పి.ఎల్. నారాయణ
పి. ఎల్. నారాయణ | |
---|---|
జననం | పుదుక్కోట్టై లక్ష్మీ నారాయణ సెప్టెంబరు 10, 1935 బాపట్ల |
మరణం | నవంబరు 3, 1998 | (వయస్సు 63)
వృత్తి | నటుడు |
పి.ఎల్.నారాయణ గా ప్రఖ్యాతిపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 - నవంబరు 3, 1998) విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. సినిమాల్లోకి ప్రవేశించక మునుపు నాటక రచయితగా, నటుడిగా పని చేశాడు. సినిమాల్లో ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, కొన్ని హాస్య ప్రధానమైన పాత్రలు పోషించాడు. 1992 లో యజ్ఞం అనే సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు.
జననం[మార్చు]
ఈయన సెప్టెంబర్ 10, 1935లో బాపట్లలో జన్మించాడు.
పురస్కారాలు[మార్చు]
తెలుగు సినిమా యజ్ఞంలో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు.[1] ఈయన కుక్క చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, మయూరి చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది అవార్డులు గెలుపొందాడు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందాడు.
మరణం[మార్చు]
ఈయన తన అరవై మూడో ఏట ఆకస్మికంగా 1998 సంవత్సరం, నవంబరు 3 న మరణించాడు.
చిత్ర సమాహారం[మార్చు]
- ఆయుధం (1990)
- రేపటి పౌరులు (1986)
- దశ తిరిగింది (1979)
- ఎర్ర మల్లెలు (1981)
- అర్ధరాత్రి స్వతంత్రం (1986)
- గణేష్ (1996)
- ఘరానా మొగుడు (1992)
- కర్తవ్యం (1991)
- ఎర్ర మందారం (1991)
- విజయ్ (1989)
- ఇంద్రుడు చంద్రుడు (1989)
- రుద్రవీణ (1988)
- పుష్పకవిమానం (1988)
- ఊరేగింపు (1988)
- స్వయంకృషి (1987)
- ప్రతిఘటన (1986)
- చట్టంతో పోరాటం (1985)
- దేశంలో దొంగలుపడ్డారు (1985)
- దేవాలయం (1985)
- రెండు రెళ్లు ఆరు (1985)
- వందేమాతరం (1985)
- మయూరి (1984)
- ఖైదీ (1983)
- గూఢచారి నెం.1 (1983)
- ఆలయశిఖరం (1983)
- మరో మాయాబజార్ (1983)
- నేటి భారతం (1983)
- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
- నిరీక్షణ (1982)
- చట్టానికి కళ్ళులేవు (1981)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- కుక్క (1980)
- జాతర (1980)
- కుక్కకాటుకు చెప్పుదెబ్బ (1979)
- మరో చరిత్ర (1978)
మూలాలు[మార్చు]
- ↑ "39th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 27 February 2012. CS1 maint: discouraged parameter (link)