పినాకిని ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పినాకిని ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంవేగమైన రైలు
స్థానికతఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలువిజయవాడ
ఆగే స్టేషనులు13
గమ్యంచెన్నై
ప్రయాణ దూరం431 km (268 mi)
సగటు ప్రయాణ సమయం7 గంటలు
రైలు నడిచే విధంప్రతి రోజు
సదుపాయాలు
శ్రేణులుశీతలీకారణ, రెండవ శ్రేణి కూర్చొనుట, అరక్షితము
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలుఉంది
సాంకేతికత
పట్టాల గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం)
వేగం60 km/h (37 mph) సగటు వేగము
మార్గపటం
Pinakini Express Route map.jpg

పినాకిని ఎక్స్‌ప్రెస్ అనే బండి భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ జంక్షన్, తమిళనాడు లోని చెన్నై ల మధ్య నడిచే వేగమైన రైలు. ఈ బండి 1991 లో నడపబడింది. పెన్నా నది పేరు మీదగా ఈ బండికి పినాకిని అని పేరు పెట్టినారు. భారతీయ రైల్వే లోని దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే విభాగం దీనిని నడుపుచున్నది.

జోను , డివిజను[మార్చు]

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)[మార్చు]

ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

బండి సంఖ్య[మార్చు]

విజయవాడ నుండి చెన్నై వెళ్ళేటప్పుడు 12711 గా నడుచును, తిరుగు ప్రయాణంలో 12712 గా నడుచును.[1][2]

ప్రయాణ దారి[మార్చు]

సౌకర్యాలు[మార్చు]

పినాకిని ఎక్స్‌ప్రెస్ సాధారణంగా LGD WAP4 / WAP7 ఇంజనుచే లాగబడుచున్నది. ఈ బండికి సాధారణంగా మొత్తం 24 పెట్టెలు ఉండును దానిలో ఒక పాంట్రీ, 2 శీతలీకరణ పెట్టెలు, 8 రెండవ శ్రేణి సిట్టింగ్, 11 అరక్షిత పెట్టెలు ఉండును.

ట్రివియా[మార్చు]

  • పినాకిని ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే లోనే మొదటి హరిత మరుగుదొడ్లు (గ్రీన్ టాయ్లెట్స్) ఉన్న రైలు.[3]
  • పినాకిని ఎక్స్‌ప్రెస్ యొక్క సోదర రైళ్ళు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, శాతవాహన ఎక్స్‌ప్రెస్ . ఈ మూడు బండ్లు విజయవాడ నుండి చెన్నై, విశాఖపట్నం, సికంద్రాబాద్ కు ఒకే సమయానికి (06:10) బయలుదేరును. తిరిగి రాత్రికల్లా విజయవాడ వచ్చి చేరును.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]