పిరియా సాయిరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిరియా సాయిరాజ్‌

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
ముందు అగర్వాల్ నరేష్ కుమార్
తరువాత బెందాళం అశోక్
నియోజకవర్గం ఇచ్ఛాపురం నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 - 2014
నియోజకవర్గం ఇచ్ఛాపురం నియోజకవర్గం

శ్రీకాకుళం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్‌
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
6 డిసెంబర్ 2019 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1975
బల్లిపుట్టుగ , కవిటి మండలం శ్రీకాకుళం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
నివాసం పలాసపురం, సోంపేట మండలం, శ్రీకాకుళం
వృత్తి రాజకీయ నాయకుడు

పిరియా సాయిరాజ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్‌గా ఉన్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పిరియా సాయిరాజ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా , కవిటి మండలం, బల్లిపుట్టుగ గ్రామంలో జన్మించాడు. ఆయన మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[1]ఆయన 6 డిసెంబర్ 2019లో శ్రీకాకుళం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పిరియా సాయిరాజ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2007లో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలో జడ్‌.ఆర్‌.యు.సి.సి.మెంబర్‌గా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇచ్ఛాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నార్తు రామారావు పై 2275 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.

పిరియా సాయిరాజ్ 2013లో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2013 నుండి 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ పరిశీలకునిగా, 2014లో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఎన్నికల పరిశీలకునిగా పని చేశాడు. ఆయన 2014లో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ టికెట్ ఆశించాడు, కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకు టికెట్ దక్కలేదు. సాయిరాజ్ 2014 నుంచి 2017 వరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా పని చేశాడు.

పిరియా సాయిరాజ్‌ 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇచ్ఛాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి,తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బెందాళం అశోక్ చేతిలో 7145ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[2]ఆయన 6 డిసెంబర్ 2019లో శ్రీకాకుళం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 March 2019). "శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Sakshi (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  2. Sakshi (2019). "Ichchapuram Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  3. The Hans India (6 December 2019). "Srikakulam: DCCB, DCMS chairmen assume office" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.