పిఆర్ వరలక్ష్మి
పిఆర్ వరలక్ష్మి | |
---|---|
జాతీయత | ఇండియన్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1966 - 2008 2017 - ప్రస్తుతం |
పిల్లలు | ఇద్దరు ఆడపిల్లలు |
పిఆర్ వరలక్ష్మి (ఆంగ్లం: P. R. Varalakshmi) భారతీయ నటి. ఆమె 1970లు, 1980లలో ప్రధానంగా మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించింది. ఆమె 1980లలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది. హిందీ చిత్రాలలో కూడా నటించిన ఆమె ప్రస్తుతం పలు టీవి ధారావాహికలలో నటిస్తోంది. ఆమె 1972లో కె.ఎస్.గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన వఝైయాది వఝై సినిమాతో అరంగేంట్రం చేసి అన్నీ భాషల్లో దాదాపు 800 సినిమాల్లో నటించింది.[1]
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రామారావుతో కలిసి నటించింది. ఆమె ముత్తురామన్, అతని కుమారుడు కార్తీక్; శివాజీ గణేశన్, అతని కుమారుడు ప్రభు; తెలుగు సూపర్ స్టార్ కృష్ణ, అతని కుమారుడు మహేష్ బాబు.. ఇలా రెండు తరాలకు చెందిన నటులతో ఆమె నటించింది. ఆమె ప్రముఖ హీరోలు జెమినీ గణేశన్, కమల్ హాసన్ వంటి వారి సరసన నటించింది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]తెలుగు
[మార్చు]సంవత్సరం | సినిమా |
1967 | శ్రీ కృష్ణావతారం |
1972 | కొడుకు కోడలు |
1973 | ధనమా? దైవమా? |
1974 | మనుషుల్లో దేవుడు |
1974 | ఇంటి కోడలు |
1975 | తోట రాముడు |
1975 | జెబు దొంగ |
1975 | మాయా మచ్ఛీంద్ర |
1976 | ఈ కాలపు పిల్లలు |
1976 | సీతా కళ్యాణం |
1976 | భక్త కన్నప్ప |
1981 | స్వర్గం |
1981 | గడసరి అత్త సొగసరి కోడలు |
1982 | కలవారి సంసారం |
1984 | మయూరి |
1988 | ఇల్లు ఇల్లాలు పిల్లలు |
1988 | స్టేషన్ మాస్టర్ |
1989 | శ్రీదేవి కామాక్షి కటాక్షం |
1989 | చెన్నపట్నం చిన్నోళ్లు |
1990 | ఇదేం పెళ్లాం బాబోయ్ |
1992 | సంసారాల మెకానిక్ |
1992 | అసాధ్యులు |
1993 | అంకురం |
హిందీ
[మార్చు]- సీతా స్వయంవర్ (1976)
- దేవి దుర్గా శక్తి (2001)
- పార్ధై కీ పిచాయ్
టెలివిజన్ సీరియల్స్
[మార్చు]Year | Serial | Role | Language | Channel |
---|---|---|---|---|
1999–2000 | ఇది కథ కాదు | తెలుగు | ETV Telugu | |
2001–2002 | అత్తమ్మ | Gemini TV | ||
2005–2006 | సెల్వి | సరస్వతి | తమిళం | Sun TV |
2007–2009 | అరసి | |||
2007–2010 | అమ్మాయి కాపురం | తెలుగు | Gemini TV | |
2007–2008 | చెల్లమది నీ ఎనక్కు | తమిళం | Sun TV | |
2010–2012 | చెల్లామెయ్ | |||
2017–2018 | నినైక తేరింత మనమే | కామాక్షి | Star Vijay | |
2018–2019 | నీలకుయిల్ | |||
2019 | యారది నీ మోహిని | కులగిని | Zee Tamil | |
2019–2020 | తేన్మొళి B. A. | దేవనై | Star Vijay | |
2019–2022 | రోజా | అరుళ్వఖు అముతనాయకి | Sun TV | |
2021–present | కాట్రుకెన్న వెలి | Star Vijay | ||
2021–present | సుందరి | గంతిమతి | Sun TV | |
2022 | అమ్మన్ | తాయమ్మ | Colors Tamil | |
2022–present | పచ్చకిలి | |||
2022 | నినైతలే ఇనిక్కుమ్ | స్పెషల్ అప్పియరెన్స్ | Zee Tamil |
మూలాలు
[మార్చు]- ↑ "Senior Actress P R Varalakshmi About Her Personal Life Struggles - Sakshi". web.archive.org. 2023-01-24. Archived from the original on 2023-01-24. Retrieved 2023-01-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)