పి.ఎన్.ఎస్. ఘాజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1964 లో లాంగ్ ఐల్యాండ్ సౌండ్లోని ఫిలడెల్ఫియా నావల్ షిప్యార్డ్ వద్ద ఫ్లీట్ స్నార్కెల్ గా మార్చబడిన పి.ఎన్.ఎస్. ఘాజీ గ పిలువబడిన డయాబ్లో (AGSS-479).

పి.ఎన్.స్. ఘాజీ[1] పాకిస్తాన్ దేశపు నౌకా దళానికి చెందిన జలాంతర్గామి. అమెరికా సంయుక్త రాష్ట్రాల ద్వారా నిర్మించబడిన ఈ జలాంతర్గామి అసలు పేరు యు.ఎస్.ఎస్ డయాబ్లో గా 1944 నుండి 1963 వరకు సేవలందించిన ఈ జలాంతర్గామి[2] పిదప పాకిస్థాన్ దేశానికి లీజు కింద ఇవ్వడం జరిగింది.[3]

1965 ఇండో-పాక్ యుద్ధం లో భారత నౌకా దళాలకు సవాలుగా మిగిలిన ఈ జలాంతర్గామి పాకిస్థాన్ నౌకా దళానికి విశేషసేవలందించింది. 1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో ఘాజీ ను తూర్పు-పాకిస్థాన్(బంగ్లాదేశ్) విముక్తి కోసం సేవలందిస్తున్న ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ కు విరుగుడు గా నియోగించింది. నవంబరు 14 1971 న కరాచీ పోర్టు నుండి బయలుదేరిన ఘాజీ, 3000 కి.మీ.లు అరేబియా సముద్రం నుండి హిందూ మహా సముద్రం మీదుగా ప్రయాణించి, బంగాళాఖాతపు భారత జలాలలో ప్రవేశించింది. అయితే ఘాజీ ఉనికిని ముందే పసిగట్టిన భారత నౌకాదళం విక్రాంత్ ను అండమాన్ దీవులకు తరలించటం, విక్రాంత్ జాడ కనుగొనలేక ఘాజీ తన కార్యాచరణ లో విఫలం కావడం జరిగింది. తదుపరి లక్ష్యం కింద "విశాఖపట్టణం" లోని భారత తూర్పు నావికా దళ ముఖ్య విభాగాన్ని ముంచి వేసే ఆలోచన తో విశాఖ నగర జలాల్లో పొంచి ఉండగా, భారత నావికా దళం దాడి కి గురై 4 డిసెంబరు 1971 న విశాఖ సమీపాన మునిగిపోయింది. 92 మంది నావికులు కల ఈ జలాంతర్గామి మునక భారత ఉపఖండం లోని తొలి నావికాదళ-ప్రమాదంగానూ, 1971 ఇండో-పాక్ యుద్ధం లో పాకిస్థాన్ కు తీరని ఓటమి నూ మిగిల్చించిన ఈ జలాంతర్గామి మునక భారత నావికాదళ విజయాలలో పేరెన్నిక గన్నది.మొట్టమొదటి సారి పాకిస్తాన్ తూర్పు భారత తీరం పై దాడికి ఉపయోగించిన నౌక.

ఇప్పటికీ ఈ జలాంతర్గామి విశాఖనగర సమీప జలాలలో సముద్రపు అట్టడుగున బురద లో కూరుకొని ఉంది.

మూలాలు[మార్చు]

  1. Shabbir, Uman. "PNS/M Ghazi (S-130)". PakDef Military Consortium. Archived from the original on 7 సెప్టెంబరు 2018. Retrieved 22 December 2018.
  2. Karim, Afsir (1996). "The Early Years" (google books). Indo-Pak Relations: Viewpoints, 1989–1996 (in ఇంగ్లీష్). Lancer Publishers. ISBN 9781897829233. Retrieved 18 November 2016.
  3. Hiranandani, G. M. (2000). "Pakistan Navy's Submarine Program" (google books). Transition to Triumph: History of the Indian Navy, 1965–1975 (in ఇంగ్లీష్). Lancer Publishers. ISBN 9781897829721. Retrieved 18 November 2016.