అక్షాంశ రేఖాంశాలు: 29°35′N 80°13′E / 29.58°N 80.22°E / 29.58; 80.22

పితోరాగఢ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పితోరాగఢ్
పట్టణం
సూర్యోదయ సమయంలో పితోరాగఢ్ పట్టణం
సూర్యోదయ సమయంలో పితోరాగఢ్ పట్టణం
పితోరాగఢ్ is located in Uttarakhand
పితోరాగఢ్
పితోరాగఢ్
Location in Uttarakhand, India
Coordinates: 29°35′N 80°13′E / 29.58°N 80.22°E / 29.58; 80.22
Country India
రాష్ట్రందస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand
జిల్లాPithoragarh
Elevation
1,627 మీ (5,338 అ.)
జనాభా
 (2011)[1]
 • Total56,044
DemonymPithoragarhiya (Kumaoni)
Time zoneUTC+౦5:30 (IST)
పిన్‌కోడ్
262501
టెలిఫోన్ కోడ్915964
Vehicle registrationUK-05

పితోరాగఢ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్ జిల్లా లోని పట్టణం. ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది కుమావోన్ ప్రంతంలోని అతిపెద్ద నగరాల్లో నాల్గవది. కుమావోన్ కొండలలో అతిపెద్దది. అల్మోరా, నైనిటాల్ కంటే పెద్దది. పట్టణంలో విమానాశ్రయంతో సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ పట్టణంలో లక్ష్మణ్ సింగ్ మహర్ ప్రభుత్వ పిజి కాలేజీ ఉన్నందున ఇది కొండ ప్రాంతానికి విద్యా కేంద్రంగా మారింది. నాన్హి ప్యారీ సీమంత్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌, నర్సింగ్ కళాశాల కూడ్ ఇక్కడ ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

పితోరాగఢ్ నగరం దాని పరిసర ప్రాంతాలు మానస్‌ఖండ్ ప్రాంతంలో భాగం. ఇది స్కాంద పురాణంలో పేర్కొన్నట్లు ఉత్తరాన కైలాష్ పర్వతం నుండి దక్షిణాన భాబర్ & తేరాయ్ వరకు విస్తరించింది.[2] : 12 అసురులు, నాగాలు ఇక్కడ మొట్టమొదట నివసించినవారు. తరువాత కిరాతులు, కునిందులు నివసించారు.[3] : 13  కునిందులు కుషాణులకు సామంతులుగ సా.శ. 1 వ శతాబ్దం చివరి పాదం నుండి ఈ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించారు.[3] : 16 తదనంతరం ఈ ప్రాంతం కూర్మంచల్ రాజ్యం క్రిందకు వచ్చింది. దీని రాజధాని మొదట జ్యోతిర్మఠం వద్ద, ఆ తరువాత కత్యూర్ లోయలోని కారికేయపుర (ఆధునిక బైజ్‌నాథ్ ) వద్ద ఉండేది.[4]

13వ శతాబ్దంలో కత్యూరిల విచ్ఛిన్నం, రాజ్య పతనం తర్వాత, పితోరాగఢ్ సౌర్‌లోని బామ్ రాజుల పాలనలోకి వచ్చింది. బామ్ రాజులు రైకులకు సామంతులుగా ఉండేవారు. పితోరాగఢ్‌కు సమీపంలో ఉన్న ఉదయపూర్‌ను తమ రాజధానిగా చేసుకున్నారు. అయితే, శీతాకాలంలో వారు రామేశ్వర్, బెయిలోర్కోల్ లకు వచ్చేవారు.[3] : 24 సౌర్‌ను పాలించిన బామ్ రాజుల వివరాలివి:[5] : 216 

 1. కరాకిల్ బామ్
 2. కాకిల్ బామ్
 3. చనరీ పామ్
 4. అర్కీ బామ్
 5. జ్ఞాని బామ్
 6. శక్తి బామ్
 7. విజయ్ పామ్
 8. హరి బామ్

1790లో, చాంద్ రాజులు ప్రస్తుత బాలికల ఇంటర్ కళాశాల ఉన్న కొండపై కొత్త కోటను నిర్మించారు. 1962లో చైనా భారత్‌పై దాడి చేసిన తర్వాత ఈ కోటను భారత ప్రభుత్వం ధ్వంసం చేసింది. చాంద్ పాలన ఉచ్ఛస్థితిలో ఉండగా, కుమావోన్‌లోని అత్యంత ప్రముఖ సామ్రాజ్యాలలో ఒకటిగా పరిగణించబడేది. వారి పాలన కూడా సాంస్కృతిక పునరుజ్జీవన కాలంతో సమానంగా ఉంటుంది. పురావస్తు సర్వేలు ఈ కాలంలో సంస్కృతి కళారూపాల అభివృద్ధిని సూచిస్తున్నాయి.

1912లో భారత జాతీయ కాంగ్రెసు శాఖ ఒకదాన్ని ఈ ప్రాంతంలో స్థాపించారు. 1916లో పితోరాగఢ్ నుండి చాలా మంది ప్రజలు లక్నో కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యారు. 1921లో ఈ ప్రాంతంలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. 1930లో పితోరాగఢ్‌కు చెందిన 10 మంది శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు . తదనంతరం, 1937లో జరిగిన ప్రావిన్షియల్ ఎన్నికలలో పితోరాగఢ్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమానికి పితోరాగఢ్‌లో ప్రజల మద్దతు లభించింది. దాదాపు 150 మందిని అరెస్టు చేయగా, అనేక మందికి జరిమానా విధించారు. 1945లో ప్రావిన్షియల్ అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ మళ్లీ పితోరాగఢ్ స్థానాన్ని గెలుచుకుంది. 1947లో, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు, ఈ ప్రాంతం కూడా బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది.[3] : 38 

భౌగోళిక శాస్త్రం

[మార్చు]
పితోరాగఢ్ నుండి హిమాలయ దృశ్యం

పితోరాగర్ 29°35′N 80°13′E / 29.58°N 80.22°E / 29.58; 80.22 వద్ద ఉంది.[6] ఇది కుమావోన్ [7] రెవెన్యూ డివిజన్‌లో నైనిటాల్‌కు ఈశాన్యంగా 188 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టం నుండి దీని సగటు ఎత్తు 1,627 మీటర్లు.[8][9] ఇది సౌర్ లోయ యొక్క పశ్చిమ అర్ధభాగంలో ఉంది. లోయ దాదాపు 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ పట్టణం భూకంప జోన్ V లో ఉంది.[10] ఇది విండ్ & సైక్లోన్ జోన్‌లోని మోడరేట్ డ్యామేజ్ రిస్క్ (బి) ప్రాంతంలో ఉంది. వరదలు రాని ప్రాంతంగా దీన్ని ప్రకటించారు.

గణాంకాలు

[మార్చు]

పితోరాఘర్ అనేది ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో ఉన్న పట్టణం. పితోర్‌ఘర్ నగరం 15 వార్డులుగా విభజించబడింది, వీటికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పితోర్‌ఘర్ నగర్ పాలికా పరిషత్ జనాభా 56,044, అందులో 29,127 మంది పురుషులు, 26,917 మంది స్త్రీలు.

0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6624, ఇది పిథోరఘర్ నగర పంచాయితీ మొత్తం జనాభాలో 11.82 %. పితోర్‌ఘర్ నగర్ పాలికా పరిషత్‌లో, రాష్ట్ర సగటు 963కి వ్యతిరేకంగా స్త్రీ లింగ నిష్పత్తి 924గా ఉంది. అంతేకాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర సగటు 890తో పోలిస్తే పితోర్‌ఘర్‌లో పిల్లల లింగ నిష్పత్తి 705గా ఉంది. పితోర్‌ఘర్ నగరం అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు కంటే 92.48 % ఎక్కువగా ఉంది. . పితోర్‌ఘర్‌లో, పురుషుల అక్షరాస్యత దాదాపు 94.81% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 90.05%.[11]

రవాణా

[మార్చు]

పితోరాగఢ్‌కు నేరుగా రైలు సౌకర్యం లేదు. అయితే ఇది రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. దీనికి విమానాశ్రయం కూడా ఉంది. జాతీయ రహదారి 9 పితోరాగఢ్ గుండా వెళుతుంది.[12] ఋతుపవనాల సమయంలో కురిసే భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి పడడం, కుంభవృష్టి ల వలన తరచుగా రవాణాకు అంతరాయం కలిగిస్తాయి.[13][14]

పితోరాగఢ్ విమానాశ్రయాన్ని నైనీ సైనీ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు, ఇది నగరానికి ఈశాన్యంగా దాదాపు 5 కిలోమీటర్లు (3.1 మై.) దూరంలో ఉంది. పరిపాలనా అవసరాల కోసం దీన్ని 1991లో నిర్మించారు.[15][16] గతంలో భారత వైమానిక దళం ప్రధానంగా రక్షణ అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకుంది.[17] 64.91 కోట్ల అంచనా వ్యయంతో 2016లో ఈ విమానాశ్రయాన్ని అప్‌గ్రేడ్ చేశారు.[18]

పితోరాగఢ్ నుండి ఉత్తరాఖండ్‌లోని మిగిలిన ప్రాంతాలకు అన్ని వాతావరణాలకు అనుకూలమైన రోడ్డు సౌకర్యం ఉంది. పితోర్‌ఘర్‌లో మొత్తం రహదారి పొడవు 80 కి.మీ.[19] : 683 రోడ్డు మార్గంలో పితోర్‌ఘర్‌లోకి ప్రవేశించడానికి హల్ద్వానీ, తనక్‌పూర్ లు ప్రవేశ ద్వారాలు. ఈ రెండు ప్రదేశాలకూ రైలు మార్గం ఉంది. తనక్‌పూర్ 151 కి.మీ., కాథ్‌గోడం 212 కి.మీ. దూరంలో ఉన్నాయి. రెండు ప్రదేశాలలో ప్రైవేట్ టాక్సీ సేవలతో పాటు రెగ్యులర్ రాష్ట్ర బస్సు రవాణా సేవలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఉపయోగించే రవాణా విధానమైన బస్సులను ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు నడుపుతారు. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, KMOU, వివిధ ప్రైవేట్ ఆపరేటర్లు సుదూర బస్సు సేవలను నిర్వహిస్తున్నాయి.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
 2. Uttar Pradesh District Gazetteers: Pithoragarh. Government of Uttar Pradesh. 1979. Retrieved 21 February 2020.
 3. 3.0 3.1 3.2 3.3 Uttar Pradesh District Gazetteers: Pithoragarh (in ఇంగ్లీష్). Government of Uttar Pradesh. 1979. Retrieved 21 February 2020.
 4. Kaṭhoca, Yaśavanta Siṃha. Uttarākhaṇḍa kā navīna itihāsa. ISBN 978-81-86844-91-5. OCLC 948116582.
 5. Pande, Badri Datt (1993). History of Kumaun : English version of "Kumaun ka itihas". Almora: Shyam Prakashan. ISBN 81-85865-01-9.
 6. Falling Rain Genomics, Inc – Pithoragarh
 7. Kumaon Himalaya (in ఇంగ్లీష్). Shree Almora Book Depot. ISBN 9788190020992.
 8. A document from official website of Pithoragarh Archived 10 ఏప్రిల్ 2009 at the Wayback Machine
 9. Official website of Pithoragarh
 10. Hazard profiles of Indian districts (PDF). National Capacity Building Project in Disaster Management, UNDP. Archived from the original (PDF) on 19 May 2006. Retrieved 17 October 2016.
 11. "Pithoragarh Nagar Palika Parishad City Population Census 2011-2023 | Uttarakhand". www.census2011.co.in. Retrieved 2023-06-17.
 12. "National highway 9 route substitution notification" (PDF). The Gazette of India. 31 Mar 2015. Retrieved 1 Aug 2018.
 13. Singh, Kautilya (19 July 2016). "263 roads across Uttarakhand closed, efforts on to open them for vehicular movement". The Times of India. Dehradun. TNN. Retrieved 18 October 2016.
 14. Singh, Kautilya (18 July 2016). "Heavy rains block 338 roads in Uttarakhand". The Times of India. Dehradun. TNN. Retrieved 18 October 2016.
 15. Chakrabarty, Arpita (21 July 2016). "Naini-Saini airstrip awaits flying license". The Times of India. Almora. TNN. Retrieved 17 October 2016.
 16. Chakrabarty, Arpita (10 September 2016). "No commercial flights from Pithoragarh any time soon". The Times of India. Almora. TNN. Retrieved 17 October 2016.
 17. "Executive Summary, Expansion of Naini-Saini airport" (PDF). RITES. October 2012. Retrieved 20 September 2019.
 18. Chakrabarty, Arpita (16 Nov 2015). "Regular flights to take off from Naini Saini airstrip from Jan 26". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 20 February 2020.
 19. District Census Handbook Pithoragarh Part-A (PDF). Dehradun: Directorate of Census Operations, Uttarakhand. Retrieved 11 July 2017.

వెలుపలి లంకెలు

[మార్చు]