్ ఆఫ్ ది పింక్ పాంథర్ మరియు కర్స్ ఆఫ్ ది పింక్ పాంథర్ చిత్రాల్లో అతడిని సెర్జెంట్ ఫ్రాంకోయిస్ డువాల్‌గా సూచిస్తారు, 1970నాటి మూడు వరుస చిత్రాల్లో అతడిని సెర్జెంట్ ఫ్రాంకోయిస్ చెవాలియర్‌గా సూచిస్తారు. 2006 పునర్నిర్మాణంలో ఫిలిప్ గుడ్‌విన్ ఇదే విధంగా ఉండే రెనార్డ్ పాత్రను పోషించారు. 2009 చలనచిత్రంలో కూడా రెనార్డ్ పాత్రలో గుడ్‌విన్ తిరిగి కనిపిస్తారు.

సర్ ఛార్లస్ లైటన్/ది ఫాంటోమ్[మార్చు]

"ఫాంటోమ్" అనేది ఒక ఆభరణాల దొంగ పాత్ర; అనేక చిత్రాల్లో క్లౌసెయు యొక్క ప్రత్యర్థి (డ్రైఫుస్ తరువాత) గా ఈ పాత్ర ఉంటుంది; సర్ ఛార్లస్ లైటన్ అనేది ప్రాచుర్యంలో ఉన్న ఈ పాత్ర పేరు. ప్రతి నేరానికి అతను ఒక "కాలింగ్ కార్డు" వదిలి వెళతాడు; ఒక శైలీకృత అక్షరం 'P'తో ఉండే ఒక తెల్లని గ్లౌవ్. మొదటి చలనచిత్రంలో ఇతను ప్రధాన ప్రతినాయకుడిగా ఉంటాడు, క్లౌసెయు యొక్క ప్రధాన లక్ష్యంగా ఈ పాత్ర ఉంటుంది, అయితే చివరకు, క్లౌసెయు భార్య మరియు ఒక అవినీతి రాకుమారి నుంచి సాయంతో గతంలో తాను చేసిన చోరీల్లో క్లౌసెయును ఇరికిస్తాడు, దీంతో క్లౌసెయు తాత్కాలికంగా జైలుకు పంపబడతాడు, మూడో సెల్లెర్స్/ఎడ్వర్డ్స్ చలనచిత్రంలో క్లౌసెయు దీనిపై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తాడు, ఈ చిత్రంలో లుగాష్‌లోని ఒక మ్యూజియం నుంచి పింక్ పాంథర్ దొంగిలించబడుతుంది, దీనిలో లైటన్ ప్రధాన అనుమానితుడిగా ఉంటాడు. మొదటి చిత్రంలో ఈ పాత్రను డేవిడ్ నివెన్, రిటర్న్‌లో క్రిస్టోఫర్ ప్లుమ్మెర్ పోషించారు. తరువాతి చలనచిత్రాల్లో, వయస్సుమీదపడుతున్న నివెన్ ఈ పాత్రలో హాస్యాస్పద ప్రదర్శనలు ఇచ్చారు, అతనికి రిచ్ లిటిన్ గాత్రదానం చేశారు. తరువాతి చలనచిత్రాల్లో, క్లౌసెయు యొక్క మాజీ-భార్యను లైటన్ వివాహం చేసుకున్నట్లు కనిపిస్తుంది (అంటే మొదటి పింక్ పాంథర్ సంఘటనలు తరువాత), రిటర్న్‌లో అతని భార్య స్పష్టంగా భిన్నమైన పాత్రగా కనిపిస్తుంది, క్లౌసెయు గురించి తక్కువ పరిజ్ఞానం ఉన్న పాత్రగా ఉంటుంది. ది పింక్ పాంథర్ 2లో వజ్రం ఒకే విధమైన దొంగ పాత్ర అయిన టోర్నాడో చేత చోరీకి గురవుతుంది, ఈ పాత్రలో జానీ హాలిడే నటించారు.

చలనచిత్రాలకు జోహార్లు మరియు సూచనలు[మార్చు]

 • ల్యూపిన్ ది థర్డ్ అనే యానిమేషన్ సిరీస్‌లోని ఒక ఎపిసోడ్ "బ్లేక్ పాంథర్"లో (అమెరికన్-డబ్ పేరు "మై బర్త్‌డే పర్స్యూట్") ప్రధాన నేరగాడు మరియు టైటిల్ పాత్ర ల్యూపిన్ తన ప్రేయసి/ప్రత్యర్థి ఫుజికో పుట్టినరోజు కానుక ఇచ్చేందుకు బ్లాక్ పాంథర్ వజ్రాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తాడు. సాధారణంగా, దీనికి అడ్డుతగిలే ఇన్‌స్పెక్టర్ జెనిగాటాతో ల్యూపిన్ తలపడాల్సి ఉంటుంది, అయితే ఈ ఎపిసోడ్‌లో, జెనిగాటా ఒక క్లౌసెయు-స్ఫూర్తిదాయక పాత్ర ఇన్‌స్పెక్టర్ కానైసెయుతో సాయం పొందుతాడు. కోనిసెయు కాటో-స్ఫూర్తితో రూపొందించిన పాత్ర హాగీటోతో సాయం పొందాడు. ఎపిసోడ్‌లో ల్యూపిన్ మరియు కోనిసెయు ఒక న్యూడిస్ట్ (దుస్తులు ధరించకుండా ఉండే) కాలనీలోకి చొరబడతారు, ఎ షాట్ ఇన్ ది డార్క్‌లో క్లౌసెయు చేసినట్లుగా వీరు కూడా చేస్తారు. బ్లాక్ పాంథర్ వజ్రంపై ఒక కోణంలో కాంతి ప్రసారమైనప్పుడు దాని గుండా కార్టూన్ రూపంలోని నల్లని చిరుతపులి కనిపించడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఈ కార్టూన్ వజ్రానికి తన యొక్క జీవం పోస్తుంది, అనుకోకుండా దీనిని కిందపడేసినప్పుడల్లా, వజ్రం ఒక విడిచిపెట్టిన చిరుతపులి మాదిరిగా పరుగు తీస్తుంది, కార్టూన్ ప్రేక్షకులకు కనిపిస్తుంది.
 • యానిమేటెడ్ సిరీస్ జాకీ ఛాన్ అడ్వెంచర్స్‌‍లో "ఎంటర్...ది విపెర్" అనే ఒక ఎపిసోడ్‌లో, జాకీ చాన్ మరియు అతని మేనకోడలు "పింక్ పూమా" వజ్రాన్ని విపెర్ అనే మహిళా ఆభరణాల దొంగ నుంచి రక్షిస్తుంటారు.
 • ది సింప్సన్స్ ఎపిసోడ్ దిస్ లిటిల్ విగ్గీలో చీఫ్ విగ్గమ్ యొక్క టెలివిజన్‌పై ఒక ప్రకటనకర్త మనం ఇప్పుడు ది రిటర్న్ ఆఫ్ ది పింక్ పాంథర్‌కు చేరుకున్నామని చెబుతాడు, దీనిలో కెన్ వాల్ ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు పాత్ర పోషించారు.
 • ది సింప్సన్స్ సీజన్ 5 ఎపిసోడ్ "హోమెర్ ది విజిలాంట్"లో స్ప్రింగ్‌ఫీల్డ్ క్యాట్ బర్గ్‌లర్ పాత్ర ఫాంటోమ్ ఆధారంగా రూపొందించబడింది. సిమ్సన్స్ ఇంటికి అతను కన్నం వేసినప్పుడు నేపథ్య సంగీతం పింక్ పాంథర్ సంగీతాన్ని దాదాపుగా పోలివుంటుంది, చోరీ ప్రదేశంలో అతను ఒక ఆనవాలు విడిచి వెళతాడు. ప్రపంచంలో అతిపెద్ద క్యూబిక్ జిర్కోనియాను మ్యూజియం నుంచి అతను దొంగలిస్తాడు, పింక్ పాంథర్ వజ్రాన్ని ఫాంటోమ్ చోరీ చేసే సన్నివేశాన్ని ఇది దాదాపుగా పోలివుంటుంది. అతడిని పట్టుకున్నప్పుడు డేవిడ్ నివెన్-వంటి పాత్ర మాదిరిగా ఉండే ఒక శాంతమైన వ్యక్తిగా మారిపోతాడు.
 • యాపిల్ కంప్యూటర్‌ యొక్క ఒక ఐఫోన్ ప్రకటనలో ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు తన టెలిఫోన్‌లో క్లుప్తంగా సమాధానంగా ఇస్తున్నట్లు చూపించారు.
 • ఇన్‌స్పెక్టర్ గాడ్జెట్ చలనచిత్రంలో మినియాన్స్ యొక్క రహస్య సమావేశంలో కాటో పాత్ర కనిపిస్తుంది.
 • ఫ్యామిలీ గై ఎపిసోడ్ బ్రేకింగ్ అవుట్ ఈజ్ హార్డ్ టు డు లో ఒక ఆసియా పట్టణంలో జరిగే ఒక ఛేజ్ సన్నివేశం రివేంజ్ ఆఫ్ పింక్ పాంథర్‌ లో ఛేజ్ సన్నివేశానికి అనుకరణగా ఉంటుంది, ఈ సన్నివేశానికి అసలు సందర్భంలో వచ్చే సంగీతాన్ని ఉపయోగించడం జరిగింది.
 • పోకెమోన్ యానిమేషన్‌లో టీం రాకెట్ ఇతివృత్తం పింక్ పాంథర్ ఇతివృత్తం శైలి మరియు నిర్మాణం మాదిరిగానే ఉంటుంది, టీం రాకెట్ ప్రవర్తన యొక్క ఆకతాయి స్వభావంగా కారణంగా ఇది దానిని పోలినట్లు ఉంటుంది.[ఉల్లేఖన అవసరం]
 • ORB (వెంచర్ బ్రదర్స్ ఎపిసోడ్)లో బిల్లీ క్విజ్‌బాయ్ యొక్క పాత్ర తనను తాను ఫ్లోర్‌పై లాగుకునేందుకు ఉపయోగించే ఒక క్రాస్బౌ మరియు గ్రెయాసెడ్ పాడ్, ది పింక్ పాంథర్ చిత్రంలో మ్యూజియంలో చోరీ సన్నివేశంలో ఫాంటోమ్ యొక్క ఎత్తుగడను సూచిస్తుంది.

చలనచిత్ర సిరీస్ గణాంకాలు[మార్చు]

చలనచిత్రం విడుదల తేదీ ఆదరణ వసూళ్లు
ది పింక్ పాంథర్ (1963) 1963 డిసెంబరు 19 88% $10,878,107
ఎ షాట్ ఇన్ ది డార్క్ 1964 జూన్ 23 100% $12,368,234
ఇన్‌స్పెక్టర్ క్లౌసెయు జూలై 19, 1968 N/A N/A
ది రిటర్న్ ఆఫ్ ది పింక్ పాంథర్ 1975 మే 21 88% $41,833,347
ది పింక్ పాంథర్ స్ట్రైక్స్ ఎగైన్ 1976 డిసెంబరు 15 82% $33,833,201
రివేంజ్ ఆఫ్ ది పింక్ పాంథర్ జూలై 19, 1978 81% $49,579,269
ట్రయిల్ ఆఫ్ ది పింక్ పాంథర్ 1982 డిసెంబరు 17 27% $9,056,073
కర్స్ ఆఫ్ ది పింక్ పాంథర్ 1983 ఆగస్టు 12 23% $4,491,986
సన్ ఆఫ్ ది పింక్ పాంథర్ 1993 ఆగస్టు 27 18% $2,438,031
ది పింక్ పాంథర్ (2006) 2006 ఫిబ్రవరి 10 23% $158,851,357
ది పింక్ పాంథర్ 2 2009 ఫిబ్రవరి 6 13% $75,936,494

పింక్ పాంథర్ పాత్ర మరియు యానిమేటెడ్ కార్టూన్‌లు[మార్చు]

దస్త్రం:Pink Panther.png
పింక్ పాంథర్ కార్టూన్ పాత్ర

అసలు 1963 పింక్ పాంథర్ చలనచిత్రం విజయవంతమైంది, దీంతో యునైటెడ్ ఆర్టిస్ట్స్ అధికారులు ఈ పేరుతోనే ఒక వరుస యానిమేటెడ్ సిరీస్‌ను రూపొందించాలని నిర్ణయించారు. మాజీ వార్నర్ బ్రదర్స్ కార్టూన్స్ సృష్టికర్తలు డేవిడ్ హెచ్ డిప్యాటీ మరియు ఫ్రిజ్ ఫ్రెలెంగ్ నడుపుతున్న డిప్యాటీ-ఫ్రెలెంగ్ ఎంటర్‌ప్రైజెస్ ఫ్రెలెంగ్ దర్శకుడిగా ప్రారంభ క్రమాలను నిర్మించింది. UA ఒక సుదీర్ఘ పింక్ పాంథర్ లఘుచిత్రాల సిరీస్‌ను ప్రారంభించింది, వీటిలో మొదటిది 1964నాటి ది పింక్ ఫింక్ 1964 అకాడమీ అవార్డ్ ఫర్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ పురస్కారం గెలుచుకుంది. 1960వ దశకం చివరిలో, రూపొందించిన లఘు చిత్రాలు శనివారం ఉదయం కార్టూన్ కార్యక్రమాలుగా ప్రసారమయ్యాయి, కొత్త లఘు చిత్రాలను టెలివిజన్ ప్రసారాలు మరియు సినిమాహాళ్లలో విడుదలకు రెండింటికీ ఉద్దేశించి నిర్మించారు. యానిమేటెడ్ పింక్ పాంథర్ పాత్ర పర్సనల్ కంప్యూటర్‌లలో మరియు కన్సోల్ వీడియో గేమ్‌లలో కూడా కనిపించింది, వివిధ కంపెనీల ప్రకటనల్లో కూడా ఈ పాత్రను ఉపయోగించారు.

గమనికలు[మార్చు]

 1. ది డైమండ్ ఈజ్ కాల్డ్ ది "పింక్ పాంథర్" బికాజ్ ది ఫ్లా ఎట్ ఇట్స్ సెంటర్, వెన్ వ్యూడ్ క్లోజ్లీ, ఈజ్ సెయిడ్ టు రిజెంబుల్ ఎ లీపింగ్ పింక్ పాంథర్.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Pink Panther మూస:DePatie-Freleng Enterprises