Jump to content

పిఎస్‌ఎల్‌వి-సీ39

వికీపీడియా నుండి

పిఎస్‌ఎల్‌వి-సీ39 ఉపగ్రహ వాహక నౌక ద్వారా వావిక్ ఉపగ్రహ వ్యవస్థకు చెందిన ఐఆర్‌ఎన్ఎస్‌ఎస్-1హెచ్ అను ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టుటకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్ణయించింది. పీఎస్ఎల్వీ-సీ39 ఉపగ్రహనౌక XL రకానికి చెందిన వాహకనౌక. XL రకం వాహక నౌకకు మామూలు పీఎస్ఎల్వీ-సీ39 ఉపగ్రహ నౌక కన్న మొదటి దశకు అదనంగా ఆరు స్ట్రాపాన్ బూస్టరు మోటరులు అదనంగా అమర్చబడి వుండును. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహం బరువు 1425 కిలోలు. నావిక్ ఉపగ్రహ వ్యవస్థకు సంబంధించి ఇంతవరకు మొత్తం ఏడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు. అందులో ఐఆర్‌ఎన్ఎస్‌ఎస్-1ఏ ఉపగ్రహంలోని 3 రూబీడియం అణు గడియారాలు సాంకేతిక లోపం ఏర్పడి పనిచెయ్యడం లేదు. ప్రస్తుతం ఐఆర్‌ఎన్ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహన్ని దాని స్థానంలో ప్రవేశపెట్టూటకై ఈ ప్రయోగాన్ని తలపెట్టారు ఈ రాకెట్ ప్రయోగానికి బుధవారం సాయంత్రం 2 గంటలకు (30 ఆగస్టు,2017)29 గంటల కౌంట్ డౌన్ మొదలైంది. 31 సాయంత్రం 7గంటలవరకు కొనసాగును.మొదట రాకెట్ ను31 ఆగస్టు సాయంత్రం 6:59కి ప్రయోగించాలని అనుకుని తరువాత ఒక నిమిషం ఆలస్యంగా 7:00గంటలకు ప్రయోగించుటకు నిర్ణయించారు.పిఎస్‌ఎల్‌వి-సీ39 ఉపగ్రహ వాహక నౌకను ఆగస్టు 31 సాయంత్రం 7:00గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో వున్న సతిష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు.కాని ప్రయోగం విఫలమైంది.[1]

పిఎస్‌ఎల్‌వి-సీ39 రాకెట్ నిర్మాణ వివరాలు

[మార్చు]

మొత్తం ఎత్తు 44.4 మీటర్లు.పిఎస్‌ఎల్‌వి-సీ39 వాహకనౌక మొత్తం బరువు 321 టన్నులు.పీఎస్ఎల్వీ-సీ39 ఉపగ్రహ నౌకలో మొత్తం నాలుగు దశలు ఉన్నాయి.మొదటి, మూడవ దశల్లో ఘన ఇంధన చోదక మోటారులు అమర్చబడి ఉన్నాయి.రెండవ, నాల్గవదశలో ద్రవఇంధన మోటారులు ఉన్నాయి.మొదటి కోర్ ఆన్ దశలో 138.2 టన్నుల ఘన ఇంధ నం నింపబడి ఉంది.దానికి అమర్చిన ఆరు బూస్టరు మోటారులలో 73.2 టన్నుల ఘనఇంధనం నింపబడి ఉంది. రెండవ దశలో 42 టన్నుల ద్రవ ఇంధనం ఉంది.అలాగే మూడవ దశలో 7.6టన్నుల ఘన ఇంధనం నింపారు.చివరి నాలగవ దశలో 2.5 టన్నుల ద్రవఇంధనం నింపబడి ఉంది. ప్రయోగం మొత్తం 19.35నిమిషాల్లో పూర్తవుతుంది.రాకెట్ మొదటి దశ 110 సెకన్లకు పూర్తవ్వుతుంది, రెండవదశ తరువాత 263 సెకన్లకు, మూడవ దశ606 సెకన్లకు పూర్తవ్వుతుంది. చివరి దశలో 1146కు పూర్తవ్వుతుంది. తరువాత 1165 సెకన్లకు ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టును. పీఎస్ఎల్వీ-సీ39 ఉపగ్రహనౌక పీఎస్ఎల్వీ శ్రేణికి చెందిన 41 ఉపగ్రహ వాహక నౌక కాగా, XL రకానికి చెంది 18 వ ఉపగ్రహ నౌక.

ప్రయోగ ఫలితం-విఫలం

[మార్చు]

పిఎస్‌ఎల్‌వి-సీ39 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విఫలం అయ్యింది. అనుకున్న విధంగా ఆగస్టు 31 సాయంత్రం 7:00 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగిసీంది. మొదటి రెందు దశలు సజావుగా జరిగాయి. కాని మూడవ దశలో ఉపగ్రహం చుట్టు రక్షణగా అమర్చిన ఉష్ణకవచం రాకెట్ నుండి వేరుపడలేదు. ఈ కారణం చేత రాకెట్ ఉష్ణరక్షక కవచంలో వుండిపోయ్యి కక్ష్యలో ప్రవేశించలేకపోయినది[2]. ప్రయోగించిన మూడు నిమిషాల 23 సెకన్లకు తెరచుకోవలసిన ఉష్ణరక్షక కవచం తెరచుకోలేదు. అందువలన ఉప భూఅనువర్తిత బదిలీ కక్ష్య రాకెట్ చేరినప్పటికి ఉపగ్రహం ఉష్ణరక్షక కవచంలో ఉండి పోయింది.రక్షక కవచంతో సహ ఉపగ్రహం కక్ష్యలో తిరగడం శాస్త్రవేత్తలు గుర్తించారు.[3] మొదటి సారిగా ప్రవేట్ సంస్థల భాగస్వామ్యంతో చేసిన రాకెట్ ప్రయోగం విఫలం అయ్యింది. పిఎస్‌ఎల్‌వి రాకెట్ కు సంబంధించి ఇది రెండవ ప్రయోగ విఫలం.1993 లో నవంబరు 20న ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-డీ1 రాకెట్ ప్రయోగంవిఫలం అయ్యింది. ఇప్పటి వరకు ఇస్రో 61 రాకెట్లను ప్రయోగించగా అందులో 55 ప్రయోగాలు విజయవంతం అయ్యాయి.

1979 నుండి 2017 ఆగస్టు 31వరకు విఫలమైన రాకెట్ల వివరాలు

[మార్చు]
  • 10-08-1979 ఎస్‌ఎల్‌వీ-డీ3ఈ1
  • ఏఎస్ఎల్‌వీ-డీ1
  • ఏఎస్ఎల్‌వీ-డీ2
  • పిఎస్‌ఎల్‌వి-డీ1
  • జీఎస్‌ఎల్‌వి-ఎఫ్02
  • జీఎస్‌ఎల్‌వి-ఎఫ్04
  • జీఎస్‌ఎల్‌వి-డీ3
  • జీఎస్‌ఎల్‌వి-ఎఫ్06

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "PSLV-C39 Flight Carrying IRNSS-1H Navigation Satellite Unsuccessful". isro.gov.in. Retrieved 2017-09-01.[permanent dead link]
  2. "పీఎస్‌ఎల్వీ-సీ39 ప్రయోగం విఫలం". sakshi.com. 2017-09-01. Archived from the original on 2017-09-03. Retrieved 2017-09-01.
  3. "PSLV-C39 mission fails". indiatimes.com. Times of India. Retrieved 2017-09-01.