పి. బాలచంద్రన్
| పి. బాలచంద్రన్ | |
|---|---|
| జననం | పద్మనాభన్ బాలచంద్రన్ నాయర్ 1952 ఫిబ్రవరి 2 శాస్తంకోట, కొల్లం, కేరళ, భారతదేశం |
| మరణం | 2021 ఏప్రిల్ 5 (వయసు: 69) వైకోమ్, కేరళ, భారతదేశం |
| విశ్వవిద్యాలయాలు | దేవస్వం బోర్డు కళాశాల, శాస్తంకోట డ్రామా అండ్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్, త్రిస్సూరు |
| వృత్తి |
|
| భార్య / భర్త | శ్రీలత |
| పిల్లలు | 2 |
| తల్లిదండ్రులు |
|
| పురస్కారాలు | కేరళ సాహిత్య అకాడమీ అవార్డు |
పద్మనాభన్ బాలచంద్రన్ నాయర్ (1952 ఫిబ్రవరి 2 - 2021 ఏప్రిల్ 5) ఒక భారతీయ రచయిత, నాటక రచయిత, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నటుడు.[1] ఆయన మలయాళ సాహిత్యం, మలయాళ చిత్రాలలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు.
కెరీర్
[మార్చు]బాలచంద్రన్ పావం ఉస్మాన్ నాటకానికి గుర్తింపు పొందాడు, దీనికి అతను 1989 సంవత్సరంలో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ ప్రొఫెషనల్ నాటక అవార్డులను గెలుచుకున్నాడు. ఆయన ఉల్లడక్కం (1991), పవిత్రం (1994), అగ్నిదేవన్ (1995), పునరాధివాసం (2000), కమ్మట్టి పదం (2016) వంటి అనేక చిత్రాలకు కథ అందించాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇవాన్ మేఘరూపన్ (2012).[2] ఆయన కొన్ని చిత్రాలలో కూడా నటించాడు, వాటిలో అత్యంత ప్రేక్షకాధరణ చిత్రం త్రివేండ్రం లాడ్జ్ (2012).
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయన 1952 ఫిబ్రవరి 2న కేరళ శాస్తంకోటలో పద్మనాభ పిళ్ళై, సరస్వతి భాయ్ దంపతులకు జన్మించాడు.[3] అతను శ్రీలతను వివాహం చేసుకున్నాడు, ఈ జంటకు శ్రీకాంత్, పార్వతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.[4]
అవార్డులు
[మార్చు]- 1989: కేరళ సాహిత్య అకాడమీ అవార్డు - పావం ఉస్మాన్
- 2008: కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు ఫర్ డ్రామా [5]
మరణం
[మార్చు]బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతున్న బాలచంద్రన్ 69 సంవత్సరాల వయసులో 2021 ఏప్రిల్ 5న వైకోమ్‌లోని తన ఇంట్లో మరణించాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Malayalam actor P Balachandran dies at 62". The Indian Express (in ఇంగ్లీష్). 5 April 2021. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 April 2021.
- ↑ "P.Ramachandran". IBN Live. 13 May 2012. the original నుండి 13 February 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 August 2012.
- ↑ "Archived copy". the original నుండి 8 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 July 2014.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ "'പി'യുടെ ഓര്മയ്ക്കായി മേഘരൂപന്, Interview - Mathrubhumi Movies". the original నుండి 19 December 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-12-19.
- ↑ "Kerala Sangeetha Nataka Akademi Award: Drama". Department of Cultural Affairs, Government of Kerala. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 February 2023.
- ↑ "നടനും തിരക്കഥാകൃത്തുമായ പി.ബാലചന്ദ്രന് അന്തരിച്ചു". Mathrubhumi (in ఇంగ్లీష్). 5 April 2021. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-05.
- ↑ "തിരക്കഥാകൃത്തും നടനുമായ പി.ബാലചന്ദ്രൻ അന്തരിച്ചു". ManoramaOnline (in మలయాళం). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-05.