పి.చొక్కలింగం పిళ్ళై
పి.చొక్కలింగం పిళ్ళై | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1893 పందనల్లూర్, తంజావూరు జిల్లా |
మూలం | తంజావూరు |
మరణం | 1968 | (వయసు 74–75)
సంగీత శైలి | నాట్యం |
వృత్తి | భరతనాట్యం నృత్యకారుడు, నాట్యగురువు |
పందనల్లూర్ చొక్కలింగం పిళ్ళై (1893–1968) ఒక భరతనాట్య కళాకారుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు 1893లో తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, పందనల్లూరు గ్రామంలో ఇసై వెల్లాల కులంలో జన్మించాడు.[1] ఇతని మామ మీనాక్షి సుందరం పిళ్ళై పిత్రార్జితపు నట్టువకాడు (నాట్యాచార్యుడు). అతడు తంజావూరు చతుష్టయంగా పేరుపొందిన చిన్నయ్య, పొన్నయ్య, శివానందం, వడివేలుల సంతతికి చెందినవాడు.
చొక్కలింగం పిళ్ళై తన స్వగ్రామం నుండి మద్రాసుకు తరలి వెళ్ళి తన విద్యను అనేక మంది శిష్యులకు నేర్పించాడు. ఇతడు 1936 నుండి 1943 వరకు కళాక్షేత్రలో నాట్యగురువుగా పనిచేశాడు. ఇతని శిష్యులలో మృణాళినీ సారాభాయ్, జి.కౌసల్య, నిర్మలా రామచంద్రన్, సుచిత్ర, ఇంద్రాణి రెహమాన్, అలర్మేల్ వల్లి, మీనాక్షి చిత్తరంజన్ మొదలైనవారున్నారు.
ఇతని కుమారుడు పందనల్లూర్ సుబ్బరాయ పిళ్ళై కూడా భరతనాట్య కళాకారుడిగా, గురువుగా పేరు సంపాదించాడు.
ఇతనికి 1965లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
ఇతడు 1968లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ ఎడిటర్ (2017). "Chokalingam Pillai". SRUTI MAGAZINE. Retrieved 10 April 2021.