పిచ్చావరం
పిచావరం | |
|---|---|
పిచావరం మడ అడవి | |
| నిర్దేశాంకాలు: 11°25′N 79°47′E / 11.41°N 79.78°E | |
| దేశం | |
| రాష్ట్రం | |
| జిల్లా | కడలూరు |
| తాలూకా | భువనగిరి |
| పట్టణ పంచాయతి | పరంగిపేట్టై |
| విస్తీర్ణం | |
• మొత్తం | 14.79 కి.మీ2 (5.71 చ. మై) |
| ఎత్తు | 6 మీ (20 అ.) |


పిచావరం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉన్న పరంగిపేట్టై గ్రామపంచాయతీ పరిధిలోని ఒక గ్రామం.[1][2] ఇది ఉత్తరాన వెల్లార్ నదీముఖం, దక్షిణాన కొల్లిడం నదీముఖం మధ్యలో ఉంది. వెల్లార్–కొల్లిడం నదీముఖ సముదాయం కలిసి కిల్లై వెనుకజలాలను (బ్యాక్‌వాటర్లు), కొద్ది అడుగుల లోతున్న నీటిలో శాశ్వతంగా వేరు పాతుకునే మడ అడవులను ఏర్పరుస్తాయి. ఇది చెన్నై నుండి 243 కి.మీ., కడలూరు పట్టణం నుండి 43 కి.మీ. దూరంలో ఉంది.
మడ అడవులు
[మార్చు]పిచావరంలో విస్తారమైన జలరాశి మధ్యలో అనేక చిన్న దీవులు ఉండి, వాటి అంతటా మడ అడవులు విస్తరించి ఉన్నాయి.[3] పిచావరం మడ అడవి భారతదేశంలోని అతిపెద్ద మడ అడవిలలో ఒకటి. 2019 నాటికి దీని విస్తీర్ణం సుమారు 45 చ.కి.మీ. ఈ అడవిని బంగాళాఖాతం నుండి ఒక ఇసుక దిబ్బ వేరు చేస్తుంది. ఈ జీవావరణంలో అవిచెన్నియా,రిజొఫోరా వంటి మొక్కల జాతులు పెరుగుతాయి. అలాగే ఆర్థికపరంగా ప్రాధాన్యమున్న అరుదైన షెల్‌ఫిష్‌లు, చేపల జాతులకు కూడా ఇది అనుకూల నివాసంగా ఉంటుంది.[4][5][6] తమిళనాడు ప్రభుత్వం చక్రవాతాలు, తుఫాను ఉప్పెనలు, తీరక్షీణత ప్రభావాలను తగ్గించడం, జీవ వైవిధ్యాన్ని, స్థానిక ప్రజల జీవనోపాధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కడలూరు జిల్లాతో పాటు మరో తొమ్మిది జిల్లాలలో కూడా మడ మొక్కలు నాటబడ్డాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2021 నుండి 2025 మధ్యకాలంలో ఈ పథకం కింద 2,900 హెక్టార్లకు (29 చ.కి.మీ.) పైగా మడ అడవులు కొత్తగా నాటబడ్డాయి లేదా పునరుద్ధరించబడ్డాయి.[7][8]
జంతుజాలం
[మార్చు]పిచావరం మడ అడవులు స్థానిక పక్షులతో పాటు వలస పక్షులను కూడా విశేషంగా ఆకర్షిస్తాయి. వీటిలో స్నైప్లు, కార్మోరెంట్లు, ఎగ్రెట్లు, కొంగలు, హెరాన్లు, స్పూన్‌బిల్లు, పెలికాన్లు ఉన్నాయి. ఇక్కడ 15 గణాలు, 41 కుటుంబాలకు చెందిన సుమారు 177 పక్షి జాతులు నమోదు చేయబడ్డాయి. నవంబరు నుండి జనవరి వరకు పక్షుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణాలు ఆహార జీవుల సమృద్ధిగా లభించడం, విదేశాల నుండి వచ్చే నిజమైన వలస పక్షులు, అలాగే భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంతానోత్పత్తి కేంద్రాల నుండి వచ్చే స్థానిక వలస పక్షుల రాక. కాలువలు, చిన్న జలమార్గాలు (క్రీక్‌లు), గండికలు, బురద మైదానాలు, ఇసుక మైదానాలు, సమీప సముద్రతీరం వంటి భిన్నమైన జీవావరణాలు అనేక పక్షి, జంతు జాతులకు అనుకూలమైన నివాసాలను అందిస్తాయి.
చిత్రమాలిక
[మార్చు]- పిచావరం మడ అడవులు
- మడ అడవుల పైభాగపు కప్పు
- మడ మొక్కల గగనమూలాలు
మూలాలు
[మార్చు]- ↑ "UNESCO list".
- ↑ "Mangrove forests". Archived from the original on 2009-12-10. Retrieved 2014-08-04.
- ↑ "Pichavaram Mangrove". Tamil Nadu Wetlands Mission. Archived from the original on 2025-01-19. Retrieved 2024-03-04.
- ↑ "Mangroves of INDIA". Tamil Nadu Agricultural University.
- ↑ "Top 5 Largest Mangrove and Swamp Forest in India". Archived from the original on 2022-08-16. Retrieved 2019-07-06.
- ↑ "Wayback Machine" (PDF). rsis.ramsar.org. Archived from the original (PDF) on 2023-04-24. Retrieved 2025-11-19.
{{cite web}}: Cite uses generic title (help) - ↑ "Tamil Nadu adds over 2,400 hectares of mangrove cover in four years". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2025-11-19.
- ↑ "World Mangrove Day: Tamil Nadu's renewed efforts add nearly 3,000 hectares of mangroves in three years". The Hindu (in ఇంగ్లీష్). Archived from the original on 2025-07-26. Retrieved 2025-11-19.