పి.ఎస్.నారాయణస్వామి
పులియూర్ సుబ్రమణియం నారాయణస్వామి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | అనతాండవపురం, మయిలదుత్తురై, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా | 1934 ఫిబ్రవరి 24
మరణం | 2020 అక్టోబరు 16 | (వయసు 86)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | గాయకుడు |
వెబ్‌సైటు | https://www.psnarayanaswamy.org/ |
పులియూర్ సుబ్రమణియం నారాయణస్వామి ( 1934 ఫిబ్రవరి 24 – 2020 అక్టోబరు 16) ఒక కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు తమిళనాడు లోని అనతాండవపురం గ్రామంలో పి.ఎన్.సుబ్రమణియన్, మధురాంబాళ్ దంపతులకు 1934, ఫిబ్రవరి 24న జన్మించాడు. ఇతని తండ్రి వృత్తి రీత్యా వైద్యుడైనప్పటికీ సంగీతం పట్ల అభిరుచి మెండుగా ఉండేది.
ఇతడు వసంత నారాయణస్వామిని వివాహాం చేసుకున్నాడు. ఈ దంపతులకు లక్ష్మి, మైథిలి, ఉమ అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు. ఇతని మనుమరాలు మనస్విని గాయనిగా పేరు గడించింది.
వృత్తి
[మార్చు]ఇతడు ముదికొండన్ వెంకట్రామ అయ్యర్, తిరుప్పంబరం సోమసుందరం పిళ్ళై, టి.ఎం.త్యాగరాజన్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ల వద్ద గాత్ర సంగీతం నేర్చుకున్నాడు. ఇతడు కుంభకోణం రాజమణి శాస్త్రి వద్ద వీణావాదన నేర్చుకున్నాడు. ఇతడు సంగీతగురువుగా ప్రశంసలను పొందాడు.[1]
ఇతడు తన 12వ యేట "బాల గాన కళారత్నం" బిరుదును పొందాడు. ఇతడు ఆకాశవాణిలో పనిచేశాడు.[2] 1999లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి "సంగీత కళాచార్య" బిరుదును ఇచ్చింది.[3] 2003లో భారత ప్రభుత్వం మూడవ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది.[1][4][5][6] కేంద్ర సంగీత నాటక అకాడమీ 2005లో కర్ణాటక సంగీతం - గాత్రం విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రదానం చేసింది.
ఇతడు తన 87వ యేట 2020, అక్టోబరు 16న చెన్నై, మైలాపూర్‌లోని తన స్వగృహంలో మరణించాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Saluting a great teacher". The Hindu. 20 February 2014. Retrieved 26 August 2015.
- ↑ "Musician-teacher par excellence". The Hindu. 13 June 2003. Archived from the original on 19 నవంబరు 2004. Retrieved 26 August 2015.
- ↑ "Sangita Kala Acharya". The Music Academy. Retrieved 25 February 2019.
- ↑ "Kalam presents Padma awards". Rediff. 3 April 2003. Retrieved 26 August 2015.
- ↑ "Words of wisdom from a vidwan!". Narayana Vishwanath. New Indian Express. 10 December 2011. Archived from the original on 3 అక్టోబరు 2015. Retrieved 26 August 2015.
- ↑ "Vocalist, dance exponent honoured". The Hindu. 15 December 2005. Retrieved 26 August 2015.
- ↑ SPECIAL CORRESPONDENT. "Carnatic vocalist P.S. Narayanaswamy dead". The Hindu. No. 17 October 2020. Retrieved 25 February 2021.