పిల్లలమర్రి

వికీపీడియా నుండి
(పిల్లల మర్రి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పిల్లలమర్రి ఎఱకేశ్వర ఆలయం

పిల్లలమర్రి, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలములోని ఒక ప్రసిద్ధ గ్రామము. పిన్ కోడ్: 508213. ఇది సూర్యాపేట నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది.

పిల్లలమర్రి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట
మండలం సూర్యాపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 8,600
 - పురుషుల సంఖ్య 4,300
 - స్త్రీల సంఖ్య 4,300
 - గృహాల సంఖ్య 2,147
పిన్ కోడ్ 508213.
ఎస్.టి.డి కోడ్

భౌగోళిక ఉనికి[మార్చు]

పిల్లలమర్రి 17.12° N 79.3200° E అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.

చరిత్ర[మార్చు]

కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు 1195లో వేయించిన పిల్లలమర్రి శిలాశాసనం

చారిత్రాత్మక ఈ గ్రామాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు. ఈ దేవాలయాలలో ఉన్న శిలాశాసనాలు అప్పటి చరిత్ర తెలుపుతున్నాయి. శాలివాహన శకం 1130 (క్రీ.శ. 1208) లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు కన్నడ, తెలుగు భాషలలో వేయించిన శిలాశాసనం ఉంది. గణపతి దేవుడు కంటే మునుపు పరిపాలించిన కాకతీయ చక్రవర్తి, రుద్రదేవుడు శాలివాహన శకం 1117 (క్రీ.శ.1195) సంవత్సరములో వేయించిన శిలాశాసనం కూడా ఉంది. కాకతీయుల కాలం నాటి నాణెములు కూడా ఈ గ్రామములో లభించాయి. కాకతీయుల తరువాత పిల్లలమర్రి రేచర్ల రెడ్డి రాజులకు రాజధానిగా విలసిల్లినది. ప్రఖ్యాత తెలుగు కవి పిల్లలమర్రి పిన వీరభద్రుడు జన్మస్థలము పిల్లలమర్రి.

  • శీర్షిక ఆంధ్రుల సాంఘిక చరిత్ర

రచయిత సురవరం ప్రతాపరెడ్డి...సంవత్సరం 1950 .........ప్రచురణకర్త సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి చిరునామా హైదరాబాదు నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట తాలూకాలో పిల్లలమర్రి యను గ్రామములో బహు మనోహరమగు దేవాలయములను నామిరెడ్డి కట్టించెను.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,600 - పురుషుల సంఖ్య 4,300 - స్త్రీల సంఖ్య 4,300 - గృహాల సంఖ్య 2,147

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

పిల్లలమర్రి జనాభా 3,733.

దేవాలయాలు[మార్చు]

ఎఱకేశ్వర ఆలయంలోని ఒక స్తంభము
  • ఈ గ్రామములో ఉన్న చెన్నకేశవస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము మాఘ మాసంలో ప్రత్యేక ఉత్సవాలకు వేలాది భక్తులు తరలివస్తారు.
  • ఇక్కడ అపూర్వమైన శిల్పకళతో భాసిల్లుతున్న నామేశ్వర, త్రికూటేశ్వర, ఎఱకేశ్వర దేవాలయములు ఉన్నాయి. హైదరాబాదు నుండి ఖమ్మం లేదా విజయవాడ వెళ్ళే దారిలో సూర్యాపేటకు ఆరు కిలోమీటర్ల ముందు ఎడమవైపు పిల్లలమర్రి శివాలయములకు దారి చూపిస్తూ ఒక బోర్డు ఉంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]