Jump to content

పి.టి. పరమేశ్వర్ నాయక్

వికీపీడియా నుండి
పి.టి. పరమేశ్వర్ నాయక్

కార్మిక శాఖ మంత్రి
పదవీ కాలం
2013 – 2016 జూన్ 20
ముందు బి.ఎన్. బచ్చే గౌడ
తరువాత సంతోష్ లాడ్

పదవీ కాలం
2013 – 2023 మే 13
ముందు బి. చంద్ర నాయక్
తరువాత కృష్ణ నాయక
నియోజకవర్గం హడగలి
పదవీ కాలం
1999 – 2008
ముందు డి నారాయణ్ దాస్
తరువాత జి కరుణాకర రెడ్డి
నియోజకవర్గం హరపనహళ్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1964-05-11) 1964 మే 11 (వయసు: 62)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

పి.టి. పరమేశ్వర్ నాయక్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కార్మిక శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

పి.టి. పరమేశ్వర్ నాయక్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 శాసనసభ ఎన్నికలలో హరపనహళ్లి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి బి.హెచ్. యాంకా నాయక్‌పై 10,537 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి డి. నారాయణ దాస్‌పై 7,994 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండుసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత హరపనహళ్లి నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాల సభ్యునికి రిజర్వ్ చేయడంతో ఆయన పక్కనే ఉన్న హడగలి శాసనసభ నియోజకవర్గం నుండి పి.టి. పరమేశ్వర్ నాయక్ 2008 శాసనసభ ఎన్నికలలో హడగలి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బి. చంద్ర నాయక్ చేతిలో 6,518 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి బి. చంద్రనాయక్‌పై 40,810 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశాడు.

పి.టి. పరమేశ్వర్ నాయక్ 2018 శాసనసభ ఎన్నికలలో హడగలి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బి. చంద్ర నాయక్ చేతిలో 9178 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] 22 డిసెంబర్ 2018 నుండి 8 జూలై 2019 వరకు కుమారస్వామి మంత్రివర్గంలో ముజ్జరై, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత & జీవనోపాధి శాఖ మంత్రిగా పని చేశాడు.[4][5] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కృష్ణ నాయక చేతిలో 1,444 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Minister gives farmer's family compensation" (in Indian English). The Hindu. 27 July 2015. Archived from the original on 30 April 2025. Retrieved 30 April 2025.
  2. ↑ "Karnataka Reshuffle: Siddaramaiah drops almost half his team" (in ఇంగ్లీష్). The Indian Express. 20 June 2016. Archived from the original on 30 April 2025. Retrieved 30 April 2025.
  3. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. ↑ "Kumaraswamy inducts 8 Ministers; 7 of them are from north Karnataka" (in Indian English). The Hindu. 22 December 2018. Archived from the original on 17 January 2025. Retrieved 17 January 2025.
  5. ↑ "Will Parameshwar Naik break the pattern in Hadagali?" (in Indian English). The Hindu. 9 May 2018. Archived from the original on 30 April 2025. Retrieved 30 April 2025.
  6. ↑ "Karnataka Assembly Elections 2023: Hadagali". Election Commission of India. 13 May 2023. Archived from the original on 29 April 2025. Retrieved 29 April 2025.