పి.మాధవీ దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.మాధవీ దేవి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 అక్టోబర్ 2021
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1965-12-28) 1965 డిసెంబరు 28 (వయసు 58)
హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

పట్లోళ్ల మాధవీదేవి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమె 2021 అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైంది.[1][2]ఆమె అక్టోబరు 15న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది.[3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

పి.మాధవీ దేవి తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో 1965 డిసెంబరు 28లో జన్మించింది. ఆమె కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గాలో న్యాయశాస్త్రం పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎంఎల్ పూర్తి చేసింది.[4]

వృత్తి జీవితం[మార్చు]

పి.మాధవీ దేవి 1992లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుంది. ఆమె 1992 నుంచి 2005 వరకు న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేసి, 2005 మార్చి 1న సర్వీసులో చేరి ఇన్ కమ్ ట్యాక్స్ అప్పీలెట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యులుగా ముంబయి, బెంగళూరులో పనిచేసింది. పి.మాధవీ దేవి హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2021 సెప్టెంబరు 16న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సభ్యులు ఉదయ్‌ యూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలై[5][6]అక్టోబరు 15న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది.

మూలాలు[మార్చు]

  1. Sakshi (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు". Sakshi. Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  2. Namasthe Telangana (13 October 2021). "ఏడుగురు కొత్త జడ్జీలకు రాష్ట్రపతి ఆమోదం". Archived from the original on 14 October 2021. Retrieved 15 October 2021.
  3. ETV Bharat News (15 October 2021). "హైకోర్టు నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  4. Eenadu (14 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  5. V6 Velugu (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Andrajyothy (19 August 2021). "సైన్యంలో..న్యాయంలో మహిళలకు జస్టిస్‌". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.