పిజ్జా హట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Pizza Hut
రకంWholly owned subsidiary
స్థాపితంWichita, Kansas (1958)
వ్యవస్థాపకు(లు)Dan and Frank Carney
ప్రధానకార్యాలయంAddison, Texas, United States
కీలక వ్యక్తులుDavid C Novak (Chairman)
Scott Bergren (President)
పరిశ్రమRestaurants
ఉత్పత్తులుItalian-American cuisine
pizza · pasta · desserts
ఉద్యోగులుover 30,000
ఆదాయంPepsiCo (1977–1997)
Yum! Brands (1997–present)
వెబ్‌సైటుPizzahut.com

పిజ్జా హట్ (కార్పొరేట్ పరంగా ఇది పిజ్జా హట్, ఇంక్‌ గా సుపరిచితం.) అనేది ఒక అమెరికన్ రెస్టారెంట్ చైన్ మరియు అంతర్జాతీయ ఫ్రాంచైజ్‌. ఇది విభిన్న రకాల పిజ్జా లతో పాటు పాస్టా, బఫ్పలో వింగ్స్, బ్రెడ్‌స్టిక్స్, గార్లిక్ బ్రెడ్ లాంటి సైడ్ డిష్‌ లను కూడా అందిస్తుంది.

పిజ్జా హట్ అనేది యం బ్రాండ్స్, ఇంక్‌ (ప్రపంచంలోని అతిపెద్ద రెస్టారెంట్ కంపెనీ[1]) కి అనుబంధమైనది. ఇది దాదాపు 34,000 రెస్టారెంట్లు, డెలివరీ/క్యారీ-అవుట్ లొకేషన్స్ తో పాటు, 100 దేశాల్లో కియోష్క్ లను కూడా కలిగి ఉంది.

ప్రస్తుతం ఇది అడిషన్, టెక్సాస్[2] డల్లాస్ లోని ఉత్తరంలో ఉంది. ప్రస్తుతమున్న భవనాన్ని 1995లో లీజుకు తీసుకోగా, 2010 చివరినాటికి ఈ లీజు గడువు ముగుస్తుండడంతో పిజ్జా హట్ తన ప్రధాన కార్యాలయాలను దగ్గర్లోని ప్లేనోలో ఉన్న లెగసీ ఆఫీస్ పార్కుకు తరలించనుంది.[3][4]

భావన మరియు రూపం[మార్చు]

ఏథెన్స్ లో, పిజ్జా హట్ అంగడి ( వైవిధ్యమైన చూరు కలిగిన ) ఒహియో భిన్నమైన U .S పిజ్జా హట్ రెస్టారెంట్

పిజ్జా హట్ అనేది వివిధ రకాల రెస్టారెంట్లు రూపాల్లోకి విభజించబడింది; ప్రారంభపు ఫ్యామిలీ-స్టైల్ డైన్-ఇన్ కేంద్రాలు; స్టోర్ ఫ్రంట్ డెలివరీ మరియు క్యారీ-అవుట్ కేంద్రాలు; మరియు క్యారీ-అవుట్, డెలివరీ, డైన్-ఇన్ ఎంపికలను కలిగిన హైబ్రీడ్ కేంద్రాలు అనే రూపాల్లో ఇవి కనిపిస్తాయి. పూర్తి-స్థాయిలో ఉండే అనేక పిజ్జా హట్ కేంద్రాలు "మీరు తినగలిగినంత" పిజ్జా, సలాడ్, బ్రెడ్ స్టిక్స్, మరియు ఒక ప్రత్యేక పాస్టాలతో కలిపి లంచ్ బఫ్పే‌ " ను అందిస్తుంటాయి. దీంతోపాటు, పిజ్జా హట్ అనేది ఇతర అనేక వ్యాపార ఉద్దేశ్యాలను కూడా కలిగి ఉంది. ఇవి స్టోర్ రకం నుంచి ప్రత్యేకంగా ఉంటాయి; పిజ్జా హట్ "బిస్ట్రో" కేంద్రాలు అనేవి "రెడ్ రూఫ్" (ఎర్రటి పైకప్పు)లను కలిగి ఉంటాయి. ఇవి విస్తరించిన మెనూలను అందించడంతో పాటు కొన్ని ఉన్నతస్థాయి ఎంపికలను కూడా కలిగి ఉంటాయి.

సాంప్రదాయకంగా, పిజ్జా హట్‌ అనేది ఆహార పదార్థాల రకాల కంటే, అది అందించే ప్రత్యేకమైన వాతావరణం ద్వారా మరింతగా ఆదరణ పొందింది. బాగా ప్రాచుర్యం పొందిన "రెడ్ రూఫ్" పిజ్జా హట్ కేంద్రాలు అమెరికా మొత్తం మీద విరివిగా కనిపిస్తాయి. అలాగే, కొద్ది మొత్తంలో బ్రిటన్, ఆస్ట్రేలియాలలో కూడా ఇవి దర్శనమిస్తాయి. ఈ రకమైన కేంద్రాలు చాలావరకు డెలివరీ/క్యారీఅవుట్ సేవలను అందిస్తుంటాయి. 1960లు మరియు 1970లలో ఈ రకమైన భవన శైలి సర్వసాధారణంగా కనిపించేది. ప్రస్తుతం మాత్రం "రెడ్ రూఫ్" అనే పేరుకు కాలం చెల్లిపోవడంతో, అనేక కేంద్రాలు గోధుమ రంగు పైకప్పులతో ఉంటున్నాయి; కొన్నాళ్లపాటు రెడ్ రూఫ్‌తో దర్శనమిచ్చిన ఈ కేంద్రాలు మూసివేయడం లేదా మరోచోటుకు తరలిపోవడం/పునఃనిర్మించడం లాంటివి జరిగాయి. 1980ల్లో ఈ కంపెనీ డెలివరీ/క్యారీఅవుట్‌లతో పాటు ఇతర విజయవంతమైన రూపాలైన ఫాస్ట్ ఫుడ్‌ "ఎక్స్ ప్రెస్" నమూనాలోకి ప్రవేశించింది.

చివరకు, "పిజ్జా హట్ ఎక్స్ ప్రెస్" మరియు "ది హట్" కేంద్రాలు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లుగా రూపొందాయి. సాంప్రదాయక పిజ్జా హట్‌లలో కనిపించని అనేక ఉత్పత్తులతో కలిసిన ఒక పరిమిత మెనూను ఈ కేంద్రాలు అందిస్తాయి. ఈ రకమైన దుకాణాలు తరచూ సంయుక్త కేంద్రాలుగా ఏర్పాటైన కేంద్రంలో సోదర బ్రాండ్లతో కలిసి జతగా ఏర్పాటవుతుంటాయి. వింగ్ స్ట్రీట్, KFC లేదా టాకో బెల్ లాంటి బ్రాండ్లతో కలిసి ఏర్పాటయ్యే ఈ రకమైన పిజ్జా హట్ కేంద్రాలు కళాశాల క్యాంపస్‌లు, ఫుడ్ కోర్టులు, థీమ్ పార్కులు, టార్గెట్ లాంటి దుకాణాల్లోనూ దర్శనమిస్తుంటాయి.

చరిత్ర[మార్చు]

మొదటి పిజ్జా హట్ భవనంలో వున్నా అలంకార పళ్ళెం ఒక్కోసారి బాక్స్ లో కనిపిస్తుంది.1970 నుంచి 1985 వరకు దీన్ని ప్రదర్శించారు.

పిజ్జా హట్ అనేది 1958లో స్థాపితమైంది. డాన్ మరియు ఫ్రాంక్ కర్నే సోదరులు తమ సొంత ప్రాంతమైన విచిత, కాన్సాస్‌ లో దీన్ని ఏర్పాటు చేశారు.[5] పిజ్జా పార్లర్‌ ను ప్రారంభించమని ఒక స్నేహితుడు ఇచ్చిన సలహా విజయవంతం కాగలదని భావించిన ఆ సోదరులు, భాగస్వామి జాన్ బెండెర్‌ తో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం తమ తల్లి వద్ద నుంచి 600 డాలర్లు అప్పుగా తీసుకున్నారు.[ఆధారం కోరబడింది] డౌన్‌టౌన్ విచితలోని 503 సౌత్ బ్లఫ్ వద్ద ఒక చిన్న భవనాన్ని అద్దెకు తీసుకోవడంతో పాటు, పిజ్జాల తయారీ కోసం కొన్ని పాత పరికరాలను వారు కొనుగోలు చేశారు, ఈ విధంగా కర్నే సోదరులు, బెండర్‌లు కలిసి మొట్టమొదటి "పిజ్జా హట్" రెస్టారెంట్‌ను ప్రారంభించారు; ప్రారంభోత్సవం రోజు రాత్రి, ప్రజలకు పిజ్జాపై మక్కువ పెంచడం కోసం అందరికీ పిజ్జాలను బహుమతిగా అందజేశారు. మరోవైపు వారు కొనుగోలు చేసిన సంకేతం కేవలం తొమ్మిది అక్షరాలు సరిపోయేంత చోటును మాత్రమే కలిగి ఉండడంతో వారు "పిజ్జా హట్" అనే పేరును ఎంచుకున్నారు.[6] 1959లో టొపెకా, కాన్సాస్‌ లో మొదటి ఫ్రాంచైజ్ యూనిట్ ప్రారంభం కావడంతో పిజ్జా హట్‌కు సంబంధించి అదనపు రెస్టారెంట్లు తెరుచుకోవడం కూడా ప్రారంభమైంది. అటుపై మొట్టమొదటగా ఏర్పాటు చేసిన పిజ్జా హట్ భవనం కూడా విచిత స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి మార్చబడింది.[7]

పిజ్జా హట్ రేస్టారెంట్ యొక్క ప్రాధమిక రూపము(1950–1961). ఈ ప్రాధమిక రూపాల పిజ్జా హట్ కేవలం నలుగు ప్రదేశాల్లో వాడటం జరిగింది. ఈ వర్తన యొక్క పట్టికలో చాలా కొన్ని పదార్ధాలు మాత్రమే ఉన్నవి.

మంచి ప్రమాణాలతో నిండిన ఖ్యాతిని తాము సాధించాలని డాన్ మరియు ఫ్రాంక్‌ కార్నేలు నిర్ణయించారు. దీంతో కార్నే సోదరులు విచిత వాస్తుశిల్పి రిచర్డ్ డి. బూర్కే ను సంప్రదించారు. ఆయన పిజ్జా హట్‌కు ప్రత్యేకమైన నాలుగు వైపుల వాలుగా ఉండే కప్పు రూపాన్ని, నిర్థిష్టమైన లేఅవుట్‌ను అందించారు. ఈ రకమైన నిర్మాణం ద్వారా అప్పటికే పశ్చిమ తీరంలో విస్తరించిన షేకీస్ పిజ్జా నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడగలమని కార్నే సోదరులు భావించారు.[8] స్నేహితులు, వ్యాపార సంస్థల ద్వారా ఫ్రాంచైజ్ నెట్‌వర్క్ క్రమంగా వృద్ధి చెందడం ప్రారంభమైంది, దీంతో వినియోగదారులు పిజ్జా హట్‌లను సులభంగా గుర్తించడం కోసమై 1964లో విశిష్టమైన ప్రమాణికతతో నిండిన భవన నిర్మాణంతో పాటు, ఫ్రాచైంజ్, కంపెనీకి స్వంతమైన స్టోర్ల కోసం లేఅవుట్‌ను కూడా సిద్ధం చేశారు.

1972 నాటికి 314 దుకాణాలతో విస్తరించడంతో, స్టాక్ టికర్ సంకేతం కింద న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజ్‌ పై పిజ్జా హట్ సార్వజనీక ప్రకటన కు సిద్ధమైందిNYSE: PIZ. 1978లో పిజ్జా హట్‌ను పెప్సికో సొంతం చేసుకుంది. దీంతోపాటు కొన్నాళ్లకు KFC , టాకో బెల్‌ లను కూడా పెప్సికో స్వాధీనం చేసుకుంది. 1997లో ఈ మూడు రెస్టారెంట్ చైన్లు ట్రికోన్‌ లోకి విలీనమయ్యాయి, అలాగే 2001లో లాంగ్ జాన్ సిల్వర్స్ తో చేరడంతో పాటు A&W రెస్టారెంట్లు యం బ్రాండ్లు గా మారాయి. ప్రపంచంలో ఇప్పటికీ అమ్మకాలు సాగిస్తున్న అత్యంత పాతదైన పిజ్జా హట్ కేంద్రం మ్యాన్‌హట్టన్, కాన్సాస్‌ లో ఉంది. అగ్గియేవిల్లే గా సుపరిచితమైన షాపింగ్, టవేరన్ జిల్లాలోని కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ దగ్గర్లో ఈ పిజ్జా హట్ అమ్మకాలు జరుపుతోంది.

ఉత్పత్తులు[మార్చు]

పిజ్జా హట్ ఉత్పత్తులైన "స్టఫ్‌డ్ క్రస్ట్" పిజ్జా అనేది బయటి అంచు చుట్టూ మొజ్జరెల్లా ఛీజ్‌తో నింపబడి ఉంటుంది; "హ్యాండ్-టోస్డ్" అనేది చాలా వరకు సంప్రదాయ పిజ్జేరియా క్రస్ట్ లాగా ఉంటుంది; "తిన్ 'ఎన్ క్రిస్పీ" అనేది పలుచని, కరకరలాడే పిండిముద్ద లాగా ఉంటుంది. ఇది పిజ్జా హట్ యొక్క నిజమైన రూపం; "డిప్పిన్' స్ట్రిప్స్ పిజ్జా" అనేది చిన్న ముక్కలుగా చేసిన ఒక పిజ్జా, ఇది ఒక్కోసారి అనేక రకాలైన సాస్‌లలో ముంచబడుతుంది; ఇక "ది ఎడ్జ్ పిజ్జా"లో పిజ్జా యొక్క అంచు వరకు టోపింగ్స్ తో నిండి ఉంటుంది. పిజ్జా హట్ యొక్క పాన్ పిజ్జా లాగా మందంగా కాకుండా, దాని పలుచని క్రస్ట్ లాగా పలుచగా కాకుండా గతంలో ఒక క్రస్ట్ కూడా ఉండేది. ఈ క్రస్ట్ ను ఫుల్ హౌస్ XL పిజ్జాపై ఉపయోగించేవారు. అయితే, 2007లో దీనిని తయారు చేయడం నిలిపేశారు.[9]

కొత్త రకమైన ఉత్పత్తులతో పిజ్జా హట్ నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. అదేసమయంలో తక్కువ విజయవంతమైన వాటిని తయారు చేయడం ఆపివేస్తుంటుంది. ఇలా ఆపివేసిన వాటిలో ప్రప్రథమంగా ప్రజాదరణ పొందిన రెండు- అడుగుల పొడవు, ఒక-అడుగు వెడల్పు పిజ్జా అయిన బిగ్‌ఫుట్, తీపి సాస్‌తో తయారుచేసిన 16 ఇంచుల బిగ్ న్యూ యార్కర్, చికాగో డిష్ పిజ్జా, సిసిలియాన్ పిజ్జాలు ఉన్నాయి. సిసిలియాన్ పిజ్జా అనేది అటుపై 2006లో లసగ్నా పిజ్జా పేరుతో ప్రవేశపెట్టబడింది. పిజ్జా హట్ ప్రవేశపెట్టిన ఇతర ఉత్పత్తులైన "పి'జోన్" అనేది పిజ్జా హట్ యొక్క కాల్‌జోన్ రూపాంతరము; చీజీ బైట్స్ పిజ్జా అనేది స్టప్‌డ్ క్రస్ట్ పిజ్జాను పోలి ఉంటుంది.అయితే, ఇందులోని క్రస్ట్ 28 ముక్కలుగా ఉండడంతో పాటు అవి వేటికవి విడిగా ఉంటాయి; ఇక ఇన్‌సైడర్ పిజ్జా అనేది రెండు పొరల రొట్టె పిండి మధ్య ఒక పొర చీజ్‌ తో నిండి ఉంటుంది. పరిమిత కాలానికి ప్రవేశపెట్టబడిన మరో ఉత్పత్తి అయిన డీప్ పిజ్జా అనేది రెట్టింపు టాపింగ్స్ తో పాటు 50% ఎక్కువ చీజ్‌ను కలిగి ఉంటుంది. ఈ పిజ్జాపై ఉండే టాపింగ్స్ ను పట్టి ఉంచేందుకు పై భాగంలోని అంచు మొత్తం పిండితో చుట్టినట్టు ఉంటుంది. 1985లో ప్రియజ్జో[10] పేరుతో పిజ్జా హట్ కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. రెండు-క్రస్ట్ లతో ఉండే ఈ ఇటాలియన్ రకం డీప్-డిష్ పిజ్జాను పోలి ఉంటుంది. ఇతర రకాల ఉత్పత్తులైన ప్రియజ్జో మిలానో అనేది ఇటాలియన్ సాసేజ్, పెప్పరోని, బీప్, ఫోర్క్ ముక్కలు, మొజ్జరెల్లా, చెద్దార్ చీజ్‌ల కలయికతో తయారవుతుంది; ప్రియజ్జో ఫ్లోరెన్టినే అనేది ఉడకబెట్టిన పంది తొడ మాంసము, బచ్చలికూర ముక్కలతో పాటు ఐదు చీజ్‌ల కలయికతో తయారవుతుంది. అలాగే ప్రియజ్జో రోమా అనేది పెప్పరోని, పుట్టగొడుగులు, ఇటాలియన్ సాసేజ్, పోర్క్ ముక్కలు, ఉల్లిపాయలు, మెజ్జరెల్లా, చెద్దార్ చీజ్‌లతో నింపబడి ఉంటుంది. డబుల్-క్రస్టడ్ పీ పైభాగంలో టమోటో సాస్, కరిగించిన చీజ్‌లతో నిండిన ఒక పొర ఉంటుంది. ఈ ప్రియజ్జో అనేది 15 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రచారం నిర్వహించడం ద్వారా అత్యంత ఘనంగా ప్రవేశపెట్టబడింది. అయితే, దీని తయారీకి శ్రామికుల అవసరం ఎక్కువగా ఉండడంతో చాలా ఏళ్ల తర్వాత దీనిని మెనూ నుంచి తొలగించారు.

బుఫ్ఫెల్లో వింగ్స్

వ్యక్తిగత రెస్టారెంట్ పరిమాణంపై ఆధారపడినప్పటికీ, పిజ్జా హట్‌లు సైతం స్పాగెట్టి, కవటిని లాంటి పాస్తా డిన్నర్లను అందిస్తాయి. ఇవి కవటెల్లి (పెంకులు), రోటిని (సర్పిలాలు), రోటెల్లె (చక్రాలు) కలయికతో ఉంటాయి.

పిజ్జా హట్ బిస్ట్రో ప్రధాన ప్రదేశం ఇండియానాపోలిస్ లో ఉంది.

"పిజ్జా హట్ ఇటాలియన్ బిస్ట్రో" పేరుతో 2004లో ఒక కొత్త అప్‌స్కేల్ కాన్సెప్ట్ తెరవబడింది. దేశవ్యాప్తంగా యాభై ప్రదేశాల్లో తెరవబడిన ఈ బిస్ట్రోలు సంప్రదాయ పిజ్జా హట్‌ను పోలి ఉంటాయి. అయితే, ఇటాలియన్ రుచులైన పెన్నే పాస్తా, చికెన్ పొమొడొరో, టోస్టెడ్ శాండ్‌విచ్‌లు, ఇతర ఆహార పదార్ధాలను కలిగి ఉండడం ద్వారా ఇవి భిన్నత్వాన్ని ప్రదర్శిస్తాయి.[11] నలుపు, తెలుపు, ఎరుపు రంగులకు బదులుగా బిస్ట్రో కేంద్రాలనేవి బర్గండీ, టాన్ మోటిఫ్ రంగుల్లో కనిపిస్తాయి.[12] పిజ్జా హట్ బిస్ట్రోలు ఇప్పటికీ సంప్రదాయ పిజ్జాలను, అలాగే సైడ్‌లను అందిస్తున్నాయి. మరికొన్ని సమయాల్లో, పిజ్జా హట్ అనేది "రెడ్ రూఫ్" నుంచి కొత్త కాన్సెప్ట్ లోకి మార్పు చెందడం జరిగింది.

పిజ్జా హట్ పిజ్జా కొత్త వెర్షన్‌గా వచ్చిన పిజ్జా మియా అనే పిజ్జా తేలికపాటి టాపింగ్‌తో ఉంటుంది, ఇది 2007లో పరిచయమైంది. తక్కువ ధరకు లభించే పిజ్జాల కోసం ఎదురుచూసే వినియోగదారుల విభాగం లక్ష్యంగా ఈ ఉత్పత్తి తెరమీదకు వచ్చింది. దీని ధర డోమినోస్ 555 డీల్‌ను పోలి ఉంటుంది. మూడు లేదా అంతకంటే ఎక్కువతీసుకున్నట్టైతే, ఒక్కో పిజ్జా ధర ఐదు డాలర్లుగా ఉంటుంది. దీంతో పోల్చినపుడు పిజ్జా హట్ అందించే మధ్యరకం పరిమాణంలోని హ్యాండ్-టోస్‌డ్ పెప్పరోని పిజ్జా అనేది అంతర్జాతీయంగా 10.24 డాలర్లుగా (డల్లాస్, టెక్సాస్ 1/1/2009) ఉంటుంది. పిజ్జా మియా అనేది కేవలం ఒకే పరిమాణం (మధ్యరకం) లో లభించడంతో పాటు అదనపు టాపింగ్స్ శ్రేణి $1.25 నుంచి $1.49 వరకు ఉంటుంది. పిజ్జా హట్ పిజ్జా మియా యొక్క ఒక్క ముక్క బరువు 83 గ్రాములుగా ఉండగా, పిజ్జా హట్ పెప్పరోని హ్యాండ్-టోస్‌డ్ పిజ్జా బరువు 96 గ్రాములుగా ఉంటుంది.[13]

మే 9, 2008న సియాటిల్, డెన్వర్, డల్లాస్‌ లలో "ది నేచురల్" పేరుతో తయారు చేసిన ఉత్పత్తిని పిజ్జా హట్ అమ్మకానికి పెట్టింది. ఈ కొత్త సకల- సహజసిద్ధ బహుళ- ధాన్యాల క్రస్ట్ అనేది తేనెతో కలిసి తీయగా ఉండడంతో పాటు, సేంద్రియ టమోటాలతో చేసిన ఎర్పటి సాస్‌ను మరియు పైన సకల-సహజసిద్ధ చీజ్ (లేదా సకల-సహజసిద్ధ చికెన్ సాసేజ్ మరియు వేయించిన ఎర్రటి మిరియాలను) కలిగి ఉంటుంది. ఒక టాపింగ్‌తో ఉండే మధ్యరకం పరిమాణంలోని నేచురల్ పిజ్జా 9.99 డాలర్లకు అమ్మబడింది. డల్లాస్ మార్కెట్ నుంచి ఇది అక్టోబర్ 27, 2009లో తొలగించబడింది.[14] ప్రారంభంలో ఇది దేశవ్యాప్త ప్రకటనల ప్రచారంతో వినియోగదారుల ముందుకు వచ్చింది. 2008లో సైతం, పిజ్జా హట్ తన అతిపెద్ద పిజ్జా అయిన పనరమౌస్ పిజ్జాను తయారుచేసింది. జూన్ 21, 2009లో పిజ్జా హట్ తన బిగ్ ఈట్ టినీ ప్రైస్ మెనూను ప్రవేశపెట్టింది. ఈ మెనూ కొత్త పిజ్జా రోల్స్, పి'జోన్ పిజ్జా, కొత్త పర్సనల్ పనోరమౌస్ పిజ్జా, పిజ్జా మియా పిజ్జాను కలిగి ఉండడంతో పాటు, ప్రతి ఒక్క పిజ్జా ధర 5.00 డాలర్లు లేదా 5.99 డాలర్లతో ప్రారంభమయ్యే విధంగా ఉంటుంది.

ఇక ఆగస్టు 23, 2009లో ఒక టాపింగ్స్ కోసం 10.99 డాలర్లు, ప్రత్యేకమైన దానికోసం 13.99 డాలర్లు ధరతో పిజ్జా హట్ తన స్టప్‌డ్ పాన్ పిజ్జాను ప్రవేశపెట్టింది. క్రస్ట్ లోపల సాధారణ స్టప్‌డ్ క్రస్ట్ చీజ్‌ లేనట్టుగా కాకుండా, పాన్ క్రస్ట్ లోకి నొక్కబడి ఉంటుంది.

ప్రకటనలు[మార్చు]

"పుట్ పుట్ టు పిజ్జా హట్" అనేది పిజ్జా హట్ యొక్క మొట్టమొదటి ప్రకటన. ఒక వ్యక్తి టేక్-అవుట్‌కు ఫోన్ చేసి పిజ్జాకు ఆర్డర్ ఇవ్వడంతో ఈ ప్రకటన ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి తన 1965 ముస్తాంగ్ JRలో పిజ్జా హట్‌కు బయలుదేరుతాడు. ఆ సమయంలో కొంతమంది నగరవాసులు అతని వెంటపడుతారు. పిజ్జా హట్‌కు వెళ్లిన ఆ వ్యక్తి పిజ్జా తీసుకుని ఇంటికి చేరగానే, అతన్ని తరుముకొచ్చిన వారంతా అతను తెచ్చిన పిజ్జాను పూర్తిగా తినేస్తారు. దీంతో నిరాశ చెందిన అతను మళ్లీ పిజ్జా హట్‌కు ఫోన్ చేయడంతో ఈ ప్రకటన పూర్తవుతుంది.

2007 ప్రారంభం వరకు "గేథెర్ 'రౌండ్ ది గుడ్ స్టఫ్" అనేది పిజ్జా హట్ ప్రధాన వ్యాపార ప్రకటన నినాదం. ప్రస్తుతం మాత్రం "నౌ యుయార్ ఈటింగ్!" అనేది పిజ్జా హట్ నినాదం. పిజ్జా హట్‌కు అధికారికంగా అంతర్జాతీయ మస్కట్‌ లాంటిదేమీ లేదు. అయితే, ఒకసారి మాత్రం వారు అమెరికాలో 'ది పిజ్జా హెడ్ షో పేరుతో వ్యాపార ప్రకటనలు నిర్వహించారు. 1993 నుంచి 1997 వరకు ఈ ప్రకటనల పర్వం కొనసాగింది. అలాగే 1970లలో వచ్చిన సాటర్‌డే నైట్ లైవ్ కార్యక్రమంలోని మిస్టర్ బిల్ షార్ట్స్ పై ఆధారపడడం జరిగింది. ఈ ప్రకటనల్లో కనిపించే పిజ్జా ముక్కకు టాపింగ్స్ ద్వారా రూపం దిద్దబడి ఉండడంతో పాటు దానిని 'పిజ్జా హెడ్' పేరుతో పిలిచేవారు. 1970ల్లో "పిజ్జా హట్ పేట్" పేరుతో పిలిచే ఒక ఉల్లాసవంతుడైన వ్యక్తి బొమ్మతో పిజ్జా హట్ ఒక ప్రకటనను తయారు చేసింది. సంచీలు, కప్పులు, బెలూన్లు, పిల్లల కోసం చేసిన చేతి బొమ్మలు లాంటి వాటిపై ఈ బొమ్మను ముద్రించారు. 1990ల్లో ఆస్ట్రేలియాలో, డౌగే అని పిలిచే డెలివరీ బాయ్‌ రూపాన్ని వ్యాపర ప్రకటన మస్కట్‌గా ఉపయోగించారు. చిలిపి రూపంతో అందంగా కనిపించే ఆ కుర్రాడు తన తండ్రికి పిజ్జాను అందించే సమయంలో "హియర్స్ ఏ టిప్: బి గుడ్ టు యువర్ మదర్" అనే నినాదాన్ని వింటుంటాడు.

దస్త్రం:Pizzahutpanpizza.JPG
పిజ్జా హట్ కోసం ఓల్డ్ ఇన్ రెస్టారెంట్ ప్రకటించిన ప్రకటన "పాన్ పిజ్జా".

1989 సినిమా బ్యాక్ టు ది ఫ్యూచర్ పార్ట్ " ను పిజ్జా హట్ స్పాన్సర్ చేసింది. ఇందులో భాగంగా,పిజ్జా హట్ పిజ్జాను కొనుగోలు చేసిన వారికి భవిష్యకాల లక్షణాలు గల "సోలార్ షేడ్స్"గా సుపరిచితమైన సన్‌గ్లాసెస్ జతను అందజేసింది. ఉత్పత్తి ప్రోత్సాహంలో భాగంగా ఈ సినిమాలోనూ పిజ్జా హట్ దర్శనమిచ్చింది. మెక్‌ఫ్లే కుటుంబం డిన్నర్ చేసే సన్నివేశంలో మైలర్ డీహైడ్రేటెడ్ పిజ్జా కాగితం పక్కభాగంలో పిజ్జా హట్ ట్రేడ్‌మార్క్ అయిన రెడ్ హట్ ముద్రించబడి ఉంటుంది. అలాగే, 2015 హిల్ వ్యాలీ సన్నివేశంలోనూ పిజ్జా హట్ స్టోర్ ముందరిభాగం దర్శనమిస్తుంది.[15]

1990 NES గేమ్ అయిన టీనేజ్ మ్యూటెన్ట్ నింజ టర్టెల్స్ II: ది ఆర్కేడ్ గేమ్ , ఉచిత పిజ్జా కుపన్‌తో నిర్వహించబడింది. ఈ గేమ్ మొత్తం పిజ్జా హట్ ప్రకటనలతో నిండి ఉండడంతో పాటు, పాత్రల జీవితం కూడా పిజ్జా ద్వారానే తిరిగి పూరించబడుతుంది.

1994లో డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన మాజీ భార్య ఇవానా ట్రంప్‌ లు ఒక పిజ్జా హట్ ప్రకటనలో నటించారు. ఈ ప్రకటన చివర్లో ఇవానా ట్రంప్ చివరి ముక్క కోసం అడుగుతుంది. అప్పుడు డొనాల్డ్ "ప్రియతమా నిజానికి నీవు మాత్రమే అర్ధబాగానికి అర్హురాలివి" అని అంటాడు. అయితే, నిజజీవితంలో మాత్రం ఈ జంట ఇటీవలే విడాకులు తీసుకుంది.

1995లో రూపొందిన పిజ్జా హట్ ప్రకటనలో రింగో స్టార్ నటించాడు. ఇందులో ది మంకీస్ బృందం కూడా దర్శనమిచ్చింది. అదే సంవత్సరంలో రూపొందించిన మరో ప్రకటనలో రష్ లింబగ్ నటించాడు. ఈ ప్రకటనలో భాగంగా "ఎవరూ తనకంటే సరైనవారు కాదు" అని రష్ గొప్పలు పలికినప్పటికీ, మొదటిసారి తాను ఒక తప్పు చేయనున్నానని, పిజ్జా హట్‌లో పాల్గొని "మొదట పిజ్జా క్రస్ట్ తింటానని" చెబుతాడు.

మరో ప్రకటనలో భాగంగా టాక్ షో అతిథి జోనాథన్ రోస్, అమెరికన్ మోడల్ కాప్రిసే బౌరెట్‌తో కలిసి నటించాడు. స్టఫ్‌డ్ క్రస్ట్ పిజ్జా కోసం వీరిద్దరూ ఈ యాడ్‌లో నటించారు. ఇందులో జోనాథన్ 'R' అనే అక్షరాన్ని ఉచ్చరించేందుకు తంటాలు పడుతూ, పిజ్జా పేరును "స్టఫ్‌డ్ క్వస్ట్" అని ఉచ్చరిస్తుంటాడు.

దస్త్రం:Tv ads pizza hut muppets.jpg
మాప్పేట్స్ ను ప్రసారించిన పిజ్జా హట్ ప్రకటన (2003–2005).

మరో బ్రిటన్ ప్రకటనలో భాగంగా బ్రిటీష్ ఫార్ములా ఒన్ డ్రైవర్ డెమోన్ హిల్, ఒక పిజ్జా హట్ రెస్టారెంట్‌కు వచ్చి ఒక పిజ్జా కోసం ఆర్డర్ ఇస్తాడు. ఆయనతో పాటు ప్రముఖ ఎఫ్ 1 వ్యాఖ్యాత ముర్రే వాకర్ కూడా ఆ రెస్టారెంట్‌కు విచ్చేస్తాడు. అది ఫార్ములా ఒన్ రేస్ కానప్పటికీ, హిల్ పిజ్జా తింటున్న తీరును ముర్రే వాకర్ వ్యాఖ్యానించడం ప్రారంభిస్తాడు. హిల్ పిజ్జా తింటుంటే, వాకర్ మాత్రం, 1994 & 1995 సీజన్లలో హిల్ పాల్గొన్న ఫార్ములా ఒన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ గురించి మాట్లాడుతుంటాడు. ఆ పోటీల్లో హిల్ రెండో స్థానంలో నిలవడం, ఆ రెండు పోటీల్లో మైకెల్ షూమేకర్ విజయం సాధించడాన్ని గుర్తు తెచ్చుకుని "హిల్ మళ్లీ రెండో స్థానంలో పోటీ పూర్తి చేశాడు" అంటూ వాకర్ గట్టిగా అరుస్తాడు. దీంతో హిల్‌కు కోపం వచ్చి వాకర్‌ చొక్కా పట్టుకుని గట్టిగా ఊపేస్తాడు. అయినప్పటికీ, వాకర్ మాత్రం తన వ్యాఖ్యానం మానుకోకుండా "అతను మొదటి స్థానాన్ని కోల్పోయాడు.అలాగే అతను నియంత్రణ కోల్పోయాడు" అని ఆపకుండా చెబుతూనే ఉంటాడు.

యూరో 96 సెమీ-ఫైనల్‌లో పెనాల్టీలను గోల్స్ గా మార్చలేక జర్మనీ చేతిలో ఇంగ్లాండ్ పరాజయం పొందిన సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లైన గారెథ్ సౌత్‌గేట్, స్టౌర్ట్ పియర్స్, క్రిస్ వడ్‌లే] లతో పిజ్జా హట్ ఒక ప్రకటన రూపొందించింది. ఈ ప్రకటనలో భాగంగా, సౌత్‌గేట్ తన తలకు ఒక కాగితం సంచీని తగిలించుకుని ఉంటాడు. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో కీలకమైన పెనాల్టీ అవకాశాన్ని కోల్పోవడానికి సౌత్‌గేట్ కూడా కారణం కావడంతో అవమాన భారంతో ఉన్న అతను అలా కాగితం సంచిని తలకు తగిలించుకుంటాడు. అదేసమయంలో ఇటాలియా 90లో పెనాల్టీ కిక్‌లను గోల్స్ గా మార్చలేకపోయిన పియర్స్, వడ్‌లేలు మాత్రం అతని పక్కన కూర్చుని మాట్లాడే ప్రతి మాటలో 'కోల్పోయావు' అనే పదాన్ని నొక్కిచెప్పడం ద్వారా, సౌత్‌గేట్‌ను ఆటపట్టిస్తుంటారు. అయితే, పిజ్జా తినడం పూర్తి చేసిన సౌత్‌గేట్ తలకు ఉన్న కాగితం సంచీని తీసివేసి, బయటకి వెళ్లబోతుండగా పొరబాటున అతని తల గోడకి గుద్దుకుంటుంది. అప్పడు పియర్స్ అతనితో "ఈసారి అతను పోస్టును కొట్టగలిగాడు" అంటాడు.

1997లో మాజీ సోవియట్ యూనియన్ ప్రధానమంత్రి మైఖైల్ గార్బచోవ్ ఒక పిజ్జా హట్ ప్రకటనలో నటించాడు. పెరెస్ట్రోయ్‌కా అర్చివ్స్ కోసం ధనం సేకరించడం కోసం ఆయన ఈ ప్రకటనలో నటించారు. ఇటీవలి సంవత్సరాల్లో, జెస్సికా సింప్సన్, ది ముప్పెట్స్, డెమోన్ హిల్, ముర్రే వాకర్‌ లతో సహా, అనేకమంది ప్రముఖలతో పిజ్జా హట్ ప్రకటనలు రూపొందించింది. పిజ్జా హట్ రూపొందించిన ఇటీవలి ప్రకటనలకు క్వీన్ లతిఫా గాత్రం అందించారు. 1997లో పిజ్జా హట్ తన సూపర్ బౌల్ ప్రకటనలో భాగంగా, "గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ బాక్సర్" మహమ్మద్ అలీ ని, శిక్షకుడు ఏంజెలో డుండే లను మళ్లీ ఏకం చేసింది.

2001లో పిజ్జా హట్, మొదటిసారిగా స్పేస్ పిజ్జా డెలివరీని సమర్పించింది. అలాగే 2000లో రష్యన్ ప్రోటాన్ రాకెట్‌లో తమ లోగో కనిపించడం కోసం కొంత సొమ్మును వెచ్చించింది.[16]

2006లో ఆస్ట్రేలియాలో పిజ్జా హట్ ప్రకటనలో "పిజ్జా మట్" అనే మస్కట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ప్రకటనలో మస్కట్‌గా ఎంచుకున్న చిన్న కుక్కపిల్ల పిజ్జాలను డెలివరీ చేస్తుంది. అయితే, కేవలం రెండు ప్రకటనల తర్వాత ఈ మస్కట్‌ను ఉపయోగించడం మానేశారు.

2007 ప్రారంభంలో చూసినట్టైతే, వినియోగదారులను ఆకట్టుకునేందుకు పిజ్జా హట్ ఎక్కువ సంఖ్యలో అనేక పరస్పర మార్గాలను ఎంచుకుంది. మొబైల్ ఫోన్ SMS సాంకేతికతతో పాటు వారి మైహట్ ఆర్డరింగ్ సైట్‌ను ప్రకటనల కోసం ఉపయోగించారు. దీంతోపాటు దాగిన అక్షరాలతో కూడిన అనేక టెలివిజన్ ప్రకటనలు (సూపర్ బౌల్‌కు కొంచెం ముందు నుంచి ప్రారంభించారు) రూపొందించారు. ఈ ప్రకటనలు చూసే వీక్షకులు, కూపన్లను అందుకోవడం కోసం ఆ అక్షరాలను తమ ఫోన్లలో టైప్ చేసే విధంగా ఈ ప్రకటనలను రూపొందించారు. ఇక ఇతర ఆవిష్కృత ప్రయత్నాలైన "మైస్పేస్ టెడ్" ప్రచారంలో భాగంగా, సోషల్ నెట్‌వర్కింగ్ యొక్క ప్రజాదరణను తమకు అనుకూలంగా మల్చుకున్నారు. అలాగే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పిజ్జా కంటెస్ట్ ద్వారా వినియోగదారు-అనుకూల మార్కెటింగ్ ఉద్యమాన్ని ముందుకు తేవడం జరిగింది.

కోడ్ గెస్, మారియా-సామ గ మితేరు, డార్కర్ దెన్ బ్లాక్ మరియు టౌరు కగాకు నో రైల్‌గన్ లాంటి ప్రకటనల ద్వారా పిజ్జా హట్ యానిమే రూపంలోనూ ప్రకటనలు చేసింది. అయితే, కోడ్ గెస్ లాంటి అనువాద వెర్షన్లలోని లోగోను తొలగించి, కేవలం రెడ్ రూప్ లోగోను మాత్రమే ఉంచారు.

2009 అక్టోబరులో పిజ్జా హట్ తన వింగ్‌స్ట్రీట్ బ్రాండ్‌ను దేశవ్యాప్త ప్రాతిపదికన ప్రచారం చేయడం ప్రారంభించింది. 80% స్టోర్లు ఉత్పత్తి అందుబాటును కలిగి ఉండడం లాంటి అంతర్గత అవసరాలను చేరుకునే దిశగా పిజ్జా హట్ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.

పాస్టా హట్[మార్చు]

దస్త్రం:LogoPastaHut.png
పాస్తా హట్ చిహ్నం (2008 – ప్రస్తుతం వరకు)

2008 ఏప్రిల్ 1న అమెరికాలోని పాస్టా హట్ వినియోగదారులకు కొన్ని ఇమెయిల్‌ లను పంపింది. ప్రస్తుతం తాము మెనూలో పాస్టా ఐటమ్‌లను కూడా అందిస్తున్నట్టు వీటిలో పేర్కొంది. ఆ ఇమెయిల్ (అలాంటి ప్రకటనే కంపెనీ వెబ్‌సైట్‌లోనూ చోటుచేసుకుంది) ప్రకారం, "పాస్టా అనేది చాలా బాగుంది. మేం మా పేరును పాస్టా హట్‌!"గా మార్చాం అని నిర్వాహకులు పేర్కొన్నారు.[17] అయితే ఈ పేరు మార్పు అనేది ప్రచారంలో భాగంగానే చోటు చేసుకుంది. ఈ రకమైన ప్రచారాన్ని ఏప్రిల్ ఫూల్స్ డేతో జోడించిన నిర్వాహకులు ఏప్రిల్ నెల మొత్తం ఈ ప్రచారాన్ని కొనసాగించారు. ఇందుకోసం డల్లాస్ ప్రధాన కార్యాలయం తన లోగోను పాస్టా హట్‌గా మార్పు చేసింది.[18] మరోవైపు ఈ పేరు మార్పు అనేది, కొత్త టుస్కనీ పాస్టాను, కొత్త పిజ్జా హట్ డైన్-ఇన్ మెనూను ప్రచారంలోకి తేవడానికి కూడా ఉపయోగించారు. మొదటి పాస్టా హట్ ప్రకటన అసలైన పిజ్జా హట్ రెస్టారెంట్‌లో భాగంగా ఉండడంతో పాటు, "పాస్టా హట్" పేరుతో భవనంపై మళ్లీ ఏర్పాటైంది.

యునైటెడ్ కింగ్‌డమ్[మార్చు]

వార్విక్షైర్లో పిజ్జా హట్.

యునైటెడ్ కింగ్‌డమ్‌ లోని పిజ్జా హట్, తన పేరును పాస్టా హట్‌గా మార్చుకోనున్నట్టు 2008 అక్టోబరులో ప్రకటించింది. అమెరికా ఏప్రిల్ ఫూల్ ప్రయత్నం జరిగిన 6 నెలల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.[19] పిజ్జా హట్ చైన్‌ దుకాణాల్లోని ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాల[19] ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడం కోసం ఈ పేరు మార్పు అనేది తాత్కాలికంగా చోటు చేసుకున్నట్టు కొన్నాళ్లకు మరో ప్రకటన వెలువడింది. అటుపై జనవరి 19, 2009లో పాస్టా హట్ ప్రచారానికి తెరపడిందని, పాస్టా హట్‌గా పేరు మార్చిన అన్ని స్టోర్ల పేర్లను మళ్లీ పూర్వం లాగే పిజ్జా హట్‌గానే మార్పు చేయనున్నట్టు సంస్థ నుంచి ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన అభిప్రాయసేకరణలో భాగంగా 81% మంది పిజ్జా హట్ పేరునే సూచించడంతో ఈ రకమైన మార్పు చోటు చేసుకుంది.[20]

కోస్టా రికా[మార్చు]

కోస్టా రికాలో పిజ్జా హట్ రెస్టారెంట్ల నుంచి "PHD-పిజ్జా డెలివర్డ్ హాట్ బై పిజ్జా హట్" అనే మరో కొత్త బ్రాండ్ వెలువడింది. అయితే ఈ బ్రాండ్ మాత్రం మాల్స్ లోని ఫుడ్ కోర్టుల్లో వేగవంతమైన డెలివరీకి సంబంధించిన ప్రత్యామ్నాయంగానే ఉండిపోయింది. రెస్టారెంట్లు సాధారణ ఆహారపదార్ధాలపై కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో "ఫాస్ట్ ఫుడ్" మార్కెట్‌లోని పోటీని తట్టుకునేందుకు ఇది రూపొందించబడింది.

ఆగ్నేయ ఆసియా[మార్చు]

ఆగ్నేయ ఆసియాలోని పిజ్జా హట్ రెస్టారెంట్లలో "PHD- పిజ్జా డెలివర్డ్ హాట్ బై పిజ్జా హట్" అనేది కేవలం మాల్స్ లోని ఫుడ్ కోర్టులకు సంబంధించిన వేగవంతమైన డెలివరీకి మాత్రమే పరిమితమైంది. స్థానిక రుచులకు సరిపోయే విధంగా పిజ్జా రకాలు మార్పులు సంతరించుకున్నాయి. ఆసియా రుచులను పోలిన పాస్టా ఉత్పత్తులనేవి ఇండోనేషియాలో మాత్రమే అమ్మబడుతాయి.[ఆధారం కోరబడింది]

ఆర్ధిక మద్దతు[మార్చు]

 • 1990ల ప్రారంభంలో పెప్సికో యొక్క స్పాన్సర్‌షిప్ అయిన ది న్యూస్అవర్ విత్ జిమ్ లెహ్‌రర్ (ది మెక్‌నెయిల్/లెహ్‌రర్ న్యూస్అవర్ అనేది దాని పాత పేరు) కార్యక్రమంలో భాగంగా ఆ సమయంలో పెప్సికోకు సొంతమైన టాకో బెల్, KFC లతో పిజ్జా హట్ కలిసి పనిచేసింది.
 • 2000లో, అప్పటి NASCAR విన్‌స్టన్ కప్ సిరీస్‌లో భాగంగా, వ్యాలీ డల్లెన్‌బ్యాచ్ జూనియర్ ద్వారా నడపబడుతున్న గెలాక్సీ మోటార్‌స్పోర్ట్స్ '#75 ఫోర్డ్ కు పిజ్జా హట్ సహ ప్రాయోజకురాలిగా వ్యవహరించింది.
 • 2001-02 సీజన్‌లో భాగంగా ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ ఫుల్‌హామ్ F.C.కి పిజ్జా హట్ చొక్కా స్పాన్సరర్‌గా వ్యవహరించింది.
 • 2005లో టెర్రీ ల్యాబోన్టే డ్రోవ్‌ ఎంపికచేసిన ఈవెంట్లలో దాని యొక్క #44 కారుకు పిజ్జా హట్ ప్రాథమిక స్పాన్షర్‌గా వ్యవహరించింది.
 • మేజర్ లీగ్ సాకర్ క్లబ్ FC డల్లాస్ స్టేడియానికి పేరు సూచించే హక్కులు కొనుగోలు చేసిన పిజ్జా హట్, 2005లో దాని ప్రారంభోత్సవం జరగడానికి ముందుగానే దానికి పిజ్జా హట్ పార్క్ అని నామకరణం చేసింది.
 • మార్చి 2007లో, చీజీ బైట్స్ పిజ్జా కొనుగోలుతో పాటు LGమొబైల్ ఫోన్‌ను అందించడం కోసం వెరిజోన్ వైర్‌లైస్‌తో పిజ్జా హట్ భాగస్వామ్యం వహించింది.
 • UKలో జరిగిన 2007/08 EIHL సీజన్‌లో పాల్గొన్న న్యూక్యాస్టిల్ వైపర్స్ ఐస్ హాకీ జట్టుకు పిజ్జా హట్ స్పాన్సరర్‌గా వ్యవహరించింది.
 • చిల్డ్రన్స్ జాయ్ ఫౌండేషన్ ఇన్ ది ఫిలిఫైన్స్ కు కూడా పిజ్జా హట్ ఒక స్పాన్సరర్‌
 • పిజ్జా హట్ జపాన్ తమ మస్కట్‌ చీజ్-కున్‌తో యానిమేCode Geass: Lelouch of the Rebellionను స్పాన్సర్ చేసింది. ఆ సిరీస్ పూర్తిగా అది మస్కట్‌ బొమ్మతో ఉన్న ముద్రలను తయారు చేసింది.

బుక్ ఇట్[మార్చు]

పిజ్జా హట్ ఒక దీర్ఘకాల స్పాన్సరర్‌‌గా వ్యవహరించిన "బుక్ ఇట్!" కార్యక్రమం (1984లో ప్రారంభమైంది[21]) అమెరికన్ పాఠశాలల్లో పుస్తక పఠనం అలవాటును ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడింది. తరగతి గది ఉపాధ్యాయుడు నిర్థేశించిన లక్ష్యం ప్రకారం పుస్తక పఠనం చేసిన వారు పిజ్జా హట్ కూపన్ల ద్వారా సత్కరించబడుతారు. ఈ కూపన్ల ద్వారా ఉచిత పర్సనల్ పాన్ పిజ్జా లేదా తగ్గింపు రేట్లలో మెనూ ఐటమ్‌లను పొందవచ్చు. 1980ల చివర్లో తరగతిలో పిల్లలందరూ తమ పఠన లక్ష్యాలను పూర్తి చేసినట్టైతే, పిజ్జా హట్ ఉచితంగా తరగతిలోని వారికోసం పిజ్జా పార్టీలను ఏర్పాటు చేసేది. అయితే ఇది పుస్తక పఠనం విషయంలో అతి నిరూపణకు దారితీస్తోందని, దీనివల్ల పఠించడంలో పిల్లలకు సహజంగా ఉండే ఆసక్తి తగ్గిపోతుందనే కారణంతో కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంపై విమర్శలు చేశారు.[22] అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల పఠన ప్రేరణ అనేది పెరగడం లేదా తగ్గడం జరగలేదని పిజ్జా హట్ కార్యక్రమమైన బుక్ ఇట్! యొక్క అధ్యయనంలో గుర్తించింది.[22] ఈ కార్యక్రమం యొక్క 25వ వార్షికోత్సవం 2009లో జరిగింది.

పోషణ[మార్చు]

పదార్ధాల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉందనే కారణంగా UKలోని పిజ్జా హట్ విమర్శలకు గురైంది. ఇక్కడ తయరయ్యే పిజ్జా రకాల్లోని కొన్నింటిల్లో ఉన్న ఉప్పు పరిమాణం, పెద్ద వారికి రోజు మొత్తంలో అవసరమైన ఉప్పు శాతం కంటే రెట్టింపు ఉన్నట్టుగా కనుగొనబడింది. వినియోగదారుని కోరిక మేరకు పిజ్జాపై ఉంచే ఆహార పదార్థాలు (పెప్పరోని, సాసగే, బేకన్ మొదలుగునవి) కూడా ఉప్పు, కొవ్వుతో నిండిన పదార్థాలుగా రుజువయ్యాయి.[23] తరచుగా శీతల మరియు పేలవమైన నాణ్యతతో పాటు పోషాకాహార విలువ లేకుండా ఉన్న తుది ఉత్పత్తుల్లో గడ్డకట్టిన పదార్థాలు అధిక స్థాయిలో ఉన్న కారణంగా ఆహార ఉత్పత్తి పద్ధతులపై ఆందోళనలు పెరిగాయి.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • పిజ్జా హట్ పార్క్
 • యం బ్రాండ్స్

సూచికలు[మార్చు]

 1. "Yum Homepage".
 2. "Town of Addison official website".
 3. "Pizza Hut to move corporate offices to Plano".
 4. "Pizza Hut studying move from Addison to Plano's Legacy Park".
 5. http://www.fundinguniverse.com/company-histories/Pizza-Hut-Inc-Company-History.html
 6. "Pizza Hut web site - about the company".[dead link]
 7. "Original Pizza Hut - Wichita State University Campus Tour".
 8. Wasson, Andrew. "Who Designed the Roof". Dairy River.
 9. "PizzaHut.com — Menu".
 10. "Pizza Hut kicks off $15M Priazzo campaign". Archived from the original on 2012-07-08.
 11. "Pizza Hut licensee opens 'italian bistro' concept". April 4, 2005.
 12. Jean Le Boeuf (March 9, 2007). "Three tomatoes to a capable Pizza Hut 'Bistro'".
 13. "Pizza Mia, Ingredient Statements" (PDF).
 14. "in.Reuters.com, Pizza Hut rolling out all-natural pizza".
 15. "YouTube - Pizza Hut commercial with Back to the Future theme".
 16. "Pitching products in the final frontier". CNN. June 13, 2001. Retrieved May 22, 2010.
 17. "Pasta Hut Is The New Name For Pizza Hut".
 18. "Pizza Hut renaming itself Pasta Hut for April Fool's". Archived from the original on 2008-04-04.
 19. 19.0 19.1 పిజ్జా హట్ హాస చెంజ్ద్ ఇట్స్ నేమ్ టు పాస్తా హట్ - పిజ్జా హట్ పత్రికా విడుదల, 06 ఆక్ట్బర్ 2008
 20. "Customers vote for Pizza Hut". Pizza Hut UK Ltd. Retrieved 2009-06-05.
 21. "PizzaHut.com — Our Story".
 22. 22.0 22.1 ఫ్లోరా, S. R., & ఫ్లోరా, D. B. (1999). భాల్య దశలో పుస్తక పటనానికి తీవ్ర ప్రభావంతం యొక్క పరిణామాలు కలిగిన కళాశాల విద్యార్దులు అభ్యాస లక్షణాల. మనోవైజ్ఞానికమైన పద్దు , 49 , 3–14.
 23. "Fast food salt levels 'shocking'". BBC News. October 18, 2007. Retrieved January 6, 2010.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Yum! మూస:Pizza chains మూస:UK Food మూస:Restaurant chains in Ireland