పిడపర్తిపాలెం
Appearance
పిడపర్తిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°18′55″N 80°44′35″E / 16.315290°N 80.742946°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | కొల్లిపర |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
పిడపర్తిపాలెం గుంటూరు జిల్లా, కొల్లిపర మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం
[మార్చు]ఈ గ్రామం, కృష్ణానదీ తీరాన, పచ్చని పంట పొలాలతో, కాలువలతో, ప్రశాంతమైన వాతావరణంతో విలసిల్లుతూ ఉంటుంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల
[మార్చు]ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న. ఎం. అన్నారావు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బొల్లు కృష్ణప్రియ, 126 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా గెలుపొందింది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీ షిర్డీ సాయినాధుని ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2014, ఏప్రిల్-6, ఆదివారం నాడు, ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. సూర్యోదయానికే, స్వామివారిని దర్సించుకోవడానికి భక్తులు తరలి వచ్చారు.