పి.ఆర్. తిలగం
పి.ఆర్. తిలగం | |
|---|---|
| 1926 (age 99–100) తిరువారూర్ , తమిళనాడు , భారతదేశం | |
| వృత్తి | నృత్య నాటక ప్రదర్శకురాలు |
| పురస్కారాలు | పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ అవార్డు |
తిరువారూర్ తిలగం అని ప్రసిద్ధి చెందిన పిఆర్ తిలగం (జననం 1926) భారతదేశానికి చెందిన స్వరకర్త, గాయని & భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ నృత్య నాటక రూపమైన కురవంజి ప్రతినిధి.[1][2] ఆమె తిరువారూర్‌లోని త్యాగరాజ ఆలయంలో ఆరాధనకు అంకితమైన మహిళల శాఖ అయిన ఇసై వెల్లలార్ సమాజానికి చెందిన కొండి పరంపర (కొండి వారసత్వం) నుండి వచ్చింది.[3][4]
తిలగం 1926లో తమిళనాడులోని తిరువారూర్ పట్టణంలో త్యాగరాజ ఆలయానికి ప్రసిద్ధి చెందిన కొండి దేవదాసీలలో చివరివారిలో ఒకరిగా, నృత్యకారుల కుటుంబంలో జన్మించింది. ఆమె నృత్య నాటకంలో ప్రదర్శనకారిణి అయిన తన అమ్మమ్మ కమలాంబాల్ నుండి కురవంజి నృత్యం నేర్చుకొని ప్రజా ప్రదర్శనలు ప్రారంభించి,[5] భారత్ తో పాటు విదేశాలలో అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది.[6]
తిరువారూర్ తిలగం 1997 సంగీత నాటక అకాడమీ అవార్డును,[7][8] 2007లో కళలకు ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర గౌరవమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.[9] ఆమె ప్రదర్శనను ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (IGNCA) వీడియో-డాక్యుమెంట్ చేసింది.[5][10]
మూలాలు
[మార్చు]- ↑ Ananda Lal, ed. (2004). The Oxford Companion to Indian Theatre. Oxford University Press. ISBN 9780195644463.
- ↑ Saṅgīt Mahābhāratī (2011). The Oxford Encyclopaedia of the Music of India. Oxford University Press. ISBN 9780195650983.
- ↑ Davesh Soneji (2012). Unfinished Gestures: Devadasis, Memory, and Modernity in South India. University of Chicago Press. p. 313. ISBN 9780226768090.
- ↑ "Before the music stopped". The Hindu. 13 December 2001. Retrieved 18 January 2016.[dead link]
- 1 2 "Major IGNCA Documentation". Indira Gandhi National Centre for the Arts. 2016. Archived from the original on 17 September 2008. Retrieved 18 January 2016.
- ↑ "Kalakshetra Annual Art Festival" (PDF). Ragashankara. 2016. Retrieved 18 January 2016.[permanent dead link]
- ↑ "Overview in Oxford Index". Oxford University Press. 2016. Retrieved 18 January 2016.
- ↑ "SNA Awardees". Sangeet Natak Akademi. 2016. Archived from the original on 30 May 2015. Retrieved 18 January 2016.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.
- ↑ "Madras Season: Its Genesis". Sruti. December 2005. Retrieved 18 January 2016.