పిచ్చి కుసుమ మొక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిచ్చి కుసుమ మొక్క ఉష్ణమండల ప్రాంతపు మొక్క. కొన్ని ప్రాంతాల్లో దీన్ని వెర్రి కుసుమ, బలరక్కసి, హేమపుష్టి, నులిపుచ్చ, స్వర్ణపుష్పం, వర్ణక్షీణి అనికూడా అంటారట. దీని శాస్త్రీయ నామం ఆర్చిమోనా మెక్సికానా. మెక్సికో దేశంలో కూడా ఈ మొక్క కనిపిస్తుంది. భారతదేశంలో ఉష్ణప్రాంతాల్లో ఎక్కడ పట్టినా రస్తాల పక్కన, బీడు భూముల్లొ కనిపిస్తుంది. చెట్టు 3 అడుగులదాకా పెరుగుతుంది. ఆకులు బూడిదరంగులో, ఆకుల చివర ముళ్ళతో పచ్చని పూతతో కనిపిస్తాయి. ఆకులు తుంచితే బంగారు రంగు రసం స్ర విస్తుంది. వర్షాకాలం తర్వాత పుష్పించి, కాస్తుంది. పశువులలు మేసినా వాటికి కూడా ప్రమాదం. దీని కాయలు ఎండిన తరవాత చిట్లి నల్లగా ఆవాలంత సైజులో విత్తనాలు చెట్టు చుట్టూ వెదజల్లబడి మళ్ళీ మొలకలెత్తి పెరుగుతాయి. ఇది విషపు మొక్క అని భావిస్తారు కానీ ఇందులో చాలా ఔషధగుణాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యులు ఈ చెట్టునుంచి రకరకాల జబ్బులకు మందులు తయారుచేస్తారు. జ్వరం, నొప్పులు తగ్గడానికి, చర్మరోగాలకు ఇతర జబ్బులకు ఈ మొక్క నుంచి మందులు తయారుచేస్తారు. గింజలనుంచి నూనె తయారుచేస్తారు. ఈ నూనె ఆహారంలోకి వాడరాదు. సబ్బుల పరిశ్రమలోనూ, ఇతర పరిశ్రమలలోను కుసుమనూనె వాడుకచేస్తారు. అవినీతిపరులయిన కొందరు వ్యాపారులు ఈ నూనెను వంటనూనెలతో కల్తీచేస్తారు.

పిచ్చికుసుమను ఇంగ్లీషులో Argamone Mexica అని, Mexian Popy అనికూడా అంటారు. Mexican PricklyPopy, flowring thistle, cardo, Cardosanta వగాయిరా పేర్లతో వ్యవహరిస్తారు. ఇది popy జాతి మొక్క. అంటారు, దీని జన్మస్థానం మెక్సికో, ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. ఏటువంటి నెలల్లో ఏయినా ఈ మొక్క విస్తరిస్తుంది.

ఫోటోలు :శ్రీశైలం ప్రాంతంలో కాళిదాసు వంశీధర్ తీసినవి.

మూలాలు: Argemone mexicana essay in Wikipedia English, . Sankara Rao, K. Raja K Swamy, Deepak Kumar, Arun Sing R. and Gopala Krishna Bhat(219) Flora of Peninsular India.2. అందరికీ ఆయుర్వేదం, సంపాదకుడు;పండిత ఏల్చూరి, మే, 2006 సంచిక, పేజీ 192 .